సింగరేణి సిఎండి బలరాం నాయక్ ని కలిసిన సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు దారావత్ పంతుల నాయక్
జైపూర్,నేటి ధాత్రి:
సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నుకున్న సందర్భంగా సెంట్రల్ కమిటీ అధ్యక్షులు దారావత్ పంతుల నాయక్ ఆధ్వర్యంలో సింగరేణి చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ బలరాం, డైరెక్టర్ (పర్సనల్) గౌతమ్ పోట్రు తదితరులను మర్యాదపూర్వకంగా కలిసి పరిచయం చేసుకున్నట్లు తెలిపారు.అధ్యక్షుడు దారావత్ పంతుల,జనరల్ సెక్రటరీ భూక్య నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రక్రియను వివరించి, రోస్టర్ వెరిఫికేషన్,ప్రమోషన్ పాలసీ వంటి గిరిజన ఉద్యోగుల సమస్యలు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని చర్చించారు.వాటి పరిష్కారానికి ప్రత్యేక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.సిఎం డి బలరాం,డైరెక్టర్ గౌతమ్ పోట్రు నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలుపుతూ,గిరిజన ఉద్యోగుల న్యాయపూరితమైన సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.జనరల్ మేనేజర్లు, లైజాన్ సెల్ అధికారులు కూడా పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.కార్యక్రమంలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ఆంగోత్ భాస్కరరావు,సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోకాళ్ల తిరుమలరావు,వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోత్ దశరథ్, వైస్ ప్రెసిడెంట్ భూక్య వెంకట్రామ్,డిప్యూటీ జి.ఎస్. బి.కృష్ణ,జాయింట్ సెక్రటరీ ఏ.ఉపేందర్,ఇల్లందు ఏరియా ప్రెసిడెంట్ బి.కిషన్,కొత్తగూడెం ఏరియా సెక్రటరీ హీరోలాల్, మణుగూరు ఏరియా లైజాన్ ఆఫీసర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.గిరిజన ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్టు తెలిపారు.