తెలంగాణ ఒలంపియాడ్‌లో జడ్ పిహెచ్ఎస్ బాలికల మెరిసిన ప్రతిభ

ప్రతిభ కనబరిచిన జడ్ పిహెచ్ఎస్ బాలికలు

శుభాకాంక్షలు తెలిపిన ఉపాధ్యాయులు

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రంలో ఆంగ్ల భాష ఉపాధ్యాయులు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండలస్థాయి తెలంగాణ ఒలంపియాడ్ పరీక్షలో శాయంపేట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠ శాల పదవ తరగతి చదువు తున్న దీవెన మొదటి బహు మతి సాధించి, ఎడ్యుక్వాస్ట్ సీనియర్ విభాగంలో ఎండి రేష్మ మొదటి బహుమతి సాధించగా,జూనియర్ విభాగంలో రుక్మిణి ప్రథమ బహుమతి సాధించింది. నాలుగు బహుమతులకు గాను మూడు బహుమతులు పాఠశాల విద్యార్థులు సాధిం చారు. ఈ విద్యార్థులు జిల్లా స్థాయికి అర్హత సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయులు శేఖర్ బాబుకు, బహుమతులు సాధించిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయు రాలు శ్రీలత శుభాకాంక్షలు తెలియజేశారు.

వైభవంగా రతన్ కీర్తన్ హాల్ ప్రారంభం

వేద ఆశీర్వచనాల మధ్య రతన్ కీర్తన్ హాల్ ప్రారంభం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలోని భవాని మందిరం రోడ్డులో నూతనంగా నిర్మించిన రతన్ కీర్తన్ హాల్ వేద ఆశీర్వచనాల మధ్య మంగళవారం రాత్రి వైభవంగా ప్రారంభమైంది. సంగీత అభిమానులకు, భజన ప్రియులకు సౌకర్యంగా ఉండేవిధంగా కీర్తన్ హాల్ ను తీర్చిదిద్దారు. అయోధ్య శ్రీరామ మందిరం ధ్వజారోహనం సందర్భంగా రతన్ కీర్తన్ హాల్ ప్రారంభించడం పట్ల ఏకాదశి భజన మండలి, జహీరాబాద్ హరేకృష్ణ మూమెంట్ బృందం శ్రీ రాముడి కీర్తనలు, శ్రీకృష్ణ భక్తి గీతాలు, శివ స్తుతులతో హాల్ మొత్తం దద్దరిల్లింది. ఈ క్రమంలోనే ప్రముఖ పారిశ్రామిక వేత్త భరత్ ఓజా జన్మదినం తో పాటు జహీరాబాద్ పట్టణ వ్యాపార వేత్త ఘన్ శ్యామ్ జాజు, కిరణ్ జాజుల 38 వ వివాహ వార్షికోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కీర్తన హాల్ నిర్వాహకులు రామ్ రతన్ సారడా, వందన సారడా, సాక్షి సారడా కుటుంబికులు వారిని ఘనంగా సత్కరించి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా భక్తులకు కేకులు పంచిపెట్టారు. హనుమాన్ మందిరం అర్చకులు ఆశిష్ తివారి మహారాజ్ వేద ఆశీర్వచనాలు అందజేయగా భక్తులు అభినందనలు తెలియజేశారు. తమ వివాహ వార్షికోత్సవం, జన్మదినం హరేకృష్ణ భక్తుల మధ్య జరుపుకోవడం అత్యంత సంతోషం కలిగించిందని ఘన్ శ్యామ్, కిరణ్ జాజు, భరత్, ప్రీతి ఓజా దంపతులు ఆనందోత్సాహల మధ్య వెల్లడించారు. భక్తులు కీర్తనలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ భక్తి భావంలో మునిగిపోయారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

రైతులను ఇబ్బంది చేస్తే కఠిన చర్యలు తీసుకుం టాం

జిల్లా కలెక్టర్ సత్యశారద

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం పత్తి పాక గ్రామంలో ధాన్యం కొను గోలు కేంద్రాన్ని కలెక్టర్ సత్య శారద గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు ధాన్యం తరలింపులో తీరును స్వయంగా పరిశీలించారు ఇప్పటివరకు రైతుల నుంచి సేకరించిన ధాన్యం ఎంత ఇంకా ఎంత ధాన్యం సేకరిం చాల్సి ఉందని ఆరా తీశారు.

కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడి సమస్య అడిగి తెలు సుకున్నారు. రైతులకు నీడగా టెంట్ సౌకర్యం కల్పించాలని ఆదేశించింది వడ్ల తేమ శాతా న్ని పరిశీలించి నిబంధనల మేరకు తాలు మట్టిలేని వడ్లను వెంటనే కొనుగోలు చేయాల న్నారు వడ్ల కొనుగోలు వివ రాలు క్యాబ్ ఎంట్రీ లపై ఆరా తీశారు. ఈ విషయంపై కలెక్టర్ మండిపడ్డారు.

ధాన్యం కొను గోలు ఆలస్యం కాకూడదు రవాణా పరంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండ వని పంట కొనుగోలు చేసిన తర్వాత పూర్తి బాధ్యత కేంద్రం నిర్వాహకులదేనని తెలిపారు. కొనుగోలు చేసిన వడ్లను వెం టనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు రైతులను ఇబ్బం దులను గురి చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, తాత్కాలిక మండల వ్యవ సాయ అధికారి శ్రీనివాస్, స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు

రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు స్నేహ ఎంపిక

రాష్ట్రస్థాయి ఖో ఖో అసోసియేషన్ పోటీలలలో పాల్గొంటున్న బాలికల పాఠశాల విద్యార్థిని స్నేహ.

మహాదేవపూర్ నవంబర్ 27 నేటి ధాత్రి *

 

మహాదేవపూర్ మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ బాలికల పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి చదువుతుంది. ఇటీవల పెద్దపెల్లి జిల్లాలో జిల్లాస్థాయి ఖో ఖో అసోసియేషన్ వారు జిల్లాస్థాయి సెలక్షన్స్ నిర్వహించారు, ఈ సెలక్షన్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగింది నవంబర్ 28 నుండి 30 వరకు పటాన్ చెరువు సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న రాష్ట్రస్థాయి 44వ జూనియర్ నేషనల్ కోకో ఛాంపియన్ 2025 ఖో ఖో పోటీల లో పాల్గొంటుందని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో బాగా ఆడి జాతీయస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు,విద్యార్థిని మరియు పాఠశాల పీడి గురుసింగాపూర్ణిమ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం సరిత, మధు ,సుధారాణి ,సరితా దేవి , ఒలి పాష,శ్రీనివాస్ ,వసుదప్రియ ,
వీరేశం ,సమ్మయ్య ,లీలారాణి ,రజిత, షాహిదాబేగం, ప్రసూన ,దీపిక, ఆంజనేయులు, అజ్మత్ పాషా లు పాల్గొని విద్యార్థిని అభినందించారు.

నామినేషన్ ఏర్పాట్లపై అధికారుల పర్యవేక్షణ

పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను పలువురు అధికారులు గురువారం మధ్యాహ్నం పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మహేందర్ రెడ్డి, సీఐ శివలింగం తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు

జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు

జిల్లా ఎస్పీ శ్రీ శిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్

భూపాలపల్లి నేటిధాత్రి

 

జిల్లాలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీస్ యాక్ట్ – 1861 నిబంధనలు 1 నుండి 30 వరకు) అమలులో ఉంటాయని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ శిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ తెలియజేశారు.
పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదు.
నిబంధనలకు విరుద్ధంగా డీజే సౌండ్ సిస్టమ్ వినియోగించరాదు.
శాంతిభద్రతలకు భంగం కలిగించే, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్ట వ్యతిరేక చర్యలు చేపట్టరాదు.
జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం శ్రమిస్తున్న నేపథ్యంలో, ప్రజలు పోలీసులకు సంపూర్ణ సహకారం అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

మొగుడంపల్లిలో నామినేషన్ కేంద్రాలు ఖరారు

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల కేంద్రాలు ఖరారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మొగుడంపల్లి మండల పరిధిలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కోసం గ్రామాలవారీగా కేంద్రాలను ఎంపీడీఓ మహేష్ ఖరారు చేశారు. ధనసిరి, మాడిగి, ఇప్పేపల్లి, గౌసాబాధ్ తండా, అసద్ గంజ్, గోపన్ పల్లి, ఖాజామాల్పూర్, గోడిగార్ పల్లి, మొగుడంపల్లి, మిర్జంపల్లి, జంగర్ బోలి, అర్చనాయక్ తాండ, విట్టు నాయక్ తండ, మన్నాపూర్, జాడి మల్కాపూర్, రాయిపల్లి తండా, సజ్జ రావు పేట తండా, గుడుపల్లి, చున్నం బట్టి తాండ, పడియల్ తండా, ఔరంగ నగర్ గ్రామాలకు నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వివరాలకు 8309271537 నంబర్ ను సంప్రదించవచ్చు.

ములుగు పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు 2024 జనాభా ఆధారంగా రిజర్వేషన్లు

గ్రామపంచాయతీ ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీలకు 2024 జనాభా నిష్పత్తికి సమానంగా రిజర్వేషన్లు (సీట్లు) కల్పించాలి

ములుగు టౌన్ నేటి దాత్రి

 

ములుగు జిల్లాలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు జరగబోయే గ్రామ సర్పంచ్ ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీలకు 2024 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ( కెవిపిఎస్) ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నం ప్రవీణ్ కోరారు

కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కమిటీ సభ్యులు రత్నం ప్రవీణ్ పాల్గొని
మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికలలో ఎస్సీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించారని, కానీ 2011-2025 ఈ మధ్యకాలంలో వారి జనాభా పెరిగి అనేక వేల మంది యువత కొత్తగా ఓటు హక్కు పొందారని ఎస్సీ ఎస్టీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని, 2011 జనాభా లెక్కల ప్రకారం కేటాయిస్తే వారికి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు రాక రాజకీయ రంగంలో కూడా వారి వెనుకబడిపోయి వివక్షతకు గురయ్యే ప్రమాదం ఉందని ఇప్పటికే ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రైవేటీకరణ విధానాల వలన విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కోల్పోయి బ్రతకడానికి చాలా ఇబ్బందులు పడుతున్న వారికి ఇప్పుడు ఈ రిజర్వేషన్ విధానం వల్ల రాజకీయ రంగంలో కూడా అవకాశాలు కోల్పోతారని, భారత రాజ్యాంగంలో కూడా ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా కనుగుణంగా రిజర్వేషన్లు కల్పించి, సీట్లు కేటాయించాలని ఉందని, అలాగే ప్రభుత్వాలు అన్ని కులాల వారిని సమానంగా గౌరవించాలని రాజ్యాంగంలో పొందుపరిచారని అయినా నేటి పాలకులు అవేమీ పట్టించుకోకుండా బీసీలకు 2024 జనాభా లెక్కల ప్రకారం గ్రామపంచాయతీ ఎన్నికలలో రిజర్వేషన్లు కల్పించి, ఎస్సీ, ఎస్టీలకు మాత్రం 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కేటాయించడం అంటే ముమ్మాటికి వారిని అవమానించడమేనని, ఇది రాజ్యాంగ స్పూర్తికి పూర్తి వ్యతిరేకమైన చర్య, రాజ్యాంగ విరుద్ధమైనదని వెంటనే ఈ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను సవరించి రాష్ట్రవ్యాప్తంగా మరియు ములుగు జిల్లాలో కూడా ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని లేనిచో కెవిపిఎస్ ఆధ్వర్యంలో పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు.

ముత్తారం పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ ఎం. రమేష్

ముత్తారం పోలీస్‌ స్టేషన్ తనిఖీ చేసిన ఏసీపీ ఎం. రమేష్

ముత్తారం :- నేటి ధాత్రి

 

రామగుండం పోలీస్‌ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ ముత్తారం పోలీస్‌ స్టేషన్ ను గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ తనిఖీ చేశారు. తనిఖీ లో భాగంగా ముందుగా పోలీస్ స్టేషన్ రికార్డ్స్ పరిశీలించారు, కే డి, డీ సి, సస్పెక్ట్ షీట్ లు పరిశీలించారు వారి ప్రస్తుత చర్యల గురించి తెలుసుకున్నారు, స్టేషన్ వెర్టికల్స్, ఎఫ్ ఐ ఆర్ ఇండెక్స్ మొదలైన రికార్డ్స్ తనిఖీ చేశారు, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండ చూసుకోవాలని సూచించారు. నిరంతం పోలీసులు పెట్రొలింగ్‌ నిర్వహించాలని పోలీస్ స్టేషన్‌ అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమం లో
మంథని సీఐ బి. రాజు ముత్తారం ఎస్ ఐ రవి కుమార్ పోలీస్ సిబ్బంది ఉన్నారు

మామండూరులో 20 ఎర్రచందనం దుంగలు స్వాధీనం, 2 స్మగ్లర్లు అరెస్టు

*మామండూరు పరిధిలో 20 ఎర్రచందనం దుంగలు స్వాధీనం..

*ఇద్దరు స్మగ్లర్లు అరెస్టు..

తిరుపతి(నేటిధాత్రి)నవంబర్ 27:

 

తిరుపతి జిల్లా మామండూరు పరిధిలో 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఇద్దరు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏఎస్పీ జె. కులశేఖర్ పర్యవేక్షణలో డీఎస్పీ ఎండీ షరీఫ్ మార్గ నిర్దేశకత్వంలో రైల్వే కోడూరు సబ్ కంట్రోల్ ఆర్ఐ కృపానందకు చెందిన ఆర్ఎస్ఐ కె.అల్లీభాషా టీమ్ స్థానిక ఎఫ్వీఓ జాన్ శామ్యూల్ తో కలసి బుధవారం రేణిగుంట మండలం మామండూరు నుంచి కూంబింగ్ చేపట్టారు. గురువారం తెల్లవారుజామున కాకిరేవులపెంట వద్ద ఇద్దరు వ్యక్తులు కనిపించారు. వారు టాస్క్ ఫోర్స్ సిబ్బంది ని చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారిని వెంబడించి పట్టుకున్నారు. వారిని మామండూరు స్థానికులుగా గుర్తించారు. వారిని విచారించి, పరిసరాల్లో వేటుకగా ఆ ప్రాంతంలో దాచి ఉన్న 20ఎర్రచందనం దుంగలు కనుగొన్నారు. అరెస్టయిన వారితో పాటు ఎర్రచందనం దుంగలను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. డీఎస్పీ వీ శ్రీనివాసరెడ్డి, ఏసీఎఫ్ జె శ్రీనివాస్ వీరిని విచారించారు. తరువాత ఎస్ఐ రఫీ కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

మహిళలపై కాంగ్రెస్ వివక్ష ఆరోపణలు

మహిళల అగౌరవపరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

ఏఐఎఫ్డిడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల రాగసుధ

నర్సంపేట,నేటిధాత్రి:

 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళల హక్కులు, గౌరవాలను పక్కనపెట్టి వివక్షను అధికారిక విధానంగా మార్చుకుందని అగౌరవపరుస్తున్నదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల రాగసుధ అన్నారు.గురువారం రాష్ట్ర సమావేశం నర్సంపేట ఓంకార్ భవన్ లో జరగగా రాగసుధ మాట్లాడుతూ మహిళ శక్తి పథకంకింద వడ్డీలేని రుణాలు,ఇందిరమ్మ చీరల పంపిణీలో ప్రభుత్వం బహిరంగంగా అన్యాయం చేస్తోందని అవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో మొత్తం 4,35,364 స్వయం సహాయక సంఘాలు ఉంటే కేవలం3,57,098 స్వయం సహాయక సంఘాలకు మాత్రమే 304 కోట్ల రూపాయల వడ్డీలేని రుణాలు ఇచ్చి కపటప్రేమ చూపుతున్నదని ఆరోపించారు.ఇందిరమ్మ చీరల పంపిణీని ఎన్నికల ప్రయోజనాల కోసం
కేవలం ఓటు బ్యాంకుగా చూస్తూ ఇందిరమ్మ పేరుతో కేవలం డ్వాక్రా గ్రూపు మహిళలకు మాత్రమే చీరలను అందిస్తుందని రాగసుద ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఐనవోలు ఎన్నికల్లో టికెట్ ఉద్రిక్తతలు

ఐనవోలు మండలంలో ఎన్నికల సందడి:
కేడర్ కష్టం వర్సెస్ నాయకుల ఆరాటం
“ఈసారి టికెట్లు కష్టపడ్డ కేడర్‌కా…?
లేక ఖద్దరు చొక్కాలిచ్చే నోట్ల కట్టలకా…?”
నాయకుల లక్ష్యం – ఆధిపత్యాన్ని నిలుపుకోవడమే
“ఆగమవుతున్నము పట్టించుకోండి” అసంతృప్తి లో కష్టపడ్డ క్యాడర్
మెజారిటీ సర్పంచ్ స్థానాలు జనరల్ కేటగిరివే!!
17 గ్రామాల రాజకీయ సమీకరణలపై విశ్లేషణ

నేటిధాత్రి ఐనవోలు :-

 

ఐనవోలు మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల పతాక వేళ మొదలైంది. హనుమకొండ రెవెన్యూ డివిజన్‌లో భాగంగా 2016లో ఐనవోలు మండలంగా ఏర్పడినప్పటి నుండి ,ఈ మండలంలో 10 రెవెన్యూ గ్రామాలు, 17 గ్రామ పంచాయతీలు ఉండటం ఈసారి ఎన్నికల రేసులో మెజారిటీ స్థానాలు జనరల్ కేటగిరీ కింద ఉండటంతో రాజకీయ నేతల దృష్టిలో కొత్త లెక్కలు మొదలయ్యాయి. ప్రజలతో కంటే పైస్థాయి అనుచరులతోనే టికెట్ పంపకాలపై చర్చలు ఎక్కువగా సాగుతుండటం, జేబులు బరువైన వాళ్లే ముందంజలో కనిపించడం స్థానిక రాజకీయ విన్యాసాలపై కొత్త సందేహాలు రేకెత్తిస్తున్నాయి.

నాయకుల లక్ష్యం – ఆధిపత్యాన్ని నిలుపుకోవడమేనా??

ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యే–ఎంపీ–జిల్లా నాయకుల దృష్టి మొత్తం పంచాయతీ స్థాయిలో తమ ఆధిపత్యాన్ని స్థిరపరచడంపైనే నిలిచింది. అనుచరులకు అవకాశాలు ఇవ్వాలనే హామీలు వెలుపల వినిపిస్తున్నా, నిజమైన కష్టపడ్డ కేడర్‌కి మాత్రం పట్టింపులు తగ్గుతున్నాయన్న ఆవేదన పార్టీ వర్గాల్లో స్పష్టంగా వినిపిస్తోంది.

గ్రామాల్లో పార్టీ జెండా మోసి తిరిగిన వాళ్ల కంటే, చివరి నిమిషంలో వచ్చిన “ప్రత్యేక అనుచరులు” లేదా వ్యాపార ప్రయోజనాల కోసం రాజకీయం వైపు చూడని వ్యక్తులకు ఇదివరకే అధికారం అనుభవించిన వారికీ టికెట్లు చుట్టబెడుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

“ఆగమవుతున్నాం పట్టించుకోండి” పా(త)ర్టీల క్యాడర్లో అసంతృప్తి

గత ఎన్నికల నుంచి ఈ ఎన్నికల దాకా పార్టీ కార్యకర్తలు భుజాన పడ్డ పని, తట్టుకున్న ఒత్తిడి, గ్రామాల్లో ఎదుర్కొన్న ప్రతికూలతలన్నింటినీ మరచినట్టుగా నాయకులు వ్యవహరిస్తున్నారని కేడర్ ఆరోపిస్తోంది.
“మా చెమట పిండుకొని వచ్చిన అధికార, మద్దతు మీ పాదాలకా? లేక నోట్ల కట్టలకా?” అనే ప్రశ్న గ్రామాల నుంచి నేరుగా నాయకుల కుర్చీల దాకా చేరుతోంది.

టికెట్లు చెమట చుక్కల కష్టానికా? ఖద్దరు చొక్కాలు ఇచ్చే నోట్ల కట్టలకా…?

టికెట్ పంపకాల్లో పారదర్శకత లేకపోవడమే ఇప్పుడు చర్చనీయాంశం.సంస్థాగత కృషి, పునాది స్థాయి పని, గ్రామ అభివృద్ధి పట్ల నిజమైన కట్టుబాటు లేనట్టి కొత్త నాయకులు లేదా గతంలో అధికారాన్ని అనుభవించి సంపాదన కూడబెట్టుకున్న వాళ్ళకి కేవలం వారి అంగ ఆర్థిక బలాన్ని చూపి పార్టీలు టికెట్ ఇచ్చేలా నాయకులు ప్రజా ప్రతినిధులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. నిజాయితీగా పార్టీ కోసం పనిచేయడం అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ సిద్ధాంతాలను జండాలను వదిలిపెట్టకుండా నిలకడగా నిలిచిన వారిని విస్మరించడం అంటే పార్టీలకే దీర్ఘకాలిక నష్టమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

సామాజిక సమీకరణలు – జనరల్ కేటగిరీ స్థానాల ప్రభావం

17 గ్రామాల్లో మేజర్ గ్రామ పంచాయతీలైన ఐనవోలు నందనం కొండపర్తి ముల్కలా గూడెం నర్సింహుల గూడెం ఉడుత గూడెం రెడ్డిపాలెం పంతిని తదితర గ్రామాల్లో జనరల్, జనరల్ మహిళా స్థానాలు కావడం వలన కుల, వర్గ సమీకరణలు కాస్త విభిన్నంగా కదులుతున్నాయి.కొన్ని గ్రామాల్లో వ్యక్తిగత ప్రాభవం మరికొన్ని గ్రామాల్లో ఆర్థిక బలం,ఇంకొన్ని ప్రాంతాల్లో పెద్దలు– మధ్యవర్తుల ప్రభావంఅభ్యర్థుల ఎంపికను ప్రభావితం చేస్తున్నాయి.

రాబోయే రోజులు కీలకం

అభ్యర్థుల జాబితా బయటకు వచ్చే సరికి పెద్దఎత్తున అసంతృప్తి, తిరుగుబాట్లు, మౌన వ్యతిరేకత కనిపించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.రాబోయే రోజులు ఐనవోలు రాజకీయ దిశను మార్చే అవకాశం ఉన్నందున అందరి చూపూ ఇప్పుడు నాయకుల నిర్ణయాలపైనే నిలిచింది.

పలమనేరు రైతులకు పంట నష్టం పరిహారం

*రైతున్నలకు అండగా నిలుస్తోన్న కూటమి ప్రభుత్వం..

*గత ప్రభుత్వం తప్పిదం… ఆర్థిక విధ్వంసం వల్ల ఇబ్బందుల్లో పడ్డ రాష్ట్రం..

*రైతులను ఆదుకోవడం…ఏనుగుల దాడుల కట్టడికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి..

*అటవీ ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలి..

*పంట నష్ట పరిహార చెక్కుల పంపిణిలో ఎమ్మెల్యే అమర్..

పలమనేరు(నేటి ధాత్రి)నవంబర్ 27:

 

రైతన్నలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తోందని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం పలమనేర్ అటవీ రేంజ్ పరిధిలోని వీ.కోట, బైరెడ్డిపల్లి గంగవరం, పలమనేరు రూరల్ మండలాలకు చెందిన అటవీ ప్రాంత గ్రామాల రైతులకు పంట నష్ట నివారణ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మొత్తం 92 మంది రైతులకు 9.60 లక్షల రూపాయల చెక్కులను ఆయన అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూగత ప్రభుత్వం తప్పిదం వల్ల ఆర్థిక విధ్వంసం జరిగి రాష్ట్రం ఇబ్బందుల్లో కూరుకుపోయింది అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం రైతులకు సంబంధించిన అన్ని అంశాలలో ప్రత్యేక శ్రద్ధ వహించి వారిని ఆదుకుంటున్నదన్నారు. అందులో భాగంగా ఏనుగుల దాడిలో పంటలు నష్టపోయిన రైతులకు మూడు నెలలలోనే పరిహారపు చెక్కులను అందించడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తున్నదన్నారు తెలియజేస్తుందన్నారు.ఇక ఏనుగుల దాడులను నివారించేందుకు చేపట్టాల్సిన అన్ని రకాల చర్యలను తీసుకోవడం జరిగిందని ఆయన వివరించారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలతో పాటు అటవీ ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హితవు పలికారు. అటవీ అధికారుల సలహాల మేరకు రైతులు ప్రత్యామ్నాయ పంటలపై మొగ్గు చూపాలని పేర్కొన్నారు. ఇలా ఉండగా పంట నష్టపరిహారం తక్షణం అందుతుండటంపై పలు రైతులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు,ఈ పరిహారపు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, టిడిపి నాయకులు సోమశేఖర్ గౌడ్, నాగరాజరెడ్డి,ఆర్బిసి కుట్టిలతో పాటు సబ్ డీఎఫ్వో వేణుగోపాల్, ఎఫ్ ఆర్వో నారాయణ, మరియు సిబ్బందితో పాటు పలువురున్నారు.

వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

పట్టణంలోని శుభం కన్వెన్షన్ హాల్ లో జరిగిన జహీరాబాద్ మండలం మల్చెల్మ గ్రామానికి చెందిన బస్వరాజ్ పటేల్ సోదరుడి కూతురి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు మాజి మున్సిపల్ చైర్మన్ అల్లాడి నర్సింలు , మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,విజేందర్ రెడ్డి,మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవికిరణ్,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,ఇస్మాయిల్, శశి వర్ధన్ రెడ్డి , తదితరులు.

ఎమ్మెల్యే మేఘా రెడ్డి గృహప్రవేశానికి వ్యాపారుల హాజరు

ఎమ్మెల్యే మెగా రెడ్డి నూతన గృహప్రవేశానికి హాజరైన వ్యాపారులు
వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నూతన గృహప్రవేశానికి వనపర్తి
కాంగ్రెస్ నేత నరహరి నరేష్ వ్యాపారులు లగిశెట్టి
చంద్రశేఖర్ సాకల్ పల్లి బొడ్డు శంకర్ తదితరులు హాజరయ్యా ఈ మేరకు ఎమ్మెల్యే మెగా రెడ్డి వారికి కృతజ్ఞతలు తెలిపారు

జర్నలిస్టుల దీక్షకు డాన్స్ అసోసియేషన్ మద్దతు

జర్నలిస్టులకు మద్దతు తెలిపిన డాన్స్ అసోసియేషన్

భూపాలపల్లి నేటిధాత్రి

 

గత రెండు సంవత్సరాల క్రితం జర్నలిస్టులకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చినా, ఇప్పటివరకు వారికి అసలు స్థలం చూపించకపోవడం చాలా బాధాకరం. ఈ న్యాయమైన డిమాండ్ కోసం జర్నలిస్టులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. జర్నలిస్టుల నిరసన కార్యక్రమానికి డ్యాన్స్ అసోసియేషన్ నాయకులు సంపూర్ణ మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
జర్నలిస్టులు ప్రజాస్వామ్యానికి నాల్గో స్తంభం సమాజంలో నిజాన్ని లేవనెత్తి ప్రజల ముందు ఉంచేవారు మీరు.
ఎవరూ మాట్లాడలేని నిజాన్ని మీరు వెలుగులోకి తీసుకువస్తారు. రాత్రింబవళ్లు కష్టపడేది వార్త కోసం కాదు — సమాజంలో మార్పు కోసం. మీలాంటి గొప్ప వృత్తి ప్రతినిధులు ఇలాంటి సమస్యలతో నిరాహార దీక్ష చేయాల్సిన పరిస్థితి రావడం బాధాకరం.
మా డాన్స్ యూనియన్ మేమంతా మీ పోరాటానికి మద్దతు తెలుపుతున్నాము. మీ డిమాండ్ న్యాయమైనది, ప్రభుత్వం అధికారులు వెంటనే జర్నలిస్టులకు కేటాయించిన స్థలాన్ని స్పష్టంగా చూపించాలని మా యూనియన్ అధికారులను డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో
జయశంకర్ జిల్లా డాన్స్ యూనియన్ ప్రెసిడెంట్ తోటకూరి గణేష్
దుర్గం రమేష్ గౌరవ అధ్యక్షులుడాన్స్ మాస్టర్
దుట తిరుపతి జాయింట్ సెక్రెటరీ
చాగర్ల రాకేష్ తదితరులు పాల్గొన్నారు

చేనేత ఎన్నికలు వెంటనే నిర్వహించాలి

వీలైనంత త్వరగా చేనేత సహకార ఎన్నికలు నిర్వ హించాలి

చేనేత కార్మికుల సంక్షేమం మెరుగుపడుతుంది

అఖిలభారత పద్మశాలి సంఘం జిల్లా ప్రచార కార్య దర్శి బాసాని బాలకృష్ణ

శాయంపేట నేటిధాత్రి:

 

ఎన్నికలతో చేనేత సహకార సంఘాలకు పూర్వ వైభవం వస్తుందోనని నేతన్నలో ఏండ్లు ఎదురుచూస్తున్న వారి కోరిక అందని ద్రాక్షలా మారుతుంది ఇప్పుడు అప్పుడు అంటూ 8 ఏళ్లుగా ఎన్నికలు ఊరిస్తూనే ఉన్నారు తాజాగా ప్రభుత్వం చేనేత జౌళి శాఖ సహకార సంఘాల గడువును పొడిగి స్తూనే కాలయాపన చేస్తుంటే దీంతో అసలు ఎన్నికలు జరు గుతాయో అనే అనుమానాలు కార్మికుల్లో వ్యక్తమౌతుంది. నాటి నుండి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వాయిదా వేస్తూ వస్తుంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి గతంలో ఉన్న పాలకవర్గాలకే అధికారం అప్పగిస్తుంది ఇలా ఇప్పటివరకు 18 దఫాలుగా జరుగుతుంది. ఎన్నికలు జరగకపోవడం ప్రత్యేకంగా సంఘాలకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో వాటి పరిస్థితి దుర్భరంగా మారి మనుగడకు ప్రశ్నార్ధకం అవుతోందని చేనేత కార్మికులు పేర్కొంటున్నారు.

చేనేత సంఘాలకు ఎన్నికల నిర్వహించాలి

స్థానిక సంస్థల ఎన్నికలతో పా టు చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని అఖిలభారత పద్మశాలి సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి బాసాని బాలకృష్ణ అన్నారు.మాట్లాడుతూ 8 సంవత్సరాల నుండి చేనేత సంఘానికి పర్సన్ ఇన్చార్జిగా పాలక వర్గాన్ని కొనసాగిస్తూ ఎన్నికలు పెట్టకుండా నిర్లక్ష్యా నికి గుర్తు చేస్తున్నారని తెలిపా రు. ఇప్పటికీ ఎన్నికలు జరగక చాలా కాలం అవుతుంది ఎన్నికల నిర్వహించడం వల్ల చేనేత కార్మికుల సంక్షేమం మెరుగు పడుతుంది అయిన ప్పటికీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని దానిపై స్పష్టత లేదు.చేనేత సంఘాలకు ప్రభు త్వం నుండి వచ్చిన నిధులపై విచారణ చేయాలని అధికారు లకు విన్నవించుకుంటే సంఘం పాలకవర్గం రాజీనామాను ఆమోదించి స్పెషల్ ఆఫీసర్ ను నియమించడం అన్నారు. ఇప్పటికైనా చేనేత సొసైటీ నిధులకు సంబంధించి విచా రణ చేసి స్థానిక సంస్థల ఎన్నిక లతో పాటు చేనేత సంఘానికి కూడా ఎన్నికలు నిర్వహిం చాలని కోరారు

వనపర్తిలో దీక్షా దివాస్ సమావేశం

దీక్షా దివాస్ సమావేశంలో మాజి మున్సిపల్ చైర్మన్ పలస

వనపర్తి నేటిదాత్రి .

 

కె సిఆ ర్ దీక్ష చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం సాధించామని వనపర్తి పట్టణ బీ ఆర్ ఎస్ అధ్యక్షుడు మాజీ మున్సిపల్ చైర్మన్ పలస రమేష్ గౌడ్ అన్నారు ఈ సందర్భంగా.రమేష్ గౌడ్ మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకంగా దీక్షా దివాస్ నిర్వహించాలని నాయకులు కార్యకర్తలు దీక్షా దివాస్ గురించి ప్రజలకు తెలుప లని కార్యకర్తలను కోరారు
14 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ఉద్యమం,10.సంవత్సరాల కె.సి.ఆర్ పరిపాలన యువతకు అవగాహన కలి పి చెందిoదుకు బీ ఆర్ ఎస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు ఈ సమావేశంలో
జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మీడియా ఇంఛార్జి నందిమల్ల.అశోక్,గంధం.పరంజ్యోతి,ఆవుల.రమేష్,విజయ్ కుమార్,ఉంగ్లం. తిరుమల్,బండారు.కృష్ణ, కంచ.రవి,సమద్,ప్రేమ్ నాథ్ రెడ్డి,స్టార్.రహీమ్,గులాం ఖాదర్ ఖాన్, రమేష్ నాయక్,షేక్.జహంగీర్,జోహెబ్ హుస్సేన్,సునీల్ వాల్మీకి,ఎం.బాలరాజు,సుధాకర్,పెద్దముక్కుల.రవి,మంద.రాము,ముద్దసార్,నందిమల్ల.సుబ్బు వజ్రాల.సాయిబాబా తోట.శ్రీను తదితరులు పాల్గొన్నారు.

రాహుల్ సిప్లిగంజ్ వివాహం

గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ వివాహం: బీజేపీ నేత శుభాకాంక్షలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ప్రముఖ గాయకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత రాహుల్ సిప్లిగంజ్ హైదరాబాద్లోని గచ్చిబౌలిలో తన ప్రియురాలు హరిణ్య రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ పట్టణ అధ్యక్షులు పూల సంతోష్ హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంఘటన రాహుల్ సిప్లిగంజ్ వ్యక్తిగత జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది.

హార్టికల్చర్‌లో పీహెచ్.డి సాధించిన ఊరటి మహేష్

హర్టికల్చర్ లో డాక్టరేట్ పొందిన ఊరటి మహేష్

వెంకటాపురం గ్రామస్తుల హర్షం వ్యక్తం

అతిచిన్న వయస్సులో పీహెచ్ డీ పొందిన డాక్టర్ మహేష్.

సంతోషం వ్యక్తపరిచిన తల్లిదండ్రులు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

ఉద్యానవన రంగంలో విశేష ప్రతిభ కనబరచి అతిచిన్న వయసులో డాక్టరేట్ పట్టా సాధించి అందరిమన్ననలు పొందాడు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామవాసి.వివరాల్లోకి వెళితే..దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన,మహమ్మదపురం వ్యవసాయ సహకార సొసైటి చైర్మన్ ఊరటి సునీత మైపాల్ రెడ్డిల కుమారుడు డాక్టర్ ఊరటీ మహేష్ ఆయన తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబం కావడంతో వారికష్టంతో చదువుపై మక్కువ పెంచుకున్నాడు.చిన్ననాటి నుండే ఉన్నత చదువుల వైపుకు అడుగువేసి వ్యవసాయ ఉద్యానవన రంగం నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు.అనంతరం పిహెచ్ డి చేసేందుకు గాను మొదటి ప్రయత్నంలోనే సీటు సాధించిన యువ విద్యావేత్త పిహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ పట్టానందుకున్నాడు.ఈ యువ విద్యావేత్త 27 ఏళ్లకే డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ నుండి హార్టికల్చర్‌లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పిహెచ్డి) లో పట్టా పొందేందుకు గాను పరిశోధన మార్గదర్శకులు డాక్టర్ కె.ఎం. యువరాజ్ ఆధ్వర్యంలో స్వాలో రూట్ (డికాల్పిస్ హామిల్టోనీ) పరిశోధన అంశంతో జన్యు వైవిధ్యం మరియు విలువ పెంపుపై అధ్యయనాలు పూర్తి చేశాడు. ఈ యువ విద్యావేత్త. 2016–2020 విద్యా సంవత్సరంలో కొండాలక్ష్మణ బాపూజీ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చరల్ యూనివర్సిటీలో బి.ఎస్‌.సి హార్టికల్చర్ లో తన ప్రతిభ తో 7.98 ఓ.జీ.పి.ఏ సాధించాడు. అనంతరం 2020–2022 కాలంలో కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్‌.సి హార్టికల్చర్ పూర్తి చేసి ఓ జీ పి ఏ 8.95 సాధించాడు. 2022–2025 లో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో పీహెచ్.డి పూర్తి చేసి ఓ జీ పి ఏ 9.37 సాధించాడు.తన పరిశోధనలో స్వాలో రూట్ ఒక ఔషధ మొక్కగా ఉండడంతో జన్యు వైవిధ్యం, విలువ పెంపు అవకాశాలను లోతుగా అధ్యయనం చేసి శభాష్ అనిపించాడు. ఈ పరిశోధన ఉద్యాన ఉత్పత్తుల వినియోగం మరియు మార్కెట్ విలువ పెంపులో కొత్త మార్గాలను చూపనుందని విశ్వవిద్యాలయ అధ్యాపకులు మహేష్ ప్రతిభకు మంత్రముగ్ధులయ్యారు.

 

డాక్టరేట్ ప్రదానం చేస్తున్న డాక్టర్ వైయస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ

విద్యాభ్యాసం చేస్తూనే డాక్టర్ మహేష్
విద్యా ప్రయాణంలో దేశీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పేపర్లను ప్రజెంట్ చేసి అనేక అవార్డులను సొంతం చేసుకున్నాడు.పరిశోధన మరియు శాస్త్రీయ ప్రజెంటేషన్లలో తమ ప్రతిభను నిరూపించాడు. అచ్చిన వయసులోనే డాక్టర్ సాధించడంతో దుగ్గొండి మండల వివిధ శాఖల అధికారులు మండల ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు కుటుంబ సభ్యులు వర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.
సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని డాక్టర్ ఊరటీ మహేష్ ప్రస్తుత యువతకు సందేశం పంపారు.భవిష్యత్తులో పరిశోధన, బోధన,మరియు ఉద్యాన రంగ అభివృద్ధిలో సేవలను కొనసాగించాలనే ఆలోచనతో మహేష్ ముందుకెళ్తానన్నారు.చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

డాక్టర్ ఊరటి మహేష్ ఫైల్ ఫోటో

 

డాక్టరేట్ పొందడం గర్వంగా ఉన్నది..తల్లిదండ్రులు.

వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మా కుమారుడు డాక్టర్ మహేష్ తన కష్టాన్ని చూస్తూ ఉన్నత చదువులు చదివి నేడు ఉద్యానవన రంగంలో డాక్టరేట్ పొందడం గర్వంగా ఉందని తల్లిదండ్రులు ఊరటి సునీత మైపాల్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version