తీన్మార్ మల్లన్న పై దాడిని ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద మొన్న తీన్మార్ మల్లన్న పై జరిగిన దాడిని ఖండిస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంగళవారం నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈసందర్భంగా బీసీ నాయకులు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న అనుచిత వాక్యాలు చేశాడు.అని చెప్పి తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడి చేయడాన్ని బీసీ సమాజం పై దాడిగా భావిస్తున్నాం అని అన్నారు.ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం మన సంస్కృతి కాదు మల్లన్న పై దాడికి ఉసిగొలిపిన జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.తీన్మార్ మల్లన్న పార్టీ పెడితే మా పప్పులు ఏమి ఉడకవని అన్న ఉద్దేశంతో దాడికి పాల్పడిందని భావిస్తున్నట్లు తెలిపారు.ఇలాంటి ఘటన పునరావృత్తం అయితే కలవకుంట్ల కవిత బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదు అని హెచ్చరిస్తున్నాం.తీన్మార్ మల్లన్నకు బీసీ సమాజం అండగా నిలుస్తుందని ఈసందర్భంగా తెలియజేస్తున్నాం.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, తుల మధుసూదన్ రావు, శాఖ పురం భీమ్సేన్,గజ్జెల్లి వెంకన్న,చంద్రగిరి చంద్రమౌళి, ఆరెంధుల రాజేశం,వేముల అశోక్,శాఖ పురం కోటేశ్వరరావు,కీర్తి బిక్షపతి, అంకం సతీష్,నగునూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.