చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టమయింది…

చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టమయింది…

రెవెన్యూ , పోలీస్ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులా..? విశాఖ ఇండస్ట్రీస్ ఉద్యోగులా..,?

“ఐ లవ్ యూ” మంత్రి వివేక్.. కావాలనే బాగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

*చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

మున్సిపల్ ఎన్నిక కాకుండా చూస్తే ప్రజాస్వామ్యాన్ని అవమానించినట్లే…

ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

మమ్మల్ని బాగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు ఐ లవ్ యూ మంత్రి వివేక్ అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు.ప్రజలంతా క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికల తీరును గమనిస్తున్నారని
పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఎప్పుడు కక్ష సాధింపు చర్యలకు దిగలేదని, అందరినీ కలుపుకుపోయామే తప్ప కక్ష సాధింపు చర్యలకు ఏనాడూ దిగలేదని మంచిర్యాల జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి విడుదలైన అనంతరం క్యాతన్ పల్లి లోని బాల్క సుమన్ తన నివాసానికి చేరుకున్న సందర్భంగా ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్,మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, మూల రాజిరెడ్డి లతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.అనంతరం వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రమంతటా పరిస్థితి దారుణంగా తయారయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా మంత్రి వివేక్ ఆయన కుమారుడు ఎంపీ వంశీకృష్ణ లు బిఆర్ఎస్, సిపిఐ పార్టీల 14 మంది కౌన్సిలర్లను కొనే ప్రయత్నం చేశారని అన్నారు. బ్లాంక్ చెక్కులు ఇచ్చి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కోట్లాది రూపాయలు ఆఫర్లు చేశారని అయినా సరే తమ కౌన్సిలర్లు తలొగ్గ లేదన్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ లు మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మెన్ ఎన్నిక సమయంలో కాంగ్రెస్ కౌన్సిలర్ల కు మందు తాగించి తమ మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేపించారని మండిపడ్డారు. ప్రజా తీర్పును మంత్రి వివేక్ గౌరవించడం లేదని విమర్శించారు. క్యాతనపల్లి లో గొడవ సందర్భంగా రాళ్ళు విసిరినోళ్ల మీద కేసులో బుక్ కాలేదని, మా పార్టీకి చెందిన 25 మంది మీద కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక సందర్భంగా క్యాతన్ పల్లి మున్సిపల్ ఆఫీస్ కి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. మంత్రి వివేక్ కాన్వాయ్ ను ఎలా పంపించారని అడిగితే పోలీసులు తమపై లాఠీ ఛార్జ్ చేశారని పేర్కొన్నారు. వాళ్లు దాడి చేస్తే మాపైనే రివర్స్ లో కేసు పెట్టారని మండిపడ్డారు. క్యాతన్ పల్లి లో కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని మున్సిపల్ పీఠం ఎలా వస్తుందని మండిపడ్డారు. జిల్లాలోని కలెక్టర్ నుండి ఎమ్మార్వో వరకు ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగులుగా కాకుండా విశాఖ ఇండస్ట్రీస్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. జైలు లోపల కూడా తమని ఇబ్బంది పెట్టారని తెలిపారు. జైలులో ఉండగా రామకృష్ణాపూర్ ఎస్సై నా ఇంటిని ఏ విధంగా సోదా చేస్తారో తెలపాలని సుమన్ ప్రశ్నించారు.అక్రమంగా నన్ను జైల్లో పెట్టారని ఇప్పుడు వారి కడుపు మంట తగ్గిందని అనుకుంటున్నానని అన్నారు. సిపిఐ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు కలిసి ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్నాయని ,పొత్తు ధర్మాన్ని విస్మరించే ప్రసక్తే లేదని , భవిష్యత్తులో కూడా పొత్తుతోనే వెళ్తామని ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య స్పష్టం చేశారు.క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికను ఇప్పటికైనా సవ్యంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

క్యాతనపల్లి మున్సిపాలిటీ కోరం లేక ఎన్నిక వాయిదా…

క్యాతనపల్లి మున్సిపాలిటీ కోరం లేక ఎన్నిక వాయిదా…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతనపల్లి మున్సిపాలిటీ లో చైర్ పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం కోరం లేక వాయిదా పడింది. నిర్దేశించిన సమయానికి మునిసిపాలిటీ కార్యాలయానికి 22 మంది కౌన్సిలర్లు ఎవరూ రాకపోవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కోరం వాయిదా వేస్తున్నట్లు మందమర్రి ఎమ్మార్వో, ఎన్నికల అధికారి సతీష్ కుమార్ తెలిపారు. నేడు మళ్లీ 11 గంటల ప్రాంతంలో కౌన్సిలర్ల ప్రమాణస్వీకారాలు ఉంటాయని, కౌన్సిలర్ లు అందరూ సకాలంలో విచ్చేసి ఎన్నికలకు హాజరు కావాల్సిందిగా ఎమ్మార్వో కోరారు. దీంతో మున్సిపాలిటీ కార్యాలయం ముందు బిఆర్ఎస్, సిపిఐ, కాంగ్రెస్ శ్రేణుల పోటా పోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బిఆర్ఎస్,సిపిఐ కలిపి 14 కౌన్సిలర్ సీట్లు గెలుపొందగా కౌన్సిలర్లను ప్రమాణస్వీకారానికి తీసుకొస్తున్న సందర్భంలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కౌన్సిలర్లతో పాటు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రావడాన్ని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య లను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మున్సిపాలిటీ కార్యాలయం ముందు కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

 

పరిస్థితులు అదుపుతప్పుతున్నాయని గమనించిన పోలీస్ యంత్రాంగం, ఎన్నికల అధికారులు మున్సిపాలిటీ కౌన్సిలర్ల ప్రమాణస్వీకారాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో మున్సిపాలిటీ కార్యాలయం ప్రాంతంలో అల్లరి సద్దుమణిగింది. నేడు ఎన్నిక జరిగే సమయంలో మళ్లీ పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘానికి, జిల్లా కలెక్టర్ కు సమాచారం అందిస్తామని ఎమ్మార్వో, ఎన్నికల అధికారి సతీష్ కుమార్ తెలిపారు.

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పీఠం పై గులాబీ జెండా….

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పీఠం పై గులాబీ జెండా….

పొత్తు ధర్మాన్ని వీడని ఎర్ర సూరీలు….

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మంత్రి గడ్డం వివేక్ ఇలాఖలో చక్రం తిప్పి మునిసిపాలిటీ గద్దెపై గులాబీ జెండా ఎగిరేలా ఎర్ర సూరీల తో వ్యూహాలు రచించి విజయం సాధించారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పీఠాన్ని బిఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీతో కలిసి కైవసం చేసుకుంటున్న నేపథ్యంలో పొత్తు ధర్మాన్ని విస్మరించకుండా ఎర్ర సూరీలు గులాబీ జెండా కు జై కొడుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి , మంత్రి ఇలాకాలో గులాబీ జెండా ఎగరడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసినప్పటికీ ప్రజా తీర్పును గౌరవించాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రం మొత్తంలో అధికార కాంగ్రెస్ పార్టీకి తోడుగా ఉన్న సిపిఐ పార్టీ నాయకులు క్యాతనపల్లిలో అందుకు భిన్నంగా బిఆర్ఎస్ పార్టీతో జతకట్టడంతో అధికారంలోకి వచ్చారు.కాంగ్రెస్ నాయకులు సిపిఐ నాయకులను తీవ్రంగా అవమానించిన నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీతో జతకట్టినట్లు ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేన శంకర్, మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ లు ఎన్నికలకు ముందే స్పష్టం చేశారు. పొత్తు ధర్మాన్ని విస్మరించి ఒకవేళ ప్రస్తుత సందర్భాలలో కాంగ్రెస్ తో జతకడితే క్యాతనపల్లి మునిసిపాలిటీలో సిపిఐ పార్టీకి మునగడ కరవయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎర్ర సూరీలకు ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ మునిసిపాలిటీలో గులాబీ జెండా ఎర్ర సూరీలతో కలిసి ఎగురుతోందని ప్రజలంతా భావిస్తున్నారు. అలానే జరగాలని ప్రజలంతా ఓటర్లంతా కోరుకుంటున్నారు. ఎర్ర సూరీలు సైతం పొత్తు ధర్మాన్ని విస్మరించడం లేదని ఇప్పటికే స్పష్టం చేశారు.

క్యాతన్ పల్లి పుర పోరు రసవత్తరం…

క్యాతన్ పల్లి పుర పోరు రసవత్తరం…

గెలిపే లక్ష్యంగా వ్యూహాలు, ప్రతి వ్యూహాలు…

పట్టు నిలుపుకునేందుకు ఎర్ర జెండా తో కారు దోస్తీ…

సత్తా చాటేందుకు కాంగ్రెస్ ,కమలం యత్నం..

కీలకంగా మారనున్న నిరుద్యోగ ఓటర్లు…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న క్యాతన్ పల్లి మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీ ఎన్నికలను సవాల్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సైతం నియోజకవర్గంలోని రెండు మునిసిపాలిటీలను కైవసం చేసుకోవాలనే ఏజెండాతో ముందుకెళ్ళినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.పట్టు నిలుపుకునేందుకు గులాబీ దళం క్యాతన్ పల్లి మున్సిపాలిటీ లో ఎర్రజెండాతో దోస్తీ కట్టాయి. సత్తా చాటేందుకు కాంగ్రెస్, కమలదళం ప్రయత్నాలతో క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికల రాజకీయం వేడెక్కింది. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం సమయంలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని పార్టీలు శత విధాలా ప్రయత్నాలు చేశాయి. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల వ్యూహ, ప్రతి వ్యూహాలతో రాష్ట్రస్థాయి కీలక నేతలతో ప్రచారాలు హోరెత్తించారు. మున్సిపాలిటీలో 22 వార్డులు ఉండగా నిరుద్యోగ ఓటర్లు కీలకంగా మారనున్నారు. ఈ ప్రాంతంలో ఉపాధి లేక ప్రజలంతా వలస వెళ్లి పనులు చేసుకుంటున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలలో సరైన అభ్యర్థులను ఎంచుకునేందుకు ఓటర్లు సైతం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మున్సిపాలిటీలోని 22 వార్డుల్లో నీ ఓటర్ల నాడి ఏంటో కొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ప్రజలంతా మార్పును కోరుకుంటున్నారనే ప్రచారం మునిసిపాలిటీలో చక్కర్లు కొడుతోంది.

హరీష్ రావు ప్రచారంతో మలుపు తిరిగిన ఓటరు నాడి..

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పై గులాబీ జెండా ఎగరేసి పట్టు నిలుపుకోవడమే ధ్యేయంగా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రయత్నిస్తుండగా, మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎల్పి ఉపనేత తన్నీరు హరీష్ రావు రామకృష్ణాపూర్ పట్టణంలో ఏర్పాటుచేసిన ప్రచారంతో ఓటరు నాడి పూర్తిగా బిఆర్ఎస్ పార్టీ వైపు మళ్ళినట్లు రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు మున్సిపాలిటీ లో జరిగిన అభివృద్ధి పనులను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీ అభివృద్ధి జరగాలంటే మరొక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు.

అధికార పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం…

కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి,సంక్షేమ పథకాలు చేపడుతుందని మునిసిపాలిటీలు అభివృద్ధి చెందాలంటే అధికారంలో ఉన్న పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ లు ప్రచారం నిర్వహించడంతో ప్రజలు ఒకింత ఆలోచించినట్లు తెలుస్తుంది. మున్సిపాలిటీ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగిరేలా ఓటర్లంతా తీర్పునివ్వాలని వారు కోరారు. మున్సిపాలిటీని ఆదర్శ మునిసిపాలిటీగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.

మున్సిపాలిటీ గద్దెపై గులాబీ జెండా

మున్సిపాలిటీ గద్దె పై గులాబీ జెండా ఎగిరేస్తాం…

16,20 వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థులు నాని, మంద వేణుగోపాల్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ ఎన్నికల బరిలో 16 వ వార్డ్ అభ్యర్థిగా జి కృపానందం(గ్యాస్ నాని),20 వ వార్డ్ బరిలో మంద వేణుగోపాల్ లు ఉన్నారు.స్థానికంగా బిఆర్ఎస్ పార్టీ కి ఎక్కువ ఓటు బ్యాంక్ ఉన్న నేపధ్యంలో ఇక్కడ మున్సిపాలిటీ గద్దె పై గులాబీ జెండా ఎగిరేస్తాం అని అభ్యర్ధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బారాస,సిపిఐ పార్టీ కలిసి మునిసిపాలిటీలో పోటీ చేస్తున్న నేపథ్యంలో ప్రచారంలో సైతం ముందు నిలుస్తున్నారు.తమను గెలిపిస్తే వార్డులలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తమ పై పెట్టుకున్నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి పార్టీని గెలిపించేందుకు కృషి చేస్తామని కౌన్సిలర్ అభ్యర్థులు నాని, మంద వేణుగోపాల్ లు అంటున్నారు.

తండ్రి కేసిఆర్,అన్న కేటీఆర్ పదేండ్లలో అభివృద్దేమో శూన్యం..

తండ్రి కేసిఆర్,అన్న కేటీఆర్ పదేండ్లలో అభివృద్దేమో శూన్యం..

కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

తండ్రి కేసిఆర్, అన్న కేటీఆర్ అని గొప్పలు చెప్పుకునే చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పదేండ్ల బిఆర్ఎస్ పాలనలో క్యాతన్ పల్లి మున్సిపాలిటీకి, చెన్నూర్ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశారని గొప్పలు చెప్పుకుంటున్నారో అర్థం కావడం లేదని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఎద్దేవచేశారు.శుక్రవారం ఆయన క్యాతన్ పల్లి మున్సిపాలిటీ లోని 1,2,7,8,9,12,13,14,17 వార్డులలో రోడ్లు డ్రైనేజీ నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి శంకుస్థాపనలు చేశారు. సుమారు 45 కోట్ల టి,యు,ఐ,ఎఫ్డిసి, సి ఎస్ ఆర్ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలకు చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా అనేక పథకాలు ప్రవేశపెట్టి, సమర్థవంతంగా అమలు చేస్తోందని అన్నారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటిని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని అన్నారు. ప్రజలకు సేవ చేయడానికి తన జీవితం అంకితం చేస్తున్నానని తెలిపారు. కమీషన్ల కోసం పనిచేసే ఎమ్మెల్యేను కాదని స్పష్టం చేశారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మునిసిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మందమర్రి ఎమ్మార్వో సతీష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు,పార్టీ కార్యకర్తలు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version