మంత్రి సీతక్క ను కలిసిన సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం

మంత్రి సీతక్క ను కలిసిన సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం

సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ

జైపూర్,నేటి ధాత్రి:

 

మంత్రి సీతక్క ను కలిసిన సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం సెంట్రల్ కమిటీ అధ్యక్షులు దారావత్ పంతుల,జనరల్ సెక్రెటరీ భూక్యా నాగేశ్వరరావు గురువారం దనుసరి సీతక్క పంచాయతీరాజ్ రూరల్ గవర్నమెంట్,ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ ని, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ని ప్రజా భవన్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఉద్యోగుల సమస్యలను వివరించారు.ఆగస్ట్ 10న జరిగిన కేంద్ర కమిటీ ఎన్నికల్లో ఎన్నుకున్న నూతన కమిటీ సభ్యుల వివరాల ప్రక్రియను వివరించారు.అలాగే సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం కి మినిస్టర్ సీతక్కని గౌరవ అధ్యక్షులుగా ఉండాలని సెంట్రల్ కమిటీ సభ్యులు కోరారు.ఈ సందర్బంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ సింగరేణిలో గిరిజన ఉద్యోగస్తుల సమస్యలు ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయని, అధికారుల ప్రమోషన్లలో క్లస్టర్,ఇంటర్ క్లస్టర్ ప్రమోషన్లలో తీవ్రంగా అన్యాయం జరుగుతుందని,రోస్టర్ రిజిస్టర్ వెరిఫికేషన్ లో కూడా ప్రమోషన్ పాలసీకి సంబంధించిన విషయాలు కొన్ని పెండింగ్లో ఉన్నాయని తెలియజేశారు.అలాగే ఈ సమస్యలను పరిష్కరించే విధంగా చూడాలని
సెంట్రల్ కమిటీ సభ్యులు వారిని కోరారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ముందుగా నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులుగా ఉండటానికి సానుకూలంగా స్పందిస్తూ గిరిజన ఉద్యోగస్తుల సమస్యలు ఇంకా ఏమైనా ఉంటే డాక్యుమెంటరీ రూపంలో తమ దృష్టికి తీసుకొస్తే అన్ని సమస్యలను పరిష్కరించడానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేయిస్తామని అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా గిరిజనులకు అండగా ఉంటుందని వారు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో చీఫ్ లైజాన్ ఆఫీసర్ వీసం కృష్ణయ్య ,వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోత్ దశరథ్ ,సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎం.తిరుమల్ రావు,జిఎం సివిల్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

మహిళా పోలీస్ శక్తికి అండగా తెలంగాణ ప్రభుత్వం – మంత్రి సీతక్క

మహిళా పోలీస్ శక్తికి అండగా తెలంగాణ ప్రభుత్వం – మంత్రి సీతక్క

కొత్త దిశకు నాంది పలికిన తెలంగాణ మహిళా పోలీసుల తొలి సదస్సు

మహిళా పోలీస్ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన మంత్రి సీతక్క

మహిళా పోలీసుల్లో నూతన ఉత్తేజం నింపిన సీతక్క ప్రసంగం

మహిళా పోలీసుల అవసరాలను గుర్తించి ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తాం- మంత్రి సీతక్క

హైదరాబాద్‌, నేటిధాత్రి.

 

రాజేంద్రనగర్‌లోని రాజ్ బహదూర్ వెంకట్రామిరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ ప్రాంగణంలో తెలంగాణ మహిళా పోలీస్ రాష్ట్రస్థాయి తొలి సదస్సు ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మహిళా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డైరెక్టర్ జనరల్ అధికారులు అభిలాష బిష్ట్, చారు సిన్హా, శికా గోయల్, స్వాతి లక్రాతో పాటు కానిస్టేబుల్ నుండి ఎస్పీ స్థాయి వరకు సుమారు 400 మంది మహిళా పోలీస్ అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. సదస్సులో మహిళా పోలీసులు విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సవాళ్లు, అనుభవాలు, మౌలిక వసతుల మెరుగుదల వంటి అంశాలపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా ప్రసంగించిన మంత్రి సీతక్క మహిళా పోలీసుల తొలి సదస్సు నిర్వహిస్తున్నందుకు పోలీస్ శాఖకు అభినందనలు తెలిపారు. మహిళా పోలీసుల సంక్షేమం పట్ల ప్రభుత్వ కమిట్‌మెంట్‌ను ఈ సదస్సు ప్రతిబింబిస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్‌గా మహిళా శక్తిని ప్రోత్సహిస్తున్నారని, ఈ సదస్సులో మహిళా పోలీసులు ఇచ్చే సలహాలు, సూచనల ఆధారంగా సంక్షేమానికి సంబంధించిన సానుకూల నిర్ణయాలు తప్పకుండా తీసుకుంటారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. యూనిఫార్మ్‌లో ఉన్న అక్కచెల్లెమ్మలకు సెల్యూట్ అంటూ ప్రశంసించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1973లో కేరళలో కోజికోడ్‌లో దేశంలోని తొలి మహిళా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన విషయాన్ని స్మరించుకున్నారు. అదే దిశగా దేశవ్యాప్తంగా మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పడి, న్యాయం కోసం మహిళలు ధైర్యంగా పోలీస్ స్టేషన్లకు వచ్చే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఒకప్పుడు పోలీసులు, తాను భిన్న ధ్రువాలుగా ఉన్నామని మారిన పరిస్థితుల్లో తాను ప్రజాసేవలోకి రావాల్సి వచ్చిందని తన ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వృత్తి ధర్మానికి మానవీయతను జోడిస్తే మంచి ఫలితాలు వస్తాయని, కమిట్మెంట్‌కు, కాన్ఫిడెన్స్‌కు చిరునామాగా తెలంగాణ మహిళా పోలీసులు నిలుస్తున్నారని మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు. వృత్తి ధర్మం, మాతృత్వం మధ్య మహిళా పోలీసులు ఎదుర్కొనే సంఘర్షణల దృష్ట్యా మెటర్నిటీ సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు. బొగ్గుబాయిల నుంచి అంతరిక్షం వరకు మహిళలు రాణిస్తున్న ఈ రోజుల్లో మహిళా పోలీసుల ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖ అండగా నిలవాలని, సమాజంలో మహిళల పట్ల ఉన్న చిన్నచూపును అరికట్టే బాధ్యత కూడా పోలీసులపైనే ఉందని ఆమె పేర్కొన్నారు. డెడికేషన్, డిసిప్లిన్, డిగ్నిటీతో మహిళా పోలీసులు పనిచేస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని, పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులకు భరోసాగా నిలవాలని ఆమె సూచించారు. ప్రతి ఏడాది జెండర్ సెన్సిటైజేషన్ ట్రైనింగ్ తప్పనిసరిగా నిర్వహించాలని, మహిళా పోలీసులకు వీక్లీ ఆఫ్, ప్రత్యేక పని వేళల సౌకర్యాలు కల్పించే అంశాన్ని పరిశీలించాలని సీతక్క సూచించారు. మహిళా పోలీసుల అవసరాలను అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తే, వాటి ఆధారంగా చట్టాలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందని ఆమె స్పష్టం చేశారు. జూనియర్ మహిళా కానిస్టేబుళ్లకు సీనియర్ అధికారులు మెంటర్లుగా మారి మార్గదర్శనం ఇవ్వాలని, సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ హరాస్మెంట్ వంటి కేసులలో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, స్ట్రెస్ మేనేజ్‌మెంట్, కౌన్సెలింగ్ కార్యక్రమాలు తప్పనిసరిగా ఉండాలని మంత్రి చెప్పారు. మహిళా పోలీసుల కృషిని గుర్తించేలా ప్రత్యేక అవార్డులు, ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని, మెటర్నిటీ, పోస్ట్ డెలివరీ కాలానికి తగినట్లుగా తమిళనాడు తరహాలో ప్రత్యేక యూనిఫార్ములు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేసి వాటిని తెలంగాణలో అమలు పరచేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మహిళా పోలీసులకు అవసరమైన రెస్ట్ రూములు, వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 80 వేల మంది పోలీసుల్లో మహిళా పోలీసులు కేవలం 7 వేల మంది మాత్రమే ఉన్నారని, వారి సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని సీతక్క గుర్తుచేశారు. మహిళా పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను అధిగమించడానికి ఈ సదస్సు దోహదపడుతుందన్న నమ్మకాన్ని మంత్రి సీతక్క వ్యక్తం చేశారు. తెలంగాణ మహిళా పోలీస్ రాష్ట్రస్థాయి తొలి సదస్సును ప్రారంభించి ప్రసంగించిన మంత్రి సీతక్కను పోలీసు ఉన్నతాధికారులు సన్మానించారు. తెలంగాణ మహిళా పోలీస్ సదస్సు విచ్చేసిన ఇతర రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులను, పోలీస్ శాఖలో ఉన్నత స్థానంలో ఉన్న మహిళా పోలీసు అధికారులను మంత్రి అభినందించారు.

కష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అండగా మంత్రి సీతక్క…

కష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అండగా మంత్రి సీతక్క

#ఇటీవల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దాపురం మొగిలి తల్లి మరణించగా వారిని పరామర్శించిన సీతక్క

#కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం…

ములుగు జిల్లా, నేటిధాత్రి:

 

 

 

గోవిందరావుపేట మండల చల్వాయి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దాపురం మొగిలి తల్లి గారైన పెద్దాపురం లచ్చమ్మ గారు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మరణించగా వారి కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖా మాత్యులు దనసరి అనసూయ సీతక్క పరామర్శించి, కష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అండగా నిలబడింది. కార్యకర్తలను కంటికి రెప్పల కాపాడుకుంటాం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటి చైర్మన్ రేగ కళ్యాణి గార్లతో పాటుగా ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ పాల్గొన్నారు.

దివాంగులకు మోటార్ సైకిళ్లను పంపిణీ చేసిన .!

దివాంగులకు మోటార్ సైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి సీతక్క

ములుగు జిల్లా , నేటిధాత్రి

బుదవారం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో
జిల్లా సంక్షేమ శాఖ, మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో
జిల్లా లోని అర్హులైన దివ్యాంగులు రెండు మోటారు వెహికల్స్ ను గ్రామం. కోడిసెలకుంట లోని బనోతు యాకూబ్, గ్రామం నర్సాపూర్ గుర్రం శ్రీహరి లకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, గ్రంధాలయ చైర్మన్ బానోత్ రవి చందర్ లతో కలసి పంపిణీ చేశారు .
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి టి.రవి,
సి.డి.పి.ఓ. శిరీష, ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

గడ్డం కేశవమూర్తికి ఎన్టీఆర్ అవార్డు

గడ్డం కేశవమూర్తికి ఎన్టీఆర్ అవార్డు

-రాష్ట్రమంత్రి సీతక్క చేతుల మీదుగా అవార్డు ప్రధానం

-గడ్డం కేశవామూర్తికి ఎన్టీఆర్ అవార్డు రావడం హర్షనీయం

-సీనియర్ జర్నలిస్ట్ వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రచయిత గడ్డం కేశవమూర్తికి మరో అత్యున్నత పురస్కారం లభించింది. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, సంచలన రాజకీయవేత్త, మాజీ ముఖ్యమంత్రి పద్మశ్రీ ఎన్టీ రామారావు స్మారక అవార్డును ఆయన పొందారు. విజయవాడకు చెందిన ఎక్స్ రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రముఖ సినీ నటుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ తో పాటు గడ్డం కేశవమూర్తికి ఈ అవార్డును ప్రధానం చేసింది.

 

 

 

 

గురువారం రోజు ములుగు జిల్లా కేంద్రంలో రాష్ట్ర పంచాయతి రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి సీతక్క చేతుల మీదుగా కేశవమూర్తి ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను మంత్రి సీతక్క శాలువాతో సత్కరించి మెమొంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. గత మూడున్నర దశాబ్దాలుగా వివిధ దినపత్రికల్లో జర్నలిస్టుగా పనిచేస్తున్న కేశవమూర్తి ఇప్పటి వరకు అరడజన్ పుస్తకాలను స్వయంగా రచించి ప్రచురించారు.

 

 

 

 

 

అలాగే 100 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సక్సెస్ స్టోరీలను రాసి జనసారథులు పేరిట పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ లలో కూడా ప్రధాన భూమిక పోషించారు. మూడేళ్లపాటు వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా విశిష్ట సేవలు అందించారు. తెలంగాణ ప్రభుత్వ విశిష్ట పురస్కారంతో పాటు జాతీయస్థాయిలో అనేక అవార్డులను కేశవమూర్తి పొందారు. పేదల పెన్నిధి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అవార్డు ప్రధానంతో జర్నలిస్టు రంగానికి కేశవమూర్తి మరింత గౌరవం తీసుకువచ్చారని పలువురు సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, పాత్రికేయులు వ్యాఖ్యానించారు.

 

 

 

 

వరంగల్ వాయిస్ ఎడిటర్ కేశవమూర్తికి ఈ అవార్డు లభించడం పట్ల వివిధ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, రాజకీయ వేత్తలు, అధికారులతోపాటు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ బాధ్యులు సంతోషం వ్యక్తం చేశారు. గడ్డం కేశవామూర్తి అన్నకు ఈ అవార్డు రావడం హర్షనీయమని, జర్నలిస్టులకు ఎంతో గర్వకారణమని, ప్రస్తుతం రాణిస్తున్న జర్నలిస్టులకు ఆయన స్ఫూర్తిదాయకమని సీనియర్ జర్నలిస్ట్ వేముల మహేందర్ గౌడ్ ఆయన సేవలను కొనియాడారు.

ఎన్టీఆర్ అవార్డు అందు కున్న గడ్డం కేశవమూర్తి

ఎన్టీఆర్ అవార్డు అందు కున్న గడ్డం కేశవమూర్తి

రాష్ట్రమంత్రి సీతక్క చేతు ల మీదుగా అవార్డు ప్రధా నం

శాయంపేట నేటిధాత్రి:

 

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్ల కానిపర్తి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రచయిత గడ్డం కేశవమూర్తికి మరో అత్యున్నత పురస్కారం లభించింది. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు,సంచలన రాజ కీయవేత్త, మాజీ ముఖ్యమంత్రి పద్మశ్రీ ఎన్టీ రామారావుస్మారక అవార్డు పొందారు. విజయ వాడకు చెందిన ఎక్స్ రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రముఖ సినీ నటుడు డాక్టర్ రాజేంద్రప్ర సాద్ తో పాటు గడ్డం కేశవ మూర్తికి ఈ అవార్డును ప్రధా నం చేసింది.

 

 

 

 

గురువారం రోజు ములుగు జిల్లా కేంద్రంలో రాష్ట్ర పంచాయతి రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి సీతక్క చేతుల మీదు గా అవార్డును అందుకున్నా రు. ఈ సందర్భంగా ఆయనను మంత్రి శాలువాతో సత్కరించి మెమొంటోతోపాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. గత మూడున్నర దశాబ్దాలుగా వివిధ దినపత్రికల్లో జర్నలిస్టు గా పనిచేస్తున్న కేశవమూర్తి ఇప్పటి వరకు అరడజన్ పుస్తకాలను స్వయంగా రచించి ప్రచురించారు.

 

 

 

అలాగే 100 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సక్సెస్ స్టోరీలను రాసి జనసారథులు పేరిట పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ లలో కూడా ప్రధాన భూమిక పోషించారు. మూడేళ్లపాటు వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా విశిష్ట సేవలు అందించారు. తెలంగాణ ప్రభుత్వ విశిష్ట పురస్కారంతో పాటు జాతీయస్థాయిలో అనేక అవార్డులను కేశవమూర్తి పొందారు.

 

 

 

పేదల పెన్నిధి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అవార్డు ప్రధానంతో జర్నలిస్టు రంగానికి కేశవమూర్తి మరింత గౌరవం తీసుకువచ్చారని పలువురు సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, పాత్రికేయులు వ్యాఖ్యానించారు. వరంగల్ వాయిస్ ఎడిటర్ కేశవమూర్తికి ఈ అవార్డు లభించడం పట్ల గ్రామ ప్రజలు, మండల ప్రజలు ప్రజాప్రతినిధులు, రాజకీయ వేత్తలు, అధికారులతోపాటు, జర్నలిస్టులు అందరూ సంతోషం వ్యక్తం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version