కాంగ్రెస్ సర్కారు రాజకీయ వేధింపులకు బీఆర్ఎస్ నిరసన…

కాంగ్రెస్ సర్కారు రాజకీయ వేధింపులకు బీఆర్ఎస్ నిరసన

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నీరసిస్తూ
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కురాజకీయ కక్షతో సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ
బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఆందోళన చేపట్టాయి. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశంతో మండల అధ్యక్షుడు మోతె కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం చౌరస్తా వద్ద పెద్దెత్తున ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో సుమారు గంటకు పైగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భూపాలపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొలసాని లక్ష్మీ నరసింహరావు, మండల అధ్యక్షుడు మోతె కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అక్రమ కేసులు, సిట్ నోటీసులతో వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిపై ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలు సిగ్గుచేటని, ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్య అని విమర్శించారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయిన రేవంత్ సర్కార్ ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటి డ్రామాలకు తెరలేపుతోందని అన్నారు. ఇలాంటి చర్యలకు ప్రజలు తగిన సమయంలో చెబుతారని హెచ్చరించారు. కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని, అవసరమైతే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ సర్పంచులు ఉడుత సాంబయ్య తోట రాకేష్ కొడారి హైమ ధనంజయ్ గ్రామ కమిటీ అధ్యక్షులు హఫీజ్ వెంకటేష్ కృష్ణ రాజ్ కుమార్ గాద శేఖర్ రాం నరసింహారావు మాజీ ఎంపీటీసీ మంద అశోక్ రెడ్డి నాయకులు భైరగాని కుమారస్వామి డాక్టర్ జానయ్య మార్త శీను పేరాల దేవేందర్రావు పెంచాల రవీందర్ పల్లె వేణి సదయ్య గాజర్ల చింటూ వీసం భరత్ రెడ్డి బొట్ల స్వామి పాపిరెడ్డి మన్తుర్తి భద్రయ్య కొడారి ఓదెలు పేరాల భాస్కరరావు ఆకుల తిరుపతి నల్లబెల్లి సంపత్ రావు తిప్పని విష్ణు పబ్బ రవి మామిండ్లసాంబయ్య జయపాల్ కొత్తపల్లి కుమార్ జంజర్ల రాకేష్ రామకృష్ణ వాజిద్ అభి సాయిరాం తదితరులు పాల్గొన్నారు..

కేసీఆర్ పై సిట్ నోటీసులు: పెద్ది సుదర్శన్ తీవ్ర ఖండన

తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కు సిట్ నోటీసులా?

ప్రతీకార పాలన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

నిప్పులాంటి కేసీఆర్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి.. ఖబర్దార్!

రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని బిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత,
రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కేసీఆర్
తెలంగాణ తెచ్చినందుకే నోటీసులా?.
తెలంగాణను ప్రగతి పథంలో నడిపించినందుకే నోటీసులా?..
రైతుబంధు ఇచ్చినందుకే నోటీసులా?
రైతన్న వ్యవసాయాన్ని పండుగలా మార్చినందుకు కేసీఆర్ కు నోటీసులా?..అని ప్రశ్నించారు.బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సిఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం పట్ల నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వెంటనే స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమం చేసిన నాయకుడిపై ప్రతీకార రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని పేర్కొన్నారు.రైతులకు భరోసా ఇచ్చిన నాయకుడిపై కుట్రలు పన్నడం రైతుల హృదయాలను అవమానించడమే అని అన్నారు. బిఆర్ఎస్ పాలనలో పదేండ్ల అద్భుత ప్రగతి తొలి సీఎం కేసీఆర్ విజన్‌కు సాక్ష్యం..ఆయన పాలనలో రాష్ట్రం అనేక రంగాల్లో చారిత్రాత్మక అభివృద్ధి సాధించిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో రైతుకు గౌరవం తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం,సాగునీటి ప్రాజెక్టులు, కాళేశ్వరం, మిషన్ కాకతీయ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిన దూరదృష్టి.. కేసీఆర్ ది అని పేర్కొన్నారు.మౌలిక వసతులు అభివృద్ధిలో భాగంగా..
సాగునీరు, త్రాగునీరు,విద్యుత్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు చేసిండు కేసీఆర్..
గ్రామీణాభివృద్ధి, పట్టణ విస్తరణ, రహదారుల అభివృద్ధి చేసి,
పరిశ్రమలు, ఐటీ, పెట్టుబడులతో రాష్ట్ర ఆర్థిక బలం పెంపు చేసిండు… కేసీఆర్…దళిత బంధు, ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ వంటి పథకాలతో దేశానికి ఆదర్శవంతమైన సామాజిక సంక్షేమం అమలు చేసినందుకా కేసీఆర్ కు నోటీసులా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగారు.పేదల సంక్షేమానికి అంకితమైన పాలన చేసి..విద్య, వైద్య రంగాల్లో మౌలిక మార్పులు చేసి
తెలంగాణ ఆత్మగౌరవం పెంచి ప్రపంచానికి చాటిన మాజీ సిఎం కేసీఆర్..సంస్కృతి, సంప్రదాయాలకు గౌరవం పెంచి,ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంచిన కేసీఆర్ పై ప్రజాపాలన పేరుతో రేవంత్ రెడ్డి ప్రతీకార పాలన చేస్తున్నాడని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం..
రోజుకో డ్రామా, రోజుకో డైవర్షన్ రాజకీయాలతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఎద్దేవా చేశారు.
నిప్పు లాంటి కేసీఆర్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి ఖబర్దార్! అని హెచ్చరించారు.రేవంత్ రెడ్డి పాలనలో సింగరేణి టెండర్లలో అవకతవకలు, సృజన్ రెడ్డి వ్యవహారం పై సిట్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.కేసీఆర్ పై చేస్తున్న కుట్రలు — ప్రజల మద్దతుతో విఫలం అవుతాయి..నాలుగు కోట్ల తెలంగాణ సమాజంలో 60 లక్షలమంది బి ఆర్ ఎస్ సైన్యం నీ కుట్రలను తిప్పికొడతారని పేర్కొన్నారు.కేసీఆర్ పై రాజకీయ కక్షతో చేస్తున్న ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version