*విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి*
*గుండాల,నేటిధాత్రి:*
బుధవారం మండలంలోని వేపలగడ్డ డబల్ బెడ్ రూమ్ గ్రామంలో విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు
చేసుకుంది. గుండాల ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం నాగారం గ్రామానికి చెందిన ఈసం అనిల్ (27) గుండాల మండలం సబ్ స్టేషన్ పరిధిలో ప్రవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్న అనిల్ విద్యుత్ సరఫరా లేకుండా స్తంభం ఎక్కుతుండగా విద్యుత్ తగిలి అక్కడికక్కడే మృతి చెందిన ఘటనపై గుండాల ఎస్సై సైదా రాహుప్ కేసు పైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
