కేసీఆర్ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండం: నాజియా అంజుమ్

కేసీఆర్ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండం: నాజియా అంజుమ్ షేక్ సోహెల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఉద్యమ నేత కేసీఆర్ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని బిఆర్ఎస్ పార్టీ ఝరాసంగం మండల తుమ్మనపల్లి గ్రామ నూతన సర్పంచ్ నాజియా అంజుమ్ షేక్ సోహెల్
హెచ్చరించారు. గాంధీ వారసులమని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతుందని, సీఎం రేవంత్ రెడ్డి పాలన అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికి వదిలేసి కేసీఆర్ను మానసికంగా వేధించే కుట్రలో భాగమే ఈ నోటీసులు అని, తాటాకు చప్పుళ్లకు కేసీఆర్ బెదరరని అన్నారు.

ఉపాధి హామీ పనులను ప్రారంభించిన నూతన సర్పంచ్…

ఉపాధి హామీ పనులను ప్రారంభించిన నూతన సర్పంచ్…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం తుమ్మనపల్లి గ్రామంలో సోమవారము ఉపాధి హామీ పనులను గ్రామ సర్పంచ్ నాజియా అంజుమ్ షేక్ సోహెల్, ఉప సర్పంచ్ వార్డు మెంబర్స్ ఆధ్వర్యంలో పనులను ప్రారంభించారు. ఉపాధి హామీ పనులను గ్రామ కూలీలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఉపాధి హామీ కూలీలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ ఈజీఎస్ పనులకు గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్లను సంప్రదించి పేరు నమోదు చేసుకొని పనులకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో
పార్టీ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి ఎక్స్ ఎంపీటీసీ నవాజ్ రెడ్డి సుభాష్ రెడ్డి సుభాష్ రెడ్డి వార్డ్ మెంబర్ ఆశప్ప ఒలి పాషా ఖాజా మియా నూతన జిపి పాలకవర్గం ప్రతినిధులతో పాటు గ్రామ కూలీలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version