ఆత్మకూరులో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు…

ఆత్మకూరులో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

పరకాల,నేటిధాత్రి

నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా పార్టీ నాయకులు కేక్ కట్ చేసి,పండ్లు పంపిణీ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.ఈ కార్యక్రమం మండలాధ్యక్షుడు మరుగిద్దె రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో జరిగింది.ముఖ్య అతిథిగా నియోజకవర్గ బాధ్యులు కందుకూరి నరేశ్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ వేడుకల్లో పలువురు స్థానికనాయకులు,కార్యకర్తలుపాల్గొన్నారు.వారిలో మండల నాయకులు,
యువజన ప్రతినిధులు,పార్టీ కార్యకర్తలు ఉన్నారు.ఈ సందర్భంగా నాయకులు కందుకూరి నరేష్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు.ఐటీ రంగ అభివృద్ధి,పెట్టుబడుల ఆకర్షణ,మౌలిక వసతుల విస్తరణ,రైతు సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో ఆయన పాత్ర విశేషమని నరేష్ పేర్కొన్నారు.ఆయన దూరదృష్టి,పరిపాలనా నైపుణ్యం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించిందని అన్నారు.చివరగా,ముఖ్యమంత్రి దీర్ఘాయుష్షు,ఆరోగ్యం కలగాలని కోరుతూ పార్టీ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ సంగారెడ్డి జిల్లా

సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ సంగారెడ్డి జిల్లా

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను ఎమ్మెల్యే క్యాంపస్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగునీటి పరిస్థితులు, పంటల మద్దతు ధరలు, రైతు సంక్షేమ పథకాల అమలు తీరు తదితర అంశాలపై ఎమ్మెల్యేతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు అనుకూల కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని, క్షేత్రస్థాయిలో రైతులకు పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని చిట్టెంపల్లి బాలరాజ్ కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమమే టిఆర్ఎస్ పార్టీ ప్రధాన లక్ష్యమని, రైతుల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ తమ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఐక్యత, శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందాలని ఆకాంక్షిస్తూ ఇరువురు శుభాకాంక్షలు పంచుకున్నారు. ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో సాగి, జిల్లాలో రైతు సమస్యలపై సమిష్టిగా ముందుకు సాగేందుకు దోహదపడిందని నాయకులు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version