ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కార్యాలయంలో బుదవారం మర్యాదపూర్వకంగా కలిశారు.నర్సంపేట నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనుల కొరకు నిధులు మంజూరు చేయాలని సీఎంను కోరినట్లు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా తన ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు దొంతి పేర్కొన్నారు.
