వైకాపా అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యం: ఎమ్మెల్యే గురజాల జగన్

*ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవడమే వైకాపా ఎజెండా..

*అందుకే వెకాపా నాయకులు అలజడులు సృష్టిస్తున్నారు..

*సంస్కారం మరచిన వైకాపా నాయకులు..

*రాయలసీమకు జగన్ చేసింది శూన్యం…

*గత తెదేపా, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనే రాయలసీమకు నీరు…

*ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్…

చిత్తూరు(నేటిధాత్రి:

రాష్ట్రంలో వైకాపా నాయకులు వరుసగా చేస్తున్న అరాచకాలు, అలజడులు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవడమే అజెండాగా కనిపిస్తోందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల విషయంపై మంగళవారం బీవీ
రెడ్డి కాలనీలోని గృహంలో విలేకరులతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాలకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన, 48 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని నోటికొచ్చినట్లు మాట్లాడడం వైకాపా నాయకుడు అంబటి రాంబాబు సంస్కారానికి నిదర్శనమని, ప్రజలు దీన్ని గమనిస్తున్నారన్నారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ పనికిమాలిన చర్యలతో రాష్ట్రంలో అలజడలు సృష్టించి.. పెట్టుబడుదారులను, పారిశ్రామికవేత్తలను భయపెట్టి రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టడం లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ రెడ్డి ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడుస్తోందని, జాతీయ, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన నారా చంద్రబాబునాయుడు గారిని చులకనగా మాట్లాడడం తెదేపా శ్రేణులు, సానుభూతిపరులు, ప్రజలు తట్టుకోలేకపోతున్నారని రానున్న రోజుల్లో వైకాపా నాయకులకు మరింత గట్టిగా బుద్ధి చెప్తారన్నారు. గతంలో వైయస్ జగన్ రెడ్డి భార్య వైయస్ భారతి రెడ్డి పై సోషియల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అరెస్టు చేసి ఘనత కూటమి ప్రభుత్వానిదేనని.. తెలుగుదేశం పార్టీ ఎంతో క్రమశిక్షణతో పనిచేస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చిత్తూరులో మాపై, మా కార్యకర్తలపై దాడులు జరిగినా.. ఫలితాల తర్వాత ఎలాంటి ప్రతి దాడులు మేము చేయలేదని, ఇది మా పార్టీ క్రమశిక్షణ, నిబద్ధతకు నిదర్శనం అన్నారు. రాజకీయ విమర్శలను రాజకీయంగానే ఉండాలని, వ్యక్తిగతంగా,కుటుంబ పరంగా ఉండరాదని..ఈ విషయాన్ని జగన్ రెడ్డి వాల్ల పార్టీ నాయకులకు అవగాహన కల్పించాలన్నారు.

రాయలసీమకు నీటిపై డ్రామాలు..

అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు రాయలసీమలోని ప్రాజెక్టులను పట్టించుకోని జగన్.. ఇప్పుడు దీక్ష పేరుతో డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో చేసిన ఇసుక దోపిడీ కారణంగానే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి ప్రాణ నష్టం జరిగిందని, ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయలేదు, ప్రాజెక్టుల నిర్వహణలో గాలికి వదిలేసారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 19 నెలల్లోనే రూ.8వేల కోట్లు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసినట్లు చెప్పారు. చిత్తూరుకు అడివిపల్లి రిజర్వాయర్ నుంచి నీటి సరఫరా పనులు జోరుగా సాగుతుందన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కుప్పం పర్యటనలోనూ.. చిత్తూరు, పూతలపట్టు, జీడి నెల్లూరు నియోజకవర్గాలకు నీటి సరఫరాపై కలెక్టర్ తో చర్చించారని చెప్పారు. కృష్ణా జలాలను కుప్పంకు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదేనని.. గతంలో వైయస్ జగన్ సినిమా సెట్టింగ్లను వేసి డ్రామాలు చేశారని విమర్శించారు. వైకాపా నాయకులు ఎన్ని డ్రామాలు వేసిన వారిని నమ్మే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరని.. ఇలానే దిగజారుడు రాజకీయాలు చేస్తే భవిష్యత్తులో ఆ 11 సీట్లు మిగలవన్నారు. సమావేశంలో మేయర్ ఎస్ అముద, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

 బీఆర్‌ఎస్ నేతలతో కేసీఆర్ కీలక భేటీ.. చర్చించిన అంశాలివే..

 బీఆర్‌ఎస్ నేతలతో కేసీఆర్ కీలక భేటీ.. చర్చించిన అంశాలివే

 

 

నందినగర్‌లోని నివాసంలో బీఆర్‌ఎస్ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై సమావేశంలో చర్చించారు.

 బీఆర్‌ఎస్ నేతలతో మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ (Former CM KCR) ఈరోజు (మంగళవారం) సమావేశమయ్యారు. నందినగర్ నివాసంలో జరిగిన ఈ భేటీలో మాజీ మంత్రులు కేటీఆర్‌ (KTR), హరీష్ రావు (Harish Rao), పలువురు బీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ప్రధానంగా పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు సంబంధించి అసెంబ్లీ వేదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టాలన్నదే బీఆర్‌ఎస్ వ్యూహం.ఇందులో భాగంగానే ఈ అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా ఉపయోగించుకోవాలని బీఆర్‌ఎస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్‌ విషయంలో గత పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని, ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను మాత్రమే నిర్మించిందని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. బీఆర్‌ఎస్ పార్టీ పదేళ్ల కాలంలో అటు కృష్ణా, ఇటు గోదావరి రెండు నదులపై చేపట్టిన ప్రాజెక్టులు, నీటి వాటాలు పరిష్కరించామని ఆ పార్టీ చెప్పుకొస్తోంది.ఇదే విషయంపై కొద్దిరోజులుగా సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం మధ్య మాటల యుద్ధం వ్యక్తిగత దూషణలకు దారి తీసింది. వీటన్నింటికీ అసెంబ్లీ వేదికగా సమాధానం చెప్పాలని బీఆర్‌ఎస్ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగానే కాసేపటి క్రితమే కేసీఆర్‌తో కేటీఆర్, హరీష్‌ రావు, ఇతర నాయకులు సమావేశమయ్యారు. ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది?.. ప్రభుత్వం చెప్పే ప్రతీ అంశంపై సమాధానంతో సిద్ధంగా ఉండాలని ఇప్పటికే పార్టీ నేతలకు కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది.

జగన్ హయాంలో ఏపీ అభివృద్ధి అస్తవ్యస్తంగా మారింది..

జగన్ హయాంలో ఏపీ అభివృద్ధి అస్తవ్యస్తంగా మారింది.. పరిటాల సునీత ఫైర్

 

ఏపీ వ్యాప్తంగా మారుమూల గ్రామాలకు సైతం నీళ్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతోందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వ్యాఖ్యానించారు. చెరువులు జలకళను సంతరించుకోవడంతో గ్రామస్తులు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

 వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత (Paritala Sunitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ఏపీ అభివృద్ధి అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. ఇవాళ(ఆదివారం) రాప్తాడు నియోజకవర్గ పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని కక్కలపల్లి గ్రామ చెరువుకి జలహారతి ఇచ్చారు పరిటాల సునీత. గ్రామస్తులతో కలిసి చెరువు వద్ద బోనాలతో పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు పరిటాల సునీత.
ఏపీ వ్యాప్తంగా మారుమూల గ్రామాలకు సైతం నీళ్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతోందని తెలిపారు. చెరువులు జలకళను సంతరించుకోవడంతో గ్రామస్తులు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు పాలనతోనే గ్రామాలు సస్యశ్యామలం అవుతున్నాయని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతోందని పరిటాల సునీత పేర్కొన్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version