ఎన్నార్ ఆత్మీయ సన్మాన సభను విజయవంతం చేద్దాం..
జహీరాబాద్ నేటి ధాత్రి:
సామాజిక ఉద్యమకారులు, ప్రముఖ వాగ్గేయకారులు, గొప్ప ప్రజాస్వామికవాది ఎన్నార్ జహీరాబాద్ ప్రాంతానికి చేసిన అనేక రకాల సేవలకు గుర్తింపుగా ఆగష్టు 3న నిర్వహించతలపెట్టిన ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని జహీరాబాద్ ప్రాంతంలో గల సామాజికవేత్తలు,సంఘ సంస్కర్తలు,వివిధ విభాగాల నాయకులు మరియు ఎన్నార్ అభిమానులు నిర్ణయించడం జరిగింది. అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యటానికి జహీరాబాద్ పట్టణంలో గల “ఎన్ కన్వెన్షన్ హాల్ ” నందు సన్నాహక సభను ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఇట్టి సన్మాన సభకు ప్రముఖ వక్తలు, ప్రముఖ గాయకులు వస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. ఇట్టి కార్యక్రమాన్ని జహీరాబాద్ ప్రాంతవాసులంతా,వివిధ సంఘనాయకులు, సామాజికవేత్తలు,వివిధ విభాగ పార్టీల నాయకులు అలాగే ఎన్నార్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యి విజయవంతం చెయ్యాలని కోరారు. కార్యక్రమంలో కార్యక్రమ నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.