కుళ్ళిన ఆహారం ఘటనపై ప్రభుత్వ హాస్టల్ వార్డెన్‌పై చర్యలు కోరిన బిఆర్ఎస్

ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

హాస్టల్ లో విద్యార్థునిలు కుళ్ళిన ఆహారం తినడం వల్ల

అస్వస్థతకు గురైన విద్యార్థినులను పరామర్శించిన
బీ ఆర్ ఎస్ నేతలు బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిం చాలి

వనపర్తి నేటిధాత్రి .

వనపర్తి జిల్లా
కొత్తకోట మండల కేంద్రంలో ప్రభుత్వ సాంఘీక సంక్షేమ హాస్టల్ నందు కుళ్ళిన కూరగాయల తో వంటలు వండడము వల్ల కురాగాయలు విద్యార్థులకు పెట్టడము వల్ల ఆహారం విద్యార్థినులకు ఫుడ్ ఫాయిజిన్ అయిందని రాష్ట్ర బి.ఆర్.ఎస్ నాయకులు అభిలాష్ రావు జిల్లా బీ ఆర్ ఎస్ అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ గట్టు యదవ్ విలేకరుల కు తెలిపారు ప్రభుత్వ హాస్టల్
బాలికలు పప్పులో వాసన వస్తుంది అని వార్డెన్ కు తెలిపిన హాస్టల్ వార్డన్ నిర్లక్ష్యం గా సమాదానం చెప్పారని వారు పేర్కొన్నారు అధికారుల పై చర్యలు తీసుకోవాలని అభిలాష్ రావ్ గట్టు యాదవ్ రాష్ట్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు
కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా బడుగు బలహీన హాస్టల్స్ పట్ల నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నదని వారు ఆరోపించారు మాజీ ముఖ్యమంత్రి .కె.సి.ఆర్ సాంఘిక రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్స్ తోపాటు 1100వందల గురుకుల పాఠశాలలు స్థాపిం చారని హరిజన,గిరిజన,బడుగు,బలహీన ,మైనార్టీ వర్గాలవిద్యార్థులకు నాణ్యమైన భోజనం, బువ్వ అందించారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురుకులాలను,సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ను పట్టించుకోవడము లేదని వారు విమర్శించారు
ప్రభుత్వ హోసిల్ బాలికలను మాజి మున్సిపల్ వైస్ ఛైర్మన్ వాకిటి.శ్రీధర్ వనపర్తి జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ వామన గౌడ్,మాజీ జెడ్.పి.టి.సి విశ్వేశ్వర్,జిల్లా బి.ఆర్.ఎస్ నాయకులు ప్రశాంత్,జిల్లా బి.ఆర్.ఎస్.వి కోఆర్డినేటర్ హేమంత్ ముదిరాజ్ తదితరులు ఉన్నారని జిల్లా మీడియా కన్వీనర్ నంది మల్ల అశోక్ తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version