జులై 23న విద్యాసంస్థలు బంద్ ను జయప్రదం చేయండి
మండల ఉపాధ్యక్షులు చెట్టుపల్లి చందు
మంగపేట: – నేటి ధాత్రి
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మంగపేట మండల కమిటీ తరపున రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు కళాశాలలు విజయవంతం చేయండి ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు శెట్టిపల్లి చందు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యార్థులకు న్యాయం చేయలేదని విద్యార్థి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేసి ప్రభుత్వానికి సరైన జవాబు చెప్పిన భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం మారినా గాని రెండు సంవత్సరాలు గడుస్తున్న విద్యార్థులకు ప్రాముఖ్యంగా విద్యా శాఖ మంత్రి లేనటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా విద్యా రంగానికి 15% నిధులు కేటాయించాలని రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులు విడుదల చేయాలని విద్యార్థులకు బస్సు సౌకర్యాలు బస్సు చార్జింగ్ తగ్గించాలని పూర్తిస్థాయిలో విద్యార్థులకు హాస్టల్లో స్కూల్లలో మౌలిక సదుపాయాలు అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన విద్యార్థులకు ఎటువంటి న్యాయం చేయడం లేదని గత ప్రభుత్వం చేసినట్టే ఈ ప్రభుత్వం చేస్తుంది విద్యార్థులు తలచుకుంటే ఏదైనా చేస్తారని ఎస్ఎఫ్ఐగా వారు హెచ్చరించారు అదేవిధంగా విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి కేటాయించాలని జూనియర్ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన అమలు చేయాలని ఖాళీగా ఉన్న టీచర్స్ లెక్చరర్స్ పోస్ట్లు ఎంఈఓ డీఈవోలు పోస్టింగులు అమలు చేయాలని అదేవిధంగా ప్రవేట్ విద్యా సంస్థలపై ప్రభుత్వం బాధ్యత వహించాలని మరియు ప్రైవేటు యూనివర్సిటీలపై పూర్తిగా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులకు బాధ్యత ప్రభుత్వ వహించాలని ఇప్పటికే స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్ విడుదల కాక ప్రైవేట్ కళాశాలలో యాజమాన్యులు సర్టిఫికెట్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి నెలకొంది హాస్టల్లో టైం టేబుల్ ప్రకారంగా విద్యార్థులకు మెస్ పాటించాలని అన్నారు రాష్ట్రంలో మాటల్లో తెలియజేశారు గాని చేతుల్లో లేదని ప్రజా పాలన చేస్తామని ప్రజలకు ఎటువంటి న్యాయం లేనటువంటి పరిస్థితి కూడా నెలకొంది దీనిపై ప్రభుత్వం చెయ్యాలని అన్నారు లేని ఎడల గత ప్రభుత్వం లెక్కే ఈ ప్రభుత్వానికి కూడా విద్యార్థులను ఏకమై సమాధానం చెప్తామని సూచన తెలియజేశారు
లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులం వారి తల్లిదండ్రులతో పాటు ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు