బాలాజీ ఇంటిగ్రేటెడ్ అక్షరలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం
నర్సంపేట,నేటిధాత్రి:
బాలాజీ విద్యాసంస్థల్లో ఒక్కటైన అక్షర ద స్కూల్, బిట్స్ స్కూల్లో మంగళవారం వన మహోత్సవ కార్యక్రమం పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.
బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఏ. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, ట్రెజరర్ డాక్టర్ వనజ పాల్గొని వన మహోత్సవం సందర్భంగా విద్యార్థులు గ్రీన్ కలర్ దుస్తులు ధరించి ఇంటి వద్ద నుండి తీసుకొచ్చిన మొక్కలను పాఠశాల ఆవరణలో పిల్లలతో మొక్కలు నాటించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతో దోహదపడతాయని ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని తెలిపారు.అనంతరం వన మహోత్సవం పై డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల సెక్రటరీ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి,బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ ప్రిన్సిపల్ జ్యోతి,అక్షర స్కూల్ ప్రిన్సిపల్ జి. భవాని,ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు పాల్గొన్నారు.