16న రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి.

ఈనెల 16న రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి.

చిట్యాల, నేటిధాత్రి :

బ్యాండు వాయిద్య కళాకారుల సంఘం ఆధ్వర్యంలో చిట్యాల మండల కేంద్రంలో బ్యాండు సమస్యల కోసం ఈనెల 16న సిటిజన్ ఫంక్షన్ హాల్ లష్కర్ బజార్ హనుమకొండ లో జరుగు రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని గోడ పత్రిక ఆవిష్కరించడం జరిగినది వాయిద్య ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి గుర్తింపు కార్డులు ఇవ్వాలి ప్రమాద బీమా వర్తిoప చేయాలి హెల్త్ కార్డు లిపించి ఉచిత వైద్యం కల్పించాలి ఈ కార్యక్రమంలో పాల్గొన్న
చిట్యాల మండల అధ్యక్షుడు
పర్లపెల్లి రవి కోశాధికారి లద్దునూరి ప్రభు జాయింట్ సెక్రెటరీ భద్రయ్య తదితరులు అంకుశవాలి బోనగిరి రాజు వైనాల మొగిలి సాయబు హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

జై బాపు, జై భీం, జై సంవిధాన్ సభ ఘన విజయం..

జై బాపు, జై భీం, జై సంవిధాన్ సభ ఘన విజయం

ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన నవాబుపేట మండల ఓబీసీ శాఖ అధ్యక్షులు

శంకర్ పల్లి,నేటి ధాత్రి జూలై 5:
శుక్రవారం ఎల్బి స్టేడియంలో నిర్వహించిన “జై బాపు – జై భీం – జై సంవిధాన్” సభకు ప్రజలు భారీగా హాజరై సభను ఘనవిజయంతో ముగించేందుకు తోడ్పడినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు నవాబుపేట మండల ఓబీసీ శాఖ అధ్యక్షులు జూలకంటి శ్రీధర్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
“సాంఘిక న్యాయం, సమానత్వం, రాజ్యాంగ పరిరక్షణ కోసం నిర్వహించిన ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి, మద్దతుగా నిలిచిన కార్యకర్తలకు, యువతకు, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మన రాజ్యాంగ మూల్యాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో ఈ సభ ఒక గొప్ప మాదిరిగా నిలిచింది” అని అన్నారు. సభ విజయవంతం కావడంలో ముఖ్యపాత్ర వహించిన యువత సంఘాలు, స్థానిక నాయకులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. సభ అనంతరం ప్రజల్లో కొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసం కనిపించిందని పేర్కొన్నారు.

5వ మహాసభలను జయప్రదం చేయండి.

సిపిఐ జిల్లా 5వ మహాసభలను జయప్రదం చేయండి

పలిమల మండలంలోని ప్రజా సమస్యలను పరిష్కరించాలి

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సోతుకు ప్రవీణ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 5వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సోతుకు ప్రవీణ్ కుమార్ పలిమల మండల కేంద్రంలో సిపిఐ నాయకులతో కలిసి వాల్ పోస్టర్లను(గోడ పత్రికలు) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోతుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతు 99 వసంతాలను పూర్తి చేసుకున్న భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా మహాసభలను ఈ నెల జులై 13 14వ తేదీన రేగొండ ఎస్ ఎల్ ఎన్ గార్డెన్ లో లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ జిల్లా మహాసభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాస్ రావు ముఖ్యఅతిథిలు గా హాజరవుతున్నారని తెలిపారు. మహాసభలో జిల్లా సమగ్ర అభివృద్ధికై చర్చించి భవిష్యత్ కార్యక్రమం రూపొందించుకోవడం జరుగుతుందని అన్నారు.ముఖ్యంగా పలిమల మండలం అభివృద్ధి ఆమడ దూరం లో ఉంది అన్నారు. పలిమల మండల అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయించాలని కోరారు. పలిమల మండలంలోని పోడు చేసుకున్న రైతులకు పట్టాలి ఇవ్వాలని కోరారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన పెద్ద ఎత్తున చర్చ జరిపి తీర్మానాలు ప్రవేశపెట్టి ఆందోళన పోరాటాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. సిపిఐ 5వ జిల్లా మహాసభలను ప్రజలు, మేధావులు, కార్మికులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు క్యాతరాజ్ సతీష్, మండల నాయకులు మట్టి సర్వేష్, మట్టి కృష్ణ, నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్ అమీలే శ్రీనాధ్, శ్రీకాంత్, అంజి బాబు, మారవేణి వెంకట్, పోడెం సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

9 జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి.

ఈనెల 9 జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి

నాలుగు లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలి.

కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

 

 

కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని జాతీయ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు కొరిమి రాజ్ కుమార్, మిరియాల రాజిరెడ్డి, తుమ్మల రాజిరెడ్డి, చక్రపాణి, విశ్వనాధులు డిమాండ్ చేశారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటియుసి కొమురయ్య భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ.. బ్రిటిష్ కాలం నుండి 44 కార్మిక చట్టాలను సాధించుకోవడం జరిగిందని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఈ కార్మిక 44 చట్టాలను నాలుగు కోడులుగా విభజించి కార్మిక హక్కులను కాల రాస్తున్నాయని మండిపడ్డారు. ఈ కోడ్ ల విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 9 న నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మికులంతా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ ఒక్కరోజు దేశవ్యాప్త సమ్మెతో కార్మిక శక్తి ఏంటో కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా సింగరేణి సంస్థను పరిరక్షించే విధంగా జాతీయ సంఘాల జేఏసీ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఈ నాలుగు లేబర్ కోడ్ ల వల్ల కార్మిక సంఘాలు ఉండకూడదని కుట్రతో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం లేబర్ చట్టాలను తెచ్చిందని, కార్పొరేట్ శక్తులకు లాభం చేసే ఈ నాలుగు కోడ్ల అమలు వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని, భూపాలపల్లి ఏరియాలోని అన్ని సంఘాల నాయకులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జేఏసీ సంఘాల నాయకులు మాతంగి రామ్ చందర్, నూకల చంద్రమౌళి, బడి తల సమ్మయ్య, కంపేటి రాజయ్య, గణేష్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటికి కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం..

*ఇంటింటికి కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం..

*2న వి.కోట నుంచి ప్రారంభం..

పలమనేరు(నేటి ధాత్రి) జూన్ 31:

 

 

 

ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశ్యంతో చేపట్టదలచిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా విజయవంతం చేయాలని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం సమన్వయ కమిటీ సభ్యులతో అయన సమావేశం నిర్వహించారుఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా ఇప్పటి వరకు ప్రజలకు చేసిన సంక్షేమం అభివృద్ధి పై గ్రామ స్థాయిలోని ప్రజలకు తెలియజేయడంతో పాటు వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారించ డమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఇందుకోసం
(కే ఎస్ ఎస్) కుటుంబ సాధికారిక సభ్యులుగా ఉన్న వారు బాధ్యత తీసుకొని పార్టీ రూపొందించిన ఫార్మట్ ప్రకారం వివరాలను పొందుపరచాల్సి ఉంటుందన్నారు. ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లాలన్నదే ముఖ్యమంత్రి ప్రధాన లక్ష్యం. కాబట్టి పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలందరికి సంక్షేమ ఫలాలు తప్పక అందెలా చూడాలన్నారుబూత్ లెవల్ స్థాయిలో కనీసం రోజుకు 50 కుటుంబాలకు తగ్గకుండా ఇంటింటికి కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుందని సూచించారు. ఇక ఈ కార్యక్రమం నియోజకవర్గం లోని వి. కోట మండలంలోని కొంగాటం పంచాయతీ నుంచి ఈ నెల 2 న ప్రారంభించి ఏక కాలంలో అన్ని మండలాల్లో విజయవంతంగా సాగేలా చూడాలని కోరారు. అనంతరం కార్యక్రమ కార్యాచరణ పై నాయకులతో ఆయన చర్చించారు. ఈ సమావేశం లో సీనియర్ నాయకులు ఆర్వీ బాలాజీ, విజయ భాస్కర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రంగనాథ్,కిషోర్ గౌడ, సోమశేఖర్ గౌడ్, ఆనంద,నాగరాజు రెడ్డి, కుట్టి,నాయకులు సుబ్రహ్మణ్యం గౌడ్,రాంబాబు, గిరి, ప్రతాప్, బ్రహ్మయ్య, నాగరాజు, చౌడప్ప, చాంద్ భాషా తదితరులు పాల్గొన్నారు.

ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం…

ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

 

ఇటీవల అనారోగ్యంతో మరణించిన సీనియర్ పాత్రికేయుడు మునీర్ యాదిలో ఆయన పేరిట రామకృష్ణాపూర్ పట్టణంలోని ఆర్కేసిఓఏ క్లబ్ లో మాజీ కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతం అయింది. కరీంనగర్ లోని ప్రముఖ రేని హాస్పిటల్, మంచిర్యాల మేడి లైఫ్, శరత్ మాక్స్ విజన్ హాస్పిటల్ వారి సౌజన్యంతో నిర్వహించిన వైద్య శిబిరంలో పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేసుకున్నారు. వైద్య పరీక్షలో సమస్యలు ఉన్న వారికి ఉచిత మందులు ఇవ్వడంతో పాటు అధిక సమస్యలు ఉన్నవారు ఆరోగ్య శ్రీ కార్డు, లేదా ఇన్సూరెన్స్ ఉన్నవారు తమ యొక్క ఆసుపత్రి యాజమాన్యం వారికి పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రత్యేక వైద్య నిపుణులు సూచించారు. ఈ వైద్య శిబిరంలో షుగర్, బీపీ, ఈసీజీ, 2డిఈకో, కంటి పరీక్షలు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ మెగా వైద్య శిబిరంలో పట్టణ ఎస్సై రాజశేఖర్, కమిషనర్ గద్దె రాజు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్,సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ లతో పాటు పుర రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

ఉచిత మెగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేయండి

ఉచిత మెగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేయండి

మెడికల్ క్యాంప్ పోస్టర్ ఆవిష్కరణ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

ఈనెల 29 ఆదివారం రోజున రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి సిఈఆర్ క్లబ్ లో సీనియర్ జర్నలిస్ట్ స్వర్గీయ మునీర్ జ్ఞాపకార్థం మునీర్ మెమోరియల్ ఆధ్వర్యంలో కరీంనగర్ రెనే హాస్పిటల్, మంచిర్యాల మెడి లైఫ్ హాస్పిటల్ వారు నిర్వహించే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మెడికల్ క్యాంపును విజయవంతం చేయాలని రెండో వార్డ్ మాజీ కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్, రెనే హాస్పిటల్ జనరల్ మేనేజర్ పవన్ ప్రసాద్ లు అన్నారు. అనంతరం మెడికల్ క్యాంపు వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సీనియర్ జర్నలిస్టు మునీర్ జ్ఞాపకార్థం సింగరేణి క్లబ్ లో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని, ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. పేదవారికి కార్పొరేట్ వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని, గత మూడు సంవత్సరాలుగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ అభిలాష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పలిగిరి కనకరాజు, వసీముద్దీన్, శంకర్, పాషా, సారయ్య, రాజేందర్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతం చేయండి.

అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతం చేయండి

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు ప్రెస్ క్లబ్ లో రేపు జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ద వేడుకల్లో భాగంగా ఈరోజు ప్రెస్ క్లబ్ లో ఆయుష్ యునాని డిస్పెన్సరీ యోగా శిక్షకులు బీ.శ్రీనివాస్ మాట్లాడుతూ భారత ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు 2014లో జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగినది. అందుకు రేపు సిరిసిల్ల జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రభుత్వం నుండి జరుపుతూ స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యార్థులు, యువకులు, అధికారులు, నాయకులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరడం జరిగినది. నేటి పరిస్థితుల్లో మానవ జీవన గమనానికి యోగా ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటిదని తెలిపారు. రేపు జరగబోయే యోగా దినోత్సవం విజయవంతం చేయవలసిందిగా కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆయుష్ యునాని డిస్పెన్సరీ యోగా శిక్షకులు బీ.శ్రీనివాస్,మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, బెల్లాజి శ్రీనివాస్,దూస రమేష్. ఉప్పరపల్లి విజయ్. వడ్నాల శ్రీనివాస్. కోడం రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

జూలై 9న సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి.

జూలై 9న సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

నాలుగు లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా జూలై 9 వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని సీఐటీయూ జహీరాబాద్ డివిజన్ కన్వీనర్ మహిపాల్ కోరారు. జహీరాబాద్ లో గురువారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా సమ్మెలో పాల్గొనాలని కోరారు.     

రేపు టీడబ్ల్యూజేఎఫ్ మంచిర్యాల జిల్లా తృతీయ మహాసభ విజయవంతం.

రేపు టీడబ్ల్యూజేఎఫ్ మంచిర్యాల జిల్లా తృతీయ మహాసభ
విజయవంతం చేయాలని జర్నలిస్టులకు విజ్ఞప్తి

మంచిర్యాల జూన్ 18 నేటిదాత్రి:

shine junior college

 

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) మంచిర్యాల జిల్లా తృతీయ మహాసభ ఈనెల 20వ తేదీన నస్పూర్ లోని ప్రెస్ క్లబ్ లో జరుగుతుందని ఫెడరేషన్ జిల్లా సమన్వయ కమిటీ కన్వీనర్ మిట్టపల్లి మధు, కో-కన్వీనర్లు కె.వెంకటస్వామి, గడ్డం సత్యగౌడ్ తదితరులు బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ మహాసభకు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఫెడరేషన్ రాష్ట్ర, జాతీయ నాయకులు పాల్లొంటారని వారు పేర్కొన్నారు. జిల్లాలో సంఘం నిర్మాణం, సభ్యత్వం, జర్నలిస్టుల హక్కులు, సమస్యలపై ఈ సందర్భంగా మహాసభలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందిచనున్నట్టు తెలిపారు. గత వారం రోజులుగా జిల్లాలో విరివిగా సభ్యత నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాల్లో పనిచేస్తున్న విలేకరులు స్వచ్ఛందంగా సంఘంలో సభ్యత్వం తీసుకోవడం జరిగిందని అన్నారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన బాధ్యతను విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని అన్నారు. ఈ మహాసభకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య తో పాటు రాష్ట్ర ఆఫీస్ బేరర్లు, కార్యవర్గ సభ్యులు హాజరు కానున్నట్లు తెలిపారు. జిల్లాలోని పాత్రికేయ మిత్రులను మహాసభకు సాధారణంగా ఆహ్వానిస్తున్నట్లు వారు తెలిపారు. జిల్లాలోని ఫెడరేషన్ సభ్యులు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి మహాసభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సమన్వయ కమిటీ సభ్యులు భాస్కర్, చంద్రమౌళి  పాల్గొన్నారు.

సిపిఐ పట్టణ 18వ మహాసభలను జయప్రదం చేయండి.

సిపిఐ పట్టణ 18వ మహాసభలను జయప్రదం చేయండి

భూపాలపల్లి నేటిధాత్రి:

భూపాలపల్లి పట్టణంలోని స్థానిక రావి నారాయణరెడ్డి భవన్ లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో 18వ పట్టణ మహాసభలను జయప్రదం చేయాలని పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు.ప్రవీణ్ కుమార్, సిపిఐ నాయకులు గురుజపెల్లి.సుధాకర్ రెడ్డిలు మాట్లాడుతూ ఈనెల 15వ తేదీన ఆదివారం సింగరేణి కమ్యూనిటీ హాల్ సుభాష్ కాలనీలో పట్టణ 18వ మహాసభను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు.పట్టణ మహాసభకు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు,సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు అని తెలిపారు.
పట్టణంలోని 30 వార్డులలో సుమారు 250 మంది డెలిగేట్స్ తో ఈ మహాసభ నిర్వహిస్తున్నామని తెలిపారు. మహాసభలో పట్టణ అభివృద్ధి కోసం, అర్హులైన వాళ్లందరికీ రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్ రూమ్, వృద్ధాప్య, వితంతు ఒంటరి మహిళ పింఛన్ల కోసం ఈ మహాసభలో పోరాట కార్యక్రమాలను రూపొందించుకోవడం జరుగుతుందని తెలిపారు.
భూపాలపల్లి పట్టణం మీదగా నడుస్తున్న లారీలను అదుపు చేసి బైపాస్ రోడ్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ భూపాలపల్లి పట్టణ 18వ మహాసభలను మేధావులు,కార్మికులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మాతంగి రాంచంధర్, నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్, అస్లాం, రవీందర్, శాంతి, శేఖర్,అజయ్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి, ప్రజావాణి విజయవంతం.

రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి, ప్రజావాణి విజయవంతం: శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్,గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి. జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

 

 

 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం కృషి చేస్తోందని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి. జగదీశ్వర్ గౌడ్ అన్నారు.

సోమవారం శేరిలింగంపల్లి మున్సిపల్ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ ఐఏఎస్ శ్రీ హేమంత్ భోర్ఖడేతో నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

“ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. నేను కూడా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తాను” అని జగదీశ్వర్ గౌడ్ అన్నారు.

రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్య పనులకు సంబంధించిన అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని, అధికారులు డివిజన్లలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.

అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని, ఎక్కడైనా సమస్యలుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయండి.

జూన్ 4న కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయండి

CITU పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ పిలుపు

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు CITU పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బి.వై.నగర్ లోని కామ్రేడ్,అమృత్ లాల్ శుక్లా భవనంలో సి.ఐ.టి.యు జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది.
ఈ సందర్భంగా సి.ఐ.టి.యు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ మాట్లాడుతూ 2023 సంవత్సరం బతుకమ్మ చీరలకు సంబంధించి గత నెల రోజుల క్రితం మొదటి విడతగా 3,000 మంది కార్మికుల ఖాతాలలో సబ్సిడీ డబ్బులు జమ చేయడం జరిగిందని ఇంకా సిరిసిల్ల మరియు టెక్స్ టైల్ పార్క్ లో దాదాపు 2200 మంది కార్మికులకు సంబంధించిన సబ్సిడీ డబ్బులు రావాల్సి ఉందని అధికారులను ఎన్నిసార్లు అడిగినా రేపు మాపు అంటూ దాటవేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు రెండవ విడత సబ్సిడీ డబ్బులు రాకపోవడంతో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆందోళన చెందుతున్నారని సబ్సిడీ రావలసిన కార్మికులకు కాలయాపన చేయకుండా అధికారులు వెంటనే రేపటి వరకు సబ్సిడీ అందించాలని డిమాండ్ చేశారు.మొదటి విడత సబ్సిడీ వచ్చి నెల రోజులు అవుతున్న సబ్సిడీ రానీ కార్మికులకు అందించడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ , వెంటనే సబ్సిడీ అందించాలని జూన్ 4 వ. తేదీ బుధవారం రోజున CITU ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఇట్టి ధర్నా కార్యక్రమంలో సిరిసిల్ల మరియు టెక్స్ టైల్ పార్క్ లో సబ్సిడీ డబ్బులు రాని కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షులు నక్క దేవదాస్ నాయకులు స్వర్గం శేఖర్,సందు పట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.

అధికారులు కృషి చేయడం వల్ల పుష్కరాలు విజయవంతం.

అధికారులు కృషి చేయడం వల్ల పుష్కరాలు విజయవంతం

మంత్రి శ్రీధర్ బాబు

భూపాలపల్లి నేటిధాత్రి:

ప్రభుత్వం ఏదైనా ఆలోచన మాత్రమే చేస్తుందని ఆచరణలో పెట్టాల్సింది అధికారులేనని, మీలాంటి అధికారులు సమగ్ర కార్యాచరణతో నిర్విరామంగా కృషి చేయడం వల్ల సరస్వతి పుష్కరాలు విజయవంతం అయ్యాయని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి
దిద్దుళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

శనివారం జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్ లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధ్యక్షతన జరిగిన సరస్వతి పుష్కరాలు డే ఆఫ్ థాంక్స్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబుపాల్గొన్నారు.

ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పుష్కరాలు ఘనంగా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి అలోచన మేరకు జిల్లా యంత్రాంగం 12 రోజులు 24 గంటలు నిర్విరామంగా కష్ట పడ్డారని తెలిపారు.

క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో పనిచేస్తేనే అది అమలు అవుతుందని నిరూపించారని, పుష్కరాలు వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినట్లు తెలిపారు.

రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని సరస్వతి పుష్కరాల’ నిర్వహణను ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకుని నిర్బహించినట్లు తెలిపారు.

పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం 40 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

నిజానికి పుష్కరాల నిర్వహణ అంత తేలిక కాదని, ఏ చిన్న పొరపాటు జరిగినా, నిర్లక్ష్యంగా ఉన్నా జరిగే నష్టం అంతా ఇంతా కాదని పేర్కొన్నారు.

శాసనమండలి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది పనులు చేయడానికి ఆటంకం ఏర్పడింది, అయినా ఇంజినీరింగ్ అధికారులు పనులను.పూర్తి చేశారని అభినందించారు.

మనకు చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది అయినా మీరంతా కష్టపడి ఒకరికొకరు సమన్వయం చేసుకుని… ఒక టీం వర్క్ లా పనిచేసి పుష్కరాలను అత్యంత విజయవంతంగా నిర్వహించారని హర్షం వ్యక్తం చేశారు.

సుమారు 30 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి… ఆ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శించుకున్నారంటే అందుకు కారణం మీరేనని, మీరు పడిన శ్రమ మీరు చూపిన చొరవ విజయానికి కారణం అయ్యాయన్నారు.

జిల్లా కలెక్టర్, ఎస్పీ మార్గ నిర్దేశనంలో 33 శాఖలకు చెందిన అటెండర్ నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారి వరకూ ప్రతి ఒక్కరూ మూడు నెలలు చాలా కష్టపడ్డారని, పుష్కరాలను విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారని.

ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

భద్రత, నీటి సరఫరా, అన్నదానం, మెడికల్ సౌకర్యాలు, శౌచాలయాలు, విద్యుత్, పారిశుధ్యం, మీడియా కవరేజి ఇలా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేశారన్నారు.

యంత్రాంగం కృషి వల్లే తెలంగాణలో తొలిసారిగా కాశీ పండితుల చేతుల మీదుగా ప్రతి రోజు సాయంత్రం నిర్వహించిన ‘‘సరస్వతి నవరత్న మాలా హారతి‘‘ కార్యక్రమం మొత్తం పుష్కరాలకే ప్రధాన ఆకర్షణగా నిలిచిందన్నారు.

ఈ పుష్కరాల ద్వారా ఆర్టీసీకి సుమారు 10 కోట్ల ఆదాయం వచ్చిందని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ అవకాశాన్ని వినియోగించుకొని లక్షలాది మంది సోదరీమణులు పుష్కరాలకు విచ్చేశారని అన్నారు.

12 రోజుల పాటు దాదాపు 9 వేల ట్రిప్పులు బస్సులు నడిచాయని తెలిపారు. కొందరు సరస్వతి పుష్కరాలు విజయవంతం కాకుండా చేయాలని కుట్రలు పన్నారని, చిన్న చిన్న అంశాలను భూతద్దంలో చూపించే ప్రయత్నం చేశారని, అయినా భక్తులు అవన్నీ ఏమి పట్టించుకోకుండా లక్షలలో పుష్కర స్నానాలు చేశారని అన్నారు. మీడియా మిత్రుల సహకారం గురించి.

ఈ రోజు ప్రత్యేకంగా చెప్పుకోవాలని, ఎప్పటి కప్పుడు పుష్కరాలకు సంబంధించిన సమాచారాన్ని భక్తులకు తెలియజేసి విజయవంతంగా కావడంలో కీలక పాత్ర పోషించారని అభినందించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా మిత్రులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

మీ సహకారం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానని మంత్రి తెలిపారు. స్వచ్ఛంద సంస్థల కృషి ప్రశంసనీయం. వారికి ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలిపారు.

ఇది మొదటి అడుగు మాత్రమేనని రానున్న గోదావరి పుష్కరాలను మరింత వైభవంగా నిర్వహించాలన్నదే మా ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు.

ఈ విషయంలో అసలు రాజీ పడబోమని, ఈ పుష్కరాల్లోని లోటుపాట్లను గుర్తించి అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన గురుతర బాధ్యత మనపై ఉందని అన్నారు.

ముఖ్యంగా యంత్రాంగం యొక్క పాత్ర చాలా కీలకమని ప్రభుత్వం మీ వెంట ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తరపున అభినందించారు

కాళేశ్వరానికి వెళ్లే జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో కాళేశ్వరం, ఇతర ప్రాంతాల్లో కొత్త బస్సు డిపోల నిర్మాణానికి శ్రీకారం చుడతామని అన్నారు.

ఓవైపు అభివృద్ధి… మరోవైపు సంక్షేమంలో తెలంగాణను దేశంలోనే తొలిస్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.

అందులో భాగంగానే ఉచిత బస్సు, 200 లోపు యునిట్లు ఉచిత విద్యుత్, రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి లాంటి అనేక ప్రతిష్ఠాత్మక పథకాలకు శ్రీకారం చుట్టామని, అయినా…

కొందరు పనిగట్టుకొని మేం ఏమి చేయడం లేదంటూ మాపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.

ఈ పుష్కరాల స్ఫూర్తితో అధికారులు మరింత జోష్ తో… టీం వర్క్ తో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆలోచనలు, ప్రాధాన్యాలు, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అభినందించారు.

ప్రమాదంలో మరణించిన కొమరవెల్లి గ్రామస్థులకు లక్ష రూపాయలు ఎక్సగ్రేషియా ప్రకటించారు. అలాగే వడదెబ్బకు గురై మరణించిన పారిశుద్ధ్య కార్మికుని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ జిల్లా యంత్రంగా ఆశాంతం కష్టపడి పనిచేసి సరస్వతి పుష్కరాలను విజయవంతం చేసినట్లు తెలిపారు.

సరస్వతి పుష్కరాలను బ్రహ్మాండంగా నిర్వహించిన యంత్రాంగం యొక్క కృషి చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి విజయానికి తోడ్పడ్డారని తెలిపారు.

ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో మంత్రి శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ పుష్కరాలు విజయవంతంగా కావడానికి ఎంతో కృషి చేశారని తెలిపారు.

కొమరపల్లి గ్రామస్తులు ఇద్దరు వ్యక్తులు ప్రమాదంలో చనిపోయారని ప్రభుత్వం తరఫున పరిహారం అందజేయాలని సూచించారు. కనువిప్పు కలిగి విధంగా విజయవంతం చేశారని జిల్లా యంత్రాంగాన్ని రాష్ట్ర మంత్రివర్యులు సిబ్బందిని అధికారులను ఆయన అభినందించారు.

రానున్న గోదావరి పుష్కరాలకు ఈ అనుభవం ఉపయోగపడుతుందని గోదావరి పుష్కరాలకు కుంభమేళాలను మైమరిపించే విధంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని ఏలాంటి లోటుపాట్లు రాకుండా చేసేందుకు సరస్వతి పుష్కరాల అనుభవం దోహదపడుతుందని తెలిపారు.

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ యంత్రాంగమంతా ఒకతాటిపై నిలబడి అహర్నిశలు శ్రమించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు.

సమగ్ర ప్రణాళికలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు. 12 రోజులపాటు సరస్వతి పుష్కరాలను అత్యంత విజయవంతంగా నిర్వహించామని ప్రతి ఒక్కరిని అభినందించారు.

మూడు నెలల ముందు నుంచి సమగ్ర ప్రణాళికలు చేశామని 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలను ప్రణాళికలు ప్రకారం నిర్వహించామని తెలిపారు.

రోజురోజుకు భక్తులు రద్దీ పెరిగిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిర్వహించామన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు తెలిపారు.

కాళేశ్వరం చిన్న గ్రామమైనప్పటికీ 30 లక్షలు కంటే ఎక్కువ మంది భక్తులు భక్తులు వచ్చిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ 12 రోజులు రేయింబవళ్ళు విధులు నిర్వహించారని అన్నారు.

పుష్కరాలు ముందు పుష్కరాలు తర్వాత పారిశుధ్య కార్యక్రమాలు ఎంతో ప్రాధాన్యమని ఆయన తెలిపారు. విద్యుత్ శాఖ ఎలాంటి అంతరాయం లేకుండా 24*7 నిరంతరం విద్యుత్ అందించారని అభినందించారు.

వర్షాలు వచ్చి రాత్రి సమయంలో విద్యుత్ అంతరాయం ఏర్పడిన 30 నిమిషాల్లో విద్యుత్ సేవలు పునరుద్ధరించారని అభినందించారు. సింగరేణి రెస్క్యూ సిబ్బంది, ఎన్డిఆర్ ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మెడికల్ సిబ్బంది వడదెబ్బ నుండి భక్తులను కాపాడారని తెలిపారు.

పోలీస్ శాఖ వాహన రద్దీ పెరుగుతున్న క్రమంలో రాత్రికి రాత్తే పార్కింగ్ ఏర్పాటు చేసి ఉచిత షటిల్ బస్సులు ఏర్పాటు చేసి భక్తులను తరలించారని తెలిపారు.

ఆర్డబ్ల్యూఎస్ నిరంతరాయ మంచినీరు సరఫరా, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారని అన్నారు. 45 డిగ్రీలు కంటే ఎండ తీవ్రత అధికంగా ఉన్నది, అనుకోకుండా అధిక వర్షపాతం వచ్చినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తూ ముందుకెళ్లామని తెలిపారు.

దేవాదాయ ధర్మదాయ శాఖ పనితీరును ఆయన అభినందించారు.

దేవాలయంలో భక్తులు నియంత్రణ చర్యలు రెడ్డిని చాలా బాగా మేనేజ్ చేశారని అభినందించారు.

ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి ఆదేశాల మేరకు కార్యాచరణలతో ముందుకు వెళ్ళామని సీఎస్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, డైరెక్టర్ తదితరులు సలహాలు సూచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయని ఆయన తెలిపారు.

హైదరాబాద్ నుండి ప్రతిరోజు పర్యవేక్షణ చేశారని వారి సూచనలు విజయవంతానికి ఎంతగానో దోహదపడ్డాయని తెలిపారు.

అనంతరం పుష్కరాల విధులు నిర్వహించిన జిల్లా అధికారులను, సిబ్బందిని శాలువా, మెమెంటో తో అభినందించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి, ఆర్టీసీ వరంగల్ ఆర్ ఎం విజయభాను, ఆర్డిఓ రవి, ఎస్పి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

సిపిఐ పట్టణ మూడో మహాసభలను జయప్రదం చేయండి.

సిపిఐ పట్టణ మూడో మహాసభలను జయప్రదం చేయండి..

పట్టణ కార్యదర్శి మిట్టపెల్లి శ్రీనివాస్

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ సిపిఐ పార్టీ కార్యాలయం లో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి పట్టణ కార్యదర్శి మిట్టపెల్లి శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఇప్పకాయాల లింగయ్య, జిల్లా సమితి సభ్యులు వనం సత్యనారాయణ లు హాజరై మాట్లాడారు. సిపిఐ పట్టణ మూడో మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. మున్సిపాలిటీలోని 22 బస్తి శాఖల సమావేశాలు నిర్వహించి అన్నీ బస్తి శాఖల నూతన కమిటీ లను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు.ఈ కమిటీ మూడు సంవత్సరాలు కొనసాగుతుందన్నారు. జూన్ 1 న జరిగే పట్టణ మహాసభలో పట్టణ కమిటీ నీ ఎన్నుకోవడం జరుగుతుందన్నారు.1925 డిసెంబర్ 26న కాన్పూర్ లో ఆవిర్భవించినటువంటి కమ్యూనిస్టు పార్టీ నాటి నుండి నేటి వరకు బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కార్మిక కర్షకుల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి అనేక హక్కులు సాధించింది అని గుర్తు చేశారు.ఈ మహాసభలకు ముఖ్య అతిథిలుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవెన శంకర్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ లు పాల్గొంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మిట్టపల్లి పౌలు, పెర్క సంపత్, పెండ్యాల కమలమ్మ, గాజుల మణెమ్మ, మరపెల్లి రవి, కుక్క దేవానంద్, గోడిసెల గురవయ్య, ఎగుడ మొండి, మాదాస్ శంకర్, షేకీర్, కౌడగని సాంబయ్య తదితరులు పాల్గోన్నారు.

జర్నలిస్టుల జాతర ను విజయవంతం చేద్దాం.

జర్నలిస్టుల జాతర ను విజయవంతం చేద్దాం.

జర్నలిస్ట్ ఫోరం రజతోత్సవ సభ కు పెద్ద సంఖ్యలో తరలిరావాలి.

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వాల్పోస్టర్ ఆవిష్కరణ.

“నేటిధాత్రి”,వేములవాడ.

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో పురుడు పోసుకున్న తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజతోత్సవాలను జయప్రదం చేద్దామని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (H143) రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాజన్న సిరిసిల్ల అధ్యక్షులు లాయక్ పాషా పిలుపునిచ్చారు.

వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆవిర్భవించి మే 31వ తేదీతో 25 వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా హైదరాబాద్ జలవిహార్ లో నిర్వహిస్తున్న సంబరాల సభ కు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు తల్లి రావాలని కోరారు.

Journalists’

 

తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నిర్వహించిన చారిత్రాత్మక పాత్రను తెలియజేయడం కోసం మే 31న టీజేఎఫ్ రజతోత్సవాలను నిర్వహిస్తుందని తెలిపారు.

తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు నినాదం తో 2001 మే 31న ఆవిర్భవించిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు 2014 వరకు అన్ని వర్గాల ప్రజలను,ఉద్యమ సంఘాలను సంఘటితం చేసిన ఘనత టీజేఎఫ్ అల్లం నారాయణ లతో పాటు యావత్ తెలంగాణ జర్నలిస్టుల కృషి అని గుర్తు చేశారు.

ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన జర్నలిస్ట్ ఫోరం రజతోత్సవ సంబరాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి జిల్లా నుండి జర్నలిస్ట్ లు అధిక సంఖ్యలో తరలివచ్చి జర్నలిస్టుల జాతరను విజవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, ప్రధాన కార్యదర్శి ఆయాచితుల జితేందర్, ఉపాధ్యక్షులు సయ్యద్ అలీ, జిల్లా రమేష్, దేవరాజ్, ప్రచార కార్యదర్శి షేక్ రియాజ్, కోడం గంగాధర్, హరీష్, విష్ణు, రాజేందర్, వెంకటేష్, ఇమ్రాన్, ఫహద్ పాషా, సల్మాన్, శ్యామ్, షోయబ్ లతోపాటు కార్యవర్గం సభ్యులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.

సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

మెపా రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ రవి ముదిరాజ్

పరకాల నేటిధాత్రి:

 

ఈనెల 25న ములుగు జిల్లా వెంకటాపూర్ లో ముదిరాజ్ ల సింహగర్జన సభ చైతన్య ర్యాలీకి ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చిన ధైర్యంగా ఎదుర్కొంటూ,అందరం ఒక తాటిపై వచ్చి సభను సక్సెస్ చేశామని సభకు అహర్నిశలు కష్టపడి విజయతీరాలకు చేర్చిన మెపా ఫౌండర్స్ మెంబర్స్,మెపా కోర్ కమిటీ సభ్యులకు,పిలవగానే సభకు వచ్చిన గౌరవ,ముఖ్య అతిథులకు,ముదిరాజ్ బందు మిత్రులకు,శ్రేయోభిలాషులకు,వివిధ జిల్లా,మండల,గ్రామాల ముదిరాజ్ కుల బాంధవులకు,మిత్రులకు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మెపా రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ రవి ముదిరాజ్ తెలిపారు.వారు మాట్లాడుతూ
ముదిరాజ్ ల బలగం,బలాన్ని,గలాన్ని చాటి చెప్పమని,మన హక్కుల పిల్లల బంగారు భవిష్యత్తు కోసంవిద్య,ఉద్యోగం,సాధికారత లక్ష్యంగా ముందుకు వెళ్దామని తెలిపారు.

సభ సక్సెస్ చేద్దాం రండి కదలిరండి.

సభ సక్సెస్ చేద్దాం రండి కదలిరండి

మెపా రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ రవి ముదిరాజ్

పరకాల నేటిధాత్రి:

 

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో ముదిరాజ్ సింహ గర్జన చైతన్య ర్యాలీని విజయవంతం చేయడానికి చేయి చేయి కలుపుదాం కలిసికట్టుగా సమిష్టి కృషితో సభను సక్సెస్ చేద్దామని,మెపా పిలుస్తోంది ప్రతి గడప నుండి సభకు వెళ్దాం,ముదిరాజ్ ల బలం బలగాన్ని చూపిద్దామని మెపా రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ రవి ముదిరాజ్ తెలిపారు.వారు మాట్లాడుతూ మన హక్కులను సాధించడానికి,రాజకీయ పార్టీలకు ఓట్లప్పుడే మనం గుర్తుకు వస్తున్నాం,ఆ తర్వాత మనం వారికి గుర్తుకు రావట్లేదని,ముదిరాజ్ లకు అధిక ప్రాధాన్యం ఇవ్వట్లేదని,ముదిరాజ్ లను బిసి ఏ లో చేర్చాలని,మేమెంతో మాకంత రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలని 75%సబ్సిడీతో సంక్షేమ పథకాలు ఇవ్వాలని,రాబోయే స్థానిక ఎన్నికలలో ముదిరాజ్ లకు టికెట్స్ కేటాయించాలని తెలిపారు.

సంగారెడ్డి జిల్లాలో సీఎం పర్యటన విజయవంతం చేయాలి.

సంగారెడ్డి జిల్లాలో సీఎం పర్యటన విజయవంతం చేయాలి: మంత్రి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ నియోజకవర్గంలో 23 న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రాష్ట్రంలో చారిత్రాత్మకం కావాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సీఎం పర్యటనతో సంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో రూపురేఖలు మారుతాయన్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో సీఎం పర్యటన విజయవంతం చేయాలన్నారు. అధికారులు సీఎం పర్యటన కోసం రూట్ మ్యాప్ ప్రణాళిక, సెక్యూరిటీ, బందోబస్తు, బారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీరు, హెలిప్యాడ్, హెల్త్ క్యాంప్ లు పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు.

సీఎం పర్యటన జయప్రదం చేయాలి జహీరాబాద్ ఎంపీ.

సీఎం పర్యటన జయప్రదం చేయాలి: జహీరాబాద్ ఎంపీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఈనెల 23న జహీరాబాద్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన జయప్రదం చేయాలని కాంగ్రెస్ నాయకులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన ఈ సన్నాహక సమావేశంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్, మాజీ మంత్రి ఏ. చంద్రశేఖర్, తెలంగాణ రాష్ట్ర సెట్విన్ చైర్మన్ గిరిధర్, మండల అధ్యక్షులు హన్మంత్ రావ్, శ్రీనివాస్ రెడ్డి, రామలింగారెడ్డి, మాక్సూద్ అహ్మద్, నరసింహా రెడ్డి, కండేం నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version