వర్షం సమృద్ధిగాకురవాలని రామాలయంలో..

వర్షం సమృద్ధిగాకురవాలని రామాలయంలో వరుణ దేవుని పూజా

గణపురం రైతులు గ్రామోత్సవంగా కప్పతల్లి ఆట

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆలయ అర్చకులు ముసునూరి నరేష్ ఉదయం 6:00 గంటలకు వర్షాలు సమృద్ధిగా పడాలని వరుణ దేవునిపూజాకార్యక్రమంనిర్వహించారు.అనంతరం వర్షాలు బాగా కురవాలని సమృద్ధిగా పంటలు పండాలని గణపురం గ్రామ రైతులు కప్పతల్లి ఆటను యువకులతో కలిసి గణపురం పురవీధులలో శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామిని డప్పు సప్పులతో, బింద నిండా నీరుతో వరుణదేవుని పూజిస్తూ వర్షాలు బాగా కురవాలని గణపురం పెద్దలు కప్పతల్లి ఆటను గ్రామోత్సవంగా గణపురం పురవీధులలో ఊరేగింపుగా మొదట గ్రామ దేవతలు భూలక్ష్మి అమ్మవారికి అభిషేకం నిర్వహించి, తదుపరి పోచమ్మ తల్లికిఅభిషేకంనిర్వహించి కప్పతల్లిఆటగణపసముద్రంచెరువుకట్టపైగలదక్షిణముఖఆంజనేయస్వామి దేవాలయం వరకు కొనసాగించి మరల రామాలయంవరకుకప్పతల్లి ఆటను కొనసాగించారు.ఈపూజాకార్యక్రమంలో శ్రీరామ భక్తులు, ప్రజలు, రైతులు, మహిళలు సంతోషంగా పాల్గొని వర్షాలు సమృద్ధిగా పడిపంటదిగుబడిసమృద్ధిగా ఉండాలని వరుణ దేవునికి పూజలు నిర్వహించారు.

ఉచిత వైద్య శిబిరం..

ఉచిత వైద్య శిబిరం

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఉచిత వైద్య శిభిరం కార్యక్రమాన్నీ” ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమంతరావు పాటిల్, శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ శేఖర్ పాటిల్ మరియు ఝరాసంగం మండల పెద్దల చేతుల మీధుగా ప్రముఖ “హోలీస్టిక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ రోజు ఝరసంగం మండల కేంద్రంలో ఉచిత వైద్య శిభిరం నిర్వహించడం జరిగింది కార్డియాలజీ, ఆర్థోపెడిక్, ఆప్థోమలాజీ, ఇంటర్నల్ మెడిసిన్ తో పాటు ఈసిజీ, ఆర్థో, కంటి, బిపి, డయాభైటిక్ షుగర్ తదితర పరీక్షలు అంధుబాటులో ఉన్నయి.

ఆ న‌ర‌క‌డం ఏంటీ టీచ‌ర్‌ నందితా శ్వేత బెన్నీ ట్రైల‌ర్‌.

ఆ న‌ర‌క‌డం ఏంటీ టీచ‌ర్‌.. నందితా శ్వేత బెన్నీ ట్రైల‌ర్‌

నందితా శ్వేత లీడ్ రోల్‌లో.. క‌న్న‌డ నాట ఓ ఆస‌క్తిక‌ర‌మైన చిత్రం రూపొందుతోంది.

క‌న్న‌డ నాట ఓ ఆస‌క్తిక‌ర‌మైన చిత్రం బెన్నీ (BENNY) రూపొందుతోంది. తెలుగులో హిడింబా, మంగ‌ళ‌వారం వంటి సినిమాల‌తో మంచి పేరు తెచ్చుకున్న నందితా శ్వేత (NANDITA SWETHA) లీడ్ రోల్‌లో న‌టిస్తోండ‌గా ఔట్ అండ్ ఔట్ వ‌య‌లెంట్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో సినిమా తెర‌కెక్కుతోంది. శ్రీలేష్ నాయ‌ర్ (Shreelesh S Nair ) ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. స‌చిన్ బ‌స్రూర్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ గ్లిమ్స్ వీడియోను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

క‌న్న‌డ అగ్ర న‌టుడు కిచ్చా సుదీప వాయిస్ ఒవ‌ర్‌లో ప్రారంభ‌మైన ఈ గ్లిమ్స్ ఆడియ‌న్స్‌ను స‌ర్‌ఫ్రైజ్‌ చేసేలా ఉంది. ఈ వీడియోలో.. ఓ టీచ‌ర్ క్లాస్ రూంలో పిల్ల‌లకు గాంధీజీ , అహింస గురించి చెబుతున్న‌ట్లు చూయించ‌గా మ‌రోవైపు ఓ ఇంట్లో హీరోయిన్ రౌడీల‌ను ఒక్కొక్క‌రిని క‌త్తితో క‌సి తీరా న‌ర‌క‌డాన్ని చూయించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది. మీరూ ఓసారి వీక్షించండి. అయితే ఈ సినిమాను క‌న్న‌డ‌తో పాటు ఇత‌ర‌ ప్రాంతీయ భాష‌ల్లోనూ రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ఫ్లాన్ చేస్తోంది.

నటీనటులను ఎడా పెడా బాదేసింది…

నటీనటులను ఎడా పెడా బాదేసింది…

నిర్మాత ప్రవీణ పరుచూరి ‘కొత్తపల్లిలో’ చిత్రంతో దర్శకురాలిగా మారారు. మంగళవారం ఈ సినిమా ప్రీవ్యూ షోను వేశారు.

‘కేరాఫ్ కంచరపాలెం’ (Care of Kancharapalem), ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ (Uma maheswara ugra roopasya) చిత్రాల నిర్మాత పరుచూరి ప్రవీణ (Paruchuri Praveena) తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా ‘కొత్తపల్లిలో…’ (Kothapalli lo). ఒకప్పుడు అనేది దాని ట్యాగ్ లైన్. 1980, 90లలో కొత్తపల్లి అనే గ్రామంలో జరిగే కొన్ని సంఘటనలను సినిమాగా దర్శకురాలు ప్రవీణ తెరకెక్కించింది.

‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ సినిమా మీద ఉన్న నమ్మకంతో విడుదలకు మూడు రోజుల ముందే మీడియాకు ప్రివ్యూ షో వేసి చూపించారు. గ్రామీణ ప్రజల మూఢ నమ్మకాలను, వాటి పర్యవసానాలను తెలియచేస్తూ ఈ సినిమా సాగింది. రామకృష్ణ అనే యువకుడి జీవితం రాత్రికి రాత్రి ఎలా తల్లకిందులైందనేది ఇందులోని ప్రధాన కథాంశం. దీన్ని మూఢ విశ్వాసాలకు, అగ్రవర్ణాల అహంకారానికి, జలగల్లా పీడించే వడ్డీ వ్యాపారుల క్రూరత్వానికి లింక్ చేస్తూ ప్రవీణ పరుచూరి సినిమాగా తీశారు.

ఇటీవల ఓ ఇంటర్వూలో ఆర్టిస్టుల పట్ల తాను సినిమా షూటింగ్ లో అనుచితంగా ప్రవర్తించానని, సన్నివేశం బాగా రావడం కోసం కొన్ని సందర్భాలలో వారిపై చెయ్యి చేసుకున్నానని, కోపంతో రాళ్లూ విసిరానని చెప్పుకోవచ్చారు. నిజానికి ఇవన్నీ సినిమా కథలో భాగంగానే ప్రవీణ పరుచూరి చేశారని ఈ చిత్రాన్ని చూసిన తర్వాత అర్థమౌతోంది.

ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించడమే కాకుండా ఇందులో నాగమణి అనే డీ గ్లామరైజ్డ్ పాత్రను ప్రవీణ పోషించారు. ఓ మారుమూల పల్లెటూరిలో అట్లు వేసుకుని జీవితాన్ని గడిపే నిరుపేదరాలు పాత్రను ఆమె చేసింది. హీరో ప్రేమ విషయంలో జరిగే తగవులో అతని తరఫున వకాల్తా పుచ్చుకున్న ఈ పాత్ర… అవతలి పాత్రలతో ఢీ అంటే ఢీ అంటూ బరిలోకి దిగుతుంది. జుత్తు జుత్తు పట్టుకుని ఇద్దరు మహిళలు వీరంగం సృష్టిస్తారు. దర్శక, నిర్మాత కూడా అయిన ప్రవీణ ఆ సమయంలో కేవలం తన పాత్రను మాత్రమే దృష్టిలో పెట్టుకుని రెచ్చిపోయి… అవతలి వాళ్ళను తన్ని తగలేసి ఆ సన్నివేశాన్ని రక్తికట్టించింది. చిత్రం ఏమంటే… ‘కేరాఫ్ కంచరపాలెం’లో వేశ్యగా నటించడానికి వెనుకాడని ప్రవీణ… ఇందులోనూ తన పాత్రను కించపరిచే సంభాషణలను సైతం రాయించుకుంది. అక్కడ పాత్ర తప్పితే… మనకు నిర్మాతో, దర్శకురాలో కనిపించరు.

అమెరికాలో కార్డియాలజిస్ట్ గా ప్రాక్టీస్ చేస్తున్న పరుచూరి ప్రవీణకు సినిమా అంటే ఎంత పిచ్చో ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు అర్థం అవుతుంది. మరి ఎంతో కష్టపడి, ఇష్టపడి పరుచూరి ప్రవీణ తెరకెక్కించిన ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ చిత్రానికి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

విక్ర‌మ్, 96 ప్రేమ్ కుమార్‌ వ‌య‌లెంట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌..

విక్ర‌మ్, 96 ప్రేమ్ కుమార్‌.. వ‌య‌లెంట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌

త‌మిళ‌నాట ఓ అస‌క్తిక‌ర కాంబినేష‌న్ సెట్ అయింది.

ఏడేండ్ల క్రితం 96 అనే చిత్రంతో సెన్షేష‌న్ అయిన ప్రేమ్ కుమార్ (Prem Kumar) ఆపై అచి తూచీ మాత్ర‌మే సినిమాలు చేస్తూ త‌న‌కంటూ ఓప్ర‌త్యేక శైలిని ఏర్పాటు చేసుకున్నాడు. గ‌త సంవ‌త్స‌రం కార్తి, అర‌వింద్ స్వామిల‌తో ‘మెయ్యళగన్‌’ (Meiyazhagan) అనే సినిమాతో ఇంటిల్లిపాదితో ఎమోష‌న‌ల్జ‌ర్నీ చేయించి త‌న ప్ర‌త్యేక‌త‌ను నిలుపుకున్నారు. ఆయ‌న త‌మిళంలో చేసిన 96 చిత్రం తెలుగులో జానుగా రీమేక్ కాగా, ‘మెయ్యళగన్‌’ స‌త్యం సుంద‌రంగా విడుద‌లై భారీ విజ‌యాల‌నే సొంతం చేసుకున్నాయి. అయితే ఈ చిత్రం త‌ర్వాత డైరెక్ట‌ర్ ప్రేమ్ చేయ‌బోయే సినిమా ఏంటి, ఎలా ఉండ‌బోతుందో అనేది చాలామందికి ఎదుర‌వుతున్న ప్ర‌శ్న‌.

ఈ నేప‌థ్యంలో తాజాగా ఆయ‌న చేయ‌బోయే సినిమా గురించి నెట్టింట అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. అందుతున్న తాజా సమాచారం ప్రకారం ప్రేం కుమార్ తన కొత్త ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోండ‌గా అందులో చియాన్ విక్రమ్ (ChiyaanVikram) హీరో అని సంచ‌ల‌న వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది, సినిమా వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. ఈ చిత్రం పూర్తిగా యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్‌గా రూపొందనున్న‌ట్లు వినికిడి. అయితే.. ఇప్ప‌టికే.. విక్రమ్ త‌న‌ కెరీర్‌లో ఎన్నో విభిన్న కాన్సెప్ట్ సినిమాలు చేసినప్పటికీ, 64వ చిత్రంగా వ‌స్తున్న ఈ మూవీ మాత్రం ఫ్యాన్స్‌కి మరో లెవల్ ట్రీట్ ఇవ్వనుందనే టాక్ వినిపిస్తోంది.

ఇదిలాఉంటే.. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోందని. అన్నీ అనుకున్న‌ట్లుగా జరిగితే, వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. విక్రమ్ ప్రస్తుతం కొన్ని ఆసక్తికరమైన సినిమాల‌తో బిజీగా ఉన్నప్పటికీ, ప్రేమ్ కుమార్ చెప్పిన క‌థ బాగా ఆక‌ట్టుకుంద‌ని అందుకే వెంట‌నే డేట్స్ కూడా అడ్జ‌స్ట్ చేసిన‌ట్లు స‌మాచారం. ప్ర‌ముఖ త‌మిళ నిర్మాణ సంస్థ వేల్స్ పిల్మ్ ఇంట‌ర్నేష‌న‌ల్ (Vels Film International) సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుండ‌గా ప్రేమ్ కుమార్ శైలికి పూర్తి భిన్నంగా వ‌య‌లెంట్‌, యాక్ష‌న్‌గా ఈ సినిమా ఉండ‌నుంది. కాగా ఈ చిత్రంపై ఈ రెండు రోజుల్లోనే అధికారిక ప్రకటన రానుంది.

వ‌ణుకు పుట్టించే డార్క్ మైథ‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌!

ఓటీటీకి.. వ‌ణుకు పుట్టించే డార్క్ మైథ‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌! ఎందులో అంటే

చాలా రోజుల త‌ర్వాత బాలీవుడ్ నుంచి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వెబ్ సిరీస్ మండల మ‌ర్డ‌ర్స్ డిజిట్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేస్తోంది.

ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు చాలా రోజుల త‌ర్వాత బాలీవుడ్ నుంచి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వెబ్ సిరీస్ మండల మ‌ర్డ‌ర్స్ (Mandala Murders) డిజిట్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేస్తోంది. క్రైమ్‌, మ‌ర్ట‌ర్ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌ జాన‌ర్‌లో వ‌స్తున్న ఈ సిరీస్ రాక కోసం చాలామంది సినీ లవ‌ర్స్ ఎదురు చూస్తున్నారు. గ‌తంలో హిందీ నుంచే వ‌చ్చి క‌ల్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న‌ అసుర్ త‌ర‌హా కాన్పెస్ట్‌తో ఈ సిరీస్ తెర‌కెక్కింది. య‌శ్ రాజ్ సంస్థ ఆస్థాన క‌థానాయిక‌ బాలీవుడ్ న‌టి వాణీ క‌పూర్ (Vaani Kapoor) లీడ్ రోల్‌లో న‌టిస్తుండ‌గా సుర్వీన్ చావ్లా (Surveen Chawla), శ్రీయ పిగ్లోంక‌ర్ (Shriya Pilgaonkar), వైభ‌వ్ రాజ్ గుప్తా (Vaibhav Raj Gupta) కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

ఇదిలాఉంటే.. ఈ సిరీస్‌కు గోపి పుత్ర‌న్ (Gopi Puthran), మ‌న‌న్ రావ‌త్ (Manan Rawat) ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో పాటు డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. య‌శ్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) వంటి ప్ర‌ఖ్యాత భారీ బాలీవుడ్ నిర్మాణ సంస్థ డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్స్ లోకి ఎంట్రీ ఇస్తుండ‌డం విశేషం. చరందాస్పూర్ అనే గ్రామంలో జ‌రిగే వ‌రుస హ‌త్య‌లు, దాని వెన‌క ఉన్న ఆధ్యాత్మిక ర‌హాస్య‌ల ప‌రిశోధ‌న నేప‌థ్యంలో ఈ సిరీస్ రూపొందించారు. రియా థామస్ (Vaani Kapoor) మరియు విక్రమ్ సింగ్ (Vaibhav Raj Gupta) ఈ కేసును ఎలా విచారణ చేశారు, వారికి ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి, మ‌ర్డ‌ర్స్ వెనుక ఉన్న అనేక మిస్టరీలను ఎలా బ‌య‌ట‌కు తీసుకు రాగ‌లిగారు, చివ‌ర‌కు ఏమ‌యింద‌నేది క‌థ‌.

తాజాగా ఈ సిరీస్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకోవ‌డ‌మే వెంట‌నే చూసేయాలి అనే ఫీలింగ్‌ను తెప్పించేలా ఉంది. ముఖ్యంగా వ‌రుస హ‌త్య‌లు, వాటికి దైవానికి మ‌ధ్య లింకులు ఎపిసోడ్ ఎపిసోడ్‌కు వ‌చ్చే ట్విస్టులు మైండ్ బ్లాక్ చేసేలా ఉండ‌నున్న‌ట్లు తెలుస్తుంది. ఈ సిరీస్‌ జూలై 25 నుంచి నెట్ ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో హిందీతో పాటు ఇత‌ర ప్రాంతీయ భాష‌ల్లోనూ స్ట్రీమింగ్‌కు రానుంది. ఎంతో కాలంగా అసుర్ లాంటి సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్ కంటెంట్ అశిస్తున్న వారికి ఈ సిరీస్ బెస్ట్ ఛాయిస్‌. సో సినీ, ఓటీటీ ల‌వ‌ర్స్ డోంట్ మిస్ మండ‌ల (Mandala Murders) మ‌ర్డ‌ర్స్‌.

ఉచిత వైద్య శిభిరని ప్రారంభించిన..

ఉచిత వైద్య శిభిరని ప్రారంభించిన హనుమంతరావు పటేల్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రముఖ హోలీస్టిక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఝరాసంగం మండల కేంద్రంలోఉచిత వైద్య శిభిరం నిర్వహించడం జరిగింది లింగాయత్ సత్రం, టెంపుల్ రోడ్ నిర్వహించిన ఉచిత శిబిరాన్ని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హనుమంతరావు పటేల్ ప్రారంభించారు. కార్డియాలజీ, ఆర్థోపెడిక్, ఆప్థోమలాజీ, ఇంటర్నల్ మెడిసిన్ తో పాటు ఈసిజీ,ఆర్థో,కంటి,బిపి,డయాభైటిక్ షుగర్ తదితర పరీక్షలు వచ్చిన రోగులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రజలను అవసరమైన టెస్టులు మందులు ఉచితంగా అందించడం జరిగింది. గ్రామస్తులు ఆయా గ్రామస్తులను ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.

మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణ నిధుల కోసం వినతి.

మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణ నిధుల కోసం వినతి

కరీంనగర్, నేటిధాత్రి:

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ని కరీంనగర్ లోని వారి నివాసంలో గన్నేరువరం లక్ష్మీ నరసింహస్వామి మున్నూరు కాపు పటేల్ అసోసియేషన్ అధ్యక్షులు బొడ్డు బాలయ్య ఆధ్వర్యంలో కలిసి అసంపూర్తిగా ఉన్న సంఘ భవనం మరియు కాంపౌండ్ నిర్మాణానికి ఎంపీ ఫండ్స్ నుండి పది లక్షల రూపాయలను మంజూరు చేసి గన్నేరువరంలో ఉన్న రెండు వందల మున్నూరు కాపు కుటుంబాలకు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరడం జరిగింది. దీనికి వారు సానుకూలంగా స్పందించి అతి త్వరలోనే నిధులు మంజూరు అయ్యేవిధంగా చూస్తానని హామీ ఇవ్వడం జరిగినది. ఈకార్యక్రమంలో గన్నేరువరం మున్నూరు కాపు సంఘం ఉపాధ్యక్షులు పుల్లెల రాము, నాయకులు పుల్లెల జగన్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.

చనిపోయిన ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబానికి ప్రభుత్వం.

చనిపోయిన ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి

◆:-కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి.

◆:-వ్యవసాయ కార్మిక సంఘం
జిల్లా అధ్యక్షులు బి.రామచందర్

జహీరాబాద్/ఝరాసంగం:వ్యవసాయ కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రామచందర్, మాట్లాడుతూ ఝరాసంగం మండలం చీలపల్లి గ్రామంలో మూడు నెలల వేతనాలు రాకపోవడం, అధికారుల ఒత్తిళ్లు వలన కుంగిపోయి చనిపోయినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ శివన్న కుటుంబాన్ని ఆదుకోవాలని ఎంపీడీవో ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు.ఫీల్డ్ అసిస్టెంట్లకు అధిక పని భారం పెట్టి సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం వలన కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారింది అని ప్రభుత్వం వెంటనే బకాయిలు ఉన్నటువంటి వేతనాలను చెల్లించి ఫిల్ అసిస్టెంట్లను ఆదుకోవాలని వారు ఎంపీడీవో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చంద్రన్న, ఫీల్డ్ అసిస్టెంట్ల మండల అధ్యక్షులు ఈశ్వరప్ప పటేల్, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

సన్న బియ్యమైతే మాకేంటి..

సన్న బియ్యమైతే మాకేంటి..?

◆:-గ్రామాల్లో జోరుగా అక్రమ దందా

◆:-ద్విచక్ర వాహనాలపై తరలింపు

◆:-మరమరాల పేరిట కొనుగోళ్లు

◆:-కోళ్లపారాల దాణాగా సరఫరా

◆:-రాష్ట్రాలు దాటుతున్న పేదల రైస్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దారిద్య్ర
రేఖకు దిగువ ఉన్న పేద మధ్యతరగతి ప్రజలందరికీ ఉచితంగా రేషన్ బియ్యాన్ని అందిస్తోంది. రాష్ట్ర ప్రభు త్వం మూడు నెలలకు సరిపడా రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసింది. రేషన్ షాపు నుంచి ప్రజల వద్దకు వెళ్లిన బియ్యం కాస్త అక్రమార్కుల ఒడిలోకి వెళ్లి కాసుల కురిపిస్తున్నాయి. పూర్తి వివరాలకు వెళితే సంగారెడ్డి జిల్లా సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు మండలాలైన నారాయణఖేడ్, కంగ్జి, మనూర్, నాగలిగిద్ద, కల్హేర్ మండలాలకు చెందిన కొందరు అక్రమార్కులు మోటార్ వాహనా లు, టీవీఎస్, మోటార్ సైకిల్, హీరో హోండా వాహనాలపై ఉదయం 6గంటలకే న్యాల్ కాల్, ఝరాసంగం, కోహిర్, మొగుడంపల్లి, మండలాల్లోని వివిధ గ్రామాలకు తరలివచ్చి ప్రజల వద్ద ఉన్న రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు లేదా తెల్ల మురమురాలు తయారు పేరిట దొడ్డు బియ్యం కొనుగోలు చేసిన మాదిరిగానే సన్నబియ్యాని సైతం సేకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక కిలో బియ్యం కోసం రూ.23, రాష్ట్రం ఒక కిలో సబ్సిడీ సన్న బియ్యం పంపిణీ కోసం సుమారుగా రూ.40 నుంచి రూ.50 వరకు ఖర్చు అవుతుందని అంచనా ఇందులో ధాన్యం కొనుగోలు, మిల్లింగ్, రవాణా, ఇతర నిర్వహణ ఖర్చులు ఉంటాయి.

Free Ration Rice.

రాష్ట్రం దాటిస్తున్న అక్రమార్కులు..

బియ్యాన్ని కోళ్ల ఫారాలకు, రాత్రివేళ కర్ణాటక, మహా రాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నారు. రోజుకు వందల క్వింటాల బియ్యం తరలిపోతున్నా అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నట్లు విమర్శ లు ఉన్నాయి. రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు రేషన్ బియ్యం అక్రమ తరలిం పు వ్యవహారం చూసీచూడ నట్లు వదిలేస్తున్నారు. వీరి దందా ఉదయం 6గంట లకు ప్రారంభమై మధ్యాహ్నం 12గంటల వరకూ కొనసాగుతోంది. అయితే ఇవి కోళ్లపారాలకు కూడా పంపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికైనా అక్రమా ర్కులపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు విజ్ఞప్తి చేశారు.

టాలీవుడ్‌లో మ‌రో విషాదం ర‌వితేజ తండ్రి క‌న్నుమూత‌..

టాలీవుడ్‌లో మ‌రో విషాదం.. ర‌వితేజ తండ్రి క‌న్నుమూత‌

టాలీవుడ్‌లో మ‌రో విషాదం నెల‌కొంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ తండ్రి రాజగోపాల్ రాజు (90) మంగ‌ళ వారం రాత్రి కన్నుమూశారు.

టాలీవుడ్‌లో మ‌రో విషాదం నెల‌కొంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ (Ravi Teja) తండ్రి రాజగోపాల్ రాజు (90) (Bhupathiraju Rajagopal Raju) మంగ‌ళ వారం రాత్రి కన్నుమూశారు. గ‌త కొంత కాలంగా వ‌యో భారం, అనారోగ్య స‌మ‌స్య‌లతో ఇబ్బంది ప‌డుతున్న ఆయ‌న‌ హైదరాబాదులోని రవితేజ నివాసంలో తుది శ్వాస విడిచారు.

ఈ రోజు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, అభిమానులు వారి కుటుంబ స‌భ్యుల‌కు సోష‌ల్ మీడియా ద్వారా త‌మ సంతాపం తెలుపుతున్నారు.

రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ వృత్తి రీత్యా ఫార్మసిస్ట్ గా పని చేసేవారు. ఈ నేప‌థ్యంలో ఆయన పలు ప్రాంతాలలో ఉద్యోగం చేయాల్సి రావడంతో తాను అనేక ప్రాంతాలు చిన్నప్పుడే తిరగాల్సి వచ్చిందని రవితేజ పలు సందర్భాలలో పంచుకున్నారు. అలా అనేక ప్రాంతాలలో పనిచేస్తూ రావడంతోనే రవితేజకు అనేక యాసలు ఒంటబట్టాయని కూడా సన్నిహితులు చెబుతూ ఉంటారు.

ఇక రాజగోపాల్ రాజుకు ముగ్గురు కుమారులు రవితేజ, రఘు, భరత్ రాజు. ఇక భూపతి రాజు రాజగోపాల్ రాజు స్వగ్రామం ఆంధ్ర ప్రదేశ్ లోని జగ్గంపేట.

మెగాస్టార్ చిరంజీవి స‌హా చాలా మంది ప్ర‌ముఖులు ర‌వితేజ తండ్రి మృతికి సంతాపం తెలియ జేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చిరంజీవి త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా.. సోదరుడు రవి తేజ తండ్రి రాజ గోపాల్ రాజు గారి మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆయన్ని ఆఖరిసారిగా వాల్తేర్ వీరయ్య సెట్లో కలిశాను. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అని మెగాస్టార్ చిరంజీవి ఓ పోస్ట్ సైతం పెట్టారు.

శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి..

శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!

అంతర్గత అవయవాలు దెబ్బతిన్నప్పుడు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. అయితే, ఈ లక్షణాలు, మీ శరీరంలో కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. ఎందుకంటే..

 మన శరీరం దాని లోపల జరిగే ప్రతి మార్పు గురించి మనకు సమాచారాన్ని అందిస్తుంది. మనం దానిని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అంతర్గత అవయవాలు దెబ్బతిన్నప్పుడు శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్య నిపుణలు చెబుతున్నారు. కాబట్టి, ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

శరీరంలో వాపు, అలసట, బలహీనత అనేవి మీ అంతర్గత అవయవాలు అనారోగ్యానికి గురవుతాయని హెచ్చరించే కొన్ని లక్షణాలు. మూత్రంలో అధిక నురుగు, తరచుగా మూత్రవిసర్జన, మూత్ర పరిమాణంలో తీవ్రమైన మార్పులు మొదలైనవి మూత్రపిండాల సమస్యలను సూచించే కొన్ని లక్షణాలు.

ఇది మాత్రమే కాదు.. మీ కాళ్ళు, చీలమండలు, పాదాలు, ముఖం, కళ్ళ చుట్టూ వాపు కనిపించడం ప్రారంభిస్తే మీ మూత్రపిండాలలో ఏదో సమస్య ఉందని అర్థం చేసుకోండి. దీనితో పాటు శ్వాస ఆడకపోవడం, ఆకలి లేకపోవడం, రక్తపోటు పెరగడం, శరీరంలో తేలికపాటి దురద వంటి లక్షణాలు కనిపిస్తే ఇది మీ మూత్రపిండాలలో సమస్యకు ప్రత్యక్ష సూచన అని గుర్తుంచుకోండి.

బరువు పెరగడం లేదా తగ్గడం, కడుపులో గ్యాస్, ఎల్లప్పుడూ ఆమ్లత్వం వంటి సమస్యలు మొదలైనవి మీ ప్రేగుల ఆరోగ్యం క్షీణిస్తోందని సూచించే కొన్ని లక్షణాలు. ఇది మాత్రమే కాదు, మీరు మళ్లీ మళ్లీ తినాలని భావిస్తుంటే ఒత్తిడికి గురవుతుంటే ఇవి ప్రేగులలోని రుగ్మత లక్షణాలు కూడా కావచ్చు. ఈ లక్షణాలను తెలుసుకుని వాటికి చికిత్స తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

నెలవారీ ఖర్చులకూ క్రెడిట్‌ కార్డులే దిక్కు.

నెలవారీ ఖర్చులకూ క్రెడిట్‌ కార్డులే దిక్కు

దేశంలో క్రెడిట్‌ కార్డుల సంస్కృతి పెరిగిపోతోంది. చేతిలో చిల్లిగవ్వ లేక పోయినా.. జేబులో క్రెడిట్‌ కార్డు ఉంటే చాలు ఎడాపెడా ఖర్చు పెట్టేస్తున్నారు. బడా బాబులేగాక…

థింక్‌360.ఏఐ సర్వే వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో క్రెడిట్‌ కార్డుల సంస్కృతి పెరిగిపోతోంది. చేతిలో చిల్లిగవ్వ లేక పోయినా.. జేబులో క్రెడిట్‌ కార్డు ఉంటే చాలు ఎడాపెడా ఖర్చు పెట్టేస్తున్నారు. బడా బాబులేగాక, చిరుద్యోగులు, స్వయం ఉపాధిలో ఉన్న వ్యక్తులకు సైతం ఇప్పుడు క్రెడిట్‌ కార్డు నిత్యావసరమైంది. థింక్‌ 360.ఏఐ అనే సంస్థ గత ఏడాది కాలంగా దాదాపు 20,000 మంది చిరుద్యోగులు, స్వయం ఉపాధిలో ఉన్న వ్యక్తుల ఆర్థిక ప్రవర్తనను సర్వే చేసి..ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. చిరుద్యోగుల్లో నెలకు రూ.50,000 కంటే తక్కువ జీతం ఉన్న వారి ఖర్చుల తీరుతెన్నులను ఇందుకోసం పరిగణనలోకి తీసుకుంది.

సర్వే ముఖ్యాంశాలు

  • నెలవారీ ఖర్చులను క్రెడిట్‌ కార్డుల ద్వారా చెల్లిస్తున్న93 శాతం మంది చిరుద్యోగులు
  • స్వయం ఉపాధిలో ఉన్న వ్యకుల్లోనూ 85 శాతం మందికి నెలవారీ ఖర్చుల చెల్లింపులకు క్రెడిట్‌ కార్డులే గతి.
  • ‘బై నౌ పే లేటర్‌’ (బీఎన్‌పీఎల్‌) విధానం పట్ల ఆకర్షితులైన 18 శాతం మంది స్వయం ఉపాధి వ్యక్తులు. అదే బాటలో 15% మంది చిరుద్యోగులు
  • గిగ్‌ వర్కర్లతో పాటు అందరికీ తప్పనిసరి అవసరంగా మారిన క్రెడిట్‌ కార్డులు, బీఎన్‌పీఎల్‌ విధానం
  • 2022-23 ఆర్థిక సంత్సరంలో కొత్తగా మంజూరు చేసిన వ్యక్తి గత రుణాల్లో 72 శాతం (సుమారు రూ.92,000 కోట్లు) వాటా ఫిన్‌టెక్‌ కంపెనీలదే

మహిళా డాక్టర్ ఆత్మహత్య కేసులో నిందితుల అరెస్ట్ : కాజీపేట ఏసిపి ప్రశాంత్ రెడ్డి

kazipet acp prasanth reddy on prathyusha suscide case warangal

నలుగురిని అదుపులోకి తీసుకొని, కోర్టులో హాజరు పరిచిన పోలీసులు.

మీడియా సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించిన “కాజీపేట ఏసిపి ప్రశాంత్ రెడ్డి”…

kazipet acp prasanth reddy on prathyusha suscide case warangal

నేటిధాత్రి, హాసన్ పర్తి. హనుమకొండ.

నగరంలో సంచలనం సృష్టించిన మహిళా డాక్టర్ ఆత్మహత్య కేసు విచారణ చేపట్టిన పోలీసులు 24 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకుని, వైద్య పరీక్షలు జరిపించి, కోర్టులు హాజరు పరిచిన హసన్పర్తి పోలీసులు. నిందితుల వివరాలను, ఆత్మహత్య కు గల కారణాలు, జరిగిన ఉదంతంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించిన కాజీపేట ఏసిపి ప్రశాంత్ రెడ్డి. ప్రత్యూష భర్త డాక్టర్ సృజన్ తన ప్రియురాలితో కలిసి వేధించడం వల్లనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో డాక్టర్ అల్లాడి సృజన్, ఆయన పేరెంట్స్, ప్రేయసి శ్రుతి ఉన్నారు.

అసలేం జరిగింది…?

నిండు ప్రాణం బలిగొన్న బుట్టబొమ్మ?

రీల్స్ అమ్మాయి వల్ల నిండు ప్రాణం పోయిన తీరు.. రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి..

రీల్స్ మోజులో భార్యకు చిత్రహింసలు. ప్రముఖ వైద్యుడు సృజన్ సహా నలుగురి రిమాండ్.

యువ డాక్టర్ల మధ్య చిచ్చు పెట్టిన రీల్స్ అమ్మాయి.
బుట్టబొమ్మ అనే ఐడితో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే అమ్మాయి.

మెడికవర్ హాస్పిటల్ ప్రమోషన్ కోసం వచ్చిన అమ్మాయి, డాక్టర్ సృజన్ తో ప్రేమాయణం.. ఇద్దరి మధ్య రీల్స్ కలిపిన ప్రేమ.

అమ్మాయి ప్రేమలో మునిగిపోయిన యువ డాక్టర్.. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం..

రిసార్ట్స్ లో చెట్టాపట్టాల్.. వీరిద్దరి రహస్య సంబంధం ఇంట్లో తెలిసి గొడవలు..

ఆదివారం సాయంత్రం బార్య (డాక్టర్) ప్రత్యూష హాసన్పర్తి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య.

రీల్స్ అమ్మాయి వల్ల నిండు ప్రాణం పోయిన తీరు.. రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి..

రీల్స్ పేరిట బాగానే సంపాదించినట్లు వినికిడి.. మంచి హోదాలో ఉండి ఇలాంటి పనులు చేయడం వైద్య వృత్తికే కళంకితం అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్న తీరు..

సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సరైన యువతితో వివాహేతర బంధం పెట్టుకున్న భర్త తనను నిత్యం చిత్రహింసలకు గురిచేస్తున్నాడని వైద్యురాలైన భార్య బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా హసన్‌పర్తిలో జరిగింది. హసన్‌పర్తి పోలీసు స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాజీపేట ఏసీపి ప్రశాంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా కమలాపూర్‌ మండలం మంగపేటకు చెందిన డాక్టర్‌ అల్లాడి సృజన్‌ కేఎంసీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రితోపాటు ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలోనూ కార్డియో సర్జన్‌గా పని చేస్తున్నారు. ఆయనకు వరంగల్‌ నగరానికి చెందిన దంత వైద్యురాలైన ప్రత్యూష (36)తో 2017లో వివాహమైంది. వివాహ సమయంలో 30 లక్షల రూపాయలు కట్నం, కారు, 30 తులాల బంగారం ఇచ్చారు అని, వీరికి ఇద్దరు కుమార్తెలు. హసన్‌పర్తి మండల కేంద్రంలో నివసిస్తున్నారు. ఏడాదిన్నర కిందట ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ కార్యక్రమానికి ప్రచారం కల్పించడానికి వచ్చిన హనుమకొండ రెవెన్యూ కాలనీకి చెందిన సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సరైన యువతి శ్రుతి తో సృజన్‌కు పరిచయమైంది. అది కాస్త వివాహేతర బంధానికి దారి తీసింది. అప్పటి నుంచి కుటుంబాన్ని పట్టించుకోని సృజన్‌ భార్యను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. అత్తామామలు మధుసూదన్‌ – పుణ్యవతి సైతం కుమారుడికి వత్తాసు పలుకుతూ కోడలును వేధించారు. సృజన్‌ చేయి చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రత్యూష ఆదివారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకుంది. గమనించిన భర్త ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సోమవారం ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో హసన్‌పర్తి పోలీసులు సృజన్, ఆయన తల్లిదండ్రులతో పాటు యువతిపై కేసు నమోదు చేశారు. ప్రత్యూష శరీరంపై పలుచోట్ల గాయాలున్నాయని ఆమెది ఆత్మహత్య కాదని భర్త, అత్తామామ, మరో యువతి చిత్రహింసలకు గురిచేసి చంపారని తల్లిదండ్రులు ఆరోపించారు. విచారణ జరిపిన పోలీసులు 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.

నీ రీల్స్ తగలెయ్య…

ఎంత పనిచేశావ్ బుట్టబొమ్మ అంటూ చీదరిస్తున్న నెటిజన్లు

500, వెయ్యి రూపాయలకు ప్రమోషన్ రీల్స్ చేసుకునే అమ్మాయి, పెళ్లి అయిన వ్యక్తితో ప్రేమ దోమా అంటూ, చివరికి ఒక మహిళ చావుకు కారణం అయ్యావు అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వైరల్ అవుతున్నాయి. నీ వల్ల నిండు ప్రాణం బలి అయిపోయే.. సంతోషంగా ఉన్న మూడు కుటుంబాలు రోడ్డు మీదకు వచ్చిన తీరు.. ఇద్దరు ఆడ పిల్లలు తల్లి లేకుండా అయ్యారు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సదరు రీల్స్ అమ్మాయిని దుమ్మెత్తి పోస్తున్నారు. సదరు డాక్టర్ ఏమైనా తక్కువ అంటే కాదు, సదివింది డాక్టర్ చదువు.. ఉన్నతమైన ప్రొఫెషన్.. మంచి కుటుంబం.. సొసైటీ లో మంచి పేరు, రీల్స్ చేసుకునే అమ్మాయితో ప్రేమ కథలు పడితివి… తీరా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి.. తోటి డాక్టర్లు కూడా ఎవరు సపోర్ట్ చేయొద్దు అని నెటిజన్లు కోరుతున్నారు. ఇలాంటి వాళ్లకు తగిన శిక్షలు పడితేనే మిగతా వాళ్ళు మారుతారు అని నెటిజన్ల అభిప్రాయం. ఏది ఏమైనా సృజన్, శృతిల ప్రేమాయణం కారణంగా ఒక మహిళ ప్రాణం బలిగొన్న ఘటన, నగరంలో విషాదకరంగా మారింది.

 

ఎన్నికల సంఘం… ఎందుకీ గందరగోళం!

-విశ్వనీయత కోల్పోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదం.

-సుప్రీం కోర్టు చివాట్లు పెట్టినా మారదా!

-ఈవిఎంల మీద ఆరోపణలు.

-ఎన్నికల నిర్వహణలో లోపాలు.

-కౌంటింగ్‌లో అస్తవ్యస్త ప్రకటనలు

-వివి ప్యాట్స్‌పై అనేక అభ్యంతరాలు.

-ఎన్నికల సంఘం పని తీరు పార్టీల బరితెగింపుకు చెక్‌ పెట్టాలి.

-బీహార్‌ లో ఎందుకంత వావాదాస్పమౌతోంది.

-శేషన్‌లా గుర్తింపు పొందేలా పని తీరు వుండాలి.

-నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించిన పేరు సంపాదించుకోవాలి.

-ప్రపంచమంతా ఇండియన్‌ ఎన్నికల నిర్వహణ గురించి గొప్పగా చెప్పుకోవాలి.

-ప్రజాస్వామ్యంపై మరింత నమ్మకం పెంచాలి.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

  ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ అనేది ఒక క్రియాశీలకమైన ప్రక్రియ. ప్రజల నిర్ణయాన్ని నిక్షిప్తం చేసే వ్యవస్ధ. ప్రజలు కోరుకునే పార్టీని గెలిపించుకొని, పాలించమని కోరుకునేందుకు ఎన్నికల సంఘం ఒక వేదిక. ఆ ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్దమైనది. ప్రత్యేక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినది. అలాంటి ఎన్నికల సంఘం ఇటీవల అనేక వివాదాల్లో చిక్కుకుంటోంది. ఆ వ్యవస్ధ వున్నదే ఎన్నికలను సకాలంలో, సక్రమంగా నిర్వహించి, ప్రజా నిర్ణయాన్ని ప్రతిబింబించేలా వుండాలి. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికలు నిర్వహించాలి. అంతే కాని పదే పదే వివాదాలకు ఎన్నికల సంఘం కేంద్రం కాకూడదు. ఈ మధ్య ఎన్నికల సంఘం ఎదుర్కొంటున్న ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. రాజకీయ పార్టీలు అనేక విమర్శలు చేస్తున్నాయి. ఎన్నికల సంఘం ఓ పార్టీకి అనుకూలంగా పనిచేస్తుందన్న ఆరోపణలు రాజకీయపార్టీలు నేరుగానే చేస్తున్నాయి. అయినా ఎన్నికల సంఘంలో ఎలాంటి కదలిక లేదు. అంటే ఎన్నికల నిర్వహనలో పొరపాట్లు జరుగుతున్నాయని ఒప్పుకున్నట్లేనా? అవి దిద్దుకోలేనంత స్దాయిలో జరుగుతున్నాయని అంగీకరించినట్లేనా? అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఏ రాష్ట్ర ఎన్నికల నిర్వహణలోనూ కూడా పాదర్శకత కనిపించడం లేదని రాజకీయ పార్టీలు పదే పదే వెలెత్తి చూపుతున్నాయి. అలా ఆరోపణలు చేసి, చేసి విసిగిపోయిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఏకంగా సుప్రింకోర్టును కూడా ఆశ్రయించాయి. గతంలో సుప్రింకోర్టు కూడా పెద్దగా ఈ విషయాలను సీరియస్‌గా తీసుకోలేదు. కాని ఇటీవల దేశ వ్యాప్తంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాటిపై విచారణకు సీకరించిన సుప్రింకోర్డు అడుగుతున్న ప్రశ్నలలో ఎన్నికల కమీషన్‌ వద్ద సరైన సమాధానాలు వుండడం లేదు. దాంతో అనుమానాలు అందిరిలోనూ మరింత బలపడుతున్నాయి. ఎన్నికల సంఘం షరతులు, అనుసరిస్తున్న విధానాలు కూడా అలాగే వున్నాయి. సహజంగా ఎన్నికలు పూర్తయిన తర్వాత 45 రోజుల వరకు ఆ ఫలితాలకు సంబందించిన లెక్కలు చెరిపేయకూడదు. కాని ఇటీవల జరిగిన కొన్ని రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలకు సంబంధించిన వివరాలు పది రోజుల్లోనే మాయం చేశారని తెలుస్తోంది. ఎందుకు అలా ఎన్నికల సంఘం చేయాల్సి వచ్చిందన్నదానిపై సమాదానాలు లేవు. ఇది ఎన్నికల సంఘం నిర్లక్ష్యాన్ని చూపిస్తోంది. నిజం చెప్పాలంటే ఎన్నికల సంఘం అంటే రాజకీయ పార్టీలు భయపడేలా వుండాలి. ఏ మాత్రం చిన్న పొరపాటు జరిగినా ఎన్నికలకు అర్హులు కాకుండాపోతామన్న భయం నాయకుల్లో వుండాలి. పార్టీల గుర్తింపు రద్దు జరుగుతుందనే భయం పార్టీల్లో కూడా వుండాలి. కాని ఎన్నికల సంఘం గత కొంత కాలంగా ఒక పార్టీకి అనుగుణంగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు దురదృష్టకరం. ఆ ఆరోపణలు నిజం కానప్పుడు, ఆయా రాజకీయ పార్టీల మీద చర్యలకు కూడా ఎన్నికల సంఘం సిఫారసు చేయొచ్చు. కాని చేయడం లేదు. రాజకీయ పార్టీలకు వివరణలు ఇచ్చింది లేదు. ఎన్నికల సంఘానికి వున్న హక్కులను వినియోగించింది లేదు. ఇలా కూడా ఎన్నికల సంఘం వివాదాల్లో చిక్కుకున్నది. ఆ మధ్య జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెళ్లువెత్తాయి. మహారాష్ట్రలో జరిగిన ఓ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి విజయం సాధించారు. అదే పార్లమెంటు నియోజకవర్గ పరిదిలో వున్న అసెంబ్లీ నియోజకవర్గాలలో బిజేపి పార్టీ గెలిచింది. ఏకకాలంలో జరిగిన ఎన్నికల్లో ఇలాంటి తేడాలు సహజంగా దొర్లవు. ఎన్నికల జరిగిన తర్వాత ఎన్నికల సంఘం విడుదల చేసిన లెక్కలకు, తర్వాత లెక్కలకు ఎక్కడా పొంతనలేదు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం చాలా వేగంగా ఎన్నికల పోలింగ్‌ వివరాలు అందించే వెసులుబాటు వుంది. గతంతaలో బ్యాలెట్‌ ఎన్నికలు నిర్వహించినప్పటికంటే ఇప్పుడు ఎందుఉకు కాలాతీతమౌతోందన్నది అర్దం కాని ప్రశ్నగా మిగిలిపోతోంది. బ్యాలెట్‌ తో ఎన్నికల జరిగిన సమయంలో కూడా మరునాటి వరకైనా లెక్కలు పక్కాగా ప్రకటించేవారు. ఏ సమయానికి ఎంత పోలింగ్‌ అయ్యింది. పోలింగ్‌ మొదలైన తొలి గంట నుంచి ఆఖరు ఓటు వరకు లెక్కల్లో ఎలాంటి తేడాలు వుండేవి కాదు. ఇంత టెక్నాలజీ పెరిగిన సందర్భంలో పోలింగ్‌ లెక్కలు చెప్పడానికి మూడు రోజులు సమయం ఎందుకు పడుతుందన్న ప్రశ్నలకు ఎన్నికల సంఘం నుంచి సరైన సమాధానం లేదు. అది కూడా పారదర్శకంగా వుండడం లేదు. పైగా పెద్దఎత్తున ఓటర్ల నమోదు ప్రక్రియ జరిగినట్లు ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి. లక్షల్లో ఓట్లు రాత్రికి రాత్రి ఎలా పెరిగాయని ప్రశ్నిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఓట్లు వేస్తున్న వారి ఓట్లు లేకపోవడం, లక్షల్లో ఓట్లు పెరిగిపోవడం అనేది అనుమానాలకు తావిస్తోంది. ఇక హర్యానా ఎన్నికల విషయంలోనూ ఎన్నికల సంఘం ఇలాంటి వివాదాన్నే ఎదుర్కొన్నది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌తోపాటు, కొన్ని రౌండ్ల లెక్కింపు వరకు కాంగ్రెస్‌ పార్టీ గెలుపు దిశగా దూసుకుపోయింది. కాని అనూహ్యంగా కొన్ని రౌండ్లు పూర్తయ్యే సరికి బిజేపి పుల్‌ స్వింగ్‌లోకి వచ్చింది. కాంగ్రెస్‌ చాలా వెనుకబడిపోయింది. ఇది కూడా పెద్ద వివాదమైంది. ఇదంతా ఎన్నికల సంఘానికి తెలియకుండా జరిగి వుంటుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నతమౌతున్నాయి. ఇక ఏపిలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో సుమారు 54లక్షల ఓట్లు అదనంగా పోలయ్యాయని చెబుతున్నారు. ఒక రాష్ట్రంలో ఏకంగా 53లక్షల ఓట్ల తేడా వచ్చినట్లు గుర్తించారు. అసలు ఇన్ని లక్షల ఓట్లు ఎలా వచ్చాయి. పోలింగ్‌కు, ఎన్నికల ఫలితాలకు మధ్య ఇంత తేడా ఎలా వచ్చిందన్న దానిపై సర్వత్రా ఎన్నికల ఫలితాల నాటి నుంచే ఆందోళన వ్యక్తమౌతోంది. ఇప్పుడు ఆ ఆందోళన మరింత ఊపందుకున్నది. ఏకంగా ఏపి ఎన్నికలు రద్దు చేయాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. ఏపి ఎన్నికల విషయం కూడా ఇంత పెద్ద ఎత్తున ఊపందుకోవడానికి బిహార్‌లో ఎన్నికల కమీషన్‌ తీరుతో మరింత బలం చేకూరింది. సరిగ్గా ఏపిలో అనుసరించిన విదానమే బిహార్‌లో అనుసరించేలా వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. అక్కడ కూడా 33 లక్షల ఓట్లు ఏకంగా ఎన్నికల జాబితాలోనే కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. ఇలా ఎందుకు అవుతోంది. సహజంగా పోలింగ్‌ రోజున ఉదయం నుంచి మద్నాహ్నం వరకు ఒక్కొసారి కనీసం పదిహేను శాతం కూడా పోలింగ్‌ కాదు. సాయంత్రం ఐదు గంటల వరకు అరవై, నుంచి డెబ్బై శాతం పోలింగ్‌ జరగుతుంది. ఒక గంట ఎక్కువ సమయం కేటాచించినా ఓ రెండు నుంచి ఐదు శాతం ఓటింగ్‌ పెరగొచ్చు. ఆరు గంటలలోపు వచ్చి లైన్లో నిలుచున్న వారందరికీ ఓటు వేసుకునే అవకాశం కల్పించినా, సరే మరో రెండు శాతం పెరగొచ్చు. ఏకంగా పదిహేను శాతం ఓటింగ్‌ పెరగడం అనేది సాద్యమయ్యే పని కాదు. ఎన్నికల పలితాల తర్వాత సుమారు 45 రోజుల వరకు వివిప్యాట్స్‌ లెక్కబెట్టేందుకు అందుబాటులో వుంచుకోవాలి. కాని ఎన్నికల కమీషన్‌ పదిరోజుల్లోనే వాటిని చిత్తు చేసినట్లు సుప్రింకోర్టుకు వెల్లడిరచింది. అసలు అంత త్వరగా వివిప్యాట్స్‌ను, ఈవింఎంలలో వుండే డాటాను ఎందుకు తొలగించినట్లు అనేదానిపై ఎన్నికల కమీషన్‌ వద్ద సమాదానం లేదు. సుప్రింకోర్టు ఒత్తిడిని తట్టుకునేందుకు భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామన్నారు. మరి ఎన్నికలు జరిగిన రాష్ట్రాల పరిస్దితి ఏమిటన్నది ప్రశ్నగా మిగిలిపోతోంది. ఏపిలో వైసిపికి కేవలం 11 సీట్లు రావడంతో ఈ అనుమానం మరింత బలపడిరది. కొన్ని పోలింగ్‌ స్టేషన్లలో రాత్రి ఒంటి గంట వరకు పోలింగ్‌ జరిగినట్లు కూడా చెబుతుండడంతో అంత మంది పోలింగ్‌ స్టేషన్‌లోకి ఎలా వచ్చారు. ఆరు తర్వాత వచ్చిన వారిని ఎలా అనుమతించారు. ఎలా ఓట్లు వేయించారు. ప్రకటించిన పోలింగ్‌ శాతానికి కన్నా అదనంగా ఫలితాలలో వచ్చిన ఓట్లు, మెజార్టీల లెక్కల్లో చాలా తేడా వుందని నిపుణులు అంటున్నారు. బిహార్‌లో కూడా ఇదే జరగొచ్చన్న అనుమానాలు ఎక్కువగా వ్యక్తమౌతున్నాయి. డిల్లీలో కూడా ఇలాగే జరిగిందని కూడా అంటున్నారు. ఏది ఏమైనా ఎన్నికల కమీషన్‌ పారదర్శకంగా వుండాలి. నిస్పక్షపాతంగా వ్యహరించాలి. ప్రజలకు అనుమానాలను నివృత్తి చేయాలి. ప్రజాస్వామ్య గొప్పదనాన్ని ఎన్నికల కమీషన్‌ కాపాడాలి. ప్రజల నిర్ణయానికి భిన్నంగా ఫలితాలు వస్తే, ఎన్నికల సంఘం మీద విశ్వసనీయత పోతుంది. అది ఎన్నికల నిర్వహణకే శాపంగా మారుతుంది.

నెక్కొండలో టాస్క్ ఫోర్స్ దాడులు.

నెక్కొండలో టాస్క్ ఫోర్స్ దాడులు

రేషన్ బియ్యం పట్టివేత

#నెక్కొండ, నేటి ధాత్రి:

మండలంలోని చిరుధాన్యం కొనుగోలు కేంద్రంలో బియ్యం దందాను కొనసాగిస్తుండగా మంగళవారం టాస్క్ ఫోర్స్ సిఐ పవన్ నెక్కొండ ఎస్సై మహేందర్ సంయుక్తంగా దాడులు నిర్వహించారు ఈ దాడులలో నెక్కొండ మండలంలోని చిరుధాన్యం కొనుగోలు వ్యాపారస్తుడు నిలువుంచిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి సంబంధిత సివిల్ సప్లై అధికారులకు అప్పగించి సంబంధిత వ్యాపారిపై కేసు నమోదు చేసినట్లు నెక్కొండ ఎస్సై మహేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది, నెక్కొండ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల బరిలో సిపిఐ.

స్థానిక సంస్థల ఎన్నికల బరిలో సిపిఐ

డబల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలి

సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్

కరీంనగర్, నేటిధాత్రి:

స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉందని. ఎన్నికల బరిలో నిలిచేందుకు సిపిఐ శ్రేణులు సిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం జమ్మికుంటలో ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో సిపిఐ పోటీ చేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే మండలాల వారిగా పార్టీ అంతర్గత సమావేశాలు నిర్వహించుకుంటూ కార్యాచరణను రూపొందించుకుంటూ ముందుకు వెళ్తామని స్థానిక సంస్థలు ఎన్నికల్లో గెలిపిదేయంగా ఎన్నికల బరిలో నిలుస్తామని హుజురాబాద్ నియోజకవర్గంలో ఎంపిటిసి, జడ్పిటిసి స్థానాలకు పోటీ చేస్తామని ఇందుకు అనుగుణంగా క్యాడర్ ను సన్నద్ధం చేస్తున్నామని ఆయన తెలియజేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నేటికీ అర్హులకు పంపిణీ చేయకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు వెచ్చించి డబుల్ బెడ్ రూమ్లు నిర్మించి పేదలకు పంచకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయని అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దేనమిది నెలలు గడుస్తుందని అటు బిఆర్ఎస్ ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయకపోవడం పేదల పట్ల ఆపార్టీలకు ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తుందన్నారు. తక్షణమే జమ్మికుంట మండలంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ లలో ఇండ్లను పంపిణీ చేయాలని లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆక్రమించుకొని అర్హులైన వారందరికీ సిపిఐ ఆధ్వర్యంలో ఆక్రమిస్తామని ఆయన హెచ్చరించారు. ఈవిలేకరుల సమావేశంలో జమ్మికుంట, ఇల్లందకుంట సిపిఐ మండల కార్యదర్శిలు గజ్జి ఐలయ్య, మాదారపు రత్నాకర్ నాయకులు బొజ్జం రామ్ రెడ్డి, సారయ్య, శంకర్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ సిబ్బందికి సీజనల్ మరియు హెల్త్ కిట్స్ పంపిణీ.

మున్సిపల్ సిబ్బందికి సీజనల్ మరియు హెల్త్ కిట్స్ పంపిణీ

.వర్షాకాలంలో 16వ డివిజన్ ను పరిశుభ్రంగా ఉంచాలి.

సుంకరి మనిషా శివకుమార్.
16వ డివిజన్ కార్పొరేటర్

కాశిబుగ్గ నేటిధాత్రి.

వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధి 16వ డివిజన్ లోని పారిశుద్య పనులు నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బందికి స్థానిక 16వ డివిజన్ కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ సీజనల్ మరియు హెల్త్ కిట్స్ అందచేయడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నిరంతం డివిజన్ ను పరిశుభ్రంగా ఉంచేందుకు ఎంతగానో శ్రమిస్తున్న సిబ్బంది అనారోగ్య ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు కార్పొరేషన్ హెల్త్ కిట్స్ అందించడం ద్వారా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు.అదే విధంగా వర్షా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని సీజనల్ కిట్స్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపాలిటీ సిబ్బంది కార్పొరేటర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ జవాన్ లు సిబ్బంది పాల్గొన్నారు.

ప్రధానమంత్రి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం.

ప్రధానమంత్రి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
పి.ఎం సడక్ యోజన కింద పూర్తయిన ఐలోని కొండపర్తి రోడ్డు

నేటి ధాత్రి అయినవోలు

ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద మంజూరైన అయినవోలు నుంచి కొండపర్తి మీదుగా వెళ్లే డబుల్ బీటీ రోడ్డు పూర్తయిన సందర్భంగా బిజెపి అయినవోలు మండల అధ్యక్షుడు మాదాసు ప్రణయ్ ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాదాసు ప్రణయ్ మాట్లాడుతూ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారానే కొండపర్తి వయా ములకలగూడెం & ఒంటిమామిడిపల్లి గ్రామాల రోడ్డు ప్రధానమంత్రి సడక్ యోజన కింద పూర్తయినది. అందుకు కృతజ్ఞతగా కొండపర్తి గ్రామ పంచాయితీ దగ్గర మోదీ చిత్రపటానికి బిజెపి శ్రేణులు పాలాభిషేకం చేశారు. మాదాసు ప్రణయ్ మాట్లాడుతూ రోడ్డు పొడవు 5.682 కి.మీ. కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా పూర్తిగా మంజూరై నిర్మించడం జరిగింది కావున గ్రామాల అభివృద్ధి మోదీ వలనే జరుగుతుంది కాబట్టి స్థానిక ఎన్నికలలో భాజాపా అభ్యర్థుల గెలిపించాలని కోరడం జరిగింది. అనంతరం ప్రతి గ్రామంలో హరితహారం ఉందా పల్లె ప్రకృతి వనం, వీధిలైట్లు, స్మశాన వాటికలు, రేషన్ బియ్యం, పీఎం కిసాన్ నిధి, ముద్ర లోన్స్ ద్వారా వ్యక్తిగత వ్యాపారాలకు అభివృద్ధి, ప్రతి ఇంటికి ఉచిత మరుగుదొడ్లు, రైతు వేదిక, గ్రామాల అభివృద్ధి జరుగుతున్నాయంటే కేవలం కేంద్ర ప్రభుత్వం తోటే అని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రవితేజ గౌడ్, శక్తి కేంద్రం ఇంచార్జ్ కోట కిరణ్, మడ్డి రాజేష్,సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, కట్ట విజయ్, పోషలా రమేష్, కట్ట సాంబరాజు,చుక్కారావు, మహేష్, పోలింగ్ బూత్ అధ్యక్షులు కట్కూరి రమేష్, భూపతి, రాకేష్, హరీష్, వినయ్ ,రాజేందర్, శంకర్, జక్కోజు సాయిరాం తదితరులు పాల్గొన్నారు

విద్యార్థులు ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలి.

విద్యార్థులు ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్

సిరిసిల్ల పట్టణంలో జూనియర్ కళాశాల మైదానంలో 10వ తరగతి పిల్లలకు సైకిల్ పంపిణీ చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

విద్యార్థులు ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలో జూనియర్ కళాశాల మైదానంలో 10వ తరగతి పిల్లలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, ఎస్పీ మహేష్ బి గీతే, ఎమ్మెల్సీ అంజి రెడ్డిలతో కలిసి సైకిళ్ళు పంపిణీ చేశారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ మాట్లాడుతూ విద్యా, వైద్యం రూపంలో రాజకీయాల కతీతంగా ప్రతి ఒక్కరికి సహాయం అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు మోడీ గిఫ్ట్ పేరిట 10వ తరగతి చదివే బాల బాలికలకు ఉచితంగా సైకిల్ అందిస్తున్నామని అన్నారు.
విద్యార్థులకు మొదటి ఆస్తి సైకిల్ అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను ప్రోత్సహించాలని సైకిల్స్ అందించామని అన్నారు.నాణ్యమైన సైకిల్ అందిస్తున్నామని, వీటిని వినియోగించి విద్యార్థులు సకాలంలో తరగతి గదులకు హాజరు కావాలని పేర్కొన్నారు.

Bandi Sanjay

రాబోయే సంవత్సరాలలో కూడా 10వ తరగతి చదివే విద్యార్థులకు మోడీ గిఫ్ట్ కింద సైకిల్స్ అందిస్తామని అన్నారు. ఎల్.కే.జి నుంచి 6వ తరగతి చదివే విద్యార్థులకు మోడి కిట్స్ పేరిట బ్యాగ్, నోట్ బుక్స్, ఇతర సామాగ్రి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, పెద్ద పెద్ద కంపెనీలు వివిధ పనులపై వచ్చినప్పుడు వారితో చర్చించి సీ.ఎస్.ఆర్. నిధుల ద్వారా ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
చిన్నతనంలో గంటకు 15 పైసలు, 40 పైసలు కిరాయి తెచ్చుకొని సైకిల్ నడిపేవారిమని కేంద్రమంత్రి గుర్తు చేసుకున్నారు. సైకిల్స్ వినియోగించుకొని విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలని అన్నారు. చిన్నతనం నుంచి అనేక ఇబ్బందులు గురైనప్పటికీ బాబా సాహెబ్ అంబేద్కర్ బాగా చదువుకొని దేశానికి రాజ్యాంగం రచ్చించే స్థాయికి ఎదగారని అన్నారు.
సిరిసిల్ల జిల్లా కలెక్టర్ నిబద్ధతతో పని చేస్తున్నారని అన్నారు. యూ.పి. రాష్ట్రానికి చెందిన కలెక్టర్, మహా రాష్ట్ర కు చెందిన ఎస్పీ క్రమశిక్షణ, పట్టుదల, ప్రణాళికతో కృషి చేయడం వల్ల గొప్ప స్థాయికి ఎదిగామని అన్నారు. విద్యార్థులు ఉదయం సమయంలో చదువుకోవాలని, మన తల్లిదండ్రుల కష్టాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలని కేంద్ర మంత్రి తెలిపారు.

Bandi Sanjay

విద్యార్థులు పట్టదలతో పని చేస్తుందని, 2014 కంటే ముందు విద్య కోసం 68 వేలకోట్లు కేటాయిస్తే, మోడీ ప్రభుత్వం ప్రస్తుతం 1,25,000 కోట్లు ఖర్చు చేస్తుందని, ఏకలవ్య పాఠశాలలు నవోదయ పాఠశాలలు సైనిక్ స్కూల్స్ క్రమశిక్షణకు మారుపేరుగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని అన్నారు. రోడ్డుపై సైకిల్ నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని , ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, 20 రోజుల తర్వాత సర్వీసింగ్ చేసుకోవాలని తెలిపారు.
ఎమ్మెల్సీ అంజి రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల ఇబ్బందులు తొలగించాలనే ఉద్దేశంతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి వర్యులు సైకిల్స్ పంపిణీ చేస్తున్నామని అన్నారు. చిన్నతనంలో సర్వ శిక్షా అభియాన్ లో చదువుకునే రోజుల్లో తాను పడిన ఇబ్బందులు విద్యార్దులకు ఉండవద్దని బహుమతిగా సైకిల్స్ అందిస్తున్నామని పేర్కొన్నారు.విద్యార్థులు బాగా చదువుకోవాలని, మంచి ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎమ్మెల్సీ తెలిపారు. మోడీ గిఫ్ట్ పేరిట అందిన సైకిల్స్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, రోడ్డు పై జాగ్రత్తగా నడపాలని అన్నారు. ఎస్.ఆర్. ట్రస్ట్ తరపున విద్యార్థులకు 10వ తరగతి తర్వాత ఎటువంటి కెరియర్ ఆప్షన్స్ ఉంటాయో తెలుసుకునేందుకు వీలుగా పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని అన్నారు.

Bandi Sanjay

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సిరిసిల్ల జిల్లాలో 4 వేల సైకిళ్ళ పంపిణీకి శ్రీకారం చుట్టారని అన్నారు. రక్త విద్యా సంవత్సరం సిరిసిల్ల జిల్లాలో 10 వేల మంది విద్యార్థులు అదనంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని, రానున్న రోజుల్లో మరింత మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతాయని కలెక్టర్ తెలిపారు.
ఎస్పీ మహేష్ బి గీతే మాట్లాడుతూ,విద్యార్థులకు ఎంపీ మంచి సైకిల్స్ అందించారని, వర్షా కాలంలో రోడ్లు స్కిడ్ అధికంగా అవుతాయని, విద్యార్థులు జాగ్రత్తగా నడపాలని అన్నారు. అనంతరం కాలేజీ గ్రౌండ్ నుండి బతుకమ్మ ఘాట్ వరకు విద్యార్థులతో సైకిల్ ర్యాలీ ని జెండా ఊపి ప్రారంబించి కొంత దూరం సైకిల్ సవారీ చేశారు.
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు ఇన్చార్జి డిఈఓ వినోద్ కుమార్, స్థానిక నాయకులు, విద్యార్థులు, ప్రజలు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version