ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కుతున్న రాష్ట్ర ప్రభుత్వం
హరీష్ రావు ని విచారణకు పిలవడం ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలనకు నిదర్శనం
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పై ఫోన్ ట్యాపింగ్ విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష్యపూరితంగా వారిని విచారణకు పిలవడం హేయమైన, ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన చర్యగా పరిగణించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, వాటి నుంచి తప్పించుకునే కుట్రలో భాగంగా ప్రతిపక్ష పార్టీ నాయకుల గొంతు నొక్కే ప్రయత్నాలు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచే చేస్తున్నారు.
ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ అనే అస్త్రాన్ని ఉపయోగించి హరీష్ రావు పై కేసులు పెట్టి రాజకీయ కుట్రలకు పాల్పడ్డారు.
హరీష్ రావు పై విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ, నిన్న మళ్లీ విచారణకు పిలవడం అనేది పూర్తిగా ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేని అసహనానికి నిదర్శనం.
భారత రాష్ట్ర సమితికి ఉన్న అపార ప్రజాదరణను చూసి, మునిసిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకులను ఎదుర్కొనే ధైర్యం లేక, బీఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలను వేధింపులకు గురిచేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తోంది.
ఇలాంటి బెదిరింపులకు బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పటికీ భయపడదు.
ఎంతమందిని విచారణలకు పిలిచినా, ఎంతమంది కార్యకర్తలను వేధించినా, బీఆర్‌ఎస్ పార్టీ రెట్టింపు ఉత్సాహంతో ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది.
ఈ ప్రభుత్వాన్ని పదవి నుంచి దించే వరకు ప్రజాపక్షంలో పోరాడటం ఖాయం. ఈ క్రమంలో అసెంబ్లీలో పార్టీ ఉపనాయకుడిగా హరీష్ రావు ప్రభుత్వ వైఫల్యాలను, బొగ్గు కుంభకోణంలో వేల కోట్ల రూపాయల అవినీతిని ధైర్యంగా బయటపెడుతున్నందుకే ప్రభుత్వం ఇలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది.
కాంగ్రెస్ పార్టీ ప్రజావ్యతిరేక చర్యలను ప్రజలు క్షేత్రస్థాయిలో గమనిస్తున్నారు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేస్తే ప్రజలు హర్షిస్తారు.లేకపోతే, ఇలాంటి నిరంకుశ చర్యలతో చరిత్రలో తప్పకుండా చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. వారు హెచ్చరించారు
