స్వరాష్ట్ర సాధనకు బలమైన పునాది దీక్ష దివాస్…

స్వరాష్ట్ర సాధనకు బలమైన పునాది దీక్ష దివాస్.

#తెలంగాణ ప్రజల చిరకాల ఆంక్షను నెరవేర్చిన నాయకుడు కేసీఆర్.

#మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి.

నల్లబెల్లి,నేటిధాత్రి:

 

తెలంగాణ స్వరాష్ట్ర సాధన లో దీక్ష దివస్ అపూర్వఘట్టమని బీ ఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోతు సారంగపాణి అన్నారు.దీక్ష దివస్ కార్యక్రమం నేపద్యంలో మండలంలోని గోవిందపురం గ్రామంలో ఉద్యమకారుల చిత్రపటానికి పూలమాలలతో అమరులకు నివాళులర్పించారు.ఈ సందర్భంగా సారంగపాణి మాట్లాడుతూ తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ సచ్చుడో” అని నినదించి తన ప్రాణాలను సైతం లెక్కచేయనీ, ఉద్యమ నాయకుడు కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజునే దీక్ష దివస్ గా అని పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఒక అపూర్వ ఘట్టమని అన్నారు.ఈ నేపథ్యంలో యావత్ తెలంగాణ ప్రజలని,తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన దీక్ష అని తెలిపారు.తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన ఘట్టంగా ఈ దీక్ష దివస్ నిలుస్తుందని స్పష్టం చేశారు.2009 నవంబర్ 29వ తేదీన భారత రాష్ట్ర సమితి (అప్పటి టీఆర్ఎస్) అధ్యక్షులు కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి, స్వరాష్ట్ర సాధనకు బలమైన పునాదులు వేసిందన్నారు.
దీక్షకు వెళ్లే ముందు కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చుడో – కేసీఆర్ సచ్చుడో అనే తెగింపుతో చేపట్టిన ఈ దీక్ష సబ్బండ వర్గాల తెలంగాణ ప్రజలను ఏకం చేసిందన్నారు.సమగ్ర భారత దేశ రాజకీయ వ్యవస్థను కదిలించి, దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిందని పేర్కొన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి, మెప్పించి.. కులాలకు, మతాలకు అతీతంగా అందరినీ దీక్షా దివస్ కలిపిందన్ని వివరించారు.
ప్రత్యేక తెలంగాణ కళ కలగానే మిగిలిపోతుందే మో అన్న సమయంలో, అమరవీరుల నెత్తురుతో వారి త్యాగాలతో తెలంగాణ నేల తడిసి ముద్దవుతున్న సమయంలో ఎత్తిన జెండా విడవకుండా, పదవులను గడ్డి పోచల్లా విసురుతూ తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర నినాదం ఇంకా బలంగానే ఉందని అనేకసార్లు నిరూపించి త్యాగాలకు తొవ్వచూపిన తీరు చరిత్ర పుటల్లో పదిలమన్నారు.
ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఉడుగుల ప్రవీణ్ గౌడ్, మాజీ సర్పంచ్ కరివెదుల వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ దేవ్ సింగ్, గ్రామ పార్టీ అధ్యక్షులు మోతిలాల్, మంజిలాల్, నాయకులు సురేష్, సంపత్ రావు,పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version