భూపాలపల్లిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-28T111949.266.wav?_=1

భూపాలపల్లిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్

భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రజలు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి

వంతెనల పై నుండి ప్రజలు వాహనదారులు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి

అత్యవసర పరిస్థితిలో ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయగలరు 9030632608

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉధృతంగా పొంగిపొర్లుతున్నాయి. రహదారులపై నీరు చేరిన చోట్ల, కాజ్‌వేల వద్ద ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు, వాహనదారులు వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ మాట్లాడుతూ మొరంచపల్లి వాగు ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ప్రవహిస్తోందని, ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా చేపట్టాలని స్పష్టం చేశారు. రహదారులపై నీరు ప్రవహిస్తున్న మార్గాల్లో ప్రయాణాలు జరగకుండా తగిన నియంత్రణ చర్యలలో భాగంగా ట్రాక్టర్లు లేదా ఇతర వాహనాలను అడ్డు పెట్టాలని ఆదేశించారు.

ప్రజలు, వాహనదారులు ప్రభుత్వం అధికార యంత్రాంగం ఇచ్చే సలహాలు, సూచనలు కచ్చితంగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 9030632608 కంట్రోల్ రూముకు కాల్ చేయాలని సూచించారు. జాలర్లు చేపల వేటకు వెళ్లకుండా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు. అలాగే వర్షాల కారణంగా పశువులు ప్రమాదానికి గురికాకుండా చూడాలని, వాటిని మేత కోసం బయటకు వదలకుండా యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కలెక్టర్ రాహుల్ శర్మ ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణ నష్టానికి దారితీయొచ్చనని హెచ్చరించారు. గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. వరద ప్రవాహాన్ని తాసిల్దార్ శ్రీనివాస్ ఆర్ ఐ భాస్కర్ కలిసి పరిశీలించారు

ప్రజా సమస్యలపై పోరాడుదాం…

ప్రజా సమస్యలపై పోరాడుదాం…

బి జె పి జిల్లా ప్రధాన కార్యదర్శి,మాజీ ఎంపిటిసి మదన్ నాయక్

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మండలంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు ఉప్పు నూతల రమేష్, అధ్యక్షతన లక్ష్మి సాయి గార్డెన్స్ లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి బీజేపీ మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి,మాజీ ఎంపీటీసీ మదన్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ, నీళ్లు నిధులు నియామకాల పేరిట ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని గత పది సంవత్సరాలు ( బి.ఆర్.ఎస్ ) పార్టీ నాయకులు రాబందుల్లా దోసుకుంటే దాదాపు 18 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న దున్నపోతు మీద వర్షం పడినట్టు వ్యవహరిస్తుందని అన్నారు. ప్రజా సమస్యల మీద బిజెపి రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేపట్టి, కెసిఆర్ ను గద్దె దించడంలో ప్రధాన పాత్ర పోషించిందని గుర్తు చేసారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కేసముద్రం మండలంలో ఉన్నటువంటి గ్రామాలు ఎటువంటి అభివృద్ధి చెందలేదని,  రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అన్ని స్తానిక సంస్థలకు సరైన సమయంలో ఎన్నికలు నిర్వహించక పొవట వలన గ్రామా పంచాయతిలకు  రావలిసిన  కోట్లాది రూపాయల కేంద్ర నిధులు మురిగి పోయి గ్రామిణా అభివృద్ది కుంటుపడుతున్నది,
గ్రామపంచయతిల లో పంచాయతి అధికరులకు   పరిపాలన భారంవుతన్నది. కావున వెంటనే అన్ని స్తానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసారు.ప్రజా సమస్యల పరిష్కారానికి బిజెపి కార్యకర్తలు పోరాడాలని అన్నారు.

ఈ కార్యక్రమం అనంతరం కేసముద్రం తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలిగా వెళ్లి కేసముద్రం మండలం లోని వివిధ గ్రామల ప్రజలు ఎదుర్కుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందజేసారు.
ఈ సందర్భముగ బిజెపి మండల అద్యక్షుడు ఉప్పునూతల రమేష్ మాట్లాడుతూ గత వారం పది రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా మండలంలోని ఉప్పరపల్లి , ఇంటికన్నె , వేంకటగిరి, కాట్రపల్లె, అర్పనపల్లె, మహమూద్పట్నం, తాళ్ళపుసపల్లి, నారయణపురం,అన్నారం, గాంధీ నగరం, సప్పిడిగుట్ట తండ, కోరుకొండపల్లె , మేగ్య తండ,అనేక తండా గ్రామాల్లో పారిశుధ్య సమస్యలు, రోడ్లపై నీళ్లు నిలవడం, బురద ఏర్పడటం, సీజనల్ వ్యాధుల వ్యాప్తి, డ్రైనేజీ వ్యవస్థలు మూసుకుపోవడం, మురుగునీటి నిల్వతో సీజనల్‌ వ్యాధులు ప్రబలి  గ్రామాల్లో ప్రజలు  తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని,కేసముద్రం మండలం లోని అన్ని గ్రామాలలో  పారిశుద్ధ్యం, నీటి సరఫరా  సరైన  రోడ్డు, రవాణ, విద్యుత్ , మంచినీరు వంటి సౌకర్యాలు కల్పించాలని. భారీ వర్షాల కారణంగా ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా గ్రామాలలో పేరుకు పోయిన మురుగు  నీరును తొలగించి , బ్లీచింగ్ పౌడరు చల్లి మరియు అంటువ్యాధులు ప్రబలకుండా నివారించాలని ,మురుగు నీటి కాలువలను శుభ్రపరచాలని, పైప్‌లైన్ వ్యవస్థలను మెరుగుపరచి, గ్రామాలలో  పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని.  కేసముద్రం మండలం లోని గ్రామాలలో అంటు వ్యాధుల నివారణ కు  మండల వైద్య శాఖా  అధికారులచే తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు .
 కల్వల  గ్రామంలో మురుగు నీరు బయటకు  పోయే కనీస వసతులు లేక పోవడంతో గ్రామస్థులు, ప్రజలు  ఇబ్బందులకు గురవుతున్నారని. మెయిన్ రోడ్డు మరియు  కాలనీల్లో  డ్రైనేజీ లేకకపోవడంతో రోడ్లపైనే మురుగు నీరు, వరద నిరు  ప్రవహిస్తోంది. దీంతో ఈగలు, దోమలు ఇళ్లలోకి వస్తుండడంతో  అనారోగ్యానికి గురవుతున్నారని. గతంలో సెల్యులైటిస్, బోదకాలు , డెంగ్యూ జ్వరాలతో కల్వల గ్రామంలో బాధపడ్డారని.కావున ఆ గ్రామంలో మెయిన్ రోడ్డు మరియు  కాలనీల్లో  డ్రైనేజీ నిర్మించి ప్రజల  ఆరోగ్యాన్ని కాపాడాల డిమాండ్ చేసారు.

 

  దీనికి తోడు ఇప్పుడు ఈ గ్రామంలో మనుషుల జనాభా కంటే కోతుల, కుక్కల  సంఖ్యనే ఎక్కువగా‌ ఉందని. భయటికి వెళ్ళాలంటేనే జనం భయపడుతున్నారని , గ్రామాల్లో ప్రజల పై కోతులు, కుక్కల  దాడులు పెరిగి అనేక మంది ప్రజలు  తీవ్ర గాయాల పాలైన సంఘటనలు జరిగాయని,అంతే కాకుండా  ఇక్కడ ప్రజలు ఆరుతడి పంటలు సాగు చేయడం వదిలిపెట్టారని. ఇప్పటికే ఇంటి పై కప్పులను ద్వసం చేస్తున్నాయని . గతంలో‌ మనుషులని చూస్తే కోతులు భయపడి పరుగులు తీసేవి. కాని ఇప్పుడు కోతులను, కుక్కలను  చూసి మనుషులు భయపడే పరిస్థితి నెలకొంటుందని కావున కేసముద్రం మండలం లోని అన్ని  గ్రామాలలో ఉన్న కోతుల, కుక్కల బెడద నుండి ప్రజలను కాపాడాటానికి తగు చర్యలు తీసుకోవాలని బిజేపి మండల శాఖ తరుపున డిమాండ్ చేసారు .
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నరసింహ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శిలు బోగోజు నాగేశ్వర చారి,ఉపేందర్ , మండల ఉపాద్యక్షులు కొండపల్లి మహేందర్ రెడ్డి ,నాగరాబోయిన చంద్రకళ, కార్యదర్శి జాటోత్ నరేష్ ,మాల్యాల రాములు, పూర్ణకంటి భాస్కర్ , బండి వెంకన్న ,శ్రీను ,రమేష్ నాయక్ ,సురేష్ నాయక్ ,మంగా వెంకన్న, భుక్య విజయ్ , జంగిటి అనిల్ ,సింగంశెట్టి మధుకర్ , పరకాల మురళీ మైనారిటీ మోర్చా నాయకుడు ఖాసిం తదితరులు పాల్గొన్నారు.

“జగిత్యాల జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అప్రమత్తం సూచనలు”…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T155921.826-1.wav?_=2

 

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మరి కొన్ని రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు లోతట్టు ప్రాంత నివాసితులు జాగ్రత్తలు తీసుకోవాలి-గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అత్యవసర సమయంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి- బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
మెట్పల్లి ఆగస్టు 18 నేటి ధాత్రి

 

 

జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగడానికి వీలు లేకుండా అవసరమైన సహాయక చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కోరారు. మరి కొన్ని రోజులపాటు భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం పార్టీ కార్యాలయంలో పత్రిక ప్రకటనను విడుదల చేశారు.
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండలాలు, గ్రామాలు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో, వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూసుకోవాలని కోరారు. ప్రజలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని తెలిపారు. గ్రామాల్లో ఉదృతంగా ప్రవహించే వాగులు, నీటి వనరుల సమాచారం తెలుసుకొని, వాటికి సమీపంలో ఉన్న రోడ్లు వంతెనలపై రాకపోకలను నిలిపివేయాలని, దీని కోసం స్థానిక అన్ని శాఖల అధికారుల సహకారం తీసుకోవాలని పేర్కొన్నారు.
అదే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా ఆస్పత్రి వరకు వైద్యులు సిబ్బంది సకాలంలో విధులకు హాజరయ్యేలా చూడాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలను అందుబాటులో ఉంచాలని కోరారు. భారీ వరదల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులు దెబ్బతినకుండా జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. భారీ వర్షాలు వచ్చిన తర్వాత పారిశుధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.
కాగా రెవెన్యూ, పోలీస్ శాఖ, నీటిపారుదల శాఖ, మున్సిపల్ శాఖ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఒకవేళ ఒకేసారి కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం ఉందని, తక్కువ సమయంలో ఎక్కువ వరద రానున్న నేపథ్యంలో అలాంటి ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యంత్రాంగం సిద్ధం కావాలని సూచించారు.
అంతే కాకుండా భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రజలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్పితే బయటకు వెళ్ళకూడదని కోరారు. వరద ప్రవాహం ఉన్న వంతెనలు, కల్వర్ట్, రహదారులపై నుండి ప్రజలు దాటవద్దని, శిధిల వ్యవస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండద్దని, తడిగా ఉన్న కరెంట్ పోల్స్, ట్రాన్సఫర్స్ తాకవద్దని, శివారు ప్రాంతాల్లో చేపల వేటకు ఎవరు వెళ్ళొద్దని సూచించారు. రైతులు కరెంటు బావుల దగ్గరికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, వరద నీరు వెళ్లే నాలాలు, మ్యాన్ హోల్స్ సమీపంలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడే ప్రమాదాలు ఉంటాయని, కావున ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
వర్షాలు, వరదల వల్ల సహాయక చర్యలు చేపట్టేందుకు స్థానిక అధికారులు సిద్ధంగా ఉన్నారని, కానీ అన్నిటి కన్నా ముఖ్యంగా ఎవరికివారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అత్యవసరమైతే, ఏదైనా సంఘటన జరిగితే స్థానిక అధికారులకు సమాచారం అందించి సహాయక చర్యలు పొందాలని కోరారు.
అదే విధంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న భారీ వరద నీటి కారణంగా ప్రాజెక్టు నిండి వరద గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి వదిలి పెట్టారని జిల్లాలో గోదావరి నది పరిసర ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే పశువుల కాపర్లు, గొర్ల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు, సామాన్య ప్రజలు గోదావరి నదిని దాటే ప్రయత్నాలు చేయవద్దని కోరారు.

భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులు వంకలు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-29-5.wav?_=3

భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులు వంకలు.

పరవళ్ళు తొక్కుతున్న పాకాల సరస్సు,మాదన్నపేట చెరువు మత్తడి నీరు..

అశోక్ నగర్ వద్ద ఉగ్రరూపం దాల్చిన పాకాల వరదనీరు..

వట్టేవాగు వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న మాదన్నపేట చెరువు అలుగు వరద*

కాకతీయ నగర్ కాలనీ వాసుల్లో మొదలైన ఆందోళన.

నర్సంపేట నుండి మాదన్నపేట,,నర్సంపేట నుండి పాకాల కొత్తగూడ రాకపోకలు బంద్.

ప్రమాదాలు జరుగకుండా పోలీస్ శాఖ అధికారులు బందోబస్తు..రెవెన్యూ మున్సిపల్ ,పంచాయితీ రాజ్ అధికారుల చర్యలు.

వరి పంటను దెబ్బతీస్తున్న భారీ వర్షాలు..

17,18 తేదీల్లో కురిసే భారీ వర్షాలతో రైతుల్లో అలజడి.

నర్సంపేట,నేటిధాత్రి:

గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నర్సంపేట డివిజన్ పరిధిలోని సరస్సు,చెరువులు,కుంటులు మత్తల్లు పోస్తున్నాయి.ఆసియా ఖండంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు పాకాల గత రెండు రోజులుగా అలుగుపోస్తున్న ది.సరస్సులో 31 ఫీట్ల పైబడి వరదనీరు చేరడంతో ఓక ఫీట్ ఎత్తుగా మత్తడి పరవళ్ళు తొక్కుతున్నది.నర్సంపేట మాదన్నపేట చెరువు గత ఐదు రోజులుగా మత్తడి పోస్తూ నేడు వరద ఉదృతం పెరుగుతున్నది.శుక్రవారం అర్థరాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి డివిజన్ పరిధిలోని చెరువులు,కుంటలు,వాగులు,వంకలు వరద నీటితో పారుతున్నాయి.నర్సంపేట నుండి పాకాల మీదుగా కొత్తగూడ వెళ్లే ప్రధాన రహదారిపై అశోక్ నగర్ వద్ద ఉన్న పాకాల నీటి ప్రవాహం తీవ్రస్థాయిలో పరవళ్ళు తొక్కుతుంది.

అటువైపు రాకపోకలు పూర్తిస్థాయిలో బంద్ అయ్యాయి.వాగువద్ద ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా ఖానాపూర్ పోలీస్ అధికారులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.మాదన్నపేట రోడ్డు వాగు వద్ద వరద నీటి ప్రవాహం ఉదృతం కావడంతో మున్సిపల్,పోలీస్ ,రెవెన్యూ శాఖల అధికారులు బందోబస్తు చర్యలు చేపట్టారు.మాదన్నపేట చెరువు ఉగ్రరూపం దాల్చి మత్తడి పడితే చాలు..నర్సంపేట పట్టణంలో ఎన్టీఆర్ నగర్ కాలని వాసుల్లో గుబులు పుట్టిస్తోంది.నర్సంపేట నుండి నేక్కొండ వైపు ముగ్దుంపురం కాజ్ వే వద్ద వరద భీభత్సం పెరుగడంతో అటువైపు వెళ్లే వాహనాలను చెన్నారావుపేట పోలీసులు,అధికారులు ఎక్కడికక్కడ నిలిపివేశారు.నల్లబెల్లి మండలం నుండి నందిగామ వైపు వెళ్లే ప్రధాన రహదారి లెంకాలపల్లి నందిగామ గ్రామాల మధ్య ఉన్న లో లెవర్ కాజ్ వే పై వరద నీటితో భయంకరంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ప్రమాదాలు జరుగకుండా నల్లబెల్లి ఎస్సై,రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో తగిన చర్యలు చేపట్టారు.దుగ్గొండి,నల్లబెల్లి,నర్సంపేట,ఖానాపూర్,చెన్నారావుపేట, నెక్కొండ మండలాల పరిధిలోని చెరువులు,కుంటలు నిండి మత్తళ్ళు పోస్తున్నాయి.దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.కొన్ని చోట్ల వాగుల వద్ద చేపలవేట చేస్తున్నారు.అనుకోకుండా ప్రమాదాలు
జరగవచ్చని అధికారులు హెచ్చరించినప్పటికి అవేవీ పట్టించుకోవడం లేదు.

Ashok Nagar

17,18 తేదీల్లో కురిసే భారీ వర్షాలతో రైతుల్లో అలజడి.

గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు డివిజన్ వ్యాప్తంగా చెరువులు,కుంటలు నిండు కుంటల్లా మారి శుక్రవారం అర్థరాత్రి కురిసిన భారీ వానకు అతలాకుతలం అయ్యింది.17,18 తేదీల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రకటించారు.ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.దీంతో ఇప్పటికే చెరువులు,కుంటలు వాగులు నిండి భారీ ఎత్తున వరద భీభత్సం సృష్టించింది.ఐతే 17,18 తేదీల్లో అతి భారీ వర్షాలు కురిస్తే పంటల పరిస్థితి ఎలా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.

వరి పంటను దెబ్బతీస్తున్న భారీ వర్షాలు..

*ఋతుపవనాలు ముందుగానే వచ్చినట్లు వచ్చి వెనక్కివెళ్లడంతో సుమారు 20 నుండి నెల రోజుల ఆలస్యంగా రైతులు వరినాట్లు సాగుచేసుకున్నారు.వరినాట్లు జోరందుకుంటున్న నేపథ్యంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు,కుంటలు నిండడం వరదలకు వరినాట్లు నీట మునుగడం,కొట్టుకుపోయే పరిస్థితులు నెలకొన్నాయి.మరిన్ని రోజులు వర్షాలు కురిస్తే పంటలకు నష్టాలు వాటిల్లే అవకాశం ఉన్నాయని పలువురు రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

నీటి ప్రవాహం వద్ద పోలీస్ అధికారుల సేవలు భేష్..

*నర్సంపేట డివిజన్ పరిధిలోని కురుస్తున్న భారీ వర్షాలకు ప్రవహిస్తున్న వరద నీటి వద్ద ప్రమాదాలు జరుగకుండా రేయింబవళ్లు పహారా కాస్తున్న పోలీస్ అధికారుల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈలాంటి సేవలు అందించడంలో నర్సంపేట డివిజన్ పోలీసులు ముందుంటారని ప్రజలు పేర్కొన్నారు.

భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-24-4.wav?_=4

భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
టిపిసిసి డెలిగేడ్ కల్వకుంట్ల సుజిత్ రావు

మెట్ పల్లి ఆగస్టు 16 నేటి ధాత్రి
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రాకూడదని ప్రమాదాలకు గురి కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని టీపీసీసీ డెలిగేట్ మెంబర్ కల్వకుంట్ల సుజీత్ రావు కోరారు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు పలు సూచనలు చేశారు. 2రోజులపాటు భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారని, అందువల్ల ప్రజలు భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రజలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని,పట్టణంతో పాటు పలు మండలాలు, గ్రామాల ప్రజలు వరద ప్రవాహం ఉన్న వంతెనలు, కల్వర్ట్, రహదారులపై నుండి దాటవద్దని, శిధిల వ్యవస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండవద్దని, తడిగా ఉన్న కరెంట్ పోల్స్, ట్రాన్సఫర్స్ తాకవద్దని, శివారు ప్రాంతాల్లో చేపల వేటకు ఎవరు వెళ్ళొద్దని సూచించారు. అదే విధంగా రైతులు కరెంటు బావుల దగ్గరికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, వరద నీరు వెళ్లే నాలాలు, మ్యాన్ హోల్స్ సమీపంలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడే ప్రమాదాలు గతంలో చూశామని, కావున ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. వర్షాలు, వరదల వల్ల సహాయక చర్యలు చేపట్టేందుకు స్థానిక అధికారులు సిద్ధంగా ఉన్నారని, కానీ అన్నిటి కన్నా ముఖ్యంగా ఎవరికివారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అత్యవసరమైతే, ఏదైనా సంఘటన జరిగితే స్థానిక అధికారులకు సమాచారం అందించి సహాయక చర్యలు పొందాలని కోరారు ప్రభుత్వం సంబంధిత కార్యాలయాలలో అధికారులను అప్రమత్తం చేసిందని ఏదైనా అత్యవసరం అయితే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

అర్ధరాత్రి కుండపోత వర్షం.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-23-3.wav?_=5

అర్ధరాత్రి కుండపోత వర్షం.

#లో లెవెల్ బ్రిడ్జిలపై పొంగిపొర్లుతున్న వరద నీరు.

#కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు.

#మత్తడి దూకుతున్న పలు చెరువులు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

మండలంలో శుక్రవారం అర్ధరాత్రి కురిసిన కుండపోత వర్షానికి మండలంలోని చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో లో లెవెల్ బ్రిడ్జిలపై ప్రమాదకరంగా ఉధృతంగా నీరు ప్రవహిస్తుండడంతో లెంకలపల్లి, నందిగామ గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ఈ మేరకు తహసిల్దార్ ముప్పు కృష్ణ, ఎస్సై వి గోవర్ధన్ అప్రమతమై తమ సిబ్బందిని వెంట తీసుకొని ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుల వద్ద భారీ కేడ్లతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ప్రజలను అప్రమత్తం చేశారు. భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని మండల ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని వారు ప్రజలకు సూచన చేశారు. అలాగే పలు గ్రామాలలో చెరువులు నిండుకుండల మారి మత్తడి దూకుతున్నాయి. మండల కేంద్ర సమీపాన ఉన్న వెంకటపాలెం చెరువు భారీ ఎత్తున మత్తడి పోయడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించేందుకు వెళ్ళగా మరికొందరు వలలతో చేపల వేట చేశారు.

Flood water overflowing

అదేవిధంగా మండలంలోని అతిపెద్ద చెరువు అయినా రంగయ్య చెరువు పూర్తిగా నిండి మత్తడి పోసేందుకు సిద్ధంగా ఉందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. మరో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కావున రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని. శిధిలవస్థలో ఉన్న ఇండ్లలో ఉండరాదని, విద్యుత్ స్తంభాల వద్ద జాగ్రత్తగా ఉండాలని, పంట పొలాలకు ఎలాంటి ఎరువులు రైతులు వేయరాదని తాసిల్దార్ ముప్పు కృష్ణ మండల ప్రజలను కోరారు. వీరివెంట ఎంపీడీవో పసర గొండ రవి, పంచాయతీ కార్యదర్శులు, రెవిన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version