వికలాంగుల మహా గర్జన సభను విజయవంతం చేయాలి
భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల మండలం బోర్నపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు రేణిగుంట శంకర్ ఆధ్వర్యంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి గ్రామ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది గ్రామ శాఖ అధ్యక్షులుగా అడిచర్ల తిరుపతి ఉప అధ్యక్షులుగా రేణికుంట్ట్ల మొగిలి ప్రధాన కార్యదర్శిగా భోగి రవి నీ ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ భూపాలపల్లి జిల్లా సీనియర్ నాయకులు రామ్ రామచంద్ర వారు హాజరైనారు అనంతరం మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్ రూపాయలు 6000 పెంచాలని వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేత గీత కార్మికుల పెన్షన్ 4000 కు పెంచాలని అలాగే పూర్తిస్థాయి కండ నరాల బలహీనత ఉన్నవారికి 15000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైదరాబాదులో ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోయే వికలాంగుల మహా గర్జన విజయవంతం చేయడానికి ఈనెల 25న భూపాలపల్లి లో నిర్వహించబోయే ఈ సభకు వృద్ధులు వికలాంగులు ఇదంతులు హాజరై గీత బీడీ గౌడ అందరూ ఈ సభకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు