శ్రావణ మాస ఆధ్యాత్మికోత్సవం…

జహీరాబాద్: శ్రావణ మాస ఆధ్యాత్మికోత్సవం

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-02T132554.640.wav?_=1

జహీరాబాద్ నేటి ధాత్రి:

శ్రావణ మాసం పురస్కరించుకొని జహీరాబాద్ అనుభవ మండపంలో రెకులగీ మల్లేశం ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. వారిని మహీంద్రా & మహీంద్రా సంస్థ నుండి పదవీ విరమణ పొందిన ఆగూర్ కృష్ణ మోహన్ కి లింగాయత్ సమాజం – రంజోలు తరఫున సన్మానం నిర్వహించారు. అదేవిధంగా ఆదివారం వీరన్న పాటిల్ పూజ నిర్వహించనున్నారని భక్తులందరు శ్రద్ధాభక్తులతో పాల్గొని ఆధ్యాత్మిక ఫలితం పొందాలని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు.

శ్రావణ మాసంలో శుభవార్త.. బంగారం, వెండి ధరల్లో ఊహించని తగ్గింపు!

శ్రావణ మాసంలో శుభవార్త.. బంగారం, వెండి ధరల్లో ఊహించని తగ్గింపు!

దేశంలో శ్రావణ మాసంలో బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి మంచి అవకాశం వచ్చింది. ఎందుకంటే వీటి ధరలు గత కొన్ని రోజులుగా క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే వీటి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

దేశంలో బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి శుభవార్త వచ్చేసింది. పసిడి ధరలు నిన్నటి రేట్లతో పోలిస్తే తగ్గుముఖం పట్టగా, వెండి ధరలు (Gold and Silver Prices July 30th 2025) మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జూలై 30, 2025న ఉదయం 6:10 గంటల సమయానికి, గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,810గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,490గా నమోదైంది. వెండి ధర కిలోకు రూ.1,15,900 వద్ద స్థిరంగా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు
  • ఢిల్లీ: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,960, 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,640, కిలో వెండి ధర రూ.1,15,900.
  • ముంబై: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,810, 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,490, కిలో వెండి ధర రూ.1,15,900.
  • చెన్నై: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,810, 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,490, కిలో వెండి ధర రూ.1,25,900.
  • బెంగళూరు: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,810, 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,490, కిలో వెండి ధర రూ.1,15,900.
  • కేరళ: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,810, 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,490, కిలో వెండి ధర రూ.1,25,900.
  • హైదరాబాద్, విజయవాడ: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,810, 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,490, కిలో వెండి ధర రూ.1,25,900.
  • విశాఖపట్నం: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,810, 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,490, కిలో వెండి ధర రూ.1,25,900.
  • ఈ ధరలు బులియన్ మార్కెట్ ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వినియోగదారులు వీటిని కొనుగోలు చేసే ముందు మళ్లీ వీటి ధరల గురించి తెలుసుకుని నిర్ణయించుకోవడం ఉత్తమం.

బంగారం ధరలు తగ్గడానికి కారణాలు

బంగారం ధరలు గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. జులై 30, 2025న బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక విధానాలు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు బంగారం ధరలపై ప్రభావం చూపించాయి. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు, బంగారం సురక్షిత పెట్టుబడిగా మరింత ఆకర్షణీయంగా మారింది. కానీ ప్రస్తుతం స్థిరమైన ఆర్థిక విధానాలు ధరల తగ్గుదలకు దోహదపడ్డాయి.

తల్ల……. రాక్షస?

తల్లీ? రాక్షసి? – 7 నెలల పాపను రూ.35 వేలకే అమ్మాలని ప్రయత్నం చేసిన మహిళ అరెస్టు!

అమెరికాలో ఒక తల్లి చేసిన పశువులాంటి చర్య ప్రపంచాన్ని షాక్‌కు గురిచేస్తోంది. ఇండియానా రాష్ట్రానికి చెందిన మహిళ తన 7 నెలల పసిపాపను లైంగిక దాడికి విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటన తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది.

32 ఏళ్ల మోర్గన్ స్టాప్ అనే మహిళ… ఒక గుర్తు తెలియని వ్యక్తికి తన పాపను లైంగికదాడికి అనుమతిస్తూ రూ.35,000 (అమెరికాలో కరెన్సీలో సుమారు 400 డాలర్లు)కి Snapchat ద్వారా ఒప్పందం చేయాలని ప్రయత్నించింది.
ఆమె మేసేజ్‌లో: “ఇప్పుడే అరటి పోతు చెల్లించండి, మిగతా మొత్తం తర్వాత ఇవ్వండి” అనే డీల్ పెట్టినట్లు తెలిసింది.

Snapchat ద్వారా కుట్ర బహిర్గతం
ఈ డీల్‌ను Snapchat‌లోని యాంటీ అబ్యూస్ సిస్టమ్ గుర్తించి వెంటనే అధికారులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న FBI అధికారులు 10 రోజుల్లోనే ఆమె ఇంటిపై దాడి చేసి విచారణ చేపట్టారు.

తప్పించుకునే ప్రయత్నం విఫలం
మోర్గన్ స్టాప్ విచారణ సమయంలో తనకు Snapchat ఖాతా లేదని బుకాయించినప్పటికీ, సాంకేతిక ఆధారాలు స్పష్టంగా చూపించడంతో ఆమెపై Attempted Child Sex Trafficking అనే Level 2 Felony కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం ఆమె జైలులో కదలలేని పరిస్థితిలో ఉంది. కేసు విచారణ కొనసాగుతోంది.

సమాజంలో అలజడి
ఒక తల్లి తన సొంత బిడ్డను ఇలాంటి ఘాతుకానికి అమ్మేంత నిష్ఠురంగా మారడం పై మానవ హక్కుల కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అమెరికా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ముగింపు:
ఇలాంటి దారుణాలకు సమాజంలో స్థానం ఉండకూడదు. చట్టం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
ఈ ఘటన పట్ల మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్‌లో తెలియజేయండి.
ఇంకా ఇలాంటి నిజ జీవిత వార్తల కోసం మా చానెల్‌ను ఫాలో అవ్వండి.

ఈ నేల 23 న శ్రీ మహంకాళి దేవలయం 26 వ వార్షికోత్సవం..

ఈ నేల 23 న శ్రీ మహంకాళి దేవలయం 26 వ వార్షికోత్సవం

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఈ నేల 23 వ తేదీన జహీరాబాద్ పట్టణంలోని మొగుడంపల్లి చౌరస్తా వద్ద గల శ్రీ మాహకాళి దేవాలయం 26 వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించ తలపెట్టినట్లు ఆలయ ప్రదాన అర్చకులు రాజన్న తెలిపారు.
మహంకాళి దేవలయము 26 వార్షికోత్సవం సందర్బంగా ఈ నేల 22 మంగళవారం బోనాలు, రంగము, 23 వ తేదీ బుధవారం నాడు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అమ్మవారి బలిపూజ, అభిషేకం, తీర్థ ప్రసాద వితరణ మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈనేల 23 తేదీ నాటికి శ్రీ మహంకాళి దేవలయం స్థాపించి 25 సంవత్సరాలు గడిచినట్లు తెలిపారు. 26 వార్షికోత్సవం సందర్బంగా అమ్మవారకి బోనాలు, రంగము, అభిషేకం, భక్తీ గీతా ఆలపనాలు, భజనలు, వివిధ రకలైన సంస్కృత కార్యక్రమాలు అతివైభవంగా జరుప నిశ్చయించినట్లు తెలిపారు. కావున ఇట్టి కార్యక్రమంలో జహీరాబాద్ ప్రాంత భక్తజనులందరు అధిక సంఖ్యలో పాల్గొని తన, మన, ధనములతో సేవచేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి మకాళి మాత కృపకు పాత్రులు కాగలరని కోరారు.

ఆలయ చరిత్ర:-

మన దేశానికి స్వాతంత్ర్యం రాక పూర్వము బ్రిటిష్ పరిపాలన కాలంలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం హైదరాబాద్ నుండి జహీరాబాద్ పట్టణం మీదుగా కర్నాటక, మాహరాష్ట్రలకు రైల్వే లైన్ ఎర్పాటు చేశారు. ఆ సందర్భంలో జహీరాబాద్ పట్టణంలో రైల్వే లైన్ నిర్మాణం కోనసాగుతుండగా శ్రీ మహంకాళి ఆలయం వద్దకు రాగనే అట్టి పనులు అర్ధాంతరంగా ఆగిపోయి ముందుకు సాగలేదు. అప్పట్లో ఓ పూజరి అక్కడికి‌ వచ్చి మొగుడంపల్లి చౌరస్తా వద్ద శ్రీ మహంకాళి ఆలయం నిర్మించాలని ఇక్కడ అమ్మవారి నివాస స్థాలమని రైల్వే ఉన్నత అధికారులకు ఆదేశించారు. పూజరి ఆదేశం మేరకు ఆ ప్రాంతంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆలయం సమీపంలో నుండి రైల్వే లైన్ పనులు కోనసాగించి పూర్తి చేశారు. 25 సంవత్సరాల క్రితం జహీరాబాద్ పట్టణం గడి మాహీలకు చేందిన ప్రదాన అర్చకులు రాజన్న జహీరాబాద్ పట్టణ పెద్దలు శ్యాం రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుబాష్, జహీరాబాద్ మాజీ ఎంపిపి అధ్యక్షులు విజయ్ కుమార్, తదితరుల సహయ సకారలతో శ్రీ మహంకాళి మాత ఆలయని నిర్మించినట్లు తెలిపారు. ఈ ఆలయనికి వచ్చిన భక్తులు కోరుకున్న కోరికలు నేరవేరడంతో మన తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్నాటక, మాహరాష్ట్రల నుండి భక్తులు తరలి వచ్చి దైవదర్శనాలు చేసుకుంటున్నారు. ఈ ఆలయం జహీరాబాద్ పట్టణంలోని మొగుడంపల్లి చౌరస్తా వద్ద గల 65 వ నంబర్ జాతీయ రహదారి ప్రక్కనే ఉండటంతో ప్రతి రోజు వందల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి దైవ దర్శనాలు చేసుకుంటారు. ఇక్కడికి వచ్చే భక్తుల సహయ సహకారలతో దిన దనానికి మహంకాళి ఆలయం అభివృద్ది చేందుతు వస్తుంది..

ఈ నెల 22న చలో గన్ పార్క్ ను విజయవంతం చేయండి..

ఈ నెల 22న చలో గన్ పార్క్ ను విజయవంతం చేయండి

మందల రవీందర్ రెడ్డి తెలంగాణ ఉద్యమ కారుల నాయకులు.

భూపాలపల్లి నేటిధాత్రి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-42.wav?_=2

కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈనెల 22న హైదరాబాదులోని గన్ పార్క కు ఉద్యమకారులందరూ తరలిరావాలని ఉద్యమ కారుల ఫోరమ్ నాయకులు మందల రవీందర్ రెడ్డి పిలుపినిచ్చారు. ఈ
సందర్భంగా మందల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఉద్యమకారుని గుర్తించడానికి ఒక ప్రత్యేకమైన కమిటీ వేయాలి.
ప్రతి ఉద్యమకారునికి 250. గజాల స్థలం ఇవ్వాలి.
జార్ఖండ్ రాష్ట్రంలో తరహాలో ప్రతి ఉద్యమకారునికి ప్రతి నెల 25 వేల పెన్షన్ సౌకర్యం కల్పించాలి.
ప్రతి ఉద్యమకారునికి గుర్తింపు కార్డుతో పాటు. ఉచిత బస్సు రైల్వే సౌకర్యాలు కల్పించాలి.
పదివేల కోట్లతో ఉద్యమకారుల సంక్షేమ బోర్డు నే ఏర్పాటు చేయాలి. డిమాండ్ చేశారు

ఆషాఢమాసం బోనాల కార్యక్రమంలో పాల్గొన్న.

ఆషాఢమాసం బోనాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఆషాఢమాసం బోనాల సందర్భంగా పట్టణంలోని వివిధ ఆలయలలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు,నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో,సుభిక్షంగా ఉండాలని ఆ తల్లిని వేడుకున్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంస్ చైర్మన్ శివకుమార్ మాజీ ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజీ మున్సిపల్ చైర్మన్ తాంజమ్, సినియర్ నాయకులు నామ రవికిరణ్,మాజీ పట్టణ అధ్యక్షులు యాకుబ్, విజిలిన్స్ మెంబెర్ రామకృష్ణ,ఎస్సి సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,వెంకట్, శివ ముదిరాజ్,నరేష్ రెడ్డి,మహమ్మద్ అలీ, జఫ్ఫార్, సందీప్, తదితరులు.

ఆశాఢ మాస బోనాల ఉత్సవాలల్లో పాల్గొన్న.

ఆశాఢ మాస బోనాల ఉత్సవాలల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు.

◆:- తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,

◆:- రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారు,మాజీ టిజిఐడిసి చైర్మన్ మహ్మద్.తన్విర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని గడి విధి లో జరిగిన ఆశాఢ మాస ఊరడమ్మ తల్లి బోనాల పండుగలో పాల్గొని అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి,మాజీ టిజిఐడిసి చైర్మన్ మహ్మద్ తన్విర్ గార్లతో కలిసి దర్శించుకున్నారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు.ఈకార్యక్రమంలో వారితో పాటు సిడిసి చైర్మన్ ముబీన్,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి,మాజీ కౌన్సిలర్లు రాజశేఖర్,మహిపాల్ రెడ్డి,అక్తర్ గోరి,రంగా అరుణ్,కాశీనాథ్,ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి,అశ్విన్ పాటిల్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లారెడ్డి,అక్బర్,జావిద్,హఫీజ్,జుబేర్,రాజు నాయక్,మల్లికార్జున్,యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రతాప్ రెడ్డి,హర్షవర్ధన్ రెడ్డి,కిరణ్ గౌడ్,జగదీశ్వర్ రెడ్డి,నథానెయల్,అక్షయ్ జాడే,విష్ణువర్ధన్ రెడ్డి,నర్సింహా యాదవ్,పాండు యాదవ్ మరియు ఆలయ కమిటీ సభ్యులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇటీవల ఎమ్మెల్యే గారి సొంత గ్రామమైన ఝరాసంగం లో అనారోగ్యంతో బాధపడుతు కోలుకున్నా గ్రామ మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్,రామ్ సింగ్,కేతన్ చౌతయి, గార్ల వారి నివాసనికి చేరుకొని శాసనసభ్యులు కోనింటి మానిక్ రావు గారు,ఉమ్మడి మెదక్ జిల్లా చైర్మన్ డీసీఎంఎస్ శివకుమార్ గార్లు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి త్వరగా కోవాలని కోరారు.
వారితో పాటుగా మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్, మాజీ కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నర్సింహా గౌడ్, పట్టణ అధ్యక్షులు ఎజాస్ బాబా, మాజీ సర్పంచ్ లు పరమేశ్వర్ పటేల్,శ్రీనివాస్ రెడ్డి, బస్వరాజ్, అమరజిత్, ప్రభు పటేల్,బస్వరాజ్ పటేల్,ఫరూక్ పటేల్, నాయకులు వెంకట్ రెడ్డి, నవాజ్ రెడ్డి, నాగేశ్వర్ సజ్జన్,సంగన్న, శివ శంకర్ పటేల్, శశి వర్ధన్ రెడ్డి, కిజర్, విజయ్ పాటిల్, మాణిక్ యాదవ్,ఎంపీ శ్రీనివాస్ పటేల్,ఎంపీ నాగన్న, సోహైల్,రమేష్,రాజు కుమార్, బాలరాజ్, విల్లాస్, అనిల్ పటేల్, కృష్ణ, విజయ్, సాయ్యేద్, శివ వైజ్యనాథ్, రామ్ రెడ్డి, తదితరులు ఉన్నారు

ఈనెల 9న కార్మికుల సమ్మెను విజయవంతం చేయాలి.

ఈనెల 9న కార్మికుల సమ్మెను విజయవంతం చేయాలి

కన్నూరి దానియల్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఏఐసీసీ టియు భూపాలపల్లి జిల్లా కార్యదర్శి కన్నూరి దానియల్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఈనెల 9న దేశవ్యాప్త సమ్మెలో కార్మికులంతా ఐక్యంగా పాల్గొనాలి,కార్మికులను బానిసత్వంలోకి నెట్టే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి.కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26,000/-లుగాని నిర్ణయించాలి.
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయరాదు. ప్రభుత్వరంగ సంస్థల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చెయ్యాలి. అసంఘటితరంగ కార్మికులను యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్’ను ప్రవేశపెట్టాలి.
గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర బడ్జెట్ నిధుల కేటాయింపు పెంచాలి. ఈ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరించాలి.అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం లాంటి స్కీమ్ వర్కర్లకు చట్టపరమైన కనీస వేతనాలు చెల్లించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

9 జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి.

ఈనెల 9 జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి

నాలుగు లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలి.

కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

 

 

కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని జాతీయ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు కొరిమి రాజ్ కుమార్, మిరియాల రాజిరెడ్డి, తుమ్మల రాజిరెడ్డి, చక్రపాణి, విశ్వనాధులు డిమాండ్ చేశారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటియుసి కొమురయ్య భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ.. బ్రిటిష్ కాలం నుండి 44 కార్మిక చట్టాలను సాధించుకోవడం జరిగిందని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఈ కార్మిక 44 చట్టాలను నాలుగు కోడులుగా విభజించి కార్మిక హక్కులను కాల రాస్తున్నాయని మండిపడ్డారు. ఈ కోడ్ ల విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 9 న నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మికులంతా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ ఒక్కరోజు దేశవ్యాప్త సమ్మెతో కార్మిక శక్తి ఏంటో కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా సింగరేణి సంస్థను పరిరక్షించే విధంగా జాతీయ సంఘాల జేఏసీ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఈ నాలుగు లేబర్ కోడ్ ల వల్ల కార్మిక సంఘాలు ఉండకూడదని కుట్రతో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం లేబర్ చట్టాలను తెచ్చిందని, కార్పొరేట్ శక్తులకు లాభం చేసే ఈ నాలుగు కోడ్ల అమలు వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని, భూపాలపల్లి ఏరియాలోని అన్ని సంఘాల నాయకులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జేఏసీ సంఘాల నాయకులు మాతంగి రామ్ చందర్, నూకల చంద్రమౌళి, బడి తల సమ్మయ్య, కంపేటి రాజయ్య, గణేష్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ నెల 9న దేశవ్యాప్తంగా సమ్మెను విజయవంతం చేయాలి.

ఈ నెల 9న దేశవ్యాప్తంగా సమ్మెను విజయవంతం చేయాలి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏఐ ఎఫ్ టియు ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఏఐ ఎఫ్ టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఎం రాయమల్లు చంద్రగిరి శంకర్ హాజరైనారు అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 9న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో సింగరేణి కార్మికులు చిరు వ్యాపారవేత్తలు స్వచ్ఛందంగా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలి
మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీటిని . ప్రవేట్ పారం చేస్తూ అమ్మి వేస్తూ అంబానీ,ఆదాని లాంటి వ్యాపారవేతలకు దేశవ్యాప్తంగా .బొగ్గు పరిశ్రమలు. అడివిలో ఉన్న అపార ఖనిజ సంపాదను అప్పగించేందుకు ప్రయత్నిస్తుదని ఇందులో భాగంగానే 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కొడ్ లను తీసుకు వస్తుందని బొగ్గు పరిశ్రమరక్షణకోసం సింగరేణిబొగ్గు గనులను కాపాడుకునేందుకు జూలై 9న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మె పరిశ్రమల రక్షణకోసం,ఉద్యోగ భద్రతకోసం,అసంఘటిత కార్మికులకు నెలకు 26వేల రూపాయల వేతనం చెల్లించాలని, లేదా పర్మనెంట్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పుప్రకారం సమాన పనికి సమానవేతనాలు చెల్లించాలని 18.86 నుండి. కార్మిక వర్గం అనేక ఉద్యమాలు నిర్మించి తమ ప్రాణాలను అర్పించి సాధించుకున్నా 44 కార్మిక చట్టాలను. నాలుగు కోడ్ లుగా అమలు చేస్తూ కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా. చేసే విధానానికి వ్యతిరేకంగా. ఉద్యమించాలని.
సింగరేణి సంస్థ ను వేలంపాట పేరుతో కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారని. వేలం పాట లేకుండా సింగరేణి సంస్థను సింగరేణికే ఇవ్వాలని
కార్మికులకు సొంతింటి కల సాకారం చేయాలని
కార్మికులకు ఇన్కమ్ టాక్స్.రద్దు చేయాలని.
విజిలెన్స్ లో ఉన్న మారు పేర్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని
24.25. సంవత్సరపు. లాభాల వాటా.40 శాతం . వెంటనే కార్మికులకు సీసీపీ
లను. రద్దుచేసి. బొగ్గు బావులను నిర్మించాలని ఏఐ ఎఫ్ టియు రాష్ట్ర కమిటీ డిమాండ్ చేశారు

ఆషాడ మాసం కొత్త కోడలిని పుట్టింటికి ఎందుకు పంపిస్తారో తెలుసా.

ఆషాడ మాసం కొత్త కోడలిని పుట్టింటికి ఎందుకు పంపిస్తారో తెలుసా…

ఆషాడ మాసంలో కొత్త కోడలిని పుట్టింటికి పంపించే సంప్రదాయం ఉంది. అయితే, అలా ఎందుకు పంపిస్తారో తెలుసా? ఈ నియమం వెనుక అసలు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Ashada Masam: ఆషాడ మాసం ప్రాధాన్యత గురించి మన పూర్వికులు ఎన్నో సంప్రదాయాలు, నమ్మకాలు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆషాడ మాసంలో కొత్త కోడలిని పుట్టింటికి పంపించే సంప్రదాయం ఉంది. అయితే, అలా ఎందుకు పంపిస్తారో తెలుసా? ఈ నియమం వెనుక అసలు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మానసిక విశ్రాంతి కోసం

హిందూ ధర్మం ప్రకారం, కొత్త కోడలు ఈ మాసంలో అత్త ముఖం చూడకూడదు. ఈ నిబంధన వెనుక ఉన్న భావం ఏమిటంటే, కొత్తగా పెళ్లైన వధువులకి అత్తింట్లో కొంత ఒత్తిడి, ఆందోళనగా ఉంటుంది. కాబట్టి, వారికి మానసిక విశ్రాంతి కల్పించేందుకు, స్వేచ్ఛగా కొన్ని రోజులు గడిపేందుకు, అత్తింటి నుంచి తాత్కాలికంగా విరామం ఇవ్వడం కోసం ఆషాడ మాసంలో కొత్త కోడలిని పుట్టింటికి పంపించే సంప్రదాయం ఏర్పడింది.

పూర్వం ఆషాడ మాసం అనేది వ్యవసాయ పనులకు చాలా కీలకమైన కాలం. అప్పట్లో పురుషులు పొలం పనుల్లో నిమగ్నమవుతూ ఇంటి విషయాలకు తక్కువ సమయం కేటాయించేవారు. అయితే, భార్య, భర్త కలసి ఉంటే ఆ వ్యక్తికి పనులపై దృష్టి తగ్గవచ్చని భావించి, తాత్కాలికంగా ఆషాడ మాసంలో భార్యను పుట్టింటికి పంపించే ఆచారం మొదలైంది.

ఆరోగ్య సమస్యలు

అలాగే, ఆషాడ మాసంలో గర్భం దాల్చినట్లయితే ప్రసవం వేసవికాలంలో జరుగుతుంది. వేసవిలో తల్లీ బిడ్డలకు ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని భావించి, ఈ మాసంలో దంపతులను వేరు వేరు ఉంచే సంప్రదాయాన్ని కొనసాగించారని చెబుతారు. ఆధునిక సమాజంలో ఈ నిబంధనలు, ఆచారాలు తక్కువగా పాటిస్తున్నారు. అయితే, దీని వెనుక ఉన్న కారణాలు తెలుసుకోవడం వల్ల మన పూర్వికుల దూరదృష్టిని అర్థం చేసుకోవచ్చు

నెలకే తేలిన నాణ్యత.

నెలకే తేలిన నాణ్యత

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

shine junior college

 

 

రహదారుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో తారు వేసిన నెల రోజులకే దారి గుంతలమయంగా మారింది. రాయికోడ్ నుంచి కప్పాడ్ వరకు ఆర్అండ్బై ఆధ్వర్యంలో మూడు కిలోమీటర్ల మేర తారు రోడ్డు వేశారు. చాలా చోట్ల తారు లేచి.. కంకర తేలుతోంది. వర్షా నికి సైడ్ బర్న్స్ కోతకు గురవుతున్నాయి. ఇకనైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు చొరవచూపి రహదారికి మరమ్మతులు చేపట్టాలని వాహనదా రులు కోరుతున్నారు.

ఈనెల 19న చలో హైదరాబాద్ విజయవంతం చెయ్యాలి.

ఈనెల 19న చలో హైదరాబాద్ విజయవంతం చెయ్యాలి

అంబాల చంద్రమౌళి మాదిగ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా సీనియర్ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి:

ఈనెల 19న హైదరాబాద్ నాగోల్ లోని శుభం కన్వెన్షన్ హాల్ లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సన్మాన సభ నిర్వహించడం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా సీనియర్ నాయకుడు అంబాల చంద్రమౌళి మాదిగ తెలిపారు జిల్లాలోని ఎమ్మార్పీఎస్ ఎంఎస్సీ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అంబాల చంద్రమౌళి మాదిగ పిలుపునిచ్చారు సోమవారం జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం పొందిన సందర్భంగా ఈనెల 19న విహెచ్ పిఎస్ సంఘo ఆధ్వర్యంలో వికలాంగులు పెద్ద ఎత్తున సన్మానం చేయబోతున్నారని తమకు సమాజంలో ప్రత్యేక గుర్తింపును తీసుకొని వచ్చి అనేక హక్కులను సాధించి పెట్టిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పట్ల కృతజ్ఞత భావంతో వికలాంగులు ఈ సన్మాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వారికి చేయూతనందించాల్సిన బాధ్యత ఎమ్మార్పీఎస్ అన్ని అనుబంధ సంఘాల నాయకుల మీద ఉంది కనుక మనలో జిల్లా మండల స్థాయిలో ఎదిగిన నాయకులు నాయకురాలు తక్షణమే తమ సొంత గ్రామాలలోని వికలాంగులను సమన్వయం చేసి వాహనం ఏర్పాటు చేసి వారిని పెద్ద ఎత్తున జాగ్రత్తగా హైదరాబాద్ కు తరలించాలని వివిధ మండలాలలో ఇన్చార్జులుగా కొనసాగుతున్న వారు ఫోన్లో ద్వారా తమ సొంత గ్రామాలలోని వికలాంగులను మాట్లాడి హైదరాబాద్కు తరలించే విధంగా అన్ని రకాల బాధ్యతలు తీసుకోవాలని మన అధినేత మంద కృష్ణ మాదిగ మీద ఎంతో అభిమానంతో వికలాంగులు చేస్తున్న సన్మాన సభను విజయవంతం చేయాలని చంద్రమౌళి మాదిగ పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో
ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దోర్నాల రాజేందర్ మాదిగ
నియోజకవర్గ ఇన్చార్జి అంతడుపుల సురేష్ మాదిగ
బట్టువిజయకుమార్
మేకల రమేష్ మాదిగ
ఎంవైఎస్ జిల్లా అధ్యక్షులు
మంద తిరుపతి
ఎర్ర భద్రయ్య మాదిగ
సిరిపంగ చంటి మాదిగ
ఓనపకల కుమార్ మాదిగ
అంతడుపుల చందర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు

ఈ నెల 14న శనివారం జాతీయ లోక్ అదాలత్.

ఈ నెల 14న శనివారం జాతీయ లోక్ అదాలత్

జిల్లా ప్రధాన న్యాయమూర్తి పీ.నీరజ

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

 

 

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జరగబోయే
ఈ నెల 14వ తేదీన శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పీ.నీరజ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రజలు, కక్షిదార్లు జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకొని, ప్రజలకు సంబంధించిన సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించు కోవాలని ఈ కార్యక్రమం ద్వారా న్యాయ సంబంధిత సమస్యలు తెలుపవచ్చునని జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.

జూన్ మాసం వచ్చిందంటే వారిలో టెన్షన్ వామ్మో.

జూన్ మాసం వచ్చిందంటే వారిలో టెన్షన్ వామ్మో జూన్..

జహీరాబాద్ నేటి ధాత్రి:

పాఠశాలలు మొదలవుతుంది అంటే తల్లిదండ్రులకు టెన్షన్ మొదలయ్యే సందర్భాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు అప్పులు చేయడానికి కూడా వెనకాడరు. అందుకే జూన్ మాసం వచ్చిందంటే వారిలో టెన్షన్ మొదలవుతుంది. ఒకటో తారీఖు అంటే ప్రతినెలా సామాన్య కుటుంబాలకు ఇబ్బందిగానే ఉంటున్నా జూన్ మాసంలో మాత్రం ఇంకాస్తా భయాన్ని కలిగిస్తుంది. ఇంటి బడ్జెట్కు తల్లిదండ్రుల కసరత్తు మొదలైంది. జూన్ మాసం వస్తుందంటేనే తల్లిదండ్రులు హడలిపోతారు. ప్రతి కుటుంబంపై జూన్ మాసంలో రూ. 50 వేల నుంచి రూ లక్ష వరకు బడి ఖర్చులు ఉంటాయి. మరో 15 రోజులు మాత్రమే పాఠశాలలకు సెలవులు మిగిలి ఉన్నాయి. పాఠశాలలు తెరుచుకోవడానికి ముందే విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు, యూనిఫాంలు, షూస్ సహా కొనుగోలు చేయడంతో పాటు ఫీజుల మోతను ఎదుర్కోవడానికి తల్లిదండ్రుల్లో దడ మొదలైంది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల మోత మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ను తలకిందులు చేస్తుంది. కళాశాలలు, పాఠశాలల్లో ఫీజులు కూడా భారీగా పెంచారు. 

జూన్ మాసంలో విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందటేనే ప్రతి ఇంటిలో ఎల్ కేజీ నుంచి పదో తరగతి వరకు, అలాగే ఇంటర్మీడియట్కు టర్మ్ ఫీజులు, రవాణా, ఇతర ఖర్చులు కలిపితే రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు అవుతుంది. కార్పొరేట్ స్థాయికి వెళ్తే రూ.లక్ష వరకు ఖర్చు అవుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోకి కార్పొరేట్ పాఠశాలలు కూడా రావడంతో పిల్లల చదువుల కోసం మధ్య తరగతి కుటుంభాలు కూడా మొగ్గు చూపుతున్నారు. ఇంజనీరింగ్ చదువాలంటే కూడా కళాశాలల్లో ఫీజు రీయింబర్స్మెంట్ మినహాయించిన కళాశాలల ఫీజులు లక్షల్లోనే ఉ న్నాయి. మరోవైపు హాస్టల్ ఫీజులు అదనపు భారం ఉంటాయి. ప్రైవేటు పాఠశాలల్లో స్కూల్ ఫీజులు వేలల్లో ఉ న్నాయి. దీనికి తోడు ఈవెంట్స్ పేరుతో అదనపు వసూళ్లు కూడా ఉన్నాయి. పుస్తకాలతో పాటు బ్యాగ్లు టిఫిన్ బాక్సుల రేట్లు కూడా మండిపోతున్నాయి. ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు బస్సు, యూనిఫాం, బెల్ట్, బ్యాడ్జి, టై, ఐడీ కార్డు, డైరీ, పుస్తకాలు, పెన్నులు, పరీక్ష ఫీజులు.. ఇలా అన్నింటికి వేలల్లోనే ఖర్చు చేయాల్సి ఉ ంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కేవలం పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు ఇస్తుండగా, మిగతా నోటు బుక్కులు, ఇతర వాటికి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది.

జూన్ మాసం వచ్చిందంటే వారిలో టెన్షన్.

జూన్ మాసం వచ్చిందంటే వారిలో టెన్షన్

వామ్మో జూన్..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

 

పాఠశాలలు మొదలవుతుంది అంటే తల్లిదండ్రులకు టెన్షన్ మొదలయ్యే సందర్భాలు ఎదురవుతున్నాయి.

ముఖ్యంగా పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు అప్పులు చేయడానికి కూడా వెనకాడరు.

అందుకే జూన్ మాసం వచ్చిందంటే వారిలో టెన్షన్ మొదలవుతుంది.

ఒకటో తారీఖు అంటే ప్రతినెలా సామాన్య కుటుంబాలకు ఇబ్బందిగానే ఉంటున్నా జూన్ మాసంలో మాత్రం ఇంకాస్తా భయాన్ని కలిగిస్తుంది.

ఇంటి బడ్జెట్కు తల్లిదండ్రుల కసరత్తు మొదలైంది.

జూన్ మాసం వస్తుందంటేనే తల్లిదండ్రులు హడలిపోతారు.

ప్రతి కుటుంబంపై జూన్ మాసంలో రూ. 50 వేల నుంచి రూ లక్ష వరకు బడి ఖర్చులు ఉంటాయి.

మరో 15 రోజులు మాత్రమే పాఠశాలలకు సెలవులు మిగిలి ఉన్నాయి.

పాఠశాలలు తెరుచుకోవడానికి ముందే విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు, యూనిఫాంలు, షూస్ సహా కొనుగోలు చేయడంతో పాటు ఫీజుల మోతను ఎదుర్కోవడానికి తల్లిదండ్రుల్లో దడ మొదలైంది.

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల మోత మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ను తలకిందులు చేస్తుంది.

కళాశాలలు, పాఠశాలల్లో ఫీజులు కూడా భారీగా పెంచారు.

జూన్ మాసంలో విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందటేనే ప్రతి ఇంటిలో ఎల్ కేజీ నుంచి పదో తరగతి వరకు, అలాగే ఇంటర్మీడియట్కు టర్మ్ ఫీజులు, రవాణా, ఇతర ఖర్చులు కలిపితే రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు అవుతుంది.

School Holidays.

 

కార్పొరేట్ స్థాయికి వెళ్తే రూ.లక్ష వరకు ఖర్చు అవుతుంది.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోకి కార్పొరేట్ పాఠశాలలు కూడా రావడంతో పిల్లల చదువుల కోసం మధ్య తరగతి కుటుంభాలు కూడా మొగ్గు చూపుతున్నారు.

ఇంజనీరింగ్ చదువాలంటే కూడా కళాశాలల్లో ఫీజు రీయింబర్స్మెంట్ మినహాయించిన కళాశాలల ఫీజులు లక్షల్లోనే ఉ న్నాయి.

మరోవైపు హాస్టల్ ఫీజులు అదనపు భారం ఉంటాయి.

ప్రైవేటు పాఠశాలల్లో స్కూల్ ఫీజులు వేలల్లో ఉ న్నాయి.

దీనికి తోడు ఈవెంట్స్ పేరుతో అదనపు వసూళ్లు కూడా ఉన్నాయి.

పుస్తకాలతో పాటు బ్యాగ్లు టిఫిన్ బాక్సుల రేట్లు కూడా మండిపోతున్నాయి.

ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు బస్సు, యూనిఫాం, బెల్ట్, బ్యాడ్జి, టై, ఐడీ కార్డు, డైరీ, పుస్తకాలు, పెన్నులు, పరీక్ష ఫీజులు..

ఇలా అన్నింటికి వేలల్లోనే ఖర్చు చేయాల్సి ఉ ంటుంది.

ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కేవలం పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు ఇస్తుండగా, మిగతా నోటు బుక్కులు, ఇతర వాటికి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది.

ఈనెల 20న కార్మిక సంఘాల.!

ఈనెల 20న కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ పిలుపు

కరీంనగర్ నేటిధాత్రి:

నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని మే20న కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె జరుగుతుందని దీని జయప్రదంకై జిల్లాలోని సంఘటిత, అసంఘటిత కార్మిక లోకం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ శుక్రవారం పిలుపునిచ్చారు. కరీంనగర్ లోని బైపాస్ రోడ్ లో గల సిమెంట్ గోదాం వద్ద సార్వత్రిక సమ్మె పోస్టర్ ను శుక్రవారం హమాలీ కార్మికులతో ఆవిష్కరించడం జరిగింది. ఈసందర్భంగా బుచ్చన్న యాదవ్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకోండు సంవత్సరాలైనా శ్రమిస్తున్న ప్రజల జీవితాలు మరియు జీవన ఉపాధిపై తన కార్పోరేట్ కుతంత్రాలు అమలు చేయాలని ప్రయత్నిస్తుందని దీనివల్ల దేశంలో పేదరికం, ఆకలి, పోషకాహార లోపం, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నలబై నాలుగు లేబర్ కోడ్లను సంస్కరించి కార్మికుల పని భారoని పెంచారని ఎనిమిది గంటలు ఉన్న పని గంటలకు పన్నేండు గంటలుగా మార్చారని దీనిని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేబర్ కోడులు అనేవి శ్రామిక ప్రజలపై బానిసత్వం విధించే బ్లూ ప్రింట్ లాంటివని సంఘంలోని కార్మికులకు సంబంధించిన అన్ని హక్కులు కార్మికుల నుండి లాక్కుంటున్నారని పని గంటలు, కనీస వేతనాలు, సామాజిక భద్రత పని పరిస్థితులకు సంబంధించిన అన్ని ప్రాథమిక హక్కులను తీవ్రమైన సవాలుగా పరిగణించబడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. యూనియన్ హక్కులు గుర్తింపు సమిష్టి నిరసనల హక్కు బావ వ్యవస్థీకరణ హక్కు తీవ్రమైన సవాలుగా మారాయని కార్పొరేట్ యజమానుల ప్రయోజనాల కోసం శ్రామిక ప్రజలపై బానిసత్వం యొక్క షరతులను విధించే బ్లూప్రింట్ లాంటివని కార్మికులు యూనియన్ నాయకులను నాన్ బెలబుల్ జైలు శిక్షలతో సహా కఠినమైన పోలీస్ చర్యలకు దారితీస్తుందని యజమాన్యానికి లేదా కార్మిక శాఖకు సమిష్టి ఫిర్యాదులను నిరాకరిస్తుందని ఇలాంటి చట్టాలను కార్మిక లోకం వ్యతిరేకించాలన్నారు. అసంఘటిత కార్మికుల జీవన ఉపాధికి సంబంధించిన ప్రాథమిక హక్కులను దూరం చేస్తుందని అందుకని కేంద్ర కార్మిక సంఘాల ఫెడరేషన్లు దేశవ్యాప్త సమ్మెను చేస్తున్నాయని దీని విజయవంతం చేయాలని చార్టర్ ఆఫ్ డిమాండ్స్ తయారుచేసి మే20న దేశవ్యాప్త నిరవధిక సమ్మె నిర్వహించడo జరుగుతుందని దీనిలో ప్రభుత్వ, ప్రవేట్ రంగంలో పనిచేసే కార్మిక లోకం జిల్లా వ్యాప్తంగా భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. ఈపోస్టర్ ఆవిష్కరణలో సిమెంట్ గోదాంహమాలీ అధ్యక్షులు జంగం తిరుపతి ఉపాధ్యక్షులు బాగోతం వీరయ్య, నాయకులు నన్నవేని శ్రీనివాస్, ననవేని కొమరయ్య, పల్లెర్ల రాములు గౌడ్, ముత్యాల శ్రీనివాస్, దానవేని కొమరయ్య, ఉప్పారం శ్రీనివాస్, జక్కుల ఐలయ్య, దొంగల శ్రీనివాస్, బోయిని ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసపక్షం కార్యక్రమం

అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసపక్షం కార్యక్రమం

నడికూడ,నేటిధాత్రి:

 

 

మండలంలోని కౌకొండ అంగన్వాడి సెంటర్ లో నిర్వహించిన పోషణ మాసపక్షం కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ హేమలత పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పోషకాహారంతోనే తల్లి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని అన్నారు.ప్రతి బిడ్డకి మొదటి 1000 రోజుల ప్రాముఖ్యతతో పాటు, పిల్లలకి స్థానిక ఆహార పదార్థాలు,చిరు ధాన్యాలతో వివిధ వంటకాలను తయారు చేసి అన్ని రకాల పోషకాలు అందేలా చూడాలని తల్లులకు సూచించారు. అనంతరం పిల్లల ఎదుగుదల ఎత్తు బరువు కొలతలు పరిశీలించారు.తల్లులకు బాలింతలకు పోషణ ఆహారంపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు కమ్రోన్,స్వరూప, అరుణ,కల్పన,తల్లులు తదితరులు పాల్గొన్నారు.

ఈ నెల 19 నజహీరాబాద్ లో రన్ ఫర్ జీసస్.

ఈ నెల 19 నజహీరాబాద్ లో రన్ ఫర్ జీసస్.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం లో ఈ నెల 19 న రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని నిర్వహకులు తెలిపారు. ఉదయం 6:30 నిముషాలకు స్థానిక ఎం ఆర్ ఎచ్ ఎస్ గ్రౌండ్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు ఉంటుంది అని తెలిపారు. నియోజకవర్గం కు చెందిన క్రిస్టియన్ యూత్ అధిక సంఖ్య లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈనెల 14 వరకు దరఖాస్తు చేసుకోండి.

ఈనెల 14 వరకు దరఖాస్తు చేసుకోండి.

నిజాంపేట, నేటి ధాత్రి

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాస పథకంలో భాగంగా మండల వ్యాప్తంగా యువత దరఖాస్తు చేసుకోవాలని నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలో మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ వికాస పథకానికి ఈ నెల 14 వరకు గడువును పొడిగించిందని అర్హత గల ప్రతి ఒక్కరూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పట్టణ అధ్యక్షుడు నజీరుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి పంజా మహేందర్, ఎం ఎస్ ఎస్ మండల అధ్యక్షులువెంకట్ గౌడ్, జాల శ్రీకాంత్ లు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version