23 న విద్య సంస్థల బంద్ ను విజయవంతం చేయాలి
నర్సంపేట,నేటిధాత్రి:
రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగా సమస్యలను పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 23న తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త విద్య సంస్థల బంద్ ను విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు దిడ్డి పార్థసారథి,పీడీఎస్యు, జిల్లా అధ్యక్షులు గుర్రం అజయ్, జిల్లా అధ్యక్షులు నరేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలు,ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకోడం కారణంగా అధికారాన్ని కోల్పోయిందని,గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని పేర్కొన్నారు.ఈకార్యక్రమలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి పైస గణేష్,పిడిఎస్యు డివిజన్ అధ్యక్షులు రవి,ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు పవన్ వరుణ్,నాయకులు కిరణ్, క్రాంతి ప్రవళిక కళ్యాణి శ్వేత రజిని నాగేంద్ర,గౌతమ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.