ఆ వ్యాఖ్యలు కౌశిక్ రెడ్డికి ఉన్న ద్వేషాన్ని బయటపెట్టాయన్న…

ఆ వ్యాఖ్యలు కౌశిక్ రెడ్డికి ఉన్న ద్వేషాన్ని బయటపెట్టాయన్న మండల అధ్యక్షులు షేక్ రబ్బాని

◆-: కేసీఆర్ నాయకత్వంలోని పార్టీ ఎమ్మెల్యే నుంచి ఇలాంటి వ్యాఖ్యలు శోచనీయమని వ్యాఖ్య

◆-: బీఆర్ఎస్ అధిష్ఠానం ఈ వ్యాఖ్యలపై ఆలోచన చేయాలని సూచన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ మజ్లిస్ పార్టీ ఝరాసంగం మండల అధ్యక్షులు షేక్ రబ్బాని తీవ్ర విమర్శలు చేశారు. విధి నిర్వహణలో ఉన్న అధికారిపై మతం పేరుతో వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఐపీఎస్ అధికారిని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ముస్లింల పట్ల ఆయనకున్న ద్వేషాన్ని బయటపెట్టాయని అన్నారు.మొదటిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే, ఆయనను ఆరెస్సెస్ భావజాలం ఆవహించి ఉంటుందని చురక అంటించారు. పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్లో ఉంటూ కౌశిక్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయమని అన్నారు. ఆయన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా చేశారని గుర్తు చేశారు.

జహీరాబాద్‌లో ఏఐఎంఐఎం పార్టీలో భారీ చేరికలు

జహీరాబాద్లో ఏఐఎంఐఎం పార్టీలో భారీ చేరికలు

◆-: 925వ వార్డు యువకులతో బలపడుతున్న మజ్లిస్…

జహీరాబాద్ నేటి ధాత్రి:

మున్సిపాలిటీ ఎన్నికల హడావుడి నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠగా మారింది. అన్ని రాజకీయ పార్టీలు తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో ఉండగా, ఏఐఎంఐఎం పార్టీలో చేరికలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పట్టణంలోని 25వ వార్డుకు చెందిన పలువురు యువకులు మజ్లిస్ పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వం పట్ల ఆకర్షితులై ఏఐఎంఐఎం పార్టీలో చేరారు. జహీరాబాద్ నియోజకవర్గ ఏఐఎంఐఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అత్తర్ అహ్మద్, జిల్లా ప్రధాన కార్యదర్శి మోహియోద్దీన్ గౌరి, పట్టణ కార్యదర్శి మొహమ్మద్ అమెర్ల సమక్షంలో 25వ వార్డుకు చెందిన ఎండి. ముజాహెద్, ఎండి. వాజిద్ తదితరులు అధికారికంగా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏఐఎంఐఎం అధ్యక్షుడు అత్తర్ అహ్మద్ నూతన సభ్యులకు పార్టీ కండువాలు కప్పి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎంఐఎం సీనియర్ నాయకులు షఫియోద్దీన్, షరీఫ్ తదితరులు పాల్గొని నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడిన అత్తర్ అహ్మద్, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఏఐఎంఐఎం పార్టీ ఒంటరిగా పోటీ చేసి జహీరాబాద్ మున్సిపాలిటీలో మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్త పార్టీ కోసం సైనికుడిలా పనిచేయాలని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు.

అసెంబ్లీ సభ్యుడు కౌసర్ మొహియుద్దీన్ సమక్షంలో మజ్లిస్‌లో బారి సంఖ్యలో చేరిక…

అసెంబ్లీ సభ్యుడు కౌసర్ మొహియుద్దీన్ సమక్షంలో మజ్లిస్‌లో బారి సంఖ్యలో చేరిక

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ కోహీర్ లో మజ్లిస్ ఎమ్మెల్యే కార్వాన్ కౌసర్ మొహియుద్దీన్ సమక్షంలో భారీ సంఖ్యలో అధికారికంగా మజ్లిస్
పార్టీలో చేరడంతో మజ్లిస్ రాజకీయ కార్యకలాపాలు మరింత బలపడతాయని అన్నారు.ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ కొత్త సభ్యులను స్వాగతించారు మజ్లిస్ ప్రజా సమస్యలు, మైనారిటీ హక్కులు మరియు సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతుందని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో జహీరాబాద్ అధ్యక్షులు అత్తర్ అహమ్మద్, గోరి సహబ్, పాల్గొని కండువా కప్పిన
మజ్లిస్ స్థానిక అధ్యక్షుడు ముహమ్మద్ రఫీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో, ముహమ్మద్ జావాద్ బేగ్, ముహమ్మద్ జలీల్ మామో, ముహమ్మద్ సయ్యద్ అకీల్ ఖురేషి, ఖలీల్ బాషా మరియు ముహమ్మద్ నజీబ్ మజ్లిస్‌లో స్వాగతించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version