ఈ నెల 22న చలో గన్ పార్క్ ను విజయవంతం చేయండి
మందల రవీందర్ రెడ్డి తెలంగాణ ఉద్యమ కారుల నాయకులు.
భూపాలపల్లి నేటిధాత్రి
కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈనెల 22న హైదరాబాదులోని గన్ పార్క కు ఉద్యమకారులందరూ తరలిరావాలని ఉద్యమ కారుల ఫోరమ్ నాయకులు మందల రవీందర్ రెడ్డి పిలుపినిచ్చారు. ఈ
సందర్భంగా మందల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఉద్యమకారుని గుర్తించడానికి ఒక ప్రత్యేకమైన కమిటీ వేయాలి.
ప్రతి ఉద్యమకారునికి 250. గజాల స్థలం ఇవ్వాలి.
జార్ఖండ్ రాష్ట్రంలో తరహాలో ప్రతి ఉద్యమకారునికి ప్రతి నెల 25 వేల పెన్షన్ సౌకర్యం కల్పించాలి.
ప్రతి ఉద్యమకారునికి గుర్తింపు కార్డుతో పాటు. ఉచిత బస్సు రైల్వే సౌకర్యాలు కల్పించాలి.
పదివేల కోట్లతో ఉద్యమకారుల సంక్షేమ బోర్డు నే ఏర్పాటు చేయాలి. డిమాండ్ చేశారు