నాయకుని పరామర్శించిన బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు.!

ప్రమాదవశాత్తు గాయపడిన నాయకుని పరామర్శించిన బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి :

 

 

తంగళ్ళపల్లి మండలానికి చెందిన టౌన్ బిఆర్ఎస్ పార్టీ. సీనియర్ నాయకులు జంగపల్లి. బిక్షపతి గత కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు గాయపడం జరిగింది. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ. సీనియర్ నాయకులు . బొ ల్లి. రామ్మోహన్. పార్టీ నాయకులు కార్యకర్తలు . ఆయన. ఇంటికి వెళ్లి. పరామర్శించి మనోధైర్యం చెప్పి. బిఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటామని ధైర్యం చెప్పి. సంబంధిత విషయాన్ని మాజీ మంత్రి కేటీ రామారావు దృష్టికి తీసుకెళ్లి తమకు అండగా ఉంటామని పార్టీ పరంగా ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు . పరామర్శించిన వారిలో తంగళ్ళపల్లి టౌన్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు యూత్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

తహసిల్దార్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు.!

జమ్మికుంట నూతన తహసిల్దార్ ను కలిసిన యువజన కాంగ్రెస్ నాయకులు
జమ్మికుంట నేటిధాత్రి:

జమ్మికుంట మండల తహసిల్దారు గా పదవి బాధ్యతలు స్వీకరించిన చలమల్ల రాజు గారిని ఈరోజు వారి కార్యాలయంలో యువజన కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ కమిటీలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది. ఈ సందర్భంగా జమ్మికుంట పట్టణ మరియు మండల ప్రజలకు ఏ సమస్య వచ్చినా సకాలంలో స్పందించి ఆ సమస్యను వెంటనే పరిష్కరించే విధంగా ముందుండాలని యువజన కాంగ్రెస్ కమిటీలు కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో; యువజన కాంగ్రెస్ జిల్లా కమిటీ జనరల్ సెక్రెటరీ చైతన్య రమేష్, సంధ్యా నవీన్, సెక్రటరీ సజ్జు అసెంబ్లీ ఉపాధ్యక్షురాలు నాగమణి, ప్రధాన కార్యదర్శి అజయ్, కార్యదర్శులు గొడుగు మానస, రోమాల రాజ్ కుమార్, పాతకాల రమేష్, మండల కమిటీ ఉపాధ్యక్షులు వినయ్, శ్యామ్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, కార్యదర్శులు రవి, అజయ్, 15వ వార్డు అధ్యక్షులు మైస సురేష్, యువజన నాయకులు ప్రవీణ్, జావీద్, శివ, శ్రీకాంత్, భాను, పవన్ తదితరులు పాల్గొన్నారు.

రేవూరికి వినతిపత్రాన్ని అందజేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు.!

ఎమ్మెల్యే రేవూరికి వినతిపత్రాన్ని అందజేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు

పరకాల నేటిధాత్రి

 

పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి ఎస్ఎఫ్ఐ నాయకులు బొచ్చు కళ్యాణ్,మడికొండ ప్రశాంత్ లు వినతి పత్రాన్ని అందజేశారు.అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ లను విడుదల చేయాలని అదే విధంగా పరకాల పట్టణంలో ఎస్సీ బాయ్స్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నిర్మించాలని పరకాల పట్టణంలో ఉన్న ఎస్ఎంహెచ్ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని పరకాల పట్టణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరమన్నారు.

నూతన సీఐని కలిసిన కాంగ్రెస్ నాయకులు.

నూతన సీఐని కలిసిన కాంగ్రెస్ నాయకులు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట పట్టణ నూతన సీఐగా పదవి బాధ్యతలను చేపట్టిన లేతాకుల రఘుపతి రెడ్డిని నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని రాజేందర్ పలువురు నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.అనంతరం పుష్పగుచ్చం అందించారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాదాసి రవికుమార్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, మాజీ కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు మసూద్, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు మెరుగు సాంబయ్య, నర్సంపేట మార్కెట్ డైరెక్టర్ అయూబ్, నర్సంపేట పట్టణ ఉపాధ్యక్షులు దూదేల సాంబయ్య, వేముల సారంగం, నర్సంపేట పట్టణ ఓబీసీ ఉపాధ్యక్షులు ఓర్సు సాంబయ్య, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి చిప్ప నాగ, నాంపల్లి వెంకటేశ్వర్లు,నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ములుకల మనీష్, 13వ వార్డు ఇంచార్జ్ శ్రీరామోజ్ మురళీ, మాజీ వార్డు సభ్యులు గాజుల రమేష్, గండి గిరి, నాగుర్లపల్లి మాజీ సర్పంచ్ రాజహంస, 1వ వార్డు అధ్యక్షులు లాక్కార్స్ రమేష్, 5వ వార్డు అధ్యక్షులు పున్నం నరసింహారెడ్డి, 8వ వార్డు అధ్యక్షులు గిరగని రమేష్, 20వ వార్డు అధ్యక్షులు రామగొని శ్రీనివాస్, 23వ వార్డు అధ్యక్షులు పెద్దపల్లి శ్రీనివాస్, 5వ వార్డు వర్కింగ్ ప్రెసిడెంట్ కొప్పు అశోక్, ఎరుకల రమేష్, హిందు రాజు, దేశి సాయి పటేల్, తదితరులు పాల్గొన్నారు.

* సిరిసిల్లలో కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్.!

* సిరిసిల్లలో కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్*

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

 

 

ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగినది. మొన్న జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల డి.సి.సి సమావేశంలో ప్రభుత్వ విప్ చీప్ ఆది శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ కార్యకర్తల ముందు చిటి ఉమేష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి దానిపై ఈరోజు కాంగ్రెస్ మండల స్థాయి నాయకులు సమావేశం నిర్వహించడం జరిగినది. ఇందులో భాగంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎప్పుడో ఒకసారి వచ్చే చీటీ ఉమేష్ రావు ఏ నాయకులను గాని ఏ కార్యకర్తలను గాని పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి. సిరిసిల్లలోని కాంగ్రెస్ కార్యకర్తలపై
పార్టీ పరంగా గాని వ్యక్తిగతంగా గాని మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం సరైనది కాదని అందువల్ల అతనిపై టీ.పి.సీ.సీకి ఫిర్యాదు చేస్తూ చర్యలు తీసుకునే విధంగా చూస్తామని కాంగ్రెస్ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ టోనీ, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, మరియు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగినది.

దశదినకర్మలకు హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

దశదినకర్మలకు హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులు

కొత్తగూడ, నేటిధాత్రి:

 

కొత్తగూడ మండలం కార్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కల్తీ నరసయ్య గారి అమ్మగారు ఇటీవల కాలం చేశారు వారి యొక్క దశదినకర్మలకు కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు వజ్జ సారయ్య, గారి ఆధ్వర్యంలో మంగళవారం రోజు దశదినకర్మలకు హాజరై వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు కల్తీ నరసయ్య గారిని ఓదార్పు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్ మొగిలి గ్రామ పార్టీ అధ్యక్షులు ఇర్ప వెంకన్న, మాజీ సర్పంచ్ మండల అధికార ప్రతినిధి ఇర్పరాజేశ్వర్, మాజీ వైస్ ఎంపీపీ కాడబోయిన జంపయ్య, సోలం వెంకన్న, కాంగ్రెస్ గ్రామ కమిటీ నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు..

కాంగ్రెస్ నేతల కుమ్ములాట.!

కాంగ్రెస్ నేతల కుమ్ములాట
– కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో గందరగోళం
– చీటి ఉమేష్ రావుని స్టేజి దిగి వెళ్లిపోవాలని ఆందోళన
సిరిసిల్ల/ వేములవాడ(నేటి ధాత్రి):

 

రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశాన్ని సిరిసిల్ల పట్టణ లహరి గ్రాండ్ లో ఏర్పాటు చేశారు. చీటి ఉమేష్ రావు సభను ఉద్దేశించి మాట్లాడుతున్న క్రమంలో
ఓడిపోతున్న వారికి టికెట్లు ఇస్తున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో కేకే మహేందర్రెడ్డి అనుచర వర్గం ఒక్కసారిగా స్టేజి వద్దకు దూసుకెళ్లారు.

discussion

ఏనాడు పార్టీకి సేవ చేయలేదని ఉమేష్ రావు స్టేజి దిగి వెళ్లిపోవాలంటూ ఆందోళనకు దిగారు. కొద్దిసేపటి వరకు ఉద్రిక్త వాతావరణం నెలకొనడం జరిగింది. సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ చాలా సేపటి వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెయ్యగ నాయకులు, పోలీస్ లు కలగజేసుకొని శాంతింప చేశారు. అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి సభను కొనసాగించారు. రాష్ట్ర స్థాయి పరిశీలకులు ఎదుటే నేతలు ఆందోళనకు దిగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

జాతీయ బీసీ విద్యార్థి సంఘం నాయకులు.

జాతీయ బీసీ విద్యార్థి సంఘం నాయకులు ముందస్తు అరెస్ట్

మంచిర్యాల నేటి దాత్రి

 

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు ఈ రోజు జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉన్నందున ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది మంచిర్యాల పోలీసులు బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నస్పూర్ అఖిల్. శ్రావణ్ . రాజ్ కుమార్ ను అరెస్ట్ చేయడం జరిగింది ఈ సందర్బంగా నస్పూర్ అఖిల్ మాట్లాడుతూ బి సి ,ఎస్ సి, ఎస్ టి విద్యార్థుల ఫిజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా ఇంత వరకీ ఒక స్కాలర్షిప్ కూడా విడుదల చేయలేదు అన్నారు విద్యార్థుల బంగారు భవిష్యత్తును గుర్తుంచుకొని ఫీజు బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చేయాని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించడం జరిగింది

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి.!

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారీ సొంత నిధులతో బోర్ ఏర్పాటు

జహీరాబాద్. నేటి ధాత్రి:

డైవర్స్ కాలనీలో నీటి సమస్యను స్థానిక ప్రజలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారీ దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించి బోర్ వేయిస్తానని హామీ ఇచ్చారు.దీంతో గురువారం రోజున బోర్ డ్రిల్ చేసేందుకు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి పూజా కార్యక్రమం నిర్వహించి కొబ్బరికాయ కొట్టి బోర్ తవ్వకాన్ని ప్రారంభించారు.ప్రజలు నీటితో కష్టాలు పడకుండా ఉండేందుకు బోర్ డ్రిల్ చేయిండం పట్ల స్థానిక ప్రజలు హర్షవ్యక్తం చేస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డా౹౹ఉజ్వల్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ భీమయ్య,పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ళ.శ్రీకాంత్ రెడ్డి,యూత్ అసెంబ్లీ అధ్యక్షుడు పి.నాగిరెడ్డి,అశ్విన్ పాటిల్, ప్రతాప్ రెడ్డి,రంగా అరుణ్ కుమార్,యూత్ కాంగ్రెస్ న్యాల్కల్ మండల అధ్యక్షుడు జి.కిరణ్ కుమార్ గౌడ్,సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కె.జగదీశ్వర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అసెంబ్లీ అధ్యక్షుడు జమిలాలోద్దిన్,మైనార్టీ సెల్ టౌన్ అధ్యక్షుడు జావిద్,బి.మల్లికార్జన్,అక్బర్,హర్షద్ పటేల్,ముస్తఫా,నిజాం,బర్కత్ మరియు డైవర్స్ కాలనీ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీని వీడి బి.ఆర్.ఎస్. పార్టీలో.!

కాంగ్రెస్ పార్టీని వీడి బి.ఆర్.ఎస్. పార్టీలో చేరిన నాయకులు
మాజీ మంత్రి దయాకర్ రావు సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్న మాజీ సర్పంచ్ ఉప, సర్పంచ్
కక్కిరాల పల్లిలో ఖాళీ అవుతున్న కాంగ్రెస్ పార్టీ

నేటిధాత్రి ఐనవోలు/హన్మకొండ:-

ఐయినవోలు మండలం కక్కిరాల పల్లి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ కంచర్ల రమేష్, ఉప సర్పంచ్ బొల్లం ప్రకాష్ మంగళవారం మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బి. ఆర్. ఎస్ పార్టీలో చేరడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఈ మోసపూరిత కాంగ్రెస్ మాటలు విని మేం మోసపోయామని ప్రజలు అంటున్నారని,కెసిఆర్ ఒక విజన్ తో పని చేస్తే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవగాహన లోపంతో ప్రజలను ఆగం పట్టిస్తున్నారని విమర్శించారు. బోగస్ మాటలు చెప్పి ప్రజలను బోల్తా కొట్టించిన ఈ కాంగ్రెస్ పార్టీని తొందరలోనే బొంద పెట్టే రోజులు వస్తున్నాయని వారు అన్నారు.వీరితోపాటు బీ. ఆర్. ఎస్ పార్టీలో కాటబోయిన కుమారస్వామి, గాడుదల లింగయ్య, చిర్ర రాజేందర్, తల్లపెల్లి నాగరాజు, మడ్లపల్లి రాజు,ఆరూరి అరుణ్, నూనె సాంబరాజు, జోగు సతీష్, జోగు రమేష్, గుబ అరుణ్ కుమార్, కోల శ్రీనివాస్, ఆరూరి లలిత, ఆరూరి పూల, బర్ల సుమలత, ఆరూరి అనిత ఇంకా భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నుండి కార్యకర్తలు పార్టీలో చేరటం జరిగింది.ఈ కార్యక్రమంలో బి. ఆర్. ఎస్ మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ తక్కలపల్లి చందర్ రావు మండల కన్వీనర్ తంపుల మోహన్, మండల ఇంచార్జ్ గుజ్జ గోపాలరావు, నాయకులు పల్లకొండ సురేష్, గ్రామ పార్టీ బీఆర్ఎస్ అధ్యక్షుడు అల్లం సోమయ్య, టిఆర్ఎస్ నాయకులు మరుపట్ల దేవదాస్,దుప్పెల్లి కొమురయ్య, గడ్డం రఘువంశీ గౌడ్ పాల్గొన్నారు.

బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం.!

బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సుంకే

రామడుగు, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని వైశ్య భవన్ లో ఈనెల 27న వరంగల్ లో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో రామడుగు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ముఖ్యఅతిథిగా చోప్పదండి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ పాల్గోని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రామడుగు సింగిల్విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంట్ల జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మర్కొండ కిష్టారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ గంట్ల వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ తౌటు మురళి, మాజీ రైతుబంధు సమితి అధ్యక్షులు జూపాక కరుణాకర్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన.!

నూతన వధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ నాయకులు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో నారగాని మాధవి-శ్రీధర్ గౌడ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులు చి. ల. సౌ. అమూల్య -చి.శ్రీకాంత్ గౌడ్ ను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన గణపురం మండల బిఆర్ఎస్ నాయకులు
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు, బి ఆర్ఎస్ మండల అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రా రెడ్డి, యాత్ నాయకులు గాజర్ల చింటూ గౌడ్, మార్క సాయి గౌడ్,బబ్లుగౌడ్, హఫీజ్ మరియు తదితరులు పాల్గొన్నారు

సిఎంఆర్ఎఫ్ చెక్కుని అందజేసిన బి అర్ ఎస్ నాయకులు

సిఎంఆర్ఎఫ్ చెక్కుని అందజేసిన బి అర్ ఎస్ నాయకులు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎమ్మెల్యే గారి కృషి తో మంజూరైన ₹54,000/- విలువ గల చెక్కును రంజోల్ గ్రామానికి చెందిన రాము గారికి అందజేసిన సీనియర్ నాయకులు నామ రవికిరణ్,సత్యం ముదిరాజ్ గార్లు .ఈ సంధర్బంగా ఎమ్మెల్యే గారికి,నాయకులకు లబ్ధిదారుడు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఎస్సై ని సన్మానించిన బిజెపి నాయకులు.

ఎస్సై ని సన్మానించిన బిజెపి నాయకులు

నిజాంపేట, నేటిధాత్రి

 

 

మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్లో బాధ్యతలు చేపట్టిన ఎస్సై రాజేష్ ను బిజెపి నాయకులు మంగళవారం రోజున మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను శాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండలంలో ప్రతి ఒక్కరు శాంతి భద్రతలకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు తీగల శ్రీనివాస్ గౌడ్ , టెలికం బోర్డు మెంబర్ ఆకుల రమేష్, అభిషేక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

మాటలతో మభ్యపెట్టే ఎమ్మెల్యే ,కార్పొరేటర్ మాకొద్దు..!

మాటలతో మభ్యపెట్టే ఎమ్మెల్యే ,కార్పొరేటర్ మాకొద్దు – తమ కాల్ నేను అభివృద్ధి చేసే నాయకులు కావాలి :
స్థానిక కాలనీ మహిళలు

మల్కాజిగిరి నేటిధాత్రి

05 ఏప్రిల్

41 సంవత్సరాల నుండి అన్ని రాజకీయ పార్టీ నాయకులకు ఓట్లు వేసి గెలిపిస్తున్న , కేవలం రోడ్లు, మోరీలు తప్ప తమ బస్తీకి ఏ ఒక్క నాయకుడు చేసింది ఏమీ లేదని, ఇందిరా నెహ్రూ నగర్ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నెహ్రూ నగర్ కాలనీలో రాజకీయ నాయకులు తమ సమస్యలను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ ఏర్పడి 41 సంవత్సరాలు గడిచిన ఈరోజు వరకు కాలనీలో ఒక కమ్యూనిటీ హాల్ లేకపోవడం విడ్డూరం. మహిళలు సమైక్య గ్రూపులు చేసుకోవాలన్న, యువత ఏదైనా మీటింగులు పెట్టుకోవాలన్న, అన్ని రోడ్లమీదనే కొనసాగుతున్నాయని, కాలనీలో కమిటీ హాల్ కోసం ఉన్న 60 గజాలలో నిర్మాణం జరపడానికి నిధులు. 

MLA .

 

లేవని నాయకులు చెప్పడం తమ దౌర్భాగ్యం అని అన్నారు. ఓట్ల సమయంలో తమకు ఏ సమస్య లేకుండా చేస్తామని మభ్యపెట్టి తమతో ఓట్లు వేయించుకోని గెలిచిన తర్వాత ఏ ఒక్క నాయకుడు తమ వద్దకు వచ్చి తమ సమస్యలను తీర్చిన దాఖలాలే లేవని అన్నారు. గతంలో నాయకులు కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరుపుతామని పలుమార్లు కొబ్బరికాయలు కొట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చి వెళ్లారు తప్ప ఈరోజు వరకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఊసే లేదు అని నాయకుల తీరుపై మండిపడ్డారు. జనరల్ ఎలక్షన్స్ సమయాన తమకు బోర్ వేయించిన ప్రస్తుత కార్పొరేటర్, 14 నెలలు గడిచిన ఈరోజు వరకు దానికి స్టార్టర్ ఏర్పాటు చేయకపోవడం హాస్యస్పదమని అన్నారు. స్థానికులు సొంత డబ్బులతో స్టార్టర్ ఏర్పాటు చేసుకుంటే, చాలా రోజుల నుండి బోరు వాడకపోవడంతో బోర్ లో నుండి నీళ్లు రావడం లేదని తెలిపారు. ఐదేళ్లకోసారి ఎలక్షన్స్ అప్పుడు వచ్చి తమను మభ్యపెట్టే నాయకులు ఇకపై తమకు వద్దని, తమ కాలనీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, నాయకులకే తాము అండగా ఉంటామని గంటపదంగా చెప్తున్నారు. మరి ఇప్పటికైనా స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే స్పందించి, పనిచేయని బోరును వెంటనే మరమ్మతులు చేయించాలని, అదేవిధంగా 41 సంవత్సరాల నుండి తాము ఎంతగోనో ఆశగా ఎదురు చూస్తున్నా కమిటీ హాల్ నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. అవి చేయకుండా ఓట్ల కోసం వారి వద్దకు వస్తే మాత్రం నాయకులకు వ్యతిరేకంగా ఓట్లు వేసి వారిని ఓడకొట్టి గుణపాఠం చెప్తామని అన్నారు.

జై బాపు. జై భీమ్. జై సంవిధాన్.!

జై బాపు. జై భీమ్. జై సంవిధాన్. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం చిర్రావంచ చింతల్ తనా పద్మ నగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపుమేరకు సంవత్సరం పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నమన్నారు. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ ఈరోజు 05.04.2025. రోజున తంగళ్ళపల్లి మండలంలో జై బాపు. జై భీమ్. జై సంవిధాన్.. కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర చేపట్టడం జరిగిందని దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాపాడాలని రాజ్యాంగ విలువలను కాపాడాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని మహాత్మా గాంధీ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ తెలంగాణ రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు మరియు రాష్ట్ర అభివృద్ధి ప్రజలకు వివరించాలని తెలియజేశారు భారత దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చి. 75. సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచడం లక్ష్యంగా. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నేడు పేద బలహీన వర్గాల ప్రజల వృద్ధిపై ఆకాంక్ష లేదని ప్రధాని పేద ప్రజల కంటే బడా బాబులకు ముఖ్యమన్నారు రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదు అంబేద్కర్ గాంధీ పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనతో కూడిన ఒక పవిత్ర గ్రంథం అన్నారు పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగాన్ని బిజెపి పార్టీ అనగదొక్కలని చూస్తుందనీ అమిత్ షాఅంబేద్కర్ నీ పార్లమెంటు సాక్షిగా అవమానించారని గ్రామ మండల స్థాయిలో కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లాలని కోరారు గాంధీ అంబేడ్కర్ ఆశయాల సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందని కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఒక్కొక్కటిగా అమలుపరుస్తూ గత బి.ఆర్.ఎస్ పార్టీ అందజేసిన పథకాలు కూడా కొనసాగిస్తున్నామన్నారు కానీ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మీడియా ద్వారా ప్రభుత్వం చేస్తున్న పనులుఓ ర్వలేక వ్యతిరేక అంశాలను సోషల్ మీడియా ద్వారా పలు విషయాలు పై విషం చిమ్ముతుందని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికలలో విజయాన్ని సాధించేందుకు రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచిన గొప్ప రాజ్యాంగం అని దానిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతిపరుడుపై ఉందని గుర్తు చేశారు. రాజ్యాంగ పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

యువజన కాంగ్రెస్ నాయకులు మామిడి దిలీప్ కుమార్.

చొప్పదండి శాసనసభ్యులు డా.మేడిపల్లి సత్యంకి విద్యాశాఖ మంత్రి పదవి ఇవ్వాలి

యువజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా నాయకులు మామిడి దిలీప్ కుమార్

కరీంనగర్, నేటిధాత్రి:

 

ఎఐసిసి అగ్రనేతలు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రివర్గ విస్తరణలో భాగంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యంకి విద్యాశాఖ మంత్రి పదవి ఇవ్వాలని యువజన కాంగ్రెస్ నాయకులు మామిడి దిలీప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించి, పిహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ అందుకుని విద్యారంగం మీద అపారమైన పట్టు ఉన్న నాయకులు మేడిపల్లి సత్యంకు రాష్ట్ర విద్యాశాఖ భాద్యతలను అప్పగిస్తే విద్యాశాఖలో కీలక అభివృదిని సాధించగలరని మామిడి దిలీప్ కుమార్ పేర్కొన్నారు.

ఏబీవీపీ నాయకుల ముందస్తు అరెస్టులు.

ఏబీవీపీ నాయకుల ముందస్తు అరెస్టులు

నిజాంపేట, నేటి ధాత్రి

 

చలో HCU కార్యక్రమానికి తరలిన ఏబీవీపీ విద్యార్థి నాయకులను నిజాంపేట పోలీసులు ముందస్తుగా అక్రమ అరెస్టులుచేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) భూములను కాపాడేందుకు పోరాడుతున్న విద్యార్థులను ముందస్తుగా అరెస్టు చేయడం దారుణమన్నారు.
క్యాంపస్‌లో 400 ఎకరాల భూమిని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం దారుణమని ఇందిరమ్మ పాలనలో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని ఆరోపించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై దమనకాండ ఆపాలని
HCU భూములను రక్షించాలన్నారు.
విద్యార్థుల గొంతును నొక్కాలని చూస్తే, తెలంగాణలో ఆత్మగౌరవ ఉద్యమం మరింత మిన్నంటుతుంది! రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి యువత ఏకమై ప్రభుత్వంపై ప్రతిఘటన తప్పదు అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

జర్నలిస్ట్ నాయకులను ఘనంగా సన్మానించిన సేవాలాల్ సేన.

టీ.ఎస్.జె.యు జిల్లా జర్నలిస్ట్ నాయకులను ఘనంగా సన్మానించిన సేవాలాల్ సేన జిల్లా కమిటీ

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:కేంద్రం లోని కాకతీయ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ నూతన జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షుడిగా ఎడ్ల సంతోష్,ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవీందర్ లు ఇటీవల ఎన్నిక కావడం జరిగింది ఈ సందర్భంగా బంజారా సేవాలాల్ సేన జిల్లా కమిటీ నాయకులు కాకతీయ ప్రెస్ క్లబ్ లో టీ.ఎస్.జె.యు జిల్లా కమిటీ నాయకులను శాలువాతో ఘనంగా సన్మానించుకోవడం జరిగిందని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన టీ.ఎస్.జె.యు జిల్లా కమిటీ ఎన్నిక కావడం వారిని ఘనంగా సన్మానం చేయడం జరిగింది మరెన్నో ఉన్నంతమైన పదవులు చేపట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని అన్నారు బంజారా సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు భూక్య రాజు నాయక్
ముఖ్య రూప్ సింగ్ సేవాలాల్ సేన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్
ధరావత్ రాజు నాయక్ సేవాలాల్ సేన జిల్లా ఉపాధ్యక్షులు
నగవత్ రాజేందర్ నాయక్ సేవాలాల్ సేన జిల్లా నాయకులు,
ఈ కార్యక్రమంలో జర్నలిస్టు నాయకులు జిల్లా ఉపాధ్యక్షుడు బండారి రాజు,సంయుక్త కార్యదర్శి కడపక రవి,ఆర్గనైజ్ సెక్రెటరీ చంద్రమౌళి,జిల్లా నాయకులు బొల్లేపల్లి జగన్ తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి C&MD ని కలిసిన BMS యూనియన్ నాయకులు.

సింగరేణి సి అండ్ ఎండి ని కలిసిన బిఎంఎస్ యూనియన్ నాయకులు

 

జైపూర్,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ ఎస్టిపిపి లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సి అండ్ ఎండి కి వినతి పత్రం అందజేసిన నాయకులు
శుక్రవారం రోజున హైదరాబాదులోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో బొగ్గు పరిశ్రమల ఇంచార్జ్ జాతీయ సేఫ్టీ కమిటీ సభ్యులైన కొత్త కాపు లక్ష్మారెడ్డి,బి ఎమ్మెస్ రాష్ట్ర అధ్యక్షులు అయిన యాదగిరి సత్తయ్య ఆధ్వర్యంలో సింగరేణి సిఎండి బలరాం నాయక్ కి జైపూర్ ఎస్టిపిపి లో ఉన్న వివిధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా బిఎమ్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ…పవర్ ప్లాంట్ విస్తరణలో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు వెంటనే పర్మినెంట్ ఉద్యోగాలు కల్పించాలని పవర్ ప్లాంట్ లో వివిధ కంపెనీలలో ఐదు సంవత్సరాలు విధులు నిర్వహించిన వివిధ కార్మికులకు వెంటనే పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు.పవర్ ప్లాంట్ లో విధులు నిర్వహిస్తున్న వివిధ గ్రామాల మీదుగా కార్మికులకు వెంటనే బస్సు సౌకర్యం కంపెనీ కల్పించాలని కోరారు. డిప్యూటీ సెంట్రల్ లేబర్ కమిషన్ హైదరాబాద్ వారి ఒప్పందం ప్రకారం క్యాంటీన్ ను వెంటనే ప్రారంభించి కార్మికులకి అతి తక్కువ ధరలకు నాణ్యమైన ఆహారాన్ని అందచేయాలని తెలియజేశారు.ఈఎస్ఐ హాస్పిటల్ ను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు భీమా సౌకర్యంతో పాటు వారి యొక్క కుటుంబంలో ఒకరికి అర్హతను బట్టి ఉద్యోగం కల్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పులి రాజిరెడ్డి,మండ రమాకాంత్, ప్రధాన కార్యదర్శి దుశ భాస్కర్,బోడకుంట శ్రీధర్, పెద్దిరెడ్డి,కిషన్ రెడ్డి,శివకృష్ణ,కే. సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version