వ్యవసాయ బావిలో కాలుజారి పడి వ్యక్తి మృతి

వ్యవసాయ బావిలో కాలుజారి పడి వ్యక్తి మృతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

మొగుడంపల్లి మండలం చిరాగ్పల్లి గ్రామానికి చెందిన రఘు (42) వ్యవసాయ బావిలో కాలుజారి పడి మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే జహీరాబాద్ అగ్నిమాపక కేంద్రం సిబ్బంది, SDRF బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశాయి. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జహీరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.

పార్దివాదేహానికి ఘన నివాళి అర్పించిన భీంభరత్

పార్దివాదేహానికి ఘన నివాళి అర్పించిన భీంభరత్

* మహేష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన
కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల అసెంబ్లీ ఇంచార్జ్ భీం భరత్

చేవెళ్ల, నేటిధాత్రి :

 

మొయినాబాద్ మండలం మోతుకు పల్లీ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎరుకల మహేష్ తీవ్ర అనారోగ్యంతో మంగళవారం తుదిశ్వాస విడిచారు. మహేష్ మృతి చెందిన విషయం తెలిసి కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల అసెంబ్లీ ఇంచార్జ్ పామేనా భీం భరత్, మహేష్ పార్టివదేహా నికి పూలమాల వేసి ఘననివాళులు అర్పించారు. అంతరం మహేష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపీ ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఆయనవెంట జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి దయానంద్ గౌడ్ , మురళి, పిరంగి భాస్కర్, గుడ్ల యాదయ్యా , బోద ప్రలద్ , బలరాజ్ , సునీల్ , సుబ్బారావు , పట్వారీ , దేవరాజ్ , మారాలి , చెంద్రయ్య ,రమేష్ , రాములు ,నరేష్ , శేఖర్ శంకరయ్య తదితరులు ఉన్నారు.

స్వర్గీయ చిట్టాల శ్రీనివాస్ గారి 8వ వర్థంతి సందర్బంగా.

స్వర్గీయ చిట్టాల శ్రీనివాస్ గారి 8వ వర్థంతి సందర్బంగా అన్నదాన కార్యక్రమం.

దాతల కొరికపై
అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నిదాలకంటే-అన్నదానం గొప్పది.

బెల్లంపల్లి నేటిధాత్రి :

మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణం శనివారం రోజున కాంట చౌరస్తా బస్టాండ్ ప్రాంతంలో అమ్మ ఒడి ఎన్ జి ఒ అన్నదాత ప్రాజేక్ట్ టెక్నో డాన్స్ అకాడమీ ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమము విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
బెల్లంపల్లి పట్టణంలో అంబేద్కర్ నగర్ కు చెందిన కీర్తిశేషులు చిట్యాల శ్రీనివాస్ ఎనిమిదో వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బెల్లంపల్లి పట్టణంలో అన్నమో రామచంద్ర అని అలమటించే ఎందరో…ఆకలి తీరుస్తూ బెల్లంపల్లి పట్టణంలో 339వ వారాలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈరోజు స్వర్గీయ చిట్టాల శ్రీనివాస్ గారి 8వ వర్థంతి సందర్బంగా వారి కుటుంబ సభ్యుల పూర్తి సహకారంతో అన్నదాన కార్యక్రమము యాచకులకు, నిరుపేదలకు, దినసరి అడ్డ కూలీలకు,బాటసారులకు సుమారు 200 మందికి అన్నదానం చేయడం జరిగింది. అమ్మ ఒడి అన్నదాత ప్రాజేక్ట్ వ్యవస్థాపకులు అజ్మీరా మోహన్ మంచిర్యాల జిల్లా బ్రాంచ్ మేనేజర్, టెక్నో డాన్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ హనుమాండ్ల మధుకర్ మాట్లాడుతూ అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టులో భాగంగా 339వ వారల సందర్భంగా అన్నదాన కార్యక్రమం విజయవంతంగా సాగింది ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడం సంతోషాన్నిచ్చిందన్నారు. ఈ కార్యక్రమం లో దాతల కుటుంబ సభ్యులు బందు మిత్రులు చిట్యాల సాయి కృష్ణ, కోట శ్రీనివాస్ , మోహన్, బాబు, సాయి, అశ్విన్
అమ్మ ఒడి సభ్యులు హనుమాండ్ల సువర్ణ,గన్నెవరం తిరుమల చారి,MD యుసుఫ్,MD ముస్తాఫా,అబ్దుల్ రహీమ్
పాల్గొన్నారు.

మాజీ సర్పంచ్ భాస్కర్ నాయుడు మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన.

మాజీ సర్పంచ్ భాస్కర్ నాయుడు మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన

చిత్తూరు ఎంపి
దగ్గు మళ్ళ ప్రసాద రావు

చిత్తూరు(నేటి ధాత్రి) జూలై 15:

గంగాధర నెల్లూరు నియోజకవర్గంవెదురుకుప్పం మండలం, గొడుగు చింత గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, టిడిపి పార్టీ సీనియర్ నాయకులు భాస్కర్ నాయుడు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు అలాగే ఆయన కుటుంబ సభ్యులకు
ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారురాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ఢిల్లీ పర్యటన నేపథ్యంలో
దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు మాజీ సర్పంచ్ భాస్కర నాయుడు మరణం వార్తను,టీడీపీ శ్రేణుల ద్వారా తెలుసుకున్నారు.ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.
సౌమ్యలైన భాస్కర నాయుడు పార్టీ బలోపేతానికి అంకితభావంతో పని చేసారని గుర్తు చేసిన చిత్తూరు ఎంపీ భాస్కర నాయుడు లేని లోటు పార్టీకి తీర్చలేనిదన్నారు.
ఈ విషాద సమయంలో
ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం, శక్తిని ఇవ్వాలని, భాస్కర్ నాయుడు పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలియజేశారు,

టీవీ9 రిపోర్టర్ ప్రసాద్ హఠాన్మరణం బాధాకరం..

టీవీ9 రిపోర్టర్ ప్రసాద్ హఠాన్మరణం బాధాకరం

రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి)

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన టివి9 రిపోర్టర్‌‌ ప్రసాద్ ఆకస్మిక మరణం పట్ల రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంతాపం వ్యక్తం చేశారు… ప్రసాద్‌‌ మరణం జర్నలిస్టు లోకానికి తీరని లోటని, చిన్న వయస్సులో మరణించడం బాధాకరమన్నారు.వారు మీడియా రంగంలో పనిచేస్తూ జిల్లాలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి ప్రజా సమస్యలను మీడియాతో పరిష్కరిస్తూ తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని,
ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.
సిరిసిల్ల ఎమ్మెల్యే కెటీఆర్ కూడా టీవీ9 రిపోర్టర్ ప్రసాద్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని సంతాపం తెలియజేశారు. మరియు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ మిత్రులు కూడా సంతాపం తెలియజేయడం జరిగినది.

వివేకవర్ధినిలో మహనీయుల వర్ధంతి.

వివేకవర్ధినిలో మహనీయుల వర్ధంతి

కేసముద్రం/ నేటి ధాత్రి

మండల కేంద్రంలోని శ్రీ వివేకవర్ధిని హైస్కూల్ లో శుక్రవారం స్వామి వివేకానంద, దొడ్డి కొమురయ్య వర్ధంతిని నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిర్రా యాకాంతం గౌడ్ మహనీయుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం యాకాంతం గౌడ్ మాట్లాడుతూ భారతీయ ఆధ్యాత్మికత విశిష్టతను హిందూ ధర్మ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన దార్శనికుడు స్వామి వివేకానంద అన్నారు.
తెలంగాణ స్వయం పాలన ఆకాంక్షలకు ఊపిరి పోసిన సాయుధ పోరాట కాలపు తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని అన్నారు.
మహనీయుల జీవిత చరిత్రను తెలుసుకొని వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్క విద్యార్థి నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ గడ్డమీది నవీన్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కలెక్టరేట్ లో దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు..

కలెక్టరేట్ లో దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ లో శుక్రవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.అలాగే జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి,ఆర్.ఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిఆర్డీఓ కౌసల్యాదేవి,డిబిసిడిఓ పుష్పలత, అధికారులు,సంఘ నాయకులు, తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

మృత్యువుకే ఫ్లయింగ్‌ కిస్‌..

మృత్యువుకే ఫ్లయింగ్‌ కిస్‌..

 

ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం యావత్‌ ప్రపంచాన్ని విషాదంలోకి నెడితే… మృత్యుంజయుడిగా నిలిచిన ‘ఒకే ఒక్కడు’ విశ్వాస్‌ కుమార్‌ రమేష్‌ అందర్నీ ఆశ్చర్యపరిచారు.

విమానంలోని అందరూ మరణించి, ఇలా ఒకే ఒక్కడు బతకడం ఓ మిరాకిల్‌. ప్రపంచవ్యాప్తంగా ఇంతకుముందు కూడా కొన్ని విమాన ప్రమాదాలు జరిగాయి. వాటిలో అందరూ చనిపోయి విచిత్రంగా ఒక్కరే బయటపడ్డ సందర్భాలు లేకపోలేదు. అలాంటి కొందరు అదృష్టవంతుల ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే…

 

 

‘11ఎ’ కాపాడింది…

 

అహ్మదాబాద్‌లో ఇటీవల ప్రమాదానికి గురైన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంలో చిన్న దెబ్బలతో బయటపడ్డ విశ్వా్‌స్‌ కుమార్‌ రమేష్‌ సీట్‌ నెంబరు 11ఎ. అత్యవరసర ద్వారం పక్కనే ఈ సీట్‌ ఉంది. అమితాశ్చర్యం కలిగించేలా 27 ఏళ్ల క్రితం విమానంలో అదే సీట్లో కూర్చుని ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఓ వ్యక్తి. అతడే థాయిలాండ్‌కు చెందిన పాప్‌స్టార్‌ రువాంగ్‌సక్‌ లోయ్‌ఛుసక్‌.

 

1998లో థాయి ఎయిర్‌వేస్‌ విమానంలో ఆయన బ్యాంకాక్‌ నుంచి సూరత్తనికి వెళుతున్నాడు. విమానంలోని 101 మంది ప్రయాణికులు మరణించారు. కొందరు మాత్రమే బతికారు. వాళ్లలో రువాంగ్‌సక్‌ ఒకరు. ‘నేడు విశ్వాస్‌ సీట్‌ నెంబరు కూడా నాదే అని తెలిసి, ఒళ్లు గగుర్పాటుకు లోనయ్యింది. నాటి ప్రమాదం తరవాత పదేళ్ల వరకు నేను విమానం ఎక్కలేదు. ఇప్పటికీ నల్లమబ్బులు, భీకర వర్షం కురుస్తుంటే నాకు భయమేస్తుంది. ఆనాటి విమాన శబ్దాలు, అరుపులు ఇంకా గుర్తున్నాయ’ని చెబుతారు రువాంగ్‌సక్‌.

 

ప్రమాదం… టాటూగా…

‘ఆరోజు, ఆ విమానం, ఆ మంటల్ని మరచిపోయింది లేదు. రోజూ గుర్తుకు వస్తుంటాయి, అసలు నేనెందుకు బతికాను, మా అన్నయ్య బతికి ఉండవచ్చు కదా, మరెవరైనా బతకాల్సింది. నేనే ఎందుకు? ఈ అపరాధభావం జీవితాంతం నన్ను వెంటాడుతూనే ఉంటుంది’ అంటారు సెసిలియా. 1987లో అమెరికాకు చెందిన ‘నార్త్‌వెస్ట్‌’ ఎయిర్‌లైన్స్‌ విమాన ప్రమాదంలో 148 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో పాటు నేల మీద ఉన్న ఇద్దరు మరణించారు. ఆ ప్రమాదంలో ఆశ్చర్యంగా నాలుగేళ్ల సెసిలియా సిచెన్‌ మాత్రమే ప్రాణాలతో బయటపడింది.

 

ఆ ప్రమాదంలో పాప అమ్మానాన్న, ఆరేళ్ల అన్నయ్య కూడా మరణించారు. ఆరిజోనాలోని టెంపేకి చెందిన వీళ్లంతా టెక్సాస్‌కు వెళ్లి వస్తూ ప్రమాదానికి గురయ్యారు. ఆ చిరంజీవిని వెంటనే వాళ్ల ఆంటీ, అంకుల్‌ అలబామా తీసుకువెళ్లి, మీడియాకు చిక్కకుండా పెంచారు. అక్కడే ఆమె చదువూ, పెళ్లీ అయ్యాయి. 2013లో విమాన ప్రమాదం జరిగిన 26 ఏళ్ల తరవాత… ‘సోల్‌ సర్వైవర్‌’ అనే డాక్యుమెంటరీ కోసం సెసిలియా బయటికి వచ్చి, తన వేదనను తెలియజేశారు. ప్రమాదం జరిగిన రోజుకు గుర్తుగా ఎడమ చేతి మణికట్టు దగ్గర విమానం పచ్చబొట్టు వేయించుకున్నారామె. ‘నేను అక్కడి నుంచే వచ్చానన్నది ఈ టాటూ గుర్తుచేస్తుంటుంద’ని అంటారు సెసిలియా.

 

ఆకాశం నుంచి ఊడిపడ్డా…

 

పదిహేడేళ్ల యువతి, వాళ్ల అమ్మతో కలిసి నాన్న దగ్గరకి విమానంలో వెళుతోంది. కిటికీ పక్క సీటు ఆమెది. మేఘాలను చూస్తూ సాండ్విచ్‌ ఆరగిస్తోంది. ఒక్కసారిగా బయట చీకటి పరచుకుంది. పేద్ద ధ్వనితో ఉరుము విమాన రెక్కను తాకింది. అంతే విమానం ముక్కలైంది. ఈ అమ్మాయి సీట్‌తో పాటు 3 వేల మీటర్ల పై నుంచి కింద పడి, స్పృహ కోల్పోయింది. మెలకువ వచ్చాక చూస్తే మెడ ఎముక విరిగి పోయింది. దట్టమైన అమెజాన్‌ అడవుల్లో చిక్కినట్టుగా అర్థం చేసుకుంది. ఎలాగోలా సత్తువ తెచ్చుకుని, తిండీ తిప్పలూ లేకుండా, దారీ తెన్నూ తెలీయకుండా 11 రోజులు ఆ అడవిలో నడుస్తూ ఆఖరికి కొందరు మత్స్యకారుల్ని చూడగలిగింది.

 

ఆమే జులియేన్‌ కోయెప్కా. 1971 డిసెంబరులో పెరూలోని లీమా నుంచి పుకాల్పాకు వెళుతోన్న వాళ్ల విమానం కూలిపోయింది. అందులోని 92 మందిలో జులియేన్‌ ఒక్కతే ప్రాణాలతో బయటపడింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ టీనేజ్‌ అమ్మాయి జీవితంలోని ఆ సంఘటన ఆధారంగా 1974లో ‘మిరాకిల్స్‌ స్టిల్‌ హ్యాపెన్‌’ అనే హాలీవుడ్‌ చిత్రం తీశారు. తరవాత ఎన్నో డాక్యుమెంటరీలు, నవలలూ వచ్చాయి.

 

అతడి పేరుతో నవల

పన్నెండున్నరేళ్ల వివాహ మహోత్సవాన్ని పెద్ద సంబరంగా జరుపుకోవడం డచ్‌వాసులకు ఒక సంప్రదాయం. నెదర్లాండ్స్‌కు చెందిన వాన్‌ ఆస్సౌ కుటుంబం ఆ వేడుకల కోసం 2010లో దక్షిణాఫ్రికాకు వెళ్లి, తిరిగి వస్తుంటే లిబియాలో వాళ్లు ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. ఆ ప్రమాదంలో తొమ్మిదేళ్ల బాలుడు తప్ప మిగతా 103 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది మరణించారు. ఆ బాలుడే రూబేన్‌ వాన్‌ ఆస్సౌ. విమాన సీట్లోనే ఇరుక్కుపోయిన బాలుడిని రక్షించి ఆస్పత్రికి తరలించి, అనేక శస్త్రచికిత్సలు చేశారు.

 

తల్లిదండ్రులు, అన్నయ్యను కోల్పోయిన రూబేన్‌ను దగ్గరి బంధువులు చేరదీసి పెంచారు. అతడి స్ఫూర్తితో ‘డియర్‌ ఎడ్వర్డ్‌’ అనే నవల వచ్చింది. ఆ తరవాత అదే పేరుతో టీవీ సిరీస్‌ కూడా రూపొందించారు. అయితే రూబేన్‌ను మీడియా ముందుకు తీసుకురాకుండా జాగ్రత్తపడ్డారు. అందుకే ఈ నవలలో ఆ చిన్న పిల్లాడి యాతన అంతా కల్పితమేనని అంటారు రచయిత్రి నపోలితానో.

 

మిరాకిల్‌ గర్ల్‌

2009… పన్నెండేళ్ల బహియా బకరీ, తల్లితో కలిసి సెలవుల్లో విహారానికి కామరూస్‌కి ప్రయాణమైంది. విమానం గమ్యానికి చేరుకోకముందే హిందూ మహాసముద్రంలో పడిపోయింది. విమానంలోని 152 మంది మృత్యువాత పడ్డారు. బకరీ మాత్రం విమాన శకటాలకు వేలాడుతూ సముద్రంలోని గడ్డకట్టే నీళ్లలో ఉండిపోయింది. అలా తొమ్మిది గంటలు గడిచాక సహాయక బృందం ఆమెని రక్షించి, ప్యారిస్‌లోని తండ్రి దగ్గరకి పంపారు. ఎన్నో శస్త్రచికిత్సల తరవాత మామూలు స్థితికి చేరుకుంది బకరీ. ఆమెను అందరూ ‘మిరాకిల్‌ గర్ల్‌’గా పిలవడం మొదలుపెట్టారు. 2010లో ఫ్రెంచ్‌ జర్నలిస్ట్‌తో కలిసి ‘మోయి బహియా, లా మిరాకులీ (ఐయామ్‌ బహియా, ది మిరాకిల్‌ గర్ల్‌’)’ పేరున తన జ్ఞాపకాలపై ఓ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం ఆధారంగా ఆమె జీవితాన్ని తెరకెక్కించాలని ప్రసిద్ధ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బెర్గ్‌ బహియాను సంప్రదిస్తే, ఆమె తోసిపుచ్చిందని అంటారు.

 

ఆరోజు ఏమైంది?

‘నువ్వు ఎలా బయటపడ్డావ్‌? ‘అంతమందిలో నువ్వొక్కడవే అంటే ఎలా నమ్మగలం’, ‘ఆ విమానానికి కో పైలట్‌ కాబట్టి, ఇతడే ఏదో కుట్ర పన్నాడు’ అంటూ కోర్టులకెక్కిన వాళ్లూ లేకపోలేదు. అతడే జేమ్స్‌ పోలెహింకే. 2006లో అమెరికాలోని కెంటకీ నుంచి అట్లాంటాకు వెళుతోన్న విమానం కూలిపోయింది. అందులో ఉన్న మొత్తం 50 మందిలో 49 మంది మరణించారు. కోపైలెట్‌ జేమ్స్‌ మాత్రం బతికి బయటపడ్డాడు. అయితే అతడు ప్రమాదంలో ఎడమ కాలును కోల్పోవాల్సి వచ్చింది. అయినా కూడా ఆ విమాన ప్రమాదానికి అతడే కారణం అంటూ మరణించిన వాళ్ల బంధువులు జేమ్స్‌పై ఎన్నో కేసులు పెట్టారు. అతడు చాలా ఇన్వెస్టిగేషన్స్‌ ఎదుర్కొన్నాడు. అనేక సంజాయిషీలు ఇచ్చుకున్నాడు. అయితే చివరికి అతడు నిర్దోషని తేలింది.

కామ్రేడ్ గాజర్ల రవి మృతికి సంతాపం తెలిపిన.

కామ్రేడ్ గాజర్ల రవి మృతికి సంతాపం తెలిపిన టి యు డబ్ల్యూ జే (ఐజేయు ) జర్నలిస్ట్ యూనియన్ .

చిట్యాల, నేటిధాత్రి :

 

 

 

కామ్రేడ్ గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ మృతి సమాజానికి తీరని లోటని భూపాలపల్లి ఐజేయు జిల్లా అధ్యక్ష,కార్యదర్శి లు క్యాతం సతీష్ , సామంతుల శ్యామ్ లు అన్నారు.

వెలిశాల గ్రామంలో శుక్రవారం గాజర్ల రవి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈనెల 18న జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యులు, ఏఓబి కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ తో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన సంఘటన తెలిసిందే.

 

కాగా వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి గత 35 సంవత్సరాల క్రితం ఉద్యమంలో చేరి..

పీడిత ప్రజల విముక్తి కోసం నిరంతరం పోరాటం చేసిన అమరుడు గాజర్ల రవి అని అన్నారు.

కార్యక్రమంలో చిట్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఐలయ్య జర్నలిస్టులు పుల్ల రవితేజ కట్కూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

కామ్రేడ్ గాజర్ల రవి మృతి సమాజానికి తీరని లోటు.

కామ్రేడ్ గాజర్ల రవి మృతి సమాజానికి తీరని లోటు

-కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

కామ్రేడ్ గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ మృతి సమాజానికి, వెలిశాల గ్రామానికి తీరని లోటని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు అన్నారు. ఈనెల 18న జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యులు, ఏఓబి కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ తో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన సంఘటన తెలిసిందే. కాగా వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి గత 35 సంవత్సరాల క్రితం ఉద్యమంలో చేరి..పీడిత ప్రజల విముక్తి కోసం నిరంతరం పోరాటం చేసిన అమరుడు గాజర్ల రవి అని పోలినేని లింగారావు అన్నారు. శుక్రవారం ఆయన గాజర్ల రవి స్వగ్రామమైన వెలిశాలకు చేరుకొని గాజర్ల రవి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన సోదరుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట వెంగల రమేష్, పెరుమాండ్ల మహేందర్, కుమార్ గౌడ్, తిరుపతిరెడ్డి, రామస్వామి తదితరులున్నారు.

కామ్రేడ్ గాజర్ల రవి మృతి సమాజానికి తీరని లోటు

కామ్రేడ్ గాజర్ల రవి మృతి సమాజానికి తీరని లోటు

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు

భూపాలపల్లి నేటిధాత్రి:

కామ్రేడ్ గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ మృతి సమాజానికి, వెలిశాల గ్రామానికి తీరని లోటని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు అన్నారు. ఈనెల 18న జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యులు, ఏఓబి కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ తో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన సంఘటన తెలిసిందే. కాగా వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి గత 35 సంవత్సరాల క్రితం ఉద్యమంలో చేరి..పీడిత ప్రజల విముక్తి కోసం నిరంతరం పోరాటం చేసిన అమరుడు గాజర్ల రవి అని పోలినేని లింగారావు అన్నారు. శుక్రవారం ఆయన గాజర్ల రవి స్వగ్రామమైన వెలిశాలకు చేరుకొని గాజర్ల రవి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన సోదరుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట వెంగల రమేష్, పెరుమాండ్ల మహేందర్, కుమార్ గౌడ్, తిరుపతిరెడ్డి, రామస్వామి తదితరులున్నారు.

నేడు ప్రో కొత్తపల్లి ఆచార్య జయశంకర్ గారి 14 వ వర్ధంతి.

నేడు ప్రో కొత్తపల్లి ఆచార్య జయశంకర్ గారి 14 వ వర్ధంతి.

◆ నివాళ్లు అర్పించిన ఎమ్మెల్యే మాణిక్ రావు,

◆ డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ బిఆర్ఎస్ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గంలో ఆచార్య జయశంకర్ గారి 14 వ వర్ధంతి. జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ బిఆర్ఎస్ నాయకులు నివాళ్లు అర్పించిన ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ
ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ చుక్కాని..
తెలంగాణ వాదాన్ని ప్రపంచానికి చాటిన మహాజ్ఞాని, తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు అని, ఈ సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు…
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నామ రవికిరణ్,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, మాజి సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి ,భారత్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు.

ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు..

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

 

ప్రొఫెసర్ జయశంకర్ సేవలు మరువలేనివని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కంబగోని సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్ లు అన్నారు. తెలంగాణ సిద్ధాంత కర్త, జయశంకర్ వర్ధంతి పురస్కరించుకొని రామకృష్ణాపూర్ పట్టణంలోని జయశంకర్ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ శ్రేణులు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన నష్టాలను, కష్టాలను.. తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని ప్రజలకు వివరిస్తూ, ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని జయశంకర్ సార్ రగిలించారని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనే శ్వాసగా, ధ్యాసగా వారు నడిపిన పోరాటం, జీవితం మహోన్నతమైనదని, మీరు కలలుగన్న తెలంగాణ ప్రగతి సాక్షిగా మీకివే మా నివాళులు అని అన్నారు.తెలంగాణ ప్రాంతం ఆంధ్ర పాలకుల వల్ల అణగారిపోయి అభివృద్ధికి నోచుకోకుండా ఉందని వారి నుండి విముక్తి కోసం తెలంగాణ ఉద్యమ కర్త కెసిఆర్‌తో వెన్నంటి ఉండి తెలంగాణ ప్రాంతంలో మన నీళ్లు,మన నిధులు,మన ఉద్యోగాలు కావాలని, కోరుకునే వ్యక్తులలో మొదటి వ్యక్తి జయశంకర్ అని అన్నారు. ఆశయాలను బంగారు తెలంగాణ కోసం నిత్యం తపించే గొప్ప ఆదర్శవాది అని అన్నారు. వారి మరణం తెలంగాణ ప్రాంత ప్రజలకు తీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు రెవెల్లి ఓదెలు, అనిల్ రావు, పోగుల మల్లయ్య, జాడి శ్రీనివాస్, జిలకర మహేష్, సీనియర్ నాయకులు అలుగుల సత్యం, జక్కన బోయిన కుమార్, రామిడి లక్ష్మి కాంత్, గోనె రాజేందర్, ఖలీం,చంద్రకిరణ్, కుర్మ దినేష్ తదితరులు పాల్గొన్నారు.

రూపాదేవి వర్ధంతి వేడుకలు.

రూపాదేవి వర్ధంతి వేడుకలు

గంగాధర నేటిధాత్రి:

 

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి సతీమణి రూపాదేవి మొదటి వర్ధంతి వేడుకలను శుక్రవారం గంగాధర మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాధర ప్రజా కార్యాలయంలో రూపా దేవి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గంగాధర ప్రభుత్వ పాఠశాలలో 200 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

కామ్రేడ్ యాకయ్య ఆకస్మిక మరణం పేదల పోరాటాలకు తీరనిలోటు.

కామ్రేడ్ యాకయ్య ఆకస్మిక మరణం పేదల పోరాటాలకు తీరనిలోటు

ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

యాకయ్య మృతదేహానికి ఎర్ర జెండా కప్పి పూలమాలలు ఘన నివాళులు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

ఎంసిపిఐ(యు) డివిజన్ కమిటీ సభ్యుడు పట్టణ నాయకుడు కామ్రేడ్ కుక్కల యాకయ్య ఆకస్మిక మరణం పేద ప్రజల ఉద్యమాలకు తీరని లోటని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.
నర్సంపేట పట్టణంలోని జ్యోతిబసు నగర్ లో అమరజీవి కామ్రేడ్ కుక్కల యాకయ్య అనారోగ్యంతో ఆకస్మికంగా ఆయన స్వగృహంలో చనిపోగా మృతదేహాన్ని సందర్శించి పార్టీ ఎర్రజెండా కప్పి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈసందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ యాకయ్య పార్టీ డివిజన్ కమిటీ సభ్యుడిగా నర్సంపేట పట్టణ నాయకుడిగా పనిచేసాడని అన్నారు. పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం గుడిసె వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎర్ర జెండా పట్టి నిరంతరం పోరాడిన నిస్వార్థ జీవి అని ఆయన లేని లోటు పార్టీకి ప్రజా ఉద్యమాలకు ఎనలేనిదని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అమరజీవి కామ్రేడ్ కుక్కల యాకయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాబూరావు వంగల రాగసుధ యుపిఎన్ఎం రాష్ట్ర కార్యదర్శి కన్నం వెంకన్న, డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజా సాహెబ్, సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, జిల్లా కమిటీ సభ్యులు కేశెట్టి సదానందం, ఏఐసిటియు జిల్లా అధ్యక్షుడు ఎండి మాశూక్, డివిజన్ కమిటీ సభ్యులు మోటం సురేష్, బండారి మల్లేశం, జ్యోతిబస్ నగర్ కాలనీవాసులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎయిరిండియా విమాన ప్రమాదం పెరిగిన మృతుల సంఖ్య.

ఎయిరిండియా విమాన ప్రమాదం పెరిగిన మృతుల సంఖ్య…

Plane Crash Death Toll: అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. గాయపడినవారు సివిల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు సివిల్ ఆసుపత్రిలో మృతదేహాల అప్పగింత కొనసాగుతోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Gujarat: అహ్మదాబాద్ (Ahmedabad) ఎయిరిండియా విమాన ప్రమాదం Air India flight accident)లో మృతుల సంఖ్య పెరిగింది. మరో ఐదుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 279కి చేరింది. గాయపడినవారు (Victims) సివిల్ హాస్పిటల్‌ (Civil Hospital)లో చికిత్స పొందుతున్నారు. విమాన ప్రమాదంలో 241 ప్రయాణికులు, 38 మంది బిజె మెడికల్ కళాశాల ప్రాంగణంలో మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం కాలిన గాయాలతో అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు.
డీఎన్ఏ పరీక్షలు..

మరోవైపు సివిల్ ఆసుపత్రిలో మృతదేహాల అప్పగింత కొనసాగుతోంది. డీఎన్ఏ పరీక్షల ఫలితాల ఆధారంగా ఆదివారం విమాన ప్రమాద ప్రయాణికుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు అధికారులు అప్పగిస్తున్నారు. కాగా చాలా మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన నేపథ్యంలో.. కుటుంబ సభ్యుల డీఎన్‌ఏతో సరిపోల్చి నిర్ధారించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇది పూర్తవగానే మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు మరణించినట్టు ఎయిరిండియా ఇప్పటికే ప్రకటించింది. మిగతా వారు వైద్య కళాశాల విద్యార్థులు, వైద్యులు, వారి కుటుంబ సభ్యులు, హాస్టల్‌ మెస్‌లో పనిచేస్తున్నవారు ఉన్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు, శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రమాద స్థలాన్ని జాతీయ భద్రతాదళం (ఎన్‌ఎస్‌జీ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బృందాలు కూడా క్షుణ్ణంగా పరిశీలించినట్టు సమాచారం.

ఉన్నతస్థాయి కమిటి…

కాగా ఎయిరిండియా విమానం కూలిపోవడానికి కారణాలను పరిశీలించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ఈ కమిటీ సోమవారం సమావేశమై విమాన ప్రమాదంపై విచారణ చేపడుతుందని.. 3 నెలల్లో విచారణ పూర్తి చేసి సమగ్ర నివేదిక సమర్పిస్తుందని ఆయన అన్నారు. విమాన ప్రమాదాలను నివారించడానికి ప్రస్తుతం అనుసరిస్తున్న కార్యాచరణ ప్రణాళికను పరిశీలిస్తుందని, భవిష్యత్తులో భద్రతా చర్యల కోసం చేపట్టాల్సిన సమగ్ర, విధాన ఆధారిత రోడ్‌‌మ్యాప్‌ను కూడా రూపొందిస్తుందని చెప్పారు.

 

వెంకటనారాయణ మృతి బాధాకరం.

వెంకటనారాయణ మృతి బాధాకరం…

అంత్యక్రియలకు తన వంతు ఆర్థిక సహాయం అందించిన నాయిని వెంకట్ గౌడ్ (గజిని)…

కొల్చారం (మెదక్) నేటిధాత్రి:

కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి చౌరస్తా గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన దాది వెంకటనారాయణ శనివారం ఉదయం మృతి చెందాడు. మృతి చెందిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాయిని వెంకట్ గౌడ్ (గజిని) అంత్యక్రియలకు మృతుని కుటుంబ సభ్యులకు తన వంతుగా 5000 రూపాయలు, ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ నాయకులు గడ్డమీది నర్సింలు, పుల్లబోయిన పోచయ్య, రాములు, స్వామి, శ్రీనివాస్, మరియు గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.

సాహితీ మేరు నగ ధీరుడు సినారే వర్ధంతి.

సాహితీ మేరు నగ ధీరుడు సినారే వర్ధంతి

సిరిసిల్ల టౌన్ ( నేటి ధాత్రి ):

రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు లక్ష్మణ్ ప్రింటర్స్ లో డాక్టర్ జ నపాల శంకరయ్య అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ కార్యనిర్వహణలో జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సినారె వర్ధంతి ఘనంగా జరిగింనది. ఈ సందర్భంగా అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ సాహితి సముద్రుడు మేరు నగ ధీరుడు తెలుగు వెలుగును, తెలుగు కవితను, తెలుగు భాష ఔన్నత్యాన్ని, కడలి దాటించిన తొలి తెలంగాణ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సినారె, అంటూ ఘన నివాళి సమర్పించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆకునూరి శంకరయ్య పూర్వ గ్రంథాలయ చైర్మన్ మాట్లాడుతూ సినారే ఒకసారి కాలేజీకి వచ్చినప్పుడు నాటక ప్రదర్శనలో అతని చేతులు మీదుగా బహుమతి అందుకున్న జ్ఞాపకం ఉందని, వారి సినీ పాటలు కవిత్వము జగము నకు తెలిసిన మహానుభావులు అన్నారు. ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ మాట్లాడుతూ గులేబకావళి కథలో గుబాలింపజేసే సాహిత్యాన్ని విరచించి, సినీ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ప్రతిభాశాలి సినారే,అని అన్నారు. సహాధ్యక్షులు కోడం నారాయణ మాట్లాడుతూ సి నారాయణ రెడ్డి ప్రముఖ కవిగా గాయకుడిగా బోధకుడిగా గురువుగా మరి సాహిత్యంలో ఎనలేని సేవ చేసినటువంటి ప్రముఖ కవిగా మరియు సినిమాకు రంగంలో పాత్రకు తగ్గట్టుగా పాటలు రాసి మన్నన పొందినాడు. మన తెలంగాణకే ఒక మనీ మకుటమై నిలిచినారు అని అన్నారు. ఉపాధ్యక్షులు బూర దేవానందం కవితా గానం ఆలాపించారు. అంకారపు రవి తన ఘనంగా కవితను సినరే కు అంకితం ఇచ్చారు.ముడారి సాయి మహేష్ కవితలు ఆలపించారు.గుండెల్లి వంశీ తన కవితను ఆలాపించారు. దొంత దేవదాసు, ఏనుగుల ఎల్లయ్య,అంది రమేష్, తదితరులు పాల్గొన్నారు.

మాగంటి మృతి పట్ల కేసీఆర్ సంతాపం.

BRS: మాగంటి మృతి పట్ల కేసీఆర్ సంతాపం..

 

నేటిధాత్రి:

 

 

 

 

 

బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల.. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. సంతాపం ప్రకటించారు. మాగంటి మరణం పార్టీకి తీరనిలోటు అని అన్నారు.

బీఆర్ఎస్ సీనియర్ నేత (BRS Senior Leader), జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే (Jubilee Hills MLA) మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) మృతి పట్ల.. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ (Ex CM KCR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. సంతాపం (Tribute) ప్రకటించారు. మాగంటి మరణం పార్టీకి తీరనిలోటు అని అన్నారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన మాగంటి గోపీనాథ్ ఎంతో సౌమ్యుడుగా ప్రజానేతగా పేరు సంపాదించారని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజక వర్గ ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయనేతగా మాగంటి తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారని కేసీఆర్.. మాగంటి జ్ఞాపకాలను స్మరించుకున్నారు.

ప్రగాఢ సానుభూతి…

మాగంటి గోపీనాథ్‌ను కాపాడుకునేందుకు వైద్యులు చేసిన కృషి, పార్టీ తరఫున చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడం దురదృష్టకరమని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మాగంటి గోపీనాథ్ మరణానికి చింతిస్తూ.. శోకతప్తులైన ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులు, అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాగంటి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు.

కాగా బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆదివారం ఉదయం 5.45 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న గుండెపోటుతో ఏఐజీ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారు జామున మృతి చెందారు. ఈ మేరకు వైద్యులు అధికారికంగా ప్రకటించారు.

శ్రేయాన్స్ మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది.

శ్రేయాన్స్ మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది.
• ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.
• ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉన్న ప్రాంతాలు గుర్తించాలి.
 ప్రమాదం జరగడానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
• ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టీకరణ
జడ్చర్ల నేటి ధాత్రి:
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడితే సహించేది లేదని, అందుకు కారకులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. జడ్చర్ల పట్టణంలోని మూడవ వార్డులో బుధవారం విద్యుత్ షాక్ తో శ్రేయాన్స్ అనే పదేళ్ల బాలుడు మృతి చెందడం పట్ల ఆయన తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసారు. జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో రక్షణ లేని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లనున్నాయని వాటి కారణంగా ప్రజల ప్రాణాలకు ఆపద వాటిల్లకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులదేనని స్పష్టం చేసారు. ప్రత్యేకించి వానకాలంలో విద్యుత్ ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అన్ని ప్రాంతాల్లోనూ రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలను గురించి సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని బుధవారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో అనిరుధ్ రెడ్డి కోరారు. రక్షణ లేని ట్రాన్ఫర్మర్ల వద్ద ప్రమాదాలు జరగడంతో పాటుగా గాలి వానలకు విద్యుత్ వైర్లు తెగిపడటం వల్ల కూడా ప్రాణాలు పోయే ప్రమాదాలు సంభవిస్తాయని ఆందోళన వ్యక్తం చేసారు. అందుకే అధికారులు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్న ప్రాతంతాలను గుర్తించి, వాటిని నివారించడానికి అవసరమైన చర్యలను చేపట్టాలని సూచించారు. దీని కోసం అవసరమైతే అదనపు నిధులను ప్రభుత్వం నుంచి తీసుకురావడానికి తాను కృషి చేస్తానన్నారు. అయితే ఇటీవల జడ్చర్లలో జరిగిన విద్యుత్ ప్రమాదాల్లో అధికార సిబ్బంది నిర్లక్ష్యం ఉందనే ఆరోపణలు వస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ అధికారుల తప్పిదాలు, నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడితే తాను సహించేది లేదని, అందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు.

హృదయం ద్రవించిపోయింది

బుధవారం జడ్చర్లలోని 3వ వార్డులో విద్యుత్ షాక్ తో మరణించిన శ్రేయాన్స్ ను చూసి తన హృదయం ద్రవించి పోయిందని, జరిగిన సంఘటన తనను కలచివేసిందని అనిరుధ్ చెప్పారు. శ్రేయాన్స్ తండ్రి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొక్కా రాఘవేందర్ ను ఎమ్మెల్యే ఫోన్ లో పరామర్శించారు. బంగారు భవిస్యత్తు కలిగిన బాలుడి జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం ఎంతో బాధాకరమని చెప్పారు. ఆ చిన్నారి బాలుడు మృతితో ఆ కుటుంబానికి ఏర్పడిన లోటు ఎవరూ పూడ్చలేనిదన్నారు. ఈ ఆపద సమయంలో ఆ కుటుంబానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాతృమూర్తి శశికళారెడ్డి శ్రేయాన్స్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాఘవేందర్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version