రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
కొడిమ్యాల (నేటి ధాత్రి ):
కొడిమ్యాల మండల కేంద్రంలో అంగడి బజార్ సమీపంలో కాంగ్రెస్ పార్టీ అద్వ్యర్యం లో భారతరత్న, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిలువేరి నారాయణ గౌడ్,సీనియర్ నాయకులు గుడి మల్లికార్జునరెడ్డి, గోగూరి మహిపాల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సింగిరెడ్డి వినోద్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు గడ్డం చంద్రమోహన్ రెడ్డి, మాజీ వార్డ్ మెంబర్ చిలువరి ప్రసాద్, నాయకులు కిషన్ రెడ్డి, గంగయ్య, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు..
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డిల ఆదేశాల మేరకు బుధవారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశంలో సాంకేతిక విప్లవ నిర్మాత అని,ఐటీ రంగ వృద్ధికి బాటలు వేశారని కొనియాడారు. దేశానికి సుస్థిర పాలన అందించి ఆదర్శంగా నిలిచాడని తెలిపారు.గ్రామీణ అభివృద్ధి, విద్య, ఆరోగ్య రంగాల్లో ఆయన అమలు చేసిన పథకాలు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన రాజీవ్ గాంధీ గ్రామపంచాయతీ వ్యవస్థను బలపరిచారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య, చాపల బాపురెడ్డి, గంజి విజయపాల్ రెడ్డి,ఏఎంసీ డైరెక్టర్లు కందాడి అచ్చిరెడ్డి,కంచర్ల వెంకట చారి,యూత్ పట్టణ అధ్యక్షుడు బసనబోయిన మహేష్ యాదవ్,నాయకులు జలకం శ్రీనివాస్, సొంటి రెడ్డి భాస్కర్ రెడ్డి,కల్లూరి కుశాల్, ముద్దసాని సురేష్, జంజీరాల మనోహర్, జలీల్, వెలుగు మహేశ్వరి, పంజా కల్పన,బిజ్జాల అనిల్, జలగం వెంకన్న,యశోద, మహంకాల దుర్గేష్, జాటోత్ రమేష్ నాయక్, నడిగడ్డ మధు, నడిగడ్డ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇటీవల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎండి సర్వర్ అనారోగ్యంతో మృతి చెందగా. మృతుని కుటుంబానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ ఆధ్వర్యంలో బుధవారం మృతిని స్వగృహానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించి 5000 వేల ఆర్థిక సహాయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు అందించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట నాయకులు కొండి అశోక్, పరికి పవన్, మురికి రవి, భాష బోయిన సమ్మయ్య, కొత్త పెళ్లి రమణ చారి, గాజు బిక్షపతి, కనుకo సాల్మన్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ కార్యకర్తలపై దాడులు ఇకపై సహించం – ఖబర్దార్.
హెచ్చరించిన జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి.
చిట్యాల, నేటిధాత్రి ;
చిట్యాల మండలం లోని కాల్వపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త పంచిక మహేష్ యాదవ్ పై ఆగస్టు 15న జరిగిన దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మహేష్, ఆయన భార్యపై దాడి చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. గ్రామ సమస్యలు పరిష్కరించేందుకు చర్చించాల్సింది పోయి, బీజేపీ కార్యకర్తలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దాడులకు పాల్పడటం పూర్తిగా బలహీనత రాజకీయాలు అని నేతలు విమర్శించారు. ఇలాంటి దాడులు ప్రజలలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను అడ్డుకోలేవని, దాడి చేసిన వారిపై వెంటనే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు డిమాండ్ చేశారు.
దాడికి వెనుక ఉన్న పులి తిరుపతి రెడ్డి – పులి అంజిరెడ్డి గ్యాంగ్.
జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి మాట్లాడుతూ – ఈ దాడి వెనుక తిరుపతి రెడ్డి, పులి అంజిరెడ్డి అనుచరులే ఉన్నారని స్పష్టమవుతోంది. వారే కుట్ర పన్ని, తమ అనుచరులను ప్రేరేపించి బీజేపీ కార్యకర్త పంచిక మహేష్ యాదవ్, ఆయన కుటుంబంపై దాడి చేయించారని ఆరోపించారు.
తమ వ్యక్తిగత స్వార్థం కోసం, రాజకీయ లాభాల కోసం గ్రామంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడే ధైర్యం లేక భయపడి ఇలాంటి క్రూర చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
తిరుపతి రెడ్డి, అంజిరెడ్డి అనుచరులు గ్రామ ప్రజలను భయపెట్టడం, బెదిరించడం, బీజేపీ కార్యకర్తలను అణగదొక్కడమే తమ రాజకీయ విధానంగా మార్చుకున్నారు. కానీ ఈ పద్ధతులు ఇకపై పనిచేయవని, ప్రజలు వారిని తిప్పికొడతారని నేతలు స్పష్టం చేశారు.
నిషిధర్ రెడ్డి గారి హెచ్చరిక
“గ్రామాల్లో బీజేపీకి విపరీతమైన ప్రజా మద్దతు లభిస్తోంది. ఈ పెరుగుతున్న శక్తిని తట్టుకోలేక ప్రత్యర్థులు దాడులకు దిగుతున్నారు. కానీ బీజేపీ కార్యకర్తలు తాత్కాలిక లాభాల కోసం పార్టీలను మార్చే వారు కాదు. వారు దేశం కోసం, ప్రజల కోసం, ధర్మం కోసం పోరాడే నిజమైన యోధులు.మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పార్టీలను చిన్న పిల్లలు ఆట వస్తువులు మార్చుకున్నట్లుగా మార్చుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే సత్యనారాయణ అనుచరుడిగా మారి మా కార్యకర్తలపై దాడులకు ప్రోత్సహించడం ప్రజలు బహిరంగంగా గమనిస్తున్నారు. ఎమ్మెల్యే సత్యనారాయణ గారు కూడా తన అనుచరులను అణగదొక్కే రాజకీయాలకు ఉపయోగించుకోవడం బాధాకరం. ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత వహించాల్సింది పోయి, బీజేపీ కార్యకర్తలను అడ్డుకోవడమే ఆయన రాజకీయమైపోయింది. ఇకనైనా మా కార్యకర్తలపై దాడులు జరిగితే బీజేపీ అస్సలు ఊరుకోదు. ప్రజాపరంగా, చట్టపరంగా గట్టి సమాధానం ఇస్తాం. ఇది మా చివరి హెచ్చరిక – ఖబర్దార్!” అని నిషిధర్ రెడ్డి గారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు:జిల్లా ప్రధాన కార్యదర్శి తాడికొండ రవికిరణ్ మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్టేకుమట్ల మండల అధ్యక్షుడు నాగరాజ్ గౌడ్ జిల్లా కార్యదర్శి సుదగాని శ్రీనివాస్ బిజెపి సీనియర్ నాయకులు చక్క నరసయ్య బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మైదం శ్రీకాంత్ మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి అశోక్ చారి బిస్కుల రవి ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్ బిఆర్ఎస్ పార్టీ ముర్తుజ జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించి శుభాకాంక్షలు తెలిపిన.
BRS Leaders
జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,కొహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు, మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,మాజి కేతకీ సంగమేశ్వర స్వామి వారి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్ ,నాయకులు చిన్న రెడ్డి,దీపక్ ,అలి,సలీం, అర్షద్,ఆసిఫ్ తదితరులు .
తొర్రూరులో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు అనుమల ఝాన్సీ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా – అన్నదానంతో మరింత విశిష్టత
తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి
పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి అనుమల ఝాన్సీ రెడ్డి గారి జన్మదిన వేడుకలు సోమవారం తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఆర్‌అండ్‌బి గెస్ట్ హౌస్‌లో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హాజరైనారు ఈ వేడుకలను పెదగాని సోమన్న గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు శ్రద్ధగా నిర్వహించారు.
వేడుకలు కేక్ కటింగ్‌తో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో హాజరైన నాయకులు, కార్యకర్తలు ఝాన్సీ రెడ్డి గారికి పుష్పగుచ్ఛాలు అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆహ్లాదకర వాతావరణంలో పార్టీ జెండాలతో, నినాదాలతో కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.
అన్నదానం కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణ
జన్మదిన వేడుకల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక పేదలు, నిరుపేదలు, వృద్ధులు, కార్మికులు సహా వందలాది మంది ప్రజలకు భోజనాన్ని వడ్డించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పేదలతో భోజనం పంచుకోవడం ద్వారా ఝాన్సీ రెడ్డి గారి ప్రజాసేవా పంథా స్పష్టంగా ప్రతిబింబించిందని నాయకులు పేర్కొన్నారు
ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు పెద్దగాని సోమన్న మాట్లాడుతూ, “ఝాన్సీ రెడ్డి గారు కేవలం రాజకీయ నాయకురాలు మాత్రమే కాదు, సేవా దృక్పథం కలిగిన నిజమైన ప్రజానేత. ఆమె ఎక్కడైనా ప్రజల సమస్యలతో మమేకమై, పరిష్కారానికి కృషి చేస్తారు. పార్టీని బలోపేతం చేస్తూ, సామాజిక న్యాయం సాధన కోసం పోరాడుతున్నారు” అని అన్నారు.
మరికొందరు మాట్లాడుతూ, “ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వంలో పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఎదుగుతోంది. ఆమెకు రాష్ట్ర స్థాయిలోనూ మరిన్ని కీలక బాధ్యతలు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం” అని అభిప్రాయపడ్డారు.
ఈ వేడుకలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ ఒకే కుటుంబ వాతావరణంలో కలిసి జరుపుకోవడం ఈ వేడుకను మరింత విశిష్టంగా మార్చింది.
సామాజిక స్పృహకు అద్దం కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ, “జన్మదినాన్ని కేవలం ఆచారంగా కాకుండా, సామాజిక సేవతో అనుసంధానం చేయడం గొప్ప విషయమని. పేదలకు అన్నదానం చేయడం ద్వారా ఝాన్సీ రెడ్డి గారు నిజమైన ప్రజాసేవకురాలిగా నిలుస్తున్నారు” అని అన్నారు. తొర్రూరు పట్టణంలో జరిగిన ఈ జన్మదిన వేడుకలు కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, ప్రజాసేవా పంథా, పార్టీ బలోపేతం, ప్రజలతో మమేకం అనే మూడు కోణాలను ప్రతిబింబించాయి. కార్యక్రమం పెద్దగాని సోమన్న కళావతి చాపల బాపీ రెడ్డి సోమ రాజశేఖర్ అమ్యా నాయక్ చిత్తలూరు శ్రీను గుండాల నరసయ్య బుసాని రాము అశోక్ రెడ్డి సోమేశ్వరరావు మేకల కుమార్ మంగళపల్లి రామచంద్రయ్య అంతా ఉత్సాహంగా సాగి, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో వేడుకకు ప్రత్యేకమైన గౌరవం దక్కింది.
జహీరాబాద్ పట్టణంలోని ఎన్ కన్వేషన్ హాల్ లో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ కొహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు మాజి జెడ్పీటీసీ పండరినాథ్ మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవికిరణ్,ప్రభు పటేల్ డాక్టర్ నాగరాజ్ నర్సింలు తదితరులు.
వరంగల్ కాశీబుగ్గ వర్తక సంఘం ఆధ్వర్యంలో, రాబోవు గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, ఉత్సవాల వేదిక నిర్మాణ పనులకు వర్తక సంఘం అధ్యక్షులు గుండేటి కృష్ణమూర్తి చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. గత 34 సంవత్సరాల నుండి కాశిబుగ్గ వర్తక సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు, ప్రతిరోజు సాయంత్రం పూజ అనంతరం ప్రసాద వితరణ చేస్తారు. కాశిబుగ్గ వర్తక సంఘం కార్యవర్గ సంఘo సభ్యుల సహకారంతో ఈ సంవత్సరం కూడా ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఏర్పాటు చేస్తున్నామని గుండేటి కృష్ణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్, మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి, వడిచర్ల సదానందం, మండల శ్రీరాములు, గుల్లపల్లి రాజ్ కుమార్, డాక్టర్ గోనె జగదీశ్వర్, బిట్ల చక్రపాణి, ఓరుగంటి కొమరయ్య, వంగరి లింగయ్య, మాటేటి విద్యాసాగర్, గుత్తికొండ నవీన్, బండారి శ్రీనివాస్, కుసుమ నగేష్, బోడకుంట్ల వైకుంఠం, కందగట్ల రాజు, గుండు సత్యనారాయణ, అలాగే ప్రతి సంవత్సరం ఉత్సవాలకు సేవలందిస్తున్న లక్ష్మీ గణపతి సహకార పరపతి సంఘం కార్యవర్గం అధ్యక్షులు వంగరి రాంప్రసాద్, ప్రధాన కార్యదర్శి మండల సురేష్, దుస్స కృష్ణ, దాసి శివకృష్ణ, మండల చందు, పసునూటి శ్రీకాంత్, క్యాతం రవీందర్, బండారి భాస్కర్, క్యాతం శ్రీనివాస్, బండారి రాజు, గాజుల రాజేష్, సిందం కృష్ణ, కోడం శరత్, కానుగంటి పవన్, బండారి లక్ష్మణ్, చిలగాని రమేష్, దాసరి దేవేందర్, ముడుతనపల్లి శ్రీనివాస్, గాదే సతీష్, వంగ ఐలయ్య ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మండల కేంద్రంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
నడికూడ,నేటిధాత్రి:
79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నడికూడ మండల కేంద్రంలో బి.ఆర్.ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా బి.ఆర్.ఎస్ మండల పార్టీ అద్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి(చందు) జాతీయ పతాకావిష్కరణ చేసి జాతీయ గీలాపానా చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో బి.ఆర్.ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నందికొండ గణపతి రెడ్డి,బిఆర్ఎస్ మండల నాయకులు,మాజీ ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రాను రాను రాజకీయాలు ఎటు పోతున్నాయి. రాజకీయాలలోకి ఎటు వంటి నాయకులు చేరుతున్నారు. రాజకీయాలను ఎటు వైపు తీసుకెళ్తున్నారు. పార్టీలు ఏవైనా సరే గొర్రెల మందలా, ఒక దానికి వెనుక మరొకటి వెళ్తోంది. ఆదర్శవంతమైన రాజకీయాలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. రాజకీయాలు అందరూ చేస్తామంటున్నారు. రాజకీయాలంటే అంత అలుసైపోయిందా? రాజకీయమంటే వ్యాపారమనుకంటున్నారా? ప్రజా ప్రతినిది అంటే పెత్తనం చేయడం అనుకుంటున్నారా? అసలు ఈ తరం నాయకులు ఏమనుకుంటున్నారు? పార్టీలు రాజకీయాలను ఎలా వాడుకుంటున్నాయి? అధికారంలోకి వస్తే చాలనుకుంటున్నాయి. అడ్డమైన మాటలు చెబుతున్నాయి. అదికారంలో వున్న వాళ్లు ప్రతిపక్షాలను, ప్రతిపక్షాలు పాలక పక్షాలను నిత్యం తిట్టుకుంటూ, కొట్టుకుంటూ కాలం గడిపేస్తున్నాయి. ఐదేళ్ల తర్వాత మళ్లీ కొత్త ముసుగేసుకొని వస్తున్నాయి. పధకాలంటారు? సంక్షేమం అంటారు. ఎన్నికల ముందు హమీలు గుప్పిస్తుంటారు. అయినవి, కానివి అన్నీ చెబుతుంటారు. నోటికి ఏది వస్తే అది చెబుతుంటారు. ప్రతిపక్షంలో వున్నప్పుడు ప్రజలు దేవుళ్లుగా కనిపిస్తారు. గెలిచిన తర్వాత ఇచ్చిన హమీల గురించి అడిగితే దెయ్యాలుగా కనిపిస్తారు? శత్రువులుగా కనిపిస్తారు? ఓట్లు అడిగినప్పుడు మాత్రం ప్రజలు ఎంతో గొప్ప వాళ్లు. విజ్ఞులు. వివేకవంతులు. అసలు రాజకీయం అనే పదానికి చరిత్రలో ఎంతటి స్ధానం వుందో తెలియదు. కాని రాజకీయాలు చేయానుకుంటారు. నాయకులు కావాలనుకుంటారు? అసెంబ్లీలో కూర్చొని అద్యక్షా! అనాలనుకుంటారు. కుదిరితే కాలం కలిసొస్తే మంత్రి కావాలనుకుంటారు. బుగ్గ కారులో తిరగాలనుకుంటారు. జిల్లాలో చక్రం తిప్పాలనుకుంటారు. రాజకీయాలను గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటారు. ఈ ఐదేళ్లలోనే సిఎం. కూడా అయిపోతే బాగుండనుకుంటారు. తాను బతికున్నంత కాలం పదవిలో వుండాలనుకుంటారు. ఇదీ నేటి తరం రాజకీయనాయకుల ఆలోచనలు. కాని అసలు రాజకీయాలను అర్ధం చేసుకున్నామా? రాజకీయాలకు అసలైన మూల సూత్రమేమిటి? ఒక నాయకుడికి వుండాల్సిన లక్షణం ఏమిటి? అనేది ఏ నాయకుడు ఆలోచించుకోవడం లేదు. కనీసం తెలుసుకోవాలనుకోవడం లేదు. దేశ చరిత్ర తెలియదు. దేశ రాజకీయ ముఖ చిత్రం తెలియదు. చారిత్రక విశేషాలు తెలియదు. చారిత్రాత్మక అంశాలు తెలియవు. దేశ చరిత్రకున్న మూలాలు తెలియవు. ఒక నాయకుడికి ఇవన్నీ తెలియాల్సిన అవసరం వుందా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నం కావొచ్చు. కాని ఈ తరం నాయకులు అవసరం. ఎందుకంటే మన దేశ విస్తీర్ణం, బౌగోళిక అంశాలపై నాయకులకు ఖచ్చితమైన అవగాహన వుండాలి. అప్పుడే దేశ రాజకీయాలలో సంపూర్ణమైన మార్పులు వస్తాయి. ఎందుకంటే ఒకప్పుడు ఆదర్శవంతమైన రాజకీయాలు చేసిన నాయకులే ఎక్కువగా వుండేవారు. వారిలో ఉన్నత విద్యావంతులు, దేశ రాజకీయాలపై అవగాహన వున్న వాళ్లు మాత్రమే ఎన్నికౌతూ వచ్చేవారు. కాని ఇప్పుడు పార్టీల బలం, బలగం, అర్ధబలం, అంగబలం వుంటే చాలు నాయకులౌతున్నారు. గతంలో ఎలాంటి నాయకుడైనా సమాజం గురించి ఆలోచించేవారు. తన నియోజకవర్గం అభివృద్ది గురించి ఎక్కువ సమయం వెచ్చించేవారు. ఇప్పుడున్న నాయకులు ప్రజా సేవకన్నా, వ్యాపారాలపై దృష్టిపెడుతున్నారు. ప్రజలను గాలికి వదిలేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే సంపాదించుకోవద్దా? అని నేరుగానే సమాధానం చెబుతున్నారు. రాజకీయాలు చేయాలనుకునేవారికి మన దేశమమే కాదు, అంతర్జాతీయ రాజకీయాలు కూడా తెలియాలి. తెలుసుకోవాలి. ప్రపంచం ఎలా ముందుకు వెళ్తోంది. మనం ఎక్కడ వెనుకబడి వున్నామన్నది కూడా అధ్యయనం చేయాలి. దేశ విదేశాలలో జరుగుతున్న అభివృద్ది మీద అవగాహన పెంచుకోవాలి. పారిశ్రామిక ప్రగతిని అంచనా వేయాలి. మన దేశ ఆర్ధిక పురోగతి కోసం ఎలా ముందుకు వెళ్లాలి. అనే అంశాలపై సంపూర్ణమైన జ్ఞానం నాయకులకు కావాలి. ప్రపంచం కుగ్రామమైపోయింది. ఇంటర్ నెట్ చేతిలో వుంది. ప్రపంచమంతా అరచేతిలోకి వచ్చేసింది. నాయకులకు సమాజం మీద పూర్తి అవగాహన కావాలి. సామాజిక శాస్త్రం చదివి వుండాలి. ఒకప్పుడు టెక్నికల్ విద్య అందుబాటులో లేకపోవడం పెద్ద లోటుగా వుండేది. ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ తెలియకపోవడంతో తీరని నష్టం జరుగుతోంది. గతంలో ప్రతి యూనివర్సిటీలోనూ చరిత్ర, సోషియాలజీ, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విద్యార్ధులు ఎక్కువగా చదువుకునేవారు. అందుకే ఆ రోజుల్లో ప్రజా ఉద్యమాలు ఎక్కువగా వచ్చేవి. ఇప్పుడు పదో తరగతి వరకు కూడా భూగోళం, చరిత్ర, అర్ధశాస్త్రం, పౌరశాస్త్రం వుంటున్నాయి. కాని అవి మార్కుల కోసం మాత్రమే చదువుతున్నారు. ఎక్కువగా లెక్కలు, సైన్స్ మాత్రమే అభ్యసిస్తున్నారు. మిగతా సబ్జెక్టులను వదిలేస్తున్నారు. ముఖ్యంగా కార్పోరేట్ విద్య వ్యాపారమైపోవడంతో, ఈ సబ్జెక్టులు విద్యార్ధులకు దూరమౌతున్నాయి. ఇప్పటి విద్యార్ధులకు రాజకీయాలు అంటే నాయకులు, పాలకులు, ప్రతిపక్షాలు అనే మాట తప్ప మరొకటి తెలియదు. మన ఓట్లేసి గెలిపిస్తున్న ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారన్న ఆలోచన కూడా ఈ తరానికి అవసరం లేకుండాపోతోంది. అదేదో సినిమాలో చెప్పినట్లు తిన్నామ, పడుకున్నామా, తెల్లారిందా? అన్నట్లు లక్షలు ఖర్చు పెట్టి చదువుకున్నామా? ఉద్యోగం వచ్చిందా? జీవితంలో స్ధిరపడిపోయామా? అన్నదే ఆలోచిస్తున్నారు. స్కిల్ అనే పదం రాజ్యమేలుతోంది. నైతికత అనేది దూరమైపోయింది. దాంతో దేశంలోనే కాదు, విదేశాలలో చదువులు, ఉద్యోగాలు చేస్తున్నారు. దేశాన్ని మర్చిపోతున్నారు. తల్లిదండ్రులనే కాదనుకుంటున్నారు. ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా నాయకులకు సమాజ శాస్త్రం తెలియాలి. కుటుంబ వ్యవస్ధలు నిర్వీర్యం కాకుండా చూడాలి. ఉన్నత లక్ష్యాలున్న సమజాన్ని తీర్చిదిద్దే బాధ్యత నాయకులే తీసుకోవాలి. సమాజ శాస్త్రం గురించి తెలియని నాయకులకు ప్రజా సమస్యలు కూడా తెలియవు. పట్టవు. ఇవన్నీ తెలియాలంటే అసలైన రాజకీయ మూల సిద్దాంతాలను తెలియజేసే పొలిటికల్ సైన్స్ అనే పదమే చాలా మంది రాజకీయ నాయకులకు తెలియదు. పొలిటికల్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. సోషియో ఎకనామిక్స్ అంటే ఏమిటో అవగాహన లేదు. పాలిటీ అంటే అర్ధంకూడా ఎవరికీ తెలియకుండాపోతోంది. రాజకీయం కూడా ఒక శాస్త్రమన్నది తెలియని నాయకులు రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలను పాలిస్తున్నారు. చిరిత్రలో సోక్రటిస్ దగ్గర నుంచి ఎంత మంది రాజకీయ విజ్ఞానవంతులున్నారో తెలియదు. రూసో అనే రాజనీతిజ్ఞుడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే మనిషి బానిస సంకెళ్లలలో వున్నాడని ఎందుకన్నాడు? అనేది తెలియదు. మాకియా వెళ్లి లాంటి రాజనీతిజ్ఞుడు రాజకీయాలు, నాయకులకు గురించి ఏం చెప్పారన్నది ప్రతి నాయకుడు తెలుసుకోవాలి. అరిస్టాటిల్ ఏమని చెప్పాడు. ఆడమ్ స్మిత్ ఏమని చెప్పారు తెలుసుకోవాలి. ఆఖరుకు మన ఆమర్త సేన్ మన దేశ ఆర్ధిక వ్యవస్ధ గురించి ఏం చెప్పారన్నది ఎంత మందికి తెలుసు. మన దేశ మొదటి ఆర్ధిక శాఖ మంత్రి ఎవరికి తెలుసు. పంచ వర్ష ప్రణాళికల రూపకర్త మహలోనుబిస్ గురించి ఎంత మంది నాయకులు తెలుసుకున్నారు. ఇవేవీ తెలియదు. కాని నాయకులమౌతాం. గెలుస్తాం. పాలిస్తాం..ఇదేనా రాజకీయం అంటే ఇదేనా? రాజకీయాలంటే చెప్పడానికి పురాణాలు కాదు. రాజకీయమంటే వర్తమానం. ప్రజల సమస్యలు తెలుసుకోవడం మర్చిపోతున్నారు. కులం, మతం అంటున్నారు. మెజార్టీ ఓట్ల గురించి లెక్కలేసుకుంటారు. మైనార్టీ ఓట్లు ఎటు వైపు అని మాట్లాడుకుంటారు. అంతే తప్ప వారి అభ్యున్నతి ఇన్ని సంవత్సరాలైనా ఎందుకు మారడం లేదని ఆలోచించరు. ఇంత పెద్ద మన ప్రజాస్వామ్య వ్యవస్ధలో, ప్రపంచానికే ఆదర్శవంతమైన ప్రజాస్వామ్య దేశంలో మన జాతీయ గీతం కంఠస్తంగా వచ్చే నాయకులు ఎంత మంది? వారికి ఆ గీతంలో వున్న అర్దం, పరమార్ధం ఎంత మంది నాయకులకు తెలుసు. మన జాతీయ గేయం వందేమాతరం చూడకుండా చదవగలిగే వాళ్లు ఎంత మంది? అసలు వీటిలో జాతీయ గీతం, జాతీయ గేయం ఏదో చెప్పలేరు. మన జాతీయ జెండా ఎంత పొడవు విస్తీర్ణంలో వుండాలో తెలియదు. నిజం చెప్పాలంటే రాజకీయ నాయకులు ఏదీ తెలియడం లేదు. కాని నాయకులౌతున్నారు. మనల్ని పాలిస్తున్నారు. ఇదీ మన దౌర్భాగ్యం. అంతే…!
ఘనంగా ఎన్ హెచ్ ఆర్ సి. గ్రేటర్ వరంగల్ ముఖ్య నాయకుల సమావేశం
హాజరైన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య
గ్రేటర్ వరంగల్, హనుమకొండ, వరంగల్ జిల్లా కమిటీల నియామకం
నేటిధాత్రి”,హనుమకొండ:
జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) గ్రేటర్ వరంగల్ ముఖ్య నాయకుల సమావేశం హనుమకొండ పట్టణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య సార్ ముఖ్యఅతిథిగా హాజరై సంస్థ విధి విధానాలను తెలియజేశారు. అవినీతి అక్రమాలకు తావులేని సమాజం కోసం తమ సంస్థ చేస్తున్న కార్యక్రమాలలో విద్యావంతులు, మేధావులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ చట్టాలకు అనుగుణంగా రాజీలేని పోరాటాలు చేస్తూ అవినీతి అక్రమార్కులను సమాజంలో దోషులుగా చూపించడమే తమ సంస్థ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. మంచిని పెంచడం మానవత్వాన్ని పంచడం వంటి కార్యక్రమాలు తమ సంస్థలో ప్రధాన అంశాలని తెలిపారు. రాష్ట్ర అధికార ప్రతినిధి, న్యాయవాది మాదాసు మొగిలయ్యతో కలిసి ఈ సందర్భంగా ఇటీవల రద్దు చేసిన గ్రేటర్ వరంగల్, హనుమకొండ, వరంగల్ జిల్లా నూతన కమిటీలను, పలు నియామకాలను ప్రకటించారు.
రాష్ట్ర కమిటీ సభ్యులుగా: ఉచత శ్రీకాంత్, విసంపెల్లి నగేష్, భానోత్ జవహర్లాల్ నెహ్రూ నాయక్
ఉమ్మడి వరంగల్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా: ఆవునూరి కిషోర్
గ్రేటర్ వరంగల్ కమిటీ గ్రేటర్ అధ్యక్షులుగా: కోమండ్ల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా: గూడూరు నరేందర్
హనుమకొండ జిల్లా కమిటీ: జిల్లా అధ్యక్షులుగా: డాక్టర్ బండి సదానందం ఉపాధ్యక్షులుగా: పడాల మురళీకృష్ణ ప్రధాన కార్యదర్శిగా: పల్లెవేని మహేష్
వరంగల్ జిల్లా కమిటీ: జిల్లా అధ్యక్షులుగా: మేరుగు రాంబాబు ఉపాధ్యక్షులుగా: గుజ్జ సురేందర్ ప్రధాన కార్యదర్శిగా: సంగెం రమేష్ అధికార ప్రతినిధిగా: నర్మేట యాదగిరి
తదితరులను నియమించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు పాక శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర నాయకులు మరియు ఉమ్మడి జిల్లా నాయకులు పాల్గొన్నారు.
ఏఐటియుసి నాయకుల తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఐఎన్టియుసి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జెట్టి శంకర్రావు
శ్రీరాంపూర్(మంచిర్యాల)నేటి ధాత్రి:
ఆర్కే5 గనిపై ఇటీవల జరిగిన ద్వార సమావేశంలో ఏఐటియుసి నాయకులు తమకు అసలు సంబంధం లేని విషయాలపై ఘనతను దక్కించుకోవాలని తాపత్రయపడటం దురదృష్టకరమన్నారు. డిపెండెంట్ల వయోపరిమితిని 30 నుండి 40 సంవత్సరాలకు పెంచేలా,మీప్రభుత్వంతో మాట్లాడి యాజమాన్యాన్ని ఒప్పించగలిగిన ఘనత ఐఎన్టియుసి యూనియన్ కే దక్కుతుంది అని అన్నారు. కానీ ఆ విషయాన్ని ఏఐటీయూసీ నాయకులు తమ విజయంగా చెప్పుకోవడం వారి నీతి మాలిన అసత్య ప్రచారానికి నిదర్శనమని పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల సొంతింటి కలను నెరవేర్చే దిశగా ఐఎన్టియుసి నాయకత్వంలో బి.జనక్ ప్రసాద్,సెక్రటరీ జనరల్,తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరి బోర్డు చైర్మన్ ప్రభుత్వ స్థాయిలో అనేకసార్లు చర్చలు జరిపినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి,మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్,సింగరేణి చైర్మన్ డైరెక్టర్లతో జరిపిన చర్చలు,సమర్పించిన నివేదికలు స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తాయని పేర్కొన్నారు.పెద్దపల్లి యువ వికాసం బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,రాష్ట్ర మంత్రివర్యులు పాల్గొన్న ఈ సమావేశం అత్యంత విజయవంతంగా నిర్వహించబడిందన్నారు. ఈసమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సభలో సింగరేణి కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ, కార్మికుల సొంతింటి పథకం, అలవెన్సులపై ఇన్కమ్ టాక్స్ చెల్లింపులు,మారుపేర్ల పరిష్కారం,ఇతర పలు సమస్యలపై బి.జనక్ ప్రసాద్ సమర్పించిన వినతిపత్రాల అంశాలను సంబంధిత శాఖలు పరిశీలిస్తున్నాయని స్పష్టంగా ప్రకటించడమే కాక,త్వరలో కార్మికుల కల నెరవేరేలా చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు.ఐఎన్టియుసియూనియన్ కృషి, నిబద్ధతా కార్యాచరణకు, విజయపథానికి ప్రత్యక్ష నిదర్శనమని జెట్టి శంకర్రావు పేర్కొన్నారు. గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ యాజమాన్యంతో జరిపిన స్ట్రక్చర్ సమావేశాలలో ఏమి సాధించామో చెప్పకుండా , ఐఎన్టియుసి కార్యాచరణను, తమదిగా చెప్పుకుంటూ కాలం వెళ్ళేదీయడం వారి అనైతికతకు నిదర్శనమన్నారు.గనుల్లో, డిపార్ట్మెంట్లలో కార్మికులు, మహిళా కార్మికులు అధిక పనిభారంతో,మౌలిక సదుపాయాల ఏర్పాట్లు కొరవడి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా, ఏఐటీయూసీ నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలతో, పైరవీలకే పరిమితమవుతూ కార్మికుల సమస్యల పట్ల శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు.ఈ నేపథ్యంలో కార్మికులు ఏఐటీయూసీ నాయకుల తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని, నిజమైన కార్మిక సంక్షేమానికి కృషి చేస్తున్న ఐఎన్టియుసి పట్ల తమ మద్దతును కొనసాగించాలని జెట్టి శంకర్రావు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో సిహెచ్.భీమ్ రావ్, గరిగ స్వామి,కలవేన శ్యామ్, తిరుపతి రాజు,వెంకటేష్ పేరం రమేష్,ఏనుగు రవీందర్ రెడ్డి, ఐరెడ్డి తిరుపతిరెడ్డి,ల్యాగల శ్రీనివాస్,జీవన్ జోయల్, మనోజ్,గోపాల్ రెడ్డి,చాట్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.
*కేంద్ర సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జెట్టి శంకర్రావు*
శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
గత కొంతకాలం నుండి టీబీజీకేఎస్ నాయకులు చేస్తున్న అసత్యపు ఆరోపణలను మానుకోవాలని ఐఎన్టియుసి కేంద్ర సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శంకర్ రావు శుక్రవారం ప్రకటనలో హెచ్చరించారు.సింగరేణిలో టీబీజీకేఎస్ ఇంచార్జ్,మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేస్తున్న ఆరోపణలు దయ్యాలు వేదాలు వల్లించడమే తప్ప వాస్తవం కాదని తెలిపారు.మితి మీరిన రాజకీయ జోక్యంతో బిఆర్ఎస్ ప్రభుత్వం బాండ్ల రూపంలో ఉన్న సింగరేణి మిగులు బడ్జెట్‌ను కొల్లగొట్టి సంస్థకు రూ.29 వేల కోట్లపైగా ప్రభుత్వ బకాయిలు ఇవ్వకుండా అజమాయిష్ చేసింది మీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.మీ పరిపాలనలో ఒక్క కొత్త గనిని కూడా తెరవలేని దుస్థితికి సింగరేణిని తీసుకొచ్చారని,సంస్థను ఆర్థికంగా నిర్వీర్యం చేసింది కూడామీ ప్రభుత్వమేనని విమర్శించారు. మీ టీబీజీకేఎస్ నాయకులను, సంస్థ పాలనా పరంగా చేసిన బదిలీలను రాజకీయ జోక్యంగా చిత్రీకరించడం అసత్యప్రచారం తప్ప మరేమీ కాదన్నారు.అప్పటి గుర్తింపు సంఘం,అధికారంలో మీ పార్టీ ఉండగా జరిగిన ఈ చర్యలు ఇప్పుడు మితిమీరిన జోక్యమని మాట్లాడడం విడ్డురమన్నారు. 2022 లో యాజమాన్యం సంస్థ పాలన పరంగా, సింగరేణి వ్యాప్తంగా 20 మంది యూనియన్ నాయకులను, శ్రీరాంపూర్‌లో ఐదుగురు టీబీజీకేస్ నేతలను బదిలీ చేసింది.అప్పుడు గుర్తింపు సంఘంగా టీబీజీకేస్, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండటాన్ని మరిచి,ఇప్పుడు రాజకీయ జోక్యం గురించి మాట్లాడడం నైతిక విలువలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు.మీ రాజకీయ హోదా నిలబెట్టుకోవడం కోసం ప్రభుత్వంపై నీతిమాలిన ఆరోపణలు చేయడం తగదని హితువు పలికారు.నిజం తెలుసుకున్న కార్మికులు తప్పకుండా మీ వాస్తవ రూపాన్ని గ్రహిస్తారని హెచ్చరించారు.
ద్వారకపేట-సర్వపురం గౌడ సంఘ మాజీ అధ్యక్షులు విలాసారపు సుదర్శన్ గౌడ్ ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ నాయకులు హాజరైనారు.ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ వరంగల్ జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకటేశ్వర్లు గౌడ్,రాష్ట్ర నాయకులు శీలం వీరన్న గౌడ్,మద్దెల సాంబయ్యగౌడ్,గంధంసిరి సామ్రాజ్యంగం,బూరుగు సాయి గౌడ్,విలసారపు నరేందర్ గౌడ్, వేముల రవి గౌడ్, పులి తిరుపతి గౌడ్, బురుగు కట్టనగౌడ్, దొనికల వెంకన్న గౌడ్, మెరుగు కమలాకర్ గౌడ్, కుమారస్వామి గౌడ్,సృజన్ గౌడ్ పాల్గొన్నారు.
చిట్యాల మండలంలో మహిళా సదస్సు ప్రాంగణాన్ని పరిశీలించిన చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి* ఈనెల 18వ తారీకున మహిళా సదస్సు కార్యక్రమానికి పంచాయతీరాజ్ మహిళా ,శిశు ,సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క విచ్చేస్తున్న సందర్భంగా సభా ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లను ముమ్మరం పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహిళా సదస్సు చిట్యాల మండల కేంద్రంలో నిర్వహిస్తున్నాం జిల్లాలోని మహిళలందరూ విచ్చేసి సదస్సును విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ…కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే దిశగా అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రివర్యులు కాంగ్రెస్ పార్టీ ప్రజా పరిపాలన అందులో భాగంగానే శిశు సంక్షేమ శాఖ మాత్యులు సీతక్క విచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పతకాలు , మహిళల సాధికారిక అనేక అంశాలపై ప్రసంగిస్తారు కావున వివిధ మండలాల గ్రామాల్లోని మహిళలు విధిగా జిల్లాలోని ప్రతి ఒక్క మహిళ యొక్క ఈ కార్యక్రమానికి విచ్చేసి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఎ పి డి డిపిఎంలు ఎంపీడీవో జయశ్రీ ఎంపీ ఓ రామకృష్ణ జిల్లా అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మధు వంశీకృష్ణ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్ , కాంగ్రెస్ నాయకులు చిలుముల రాజమౌళి బుర్ర శ్రీను బుర్ర మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
◆ ప్రభుత్వ ఆసుపత్రిలో మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన పట్టణ బి.ఆర్.ఎస్ నాయకులు.
*జహీరాబాద్ నేటి దాత్రి:*
జహీరాబాద్ స్థానిక శాసనసభ్యులు మాణిక్ రావు గారి జన్మదినం పురస్కరించుకొని జహీరాబాద్ పట్టణంలోని ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను పట్టణ బిఆర్ఎస్ నాయకులు ప్రారంభించడం జరిగింది
… ఈ సందర్భంగా బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకుడు నామ రవి కిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య సేవల కోసం వచ్చే ప్రజలకు మినరల్ వాటర్ ప్లాంట్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.. పుట్టినరోజు సందర్భంగా వేడుకలు నిర్వహించుకుని వృధా ఖర్చులు చేయకుండా ఎమ్మెల్యే గారు మంచి సేవా కార్యక్రమం చేయడం అభినందనీయమన్నారు… సీనియర్ నాయకుడు నామారవి కిరణ్,
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ తంజీం, హజ్ కమిటీ మాజీ సభ్యులు మహ్మద్ యూసుఫ్, పట్టణ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ యాకూబ్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు బండి మోహన్, మాజీ కౌన్సిలర్ అబ్దుల్లా, పురుషోత్తం రెడ్డి, గణేష్, అప్పి రాజ్, ఆశమ్, జుబేర్ ,వహీద్, ఇబ్రహీం, అలీమ్, సలీం అశోక్ రెడ్డి, ప్రవీణ్ చింటూ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
మొక్కులు సమర్పించుకున్న యువజన కాంగ్రెస్ మంగపేట మండల నాయకులు.
మంత్రి సీతక్క నిండు నూరేళ్లు సంతోషంగా ఆరోగ్యాంగా ఉండాలని ప్రత్యేక పూజలు.
మంగపేట- నేటిధాత్రి
మంగపేట మండల కేంద్రములోని శ్రీ ముక్కుడు పోచమ్మతల్లి ఆలయములో మంత్రి సీతక్క పుట్టిన రోజు ని పురస్కరించుకుని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ ఆధ్వర్యములో సమాజ సేవలో అహర్నిశలు కష్టపడుతూ ప్రజల సంక్షేమము కోసం కష్టపడుతున్న సీతక్క నిండు నూరేళ్లు సంతోషంగ ఆరోగ్యాంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు రాజకీయ జీవితములో తాను చేస్తున్న అభివృద్ధి పనులు చాలా గొప్పవని వంధ సంవత్సరాలకు సరిపడా అభివ్రుద్ది చేస్తూ ఆలోచనలు చేస్తున్న సీతక్క బాగుండాలని కోరుకున్నారు.. కార్యక్రమములో మండల యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు…
చలో హైదరాబాద్ కు తరలి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు
కొత్తగూడ, నేటిధాత్రి:
గ్రామ కమిటీ అధ్యక్షుల మరియు క్రియాశీల కార్యకర్తల సమ్మేళనానికి హైదరాబాద్ ఎల్బీ స్టేడియం కు విచ్చేసిన ఏఐసీసీ అధ్యక్షుడు గౌరవ శ్రీ మల్లిఖార్జున ఖర్గే గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ… ములుగు నియోజకవర్గ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క ఆదేశాల మేరకు నియోజకవర్గ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ పటేల్ సూచనల మేరకు… కొత్తగూడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య నేతృత్వంలో ర్యాలీ నిర్వహించి జేజేలు పలుకుతూ… కార్యకర్తలను చలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం కు తరలించారు ఈ కార్యక్రమంలో కొత్తగూడ మండల అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు , మండల నాయకులు ముఖ్య కార్యకర్తలు సోషల్ మీడియా విభాగం యువజన నాయకులు తరలి వెళ్లారు.
బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరికలు మల్లాపూర్ మండల నాయకులు మల్లాపూర్ జూలై 4 నేటి ధాత్రి మల్లాపూర్ మండలం కొత్త దాంమరాజ్ పల్లి గ్రామానికి చెందిన బద్దం నర్సారెడ్డి ఎక్స్ ఎంపీపీ మెండు గంగారెడ్డి ఎక్స్ ఎంపిటిసి, లింబాద్రి, వార్డు మెంబర్ వీరు హైదరాబాద్ నగరంలో నర్సింగరావు నివాసంలో కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు వీరికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది మేము కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అభివృద్ధి పనుల మీద ఆకర్షితులైనము నర్సింగరావు కృష్ణారావు ఎలల జలపతి రెడ్డి గారు నల్ల రాజన్న పుండ్ర శ్రీనివాస్ రెడ్డి తో కలసి కాంగ్రెస్ పార్టీలో భాగస్వామ్లమై అభివృద్ధిపై మేముకలసి చేస్తామని చెప్పడం జరిగింది.
నేడు ఎల్బీ స్టేడియంలో గ్రామస్థాయి కాంగ్రెస్ నేతల ఆత్మీయ సమ్మేళనం
జైపూర్,నేటి ధాత్రి:
శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జై బాపు – జై భీమ్ -జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలంగాణ ఐఎన్టియుసి నేతలు పిలుపునిచ్చారు.ఈ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా పాల్గొననున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయి కాంగ్రెస్ నాయకులంతా పెద్దఎత్తున హాజరుకావాలని కోరారు.ఐఎన్టియుసి రాష్ట్ర నేత,తెలంగాణ ప్రభుత్వ మినిమం వేజస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్,ఎస్ సి ఎం ఎల్ యు సెక్రటరీ జనరల్ బి.జనక్ ప్రసాద్ జైపూర్ లో మీడియాతో ఈసందర్భంగా మాట్లాడుతూ..గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మంచి ప్రాధాన్యత ఉంది.కానీ అందర్నీ ఒక వేదికపైకి తీసుకురావడం అనేది చాలా అవసరం. జూలై 4న జరిగే ఈ సభలో కాంగ్రెస్ పార్టీని నమ్మి నిస్వార్థంగా పని చేస్తున్న నాయకులకు అర్థవంతమైన ప్రోత్సాహం ఉంటుందని అన్నారు.సెంట్రల్ నాయకులు, ఏరియా వైస్ ప్రెసిడెంట్లు,పార్టీలోని అందరూ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.మల్లికార్జున ఖర్గే స్వయంగా ఈసమావేశంలో పాల్గొనడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.అలాగే పార్టీ శ్రేణుల మద్దతును సమీకరించుకునే గొప్ప అవకాశం అని తెలిపారు.అన్ని గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యకర్తలు,ఐఎన్టియుసి మిత్రులు అందరు కూడా తప్పకుండా పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.