క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్–సిపిఐ పొత్తు

క్యాతనపల్లి లో బిఆర్ఎస్ సిపిఐ దోస్తానకు సై..

స్కాములే తప్ప స్కీములు లేని ప్రభుత్వం నడుస్తుంది..

చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

సింగరేణి సంస్థ వ్యక్తుల చేతిలో బలి అవుతుంది…

ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీ కలిసి పోటీ చేస్తున్నట్లు చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య లు తెలిపారు. శనివారం రామకృష్ణాపూర్ పట్టణంలోని బారాస పార్టీ కార్యాలయంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని, బిఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగిందని బాల్క సుమన్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేక విఫలమయ్యిందని ఆరోపించారు. క్యాతన పల్లి మున్సిపాలిటీ లో సిపిఐ పార్టీతో కలిసి పోటీ చేసి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

సింగరేణి ప్రాంతంలో రాజకీయ జోక్యం ఎక్కువైందని, సంస్థ వ్యక్తుల చేతిలో బలవతోందని సిపిఐ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య ఆరోపించారు.భవిష్యత్తులో కూడా బిఆర్ఎస్ పార్టీ తో పాటు కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. పొత్తుల్లో భాగంగా ఏ ఏ స్థానాల్లో బరిలో గెలుస్తామో మూడవ తేదీన తెలియజేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, బి ఆర్ ఎస్ నాయకులు డాక్టర్ రాజా రమేష్, పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్ , మేడిపల్లి సంపత్, బారాస, సిపిఐ నాయకులు, మాజీ కౌన్సిలర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

క్యాతన్ పల్లి నూతన మున్సిపల్ కమిషనర్‌గా మారుతి ప్రసాద్

మున్సిపాలిటీ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

నూతన మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపేలా కృషి చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి సైతం ప్రాధాన్యత ఇస్తానని క్యాతన్ పల్లి మున్సిపాలిటీకి నూతన మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన మారుతి ప్రసాద్ అన్నారు. రామగుండం మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించిన ఏ మారుతీ ప్రసాద్ సాధారణ బదిలీల్లో భాగంగా క్యాతన్ పల్లి మున్సిపాలిటీకి మున్సిపల్ కమిషనర్ గా బదిలీపై వచ్చి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని, సిబ్బంది సైతం సహకరించాలని కోరారు.ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. పలువురు సిబ్బంది కమిషనర్ కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

తండ్రి కేసిఆర్,అన్న కేటీఆర్ పదేండ్లలో అభివృద్దేమో శూన్యం..

తండ్రి కేసిఆర్,అన్న కేటీఆర్ పదేండ్లలో అభివృద్దేమో శూన్యం..

కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

తండ్రి కేసిఆర్, అన్న కేటీఆర్ అని గొప్పలు చెప్పుకునే చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పదేండ్ల బిఆర్ఎస్ పాలనలో క్యాతన్ పల్లి మున్సిపాలిటీకి, చెన్నూర్ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశారని గొప్పలు చెప్పుకుంటున్నారో అర్థం కావడం లేదని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఎద్దేవచేశారు.శుక్రవారం ఆయన క్యాతన్ పల్లి మున్సిపాలిటీ లోని 1,2,7,8,9,12,13,14,17 వార్డులలో రోడ్లు డ్రైనేజీ నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి శంకుస్థాపనలు చేశారు. సుమారు 45 కోట్ల టి,యు,ఐ,ఎఫ్డిసి, సి ఎస్ ఆర్ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలకు చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా అనేక పథకాలు ప్రవేశపెట్టి, సమర్థవంతంగా అమలు చేస్తోందని అన్నారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటిని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని అన్నారు. ప్రజలకు సేవ చేయడానికి తన జీవితం అంకితం చేస్తున్నానని తెలిపారు. కమీషన్ల కోసం పనిచేసే ఎమ్మెల్యేను కాదని స్పష్టం చేశారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మునిసిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మందమర్రి ఎమ్మార్వో సతీష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు,పార్టీ కార్యకర్తలు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

హిందూ స్మశాన వాటికకు భూమి పూజ..

హిందూ స్మశాన వాటికకు భూమి పూజ..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 7,8,9,10 వ వార్డ్ ప్రజల సౌకర్యార్థం అమ్మ గార్డెన్ ఏరియాలోనీ ఆర్ ఆర్ నగర్ ప్రాంతంలో హిందూ స్మశాన వాటికకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి భూమి పూజ చేశారు. భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హాజరయ్యారు. సుమారు 50 లక్షల పట్టణ ప్రగతి, 15వ ఫైనాన్స్ నిధులతో స్మశాన వాటిక కు భూమి పూజ చేశారు. అనంతరం వారు మాట్లాడారు.అమ్మ గార్డెన్ ఏరియాలో ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నానని అన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి రఘునాథరెడ్డి, ఎమ్మార్వో సతీష్ కుమార్,పుర కమిషనర్ గద్దె రాజు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, గోపతి భానేష్, నాయకులు,ప్రజలు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

నూతన టవర్ వ్యాగన్ వాహనం ప్రారంభం…

నూతన టవర్ వ్యాగన్ వాహనం ప్రారంభం

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ కార్యాలయానికి నూతన టవర్ వ్యాగన్ వాహనం ను సుమారు 40 లక్షల పట్టణ ప్రగతి, 15వ ఫైనాన్స్ నిధులతో కొనుగోలు చేయగా బుధవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ చౌరస్తాలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. వాహన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హాజరయ్యారు. ఈ వాహనం మున్సిపాలిటీ పరిధిలోని పలు ఎలక్ట్రిసిటీ కార్యక్రమాలకు ఉపయోగపడేలా కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి రఘునాథరెడ్డి రెడ్డి, ఎమ్మార్వో సతీష్ కుమార్,పుర కమిషనర్ గద్దె రాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం కళ ,మాజీ వైస్ చైర్మన్ విద్యసాగర్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, యాకూబ్ అలీ,నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version