మానవత్వానికి మారు పేరు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్..

మానవత్వానికి మారు పేరు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి…

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కన్నాయిగూడెం గ్రామ పంచాయతీ బంగారు గూడెం గ్రామం వద్ద మొక్కలు తరలిస్తున్న ట్రాక్టర్ వాహనం అదుపుతప్పి పడిపోవడంతో డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి..
అటుగా వెళ్తూ చూసిన వెంటనే స్పందించి దగ్గరుండి తన సొంత వాహనంలో ఎక్కించుకొని పినపాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ వసూళ్ల దోపిడీ.

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ వసూళ్ల దోపిడీ

యూరియా కోసం చెప్పులను లైన్ లో పెట్టే పరిస్థితి

అధికారపార్టీ నాయకుల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తాం.

నర్సంపేట,నేటిధాత్రి:

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఠా వసూళ్ల దోపిడీ చేస్తున్నారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.నర్సంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న మాజీ శాసన సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం,స్థానిక కాంగ్రెస్ నాయకులపై ఫైర్ అయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ,ఎమ్మెల్యేలు,నాయకులు ప్రాముఖ్యతను తగ్గించారని పేర్కొన్నారు.నర్సంపేటలో బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే వందల కోట్ల నిధులతో పనులను చేపట్టగా ఆ పాత పనులను మాధవరెడ్డి సొంత కాంట్రాక్ట్ మార్చుకుంటున్నాడని ఆరోపించారు.అలాగే తండాలలో కొన్ని కోట్ల బిటి రోడ్ల పనులు చేపట్టగా వంద శాతం పనులను రద్దుచేసారని ధ్వజమెత్తారు.అలాగే రైతులకు రుణమాఫీ పట్ల ప్రభుత్వానికి అవగాహన లేకపోవడం వల్లనే ఆ రుణ మాఫీ పూర్తికాలేదన్నారు.రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు పేరుతో రద్దుచేస్తుందని ఎద్దేవా చేశారు.
జిల్లా వ్యాప్తంగా వాటాల కోసం కాంగ్రెస్ నాయకుల మధ్య కొట్లాట కుక్కల కొట్లాటగా మారిందని, సొంత కాంట్రాక్ట్ పనుల కోసం పాత పనులను రద్దు చేసి, సొంత కాంట్రాక్ట్ కంపెనీకి అగ్రిమెంట్ అయ్యేలా వాటినే కొత్తగా మంజూరు అయ్యాయంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిపై పరోక్షంగా ఆరోపించారు.
రైతుల కోసం యూరియాపై సంబంధిత అధికారులతో ఎప్పుడైన సమీక్షించారా.?అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు.కాగా మళ్ళీ పాతరోజులు తెస్తామంటూ చెప్పిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో నేడు రైతులు యూరియా కోసం చెప్పులను లైన్ లో పెట్టే పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించారు.
నర్సంపేట నియోజకవర్గంలో విచ్చలవిడిగా మట్టిదందా చేస్తుంటే రెవిన్యూ అధికారులు దందాలో వాటా దారులుగా ఉన్నారని పేర్కొన్నారు.గత ప్రభుత్వ హాయంలో మంజూరైన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అడ్డుకున్న వివరాలు,ఆయన అనుచరుల అరాచకాలను రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలకు వివరించి ప్రజల తీర్పుతో అధికారపార్టీ నాయకులు ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, మాజీ ఎంపీపీ పద్మనాభరెడ్డి ,మాజీ జెడ్పీటీసీ జయ గోపాల్ రెడ్డి , మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నరసింహరాములు, మోటూరి రవి,వల్లాల కర్నాకర్,అల్లి రవి,క్లస్టర్ బాధ్యులు,మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు.

 ఇలియానా రెండో బిడ్డ పేరు ఇదే.

 ఇలియానా రెండో బిడ్డ పేరు ఇదే…

 

గోవా బ్యూటీ ఇలియానా మరోసారి తల్లి అయ్యారు. ఈ నెల 19న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు.

గోవా బ్యూటీ ఇలియానా (Ileana) మరోసారి తల్లి అయ్యారు. ఈ నెల 19న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. తన బిడ్డ బాబు ఫొటోను అభిమానుతో పంచుకున్నారు.
”మా ప్రియమైన అబ్బాయి ‘కియాను రఫే డోలన్‌’ని (Keanu Rafe Dolan) పరిచయం చేస్తున్నందుకు మా  మనసు  సంతోషంతో నిండిపోయింది’ అనే క్యాప్షన్‌ పెట్టారు.
ఇలియానా పోస్ట్ చూసిన ఫాన్స్, పలువురు నెటిజన్లు ఇల్లి బేబీకి  అభినందనలు చెబుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ  ప్రియాంక చోప్రా ఈ పోస్ట్‌కు స్పందిస్తూ విష్ చేశారు.  

2023లో మైఖేల్‌ డోలన్‌ను (Michael Dolan) ఇలియానా వివాహం చేసుకున్నారు. అదే ఏడాది ఆగస్టులో మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. అతని పేరు కోవా ఫీనిక్స్ డోలన్‌.   పెళ్లి, భర్త గురించి వచ్చిన విమర్శల్ని పట్టించుకోకుండా ముందుకెళ్తున్నారు ఇలియానా. ‘నన్నేమన్నా భరిస్తా.. కానీ నా కుటుంబసభ్యులను ఏమైనా అంటే ఊరుకోను’ అని గతంలో ఆమె పోస్ట్ పెట్టిన  సంగతి తెల్సిందే.  

రామ్  పోతినేని హీరోగా వచ్చిన ‘దేవదాస్’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయిన ఆమె అగ్ర కథానాయికగా ఎదిగింది. స్టార్ హీరోస్ సరసన అవకాశాలు అందుకుంది. ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రంలో చివరిగా  నటించారు.  గతేడాది బాలీవుడ్ లో ఆమె నటించిన రెండు హిందీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. 

కొలనూరు లో అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమం..

కొలనూరు లో అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమం..
బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

 

 

 

ఓదెల మండలం కొలనూరు గ్రామంలో పెద్దపెల్లి బిజెపి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి ఆధ్వర్యంలో కొలనూరు గ్రామంలో అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు.దీనితో పాటు గ్రామంలోని దేవాలయంలో మొక్కలు నాటడం జరిగింది. తదనంతరం ప్రభుత్వ ఆసుపత్రి మరియు పాఠశాల ను సందర్శించి అక్కడ ఒక సమస్యలను తెలుసుకోవడం జరిగింది. తదనంతరం విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో బీజేవైఎం పెద్దపల్లి జిల్లా కార్యదర్శి పుల్లూరు పృథ్వీరాజ్ సుల్తానాబాద్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ సుల్తానాబాద్ పట్టణ అధ్యక్షులు నాగరాజు ఎలిగేడు మాజీ మండల అధ్యక్షులు నారాయణస్వామి సుల్తానాబాద్ మండల ప్రధాన కార్యదర్శి సంతోష్ జిల్లా ప్రధాన కార్యదర్శి చౌదరి మహేందర్ కొలనూరు మాజీ సర్పంచ్ కైరునిస తాజ్ పుల్ల సదయ్య అనిల్ రావు దాత రాకేష్ సత్యం రెడ్డి శంకర్ బిక్షపతి కొంగర అనిల్ తదితర మూర్చ నాయకులు బిజెపి పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

ప్రేమ పేరుతో మోసం….

ప్రేమ పేరుతో మోసం….మనస్థాపంతో ప్రేయసి ఆత్మహత్య యత్నం.

పెళ్లిచేసుకుంటానని కులం నెపంతో మోసం చేసిన ప్రేమికుడు..

మనస్థాపంతో ప్రేయసి ఆత్మహత్య యత్నం.

ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న దళిత యువతి.

పోలీసులను ఆశ్రయించిన యువతి తల్లిదండ్రులు..

వరంగల్/నర్సంపేట/దుగ్గొండి నేటిధాత్రి:

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

 

ఉన్న ఊరు కన్నతల్లి లాంటిదని, కులాలు వేరైనా ఒకే గ్రామస్థులం అంటూ ప్రేమ పేరుతో నమ్మించి ఒక నర్సింగ్ దళిత యువతిని మోసం చేశాడు ఒక కారు డ్రైవర్ కాగా..

ఆ ప్రేమికుడి మాయమాటలకు మోసపోయి మనస్థాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన దుగ్గొండి మండలంలోని ముద్దునూరు గ్రామంలో శనివారం ఉదయం చోటు చేసుకున్నది.

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం ముద్దనూరు గ్రామానికి చెందిన బండి లక్ష్మి , నర్సయ్య పెద్ద కుమారుడు బండి నాగరాజు సికింద్రాబాద్ లో కార్ డ్రైవింగ్ పని చేస్తూ బ్యాచిలర్ గా అద్దె ఇంట్లో ఉంటున్నాడు.

అదే గ్రామానికి చెందిన కన్నం పూలమ్మ ముత్తయ్య పెద్ద కూతురు కన్నం అరుణ సికింద్రాబాద్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సింగ్ చేస్తుంది.

గత సంవత్సరం నర క్రితం కారు డ్రైవర్ నాగరాజు యువతి
కన్నం అరుణతో మనం ఇద్దరం ఒకే గ్రామానికి చెందిన వారిగా పరిచయం చేసుకున్నాడు.

ఒక సంవత్సరం పాటు ప్రేమ పేరుతో ఆమె వెంట పడ్డాడు.

కులాలు వేరైనప్పటికీ ఒకే గ్రామానికి చెందినవారిమి కనుక పెళ్లి చేసుకుందామని నమ్మ పలికాడు.

నర్సింగ్ చేస్తున్న అరుణతో ప్రేమ వివాహం పెంచుతూ ఆమె వద్ద నుండి ఖర్చుల నిమిత్తం సుమారు రూ. 50 వేలకు పైగా తీసుకున్నాడు.

అనేకసార్లుగా హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో యువతిని తీసుకెళ్లి శికార్లకు కొట్టాడు.

వారు దిగిన ఫోటోలు గ్రామంలో వైరల్ కావడంతో ముఖం చాటేసి తక్కువ కులానికి చెందిన దళిత యువతిగా నిరాకరిస్తూ మరో అమ్మాయితో వివాహం చేసుకున్నాడు ఆ కిలాడి యువకుడు నాగరాజు.

మనస్థాపానికి గురి చెందిన దళిత నర్సింగ్ యువతి కన్నం అరుణ ఇంట్లో ఎవరు లేని సమయంలో కెమికల్ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

కాగా అంతకుముందే పెద్ద మనుషుల సమక్షంలో చర్చలు జరిగినప్పటికీ వాటిని సైతం లెక్కచేయకుండా మరొక యువతితో పెళ్లి చేసుకోవడంతో నాగరాజుపై పలువురు దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఆమె తల్లిదండ్రులు నర్సంపేట ఏసీపీని కలిసి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఈ సందర్భంగా యువతి తల్లిదండ్రులు కన్నం పూలమ్మ ముత్తయ్యలు మాట్లాడుతూ మా ముద్దునూరు గ్రామానికి చెందిన బండి నాగరాజు అనే కార్ డ్రైవర్ హైదరాబాదులో ఉంటూ తమ కూతురు అరుణకు మాయ మాటలు చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి మరో యువతీతో పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు.

వారి ప్రేమ వివాహారంపై నాగరాజు తల్లిదండ్రులు బండి లక్ష్మి నర్సయ్యలను కొందరు పెద్దమనుషుల సమక్షంలో నిలదీయగా ప్రేమించిన విషయం వాస్తవమే మా కుమారుడిని పిలిపించి మాట్లాడతామని నమ్మ పలికి మరొక యువతతో వారి కొడుకుకు వివాహం చేశారని తెలియజేశారు.

హైదరాబాదులో ఉన్నప్పుడు ప్రేమ పేరుతో తన కూతురు వద్ద ఉన్న రూపాయలు 50 వేలకు పైబడి తీసుకొని పలు విధాలుగా వేధింపులకు గురిచేస్తూ ఫలుదపాలుగా విచక్షణ రహితంగా దాడి చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.

మనస్థాపానికి గురైన తమ కూతురు అరుణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స నిమిత్తం నర్సంపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నట్లు తల్లిదండ్రులు బండి లక్ష్మి నర్సయ్యలు ఆరోపించారు.

ప్రేమ పేరుతో మోసం చేసిన నాగరాజుపై నర్సంపేట ఏసీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అలాగే దుగ్గొండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు పేర్కొన్నారు.

ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి కులం పేరుతో దూషిస్తూ తన కూతుర్ని మానసికంగా వేధించి ఆత్మహత్యాయత్నానికి కారకుడైన నాగరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు తల్లిదండ్రులు పోలీసుల వేడుకున్నారు.

దుగ్గొండి ఎస్ఐ నీలోజు వెంకటేశ్వర్లు వివరణ కోరగా నర్సంపేట ఏసిపి కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం ఉందని తెలిపారు.

దుగ్గొండి పోలీస్ స్టేషన్ లో బాదితుల ఫిర్యాదు చేయలేదని ఎస్సై తెలిపారు.

మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలి.

మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలి
బీజేపీ మత చాందసవాద రాజకీయాలను మానుకోవాలి…ఏఏం సి చైర్మన్‌ నరుకుడు వెంకటయ్య
`మతం అంటే నమ్మకం విశ్వాసం… మతం అంటే రాజకీయం కాదు బీజేపీ నాయకులు గుర్తేరుగాలి
`బతుకమ్మ పట్టుకున్నాడు బోనాల పండుగలలో బోనమెత్తిన నాయకుడు మా ఎమ్మెల్యే కె.ఆర్‌.నాగరాజు
`అన్ని మతాచారాలను, మత విశ్వాసాలు గౌరవించే నాయకుడు ఎమ్మెల్యే కె.ఆర్‌. నాగరాజు
`మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెడుతూ మత విద్వేషాలను రెచ్చగొట్టే కుటిల బుద్ది బీజేపీ నాయకులు మానుకోవాలి
`జై బాపు, జై భీమ్‌, జై సంవిధాన్‌ అనేది కాంగ్రెస్‌ పార్టీ నిధానం
`లౌకిక వాదం, బావసారుప్యత కాంగ్రెస్‌ పార్టీ విధానం : కాంగ్రెస్‌ నాయకులు

వర్ధన్నపేట,నేటిధాత్రి:

నియోజక వర్గ కేంద్రములో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఏద్దు సత్యం,వర్ధన్నపేట ,వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నరుకుడు వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీ , కోతపెల్లి గ్రామ మాజీ సర్పంచ్‌ కమ్మాగొని ప్రభాకర్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకులు పోషాల వెంకన్న గౌడ్‌ లు విలేఖర్లతో మాట్లాడుతూ.గతములో వర్ధన్నపేట శాసన సభ్యులు కేఆర్‌ నాగరాజు గుళ్ళు కడితే బిచ్చా గాల్లు అవుతారు, బడులు కడితే విద్యావంతులు అవుతారని మాట్లాడిన మాటలను బీజేపీ నాయకులు వక్రీకరించి రాజకీయ రంగును పులుముతున్నారు మన శాసన సభ్యులు కేఆర్‌ నాగరాజు డా: బీ అర్‌ అంబేద్కర్‌ ఆశయాలను కొనసాగించే విధంగా అంబేద్కర్‌ హైడాలోజిలో మాట్లాడడం జరగింది.కేఆర్‌ నాగరాజు మాట్లాడిన మాటలు డా: అంబేద్కర్‌ చెప్పినవే . ఓ. ఏస్‌.నేడు ఈ దేశములో ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీలు స్వేచ్చా గా జీవిస్తూ ఐఏఎస్‌,ఐపీఎస్‌,డాక్టర్లు,లాయర్లు,ఇంజనీర్లు, పొలిటీషియన్లు అయ్యారు అవుతున్నారాంటె, డా:బీ.అర్‌ అంబేద్కర్‌ చలవే. మి లాగా నిత్యం మతం ,బజనలు చేసుకుంటూ పోతే మా వర్గాలు ఈ దేశములో జీవించే స్థానమే లేదు.
ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్‌ ని జవహర్‌ లాల్‌ నెహ్రూ క్యాబినెట్లో న్యాయ శాఖ మంత్రి నీ చేసి గౌర వించింది . మి లాగా (బీజేపీ) గుళ్ళు, గోపురాలు, బజనలు,కీర్తనలు నమ్ముకుంటు,చేసుకుంటూ పోతే ఎస్సీ, ఎస్టీ లు వంద సంవత్సరాల క్రితం ఎలా ఉన్నా మో,నేటి వరకు అలానే ఉండే వాళ్ళము. నేడు ఈ దేశములో బీజేపీ పార్టీ మతం పేరుతో రాజకీయం చేయకుండా ,లౌకిక ప్రజాస్వామ్య లోకి రాండి.135 సంవత్సరాల నుండి మొదులుకొని నేటి వరకు ఈ దేశంలోని ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ,నిమ్న ,అణగారిన వర్గాల ప్రజల సంక్షేమం కోసమే కాంగ్రెస్‌ పార్టీ పని చేస్తూ వస్తుంది.నేడు కూడా కాంగ్రెస్‌ పార్టీ జై బాపు,జై బిమ్‌,జై సంవిధాన్‌ నినాదంతో బ్రహ్మ నడంగ ముందుకు వెళుతున్నా ము.భవిష్యత్‌ ఎన్నికలలో ప్రజలు ఎవరిని ఆదరిస్తారో తెలుస్తోంది. గురువింద గింజ లాగా మాటలు మాట్లాడి మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ నుండి డిమాండ్‌ చేస్తున్నాం.

జ్యోతిష్యం పేరుతో డబ్బులు తీసుకొని మోసం చేసిన.

జ్యోతిష్యం పేరుతో డబ్బులు తీసుకొని మోసం చేసిన నిందితున్ని అరెస్టు చేసిన మద్దూర్ పోలీసులు.

నిందితును వివరాలు
దక్షిణపు శివయ్య, నివాసం పెద్దపలకనూరు, గుంటూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్

కేసు వివరాలు చేర్యాల సీఐ శ్రీను తెలియపరుస్తూ

చేర్యాల నేటిధాత్రి…

2025 జనవరి చివరి రోజుల్లో కమలాయపల్లి గ్రామాననికి చెందినటువంటి ధర్మోజీ నారాయణ చారి అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కు వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది.
ఏమనగా జీటీవీ చూ స్తుండగా కింద జ్యోతిష్యం చెప్పబడును అని ఒక ఫోన్ నెంబర్ కింద స్క్రోలింగ్ వచ్చింది. ఆ స్క్రోలింగ్ గమనించినటువంటి నారాయణచారి తనకి ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి మనశాంతి ఉండట్లేదు, ఇవన్నీ జ్యోతిషం చెప్పించుకుంటే పోతాయని అతని నమ్మి ఆ నెంబరు కాల్ కాల్ చేయగానే పై నిందితుడు ఫోన్ లేపి మాట్లాడుచు పూజలు చేస్తా మంచి జరుగుతది చెప్పగానే అది నమ్మిన బాధితుడు పై నిందితుడు పూజారి చెప్పిన విధంగా మొదట ఒక 50,000 రూపాయలు అతని ఇచ్చిన అకౌంట్ కు డిపాజిట్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత పై నిందితుడు పూజారి ఫోన్ చేసి డబ్బులు సరిపోలేదు పూజ సగంలో ఉంది పూర్తి కావాలంటే ఇంకొక 50 వేల రూపాయలు కావాలంటే ఇతను మిగతా 50 వేలు కూడా పంపించిండు. తర్వాత మళ్ళీ ఇంకొక వారం రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసి ఇంకా డబ్బులు కావాలి ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి పూజ పూర్తిగా అవ్వాలి లేకపోతే మీకు చెడు జరుగుతుంది అని ఇతనికి చెప్పటం వల్ల ఇతను ఆ మాటలు నమ్మి ఆ మాయమాటలవల్ల అనుమానం వచ్చి, ఇప్పటికే లక్ష రూపాయలు ఇచ్చాను అప్పుచేసి ఇంకా తన దగ్గర డబ్బులు లేవు ఏం చేయాలి అని ఆలోచించి, సైబర్ క్రైమ్కు మోసానికి గురి అయినానని పోలీసు వారు చేసే ప్రచారాన్ని గమనించి 1930 అనే నెంబర్ కాల్ చేసి నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో అతను రిపోర్టు చేయడం జరిగింది. దాని మీద మాకు అట్నుంచి వచ్చిన దానిమీద నారాయణ దగ్గర పిటిషన్ తీసుకొని సైబర్ క్రైమ్ ప్రకారంగా కేసు నమోదు చేసి పరిశోధన చేస్తుండగా, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పై నిందితున్ని ఈరోజు అదుపులోకి తీసుకొని విచారించగా జాతకాల పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నానని ఒప్పుకున్నాడు. పై నేరస్థుని వద్ద ఉన్న సెల్ ఫోన్ సీజ్ చేసి నిందితుని వద్దనుండి బాధితుడికి లక్ష రూపాయలు రిఫండ్ చేయడం జరిగింది, పై నిందితున్ని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కుపంపించడం జరిగింది.

అదేవిధంగా ప్రజలు ఎవరు కూడా ఈ జ్యోతిష్యం గాని ఇంకేదైనా యాడ్స్ దేనికి కూడా స్పందించకుండా, ఎవరికి కూడా జ్యోతిష్యాల వల్ల మంచిగా అయితదనో, ఫోన్లో పూజలు చేస్తే మంచిగా అయితదనో అని చెప్తే నమ్మొద్దు అని, అమాయకులను మోసం చేయడం కోసం ప్రయత్నించుచున్నారు. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా వుండాలని, ఇలాంటి మీకు ఎవరైనా చేస్తే 1930 నెంబర్ కు ఫోన్ చేసి సైబర్ క్రైమ్ లో రిపోర్ట్ చేయాల్సిందిగా చేర్యాల శ్రీను ఒక ప్రకటనలో తెలిపారు.

జగన్ 2.0 పై ప్రెస్ మీట్ జగన్ పేరు..చిట్టి రెడ్డి

జగన్ 2.O అంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు..

మీ బొచ్చు మీరే పిక్కోవాలి..

30 సంవత్సరాలు ఎక్కడుంటాడో, జైల్లోనా – కిరణ్ రాయల్..

 

తిరుపతి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 06:

లండన్ కు వెళ్లొచ్చాక జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావట్లేదని, గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి, అభివృద్ధికి నోచుకోక.రాష్ట్ర ప్రజలను రాష్ట్ర అభివృద్ధిని 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారని, ఇప్పుడు మళ్లీ 2.O తో వస్తున్నామంటే.. రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ గురువారం మీడియా సమావేశంలో చిట్టి రెడ్డి 2.0 అనే పోస్టర్ లను ఆవిష్కరించి, 2.O అట్టర్ ఫ్లాప్ సినిమా అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.ఈసారి మనం అధికారంలోకి వస్తే 30 సంవత్సరాలు మనమే పరిపాలనలో ఉంటామని, రాష్ట్రాన్ని ఏలుతామని అనడం చూస్తే.. జగన్ రెడ్డికి మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు.గతంలో 175 కు 175 అంటే, ప్రజలు 11 సీట్లు మాత్రమే ఇచ్చి,మీ సేవలు ఇక చాలని, మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారని గుర్తు చేశారు. 30 సంవత్సరాలు ఎక్కడ ఉంటారు.. ప్రజల్లోనా, జైల్లోనా అని ప్రశ్నించారు.గత కోడి కత్తి, గొడ్డలిపోటు దాడులను గుర్తు చేస్తూ,జగన్ 1.O లో బాబాయ్ హత్య తో రాజకీయం చేస్తున్నారని, 2.O తో జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు విజయమ్మ, షర్మిలకు జాగ్రత్తగా వుండాలని సూచించారు.మీ బొచ్చు పీకడానికి ఇక్కడ ఖాళీగా ఎవరూ లేరని, మీ బొచ్చు మీరే పిక్కోవాలన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని, ఇప్పటికే కేంద్రం, ఆంధ్ర రాష్ట్రంపై శ్రద్ధచూపి పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలపడమే కాకుండా రాష్ట్రానికి కావలసిన నిధులను సమకూరుస్తుందని గుర్తు చేశారు. ప్రధాని మోదీ సహకారంతో.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు రాష్ట్రంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తూ మరో పది సంవత్సరాలు కూటమి ప్రభుత్వమే ఏపీలో కొనసాగుతుందని కిరణ్ జోష్యం చెప్పారు.ఈ
మీడియా సమావేశంలో హేమ కుమార్, మనోజ్,కిషోర్, హేమంత్, సాయిదేవ్,ఆది, సాయి తదితరులు పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version