బాలానగర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడుతూ.. అంబేద్కర్ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించాడని, అంటరానితనం అస్పృశ్యత నివారణకు కృషి చేశారన్నారు. బహుజనులకు ఆరాధ్యుడన్నారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, వెంకటాచారి, యాదయ్య, శ్రీశైలం, నుప్ప ప్రకాష్, కొంగళ్ళ శ్రీను, శంకర్ నాయక్, లక్ష్మయ్య, వెంకటయ్య, జంగయ్య, మాసయ్య తదితరులు పాల్గొన్నారు.
వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి
నడికూడ,నేటిధాత్రి:
మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర గ్రామైక్య ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐకేపీ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రా లకు ధాన్యాన్ని తరలించి,ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.దీనివల్ల 500 రూపాయల బోనస్ కూడా రైతులకు చేకూరుతుందన్నారు.రైతుల ఆర్థిక అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.మద్దతు ధర క్వింటాలుకు ‘ఎ ‘ గ్రేడ్ రకం రూ. 2320.సాధారణ రకానికి ధర 2300. ఉందన్నారు.ఈ కార్యక్రమం లో మండల తహాసిల్దార్ గుండాల నాగరాజు, ఎంపీడీవో విమల,ఏఎం సీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, ఏవో జైసింగ్, పి డి. శ్రీనివాస్, డిపిఎం ప్రకాష్,ఏపీఎం రమాదేవి,మహిళా సమైక్య సభ్యులు వివోఏ గోనెల కవిత,జంగిలి శిరీష, చెన్నబోయిన పవిత్ర,దుండి స్రవంతి,రావుల కావ్య.కాంగ్రెస్ పార్టీ నడికూడ మండల అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్,ప్రధాన కార్యదర్శి కుడ్ల మలహల్ రావు,గ్రామ కమిటీ అధ్యక్షుడు తాళ్ల నవీన్, సమన్వయ కమిటీ సభ్యులు పర్నెం మల్లారెడ్డి,పెద్ద బోయిన రవీందర్ యాదవ్, పాడి ప్రతాప్ రెడ్డి,కోడెపాక కరుణాకర్,హమాలీలు, రైతులు,తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక రాజ్య స్థాపకుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్… ఆత్మగౌరవ అస్తిత్వ ఉద్యమాలకు దశాదిశాలు చూపిన స్ఫూర్తిదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్… -జక్కి శ్రీకాంత్ (జాతీయ యువజన అవార్డు గ్రహీత)
వర్దన్నపేట (నేటిదాత్రి):
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో మహానీయుల జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ కన్వీనర్ జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరుగుతున్న “మహానీయుల స్ఫూర్తి యాత్ర” నేడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను నరసయ్య, మాస్ రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు,బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మచ్చ రాజు, ముగింపు యాత్రలో పాల్గొని మహానీయుల చిత్రపటాలతో స్వామి వివేకానంద విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది.
Dr. B.R. Ambedkar
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంటరానితనం వివక్షల పై అలుపెరుగని పోరాటం చేసి అస్తిత్వ ఉద్యమాలకు దిశా దశలు చూపిన స్ఫూర్తిదాత ఆర్థికవేత్త రాజనీతిజ్ఞుడు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేటి తరానికి స్ఫూర్తి అని అన్నారు. పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కి అని ఈ దేశానికి పాలకులు కావడమే మన లక్ష్యమని ఇంతకాలం బాధితులుగా ఉన్నాం ఇక మనం పాలకులుగా మారుదామని బహుజనులను చైతన్యపరిచిన మహా పురుషుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. 1931లో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని దళితులకు హక్కులు కల్పించిన దళిత అభ్యుదయ వారి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు ప్రపంచానికి జ్ఞానాన్ని పంచి నేడు ప్రపంచం మొత్తం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని జ్ఞాన దినోత్సవంగా జరుపుకోవడం ఈ దేశానికి ఎంతో గర్వకారణమని అన్నారు.
Dr. B.R. Ambedkar
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ పొలిటి బ్యూరో సభ్యులు ఈరెల్లి శ్రీనివాస్, తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు కంచర్ల మహేష్, వరంగల్ జిల్లా కో కన్వీనర్ జంగిలి భాస్కర్, జాతీయ బిసి సంక్షేమ సంఘం వర్ధన్నపేట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మామిండ్ల చెన్నయ్య, తెలంగాణ అంబేద్కర్ సంఘం వర్ధన్నపేట పట్టణ అధ్యక్షులు నందిపాక భాస్కర్, కొండేటి మహేందర్, ఎమ్మార్పీఎస్ నాయకులు చాడ కరుణాకర్, దళిత శక్తి నాయకులు ఆరోగ్యం, విజయలక్ష్మి, శ్రీనివాస్, రాజు రమేష్, తదితరులు పాల్గొన్నారు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగించాలి -జక్కి శ్రీకాంత్ వర్దన్నపేట (నేటిదాత్రి)
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలోని వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ప్రజలు పాల్గొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరుగుతున్న “మహనీయుల స్ఫూర్తి యాత్ర” లో గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ జిల్లా నాయకులు దోమకొండ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరుపట్ల బాబు, బిజెపి వర్ధన్నపేట ప్రధాన కార్యదర్శి డోలి సతీష్, కాంగ్రెస్ పార్టీ మండల మైనార్టీ నాయకులు మహమ్మద్ జాఫర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డే నారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ కుల పెద్దమనుషులు బిరు యాకయ్య, బిర్రు మామునూర్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీపాది శ్రీనివాస్, తక్కలపల్లి వెంకటేశ్వరరావు, కాంభోజ యాకయ్య, కాంభోజ సాయిలు, బిర్రు కుమారస్వామి, బిర్రు చంద్రయ్య పిటి, మంద ఎల్లయ్య, సమ్మయ్య, వెంకటయ్య, సమ్మయ్య, సాయిలు, వివిధ కుల నాయకులు పాల్గొన్నారు
ఏ వై ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.
చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లాచిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు జన్నే యుగంధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి కేక్ కట్ చేసిన చిట్యాల మాజీ జెడ్పిటిసి గొర్రె సాగర్ ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు అల్లం రవీందర్ పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరీ రాజిరెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్ మండల ప్రధాన కార్యదర్శులు మడికొండ రవీందర్రావు ఏరుకొండ రాజేందర్ మండల నాయకులు బైరం భద్రయ్య పాండ్రాల వీరస్వామి దామెర రాజు మేడిపల్లి శ్రీనివాస్ వల్ల కొండ లింగారెడ్డి చిదిరాల సరోజన వినవంక శ్రీదేవి మైదము కరుణ ముల్కోజు ప్రవీణ్ సిద్ధోజు శ్రీకాంత్ చారి కైరిక రాజు గుండు నగేష్ కట్కూరి రాజేందర్ కట్కూరి కుమార్ (గని) అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
డా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే శివసీన రెడ్డి వనపర్తి నేటిదాత్రి :
భారతరత్న డాక్టర్ బి. ఆ ర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వనపర్తి లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ ఒక సామాజిక సంస్కర్త, న్యాయవేత్త, ఆర్థికవేత్త మరియు అణగారిన వర్గాల హక్కుల పోరాట యోధుడు.దళిత కుటుంబంలో జన్మించిన ఆయన కుల వివక్షను ఎదుర్కొన్నప్పటికీ విద్యను అభ్యసించడానికి అడ్డంకులను అధిగమించి, కొలంబియా విశ్వవిద్యాలయం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుండి డిగ్రీలను సంపాదించారని అన్నారు ఈ కార్యక్రమంలో కేతపల్లి విష్ణువ ర్డన్ రెడ్డి పి సి సి దెలిగేట్ టి శంకర్ ప్రసాద్ అధికారులు ఆర్డీవో తహిసిల్ దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోర్డినెటర్ డి వెంకటేష్ ఒక ప్రకటన లో తెలిపారు_
-డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పిస్తున్న వేముల మహేందర్ గౌడ్
జయంతి అంటే పాలతో ఫోటోలు కడగడం కాదు..ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడం…
అణగారిన వర్గాల ఆశాజ్యోతి..పేదల పక్షాన నిలబడిన మహోన్నతమైన నాయకుడు బి.ఆర్ అంబెడ్కర్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మనుషుల్ని మనుషులుగా చూడని ఈ దేశంలో మనుషులంతా సమానమేనని, తాను రచించిన రాజ్యాంగం ద్వారా నిరూపించిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ అన్నారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని ఆయన హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేందర్ గౌడ్ మాట్లాడారు. సామాజిక అసమానతలను రూపుమాపేందుకు ఎన్నో అవమానాలు, కుల వివక్షతను ఎదుర్కొని దేశంలో ఎన్నో సంఘసంస్కరణలకు ఆద్యం పోసి వెలి వాడల నుంచి దేశానికే రాజ్యాంగాన్ని అందించిన గొప్ప దార్శనికుడు, బడుగు బలహీన వర్గాల బహుజన బాంధవుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. నేటితరం వారి స్ఫూర్తి, త్యాగాలను ఆదర్శంగా తీసుకుని..కుల వివక్షతకు..కుల నిర్మూలనకు..అగ్రవర్ణాల అణచివేతకు..వ్యతిరేకంగా ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఎతైన విగ్రహాలు నెలకొల్పి..జయంతులు..వర్ధంతుల సందర్భంలో మాత్రమే అంబేద్కర్ ను గుర్తు చేసుకునే ఒరవడిని కాకుండా వారి స్ఫూర్తిని, చరిత్రను భావితరాలకు అందించేందుకు కృషి చేయాలని కోరారు.
భారత రాజ్యాంగ నిర్మాత డా బి ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా ఆదివారం గీసుగొండ మండల కేంద్రంలో కీర్తిశేషులు తుప్పరి సూర్యనారాయణ జ్ఞాపకార్థం సందర్భంగా వారి కుమారుడు తుప్పరి వికాస్ ఏర్పాటుచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆవిష్కరించారు.అనంతరం గీసుగొండ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు దౌడు అనిల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవూరి మాట్లాడుతూ భారత దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపారని అన్నారు. అటువంటి మహానేత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన దాతలకు, కష్టపడ్డ ప్రతి వ్యక్తికి పేరు పేరునా అభినందిస్తున్నట్లు తెలిపారు.రాజ్యాంగ స్ఫూర్తిని అంబేడ్కర్ ఆశయాలను దెబ్బతీసేలా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని వారి కుట్రను తిప్పికొట్టేందుకే జై బాపు,జై భీమ్,జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నదని అన్నారు. అణగారిన వర్గాలకి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశాకిరణం అని బడుగు బలహీనుల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
చిట్యాలమండలం లోని చల్లగరిగ గ్రామంలో నేడు అంబేద్కర్ చౌరస్తాలో డా: బిఆర్ అంబేద్కర్ 134,వ జయంతి వేడుకలు సామాజిక కార్యకర్త నోముల శివశంకర్ శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లూరి అశోక్ గార్ల ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి గారు పాల్గొని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి,స్విట్స్ పంచిపెట్టాడం జరిగింది, అనంతరం మాట్లాడుతూ డా: బిఆర్ అంబేద్కర్ గురించి 120 దేశ ల రాజ్యాంగం లను అవపాసన పట్టీ ప్రపంచంలో నే అతి పెద్ద రాజ్యాంగాన్ని రచించిన పాలన విదానాన్ని,తేలిపిన విశ్వ మేధావి అని కొనియాడారు, ఈకార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు బండి రాజు గారు, సినియర్ నాయకులు నల్ల రాజిరెడ్డి , సిరి పెళ్లి జంపయ్య గారు, నోముల నాగరాజు గారు,సోమిడి రఘుపతి ,జరిపోతుల ఓదేలు, గ్రామ పంచాయతీ కార్యదర్శి,దూడపాక సరోత్తం, మరియు, బిసి ఎస్టీ మైనార్టీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు..
ఆదివారం గ్రేటర్ వరంగల్ 16 వ డివిజన్ పరిధిలోని గరీబ్ నగర్ నుండి కీర్తి నగర్ వరకు డివిజన్ అధ్యక్షులు దుపాకి సంతోష్ ఆధ్వర్యంలో పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో ముఖ్య అతిథిగా పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.అనంతరం పరిరక్షణ పాదయాత్రను ఉద్దేశించి రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగాన్ని బిజెపి ప్రభుత్వం అవమానించిందని, రాజ్యాంగ పరిరక్షనే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు.మన రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవటానికి పోరాటం చేయాల్సిన పరిస్థితి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొని వచ్చిందని అన్నారు.ప్రతి గ్రామానికి,ప్రతి వీధికి, ప్రతి ఇంటికి వెళ్లి రాజ్యాంగానికి జరుగుతున్న ప్రమాదాన్ని వివరించాలన్నారు. పేద, బడుగు,బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరడం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు.కుల మతాలను రెచ్చగొడుతూ బిజెపి ప్రభుత్వం పబ్బం గడుపుతుందని అన్నారు.దేశంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మరియు భారత రాజ్యాంగం పై బిజెపి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, డివిజన అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.
కేసముద్రం మున్సిపల్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు కేసముద్రం మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కేసముద్రం మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి ,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు
అనంతరం కేసముద్రం మండలలో అంబేద్కర్ సంఘం భవనం నిర్మాణం కోసం కోటి 50 లక్షలు రూపాయలు నిధులు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి కి, ఎమ్మెల్యే మురళి నాయక్ కు ఎంపీ బలరాం నాయక్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేసముద్రం , ఎస్సై మురళీధర్ రాజ్, పిసిసి సభ్యులు దశ్రు నాయక్, డిసిసి ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి, ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి, మాజీ పిఎసిఎస్ చైర్మన్ బండారు వెంకన్న,వేముల శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ కార్యదర్శి పోలపాక నాగరాజు,మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ సిహెచ్ వసంతరావు, ఎండి అయుబ్ ఖాన్, చింతకుంట్ల యాదగిరి, దామరకొండ ప్రవీణ్, యాకూబ్, కనుకుల రాంబాబు, మహేందర్, సమ్మయ్య గౌడ్, సామల నరసయ్య, సారయ్య,చేడుపేల్లి ఎలేందర్,అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు వల్లందాస్ రవి, నిల్పుగొండ ఏలియా, మందుల కృష్ణమూర్తి, సోమారపు మదర్, జల్లంపల్లి శ్రీను, జల్లే యాకాబ్రాం,దండు శ్రీను,జలంధర్,ఆనందం, నేరెళ్ల శ్రీను, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి..
తంగళ్ళపల్లిమండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి జై భీమ్ జై అంబేద్కర్ నినాదాలతో ర్యాలీ నిర్వహించి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ స్థాయి గర్వించదగ్గ గొప్ప మహనీయులని ఆయన రచించిన రాజ్యాంగం ఇప్పటికి ప్రపంచ స్థాయిలో దేశ చరిత్రలో నిలిచిపోతుందని ఆయన రచించిన రాజ్యాంగం ఇప్పటికి అమలవుతుందని ఆయన రచించిన రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకు అన్ని కులాలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ రిజర్వేషన్ లోపల అభివృద్ధి కార్యక్రమాలు రాజ్యాంగం ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల మహిళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు
– రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గితే సిరిసిల్ల, ఏప్రిల్ – 14(నేటి ధాత్రి):
మహానీయులను స్మరిస్తూ మాతృదేశానికి సేవ చేయడమే వారికి మనం ఇచ్చే ఘాన నివాళి అని, అంబేద్కర్ ఆశయాల దిశగా ప్రతి ఒక్కరు ముందుగు సాగాలన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సామాజిక వివక్షను జయించి,అత్యున్నత విద్యను సాధించిన గొప్ప మేధావిగా, భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా ఉండడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని, బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతిగా,అన్ని వర్గాల ప్రజలకు సమాన్యాయం కల్పిస్తూ భారత దేశ అభివృద్ధికి , అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప వ్యక్తి అని అభివర్ణించారు. అంబేద్కర్ జీవితం,బోధనల నుండి ప్రేరణ పొంది,ఆయన ఆశయల దిశగా నేటి యువత నడుం బిగించి ఆయనను ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఐ కిరణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
జహీరాబాద్ పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి.
జహీరాబాద్. నేటి ధాత్రి:
డా.బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని జహీరాబాద్ పట్టణంలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం జహీరాబాద్ పట్టణంలో డా౹౹బాబా సాహెబ్ అంబెద్కర్ జయంతి ఉత్సవ కమిటీ వారు నిర్వహించిన డా౹౹బాబా సాహెబ్ అంబెద్కర్ జయంతి ఉత్సవ సభకి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈసందర్భగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి మాట్లాడుతూ..ఆర్థికవేత్త రాజా నీతిజ్ఞుడు భారత రాజ్యాంగ రూపకర్త మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి జహీరాబాద్ పట్టణంలో పూలమాలవేసి నివాళులర్పించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు.యావత్ భారత్ మొత్తం రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి ఆశయాలను సాధించాలని ఈ సందర్భంగా కోరుకున్నారు.ఈకార్యక్రమంలో జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.నర్సింహారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్.కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ భీమయ్య,డిసిసి ఉపాధ్యక్షుడు ముల్తాని,మాజీ జెడ్పీటీసీలు రాందాస్,నరేష్,మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి,మాజీ కౌన్సిలర్లుశేఖర్,తాహేరా బేగం,మైనార్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు జమిలాలోద్దిన్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు న్యాల్కల్ మండల అధ్యక్షుడు జి.కిరణ్ కుమార్ గౌడ్,మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ అక్బర్,బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల్,మైనార్టీ సెల్ టౌన్ అధ్యక్షుడు జావిద్,హర్షద్ పటేల్,అశ్విన్ పాటిల్,తాహేర్ పాటిల్,కె.జగదీశ్వర్ రెడ్డి,రాజు నాయక్,సునీల్,నర్సింహా యాదవ్,అక్షయ్ జాడే,రాజు,జహీర్ అరబ్బీ,ప్రమోద్, జగదీష్,మోహిన్,నిజాం మరియు అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు,మాజీ సర్పంచ్ లు,మాజీ యం.పి.టి.సిలు,మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
మహోన్నతుడు మహనీయుడు భారతదేశపు రాజ్యాంగ పితామహుడు భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్) 135 వ జయంతి నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు, చైర్మన్ మోహినుద్దీన్ ఆదేశాల మేరకు సోమవారం కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ సెంటర్లో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎన్ హెచ్ ఆర్ సి అండ్ డబ్ల్యు ఈ ఓ కేసముద్రం మండల ప్రెసిడెంట్ సోమారపు శ్రీరాములు, జన్ను శీను పూలమాలతో సత్కరించిన అనంతరం శ్రీరాములు మాట్లాడుతూ డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. అతను స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి. ఈ గొప్ప మహనీయుడి జయంతి జరుపుకోవాలని చాలా సంతోషకరం వారి ఆశయాలను కొనసాగించాలని పిలుపునిస్తూ తెలియజేశారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఘనంగా నిర్వహించారు
జహీరాబాద్. నేటి ధాత్రి:
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సంద
ర్భంగా ఝరాసంగం ఎంఐఎం మండల అధ్యక్షులు షేక్ రబ్బాని జమియత్ ఉలమా-ఇ-హింద్ మండల అధ్యక్షులు సయ్యద్ మజీద్ ఘన నివాళులు అర్పించారు.అణగారిన వర్గాల సంక్షేమం, మహిళల సాధికారత కోసం బాబాసాహెబ్ చేసిన అవిశ్రాంత పోరాటం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాధ్యం చేసిన అంబేద్కర్ రాజ్యాంగం ప్రజా పాలనకు దిక్సూచి అని గుర్తుచేశారు. మహాశయుని ఆశయాల స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతి కోసం ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి నిర్ణయాలతో సామాజిక న్యాయం కోసం అవిరాళ కృషి చేస్తోందని చెప్పారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో ఎమ్మెల్యే .పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా డాక్టర్..బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచ మేధావి,నవభారత నిర్మాత,బహుముఖ ప్రజ్ఞాశాలిగా అణగారిన పేద,బడుగు,బలహీన వర్గాల క్షేమం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు..అత్యంత మేధోసంపతితో భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ .అణగారిన వర్గాల కోసం జీవితాంతం పరితపించి వారి జీవితాల్లో సామాజిక విప్లవ స్ఫూర్తి నింపిన ప్రదాత అంబేద్కర్ అని పేర్కొన్నారు..స్వాతంత్ర భారత దేశంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కులాలకు,మతాలకు అతీతంగా ప్రజలందరూ సుఖ జీవనం గడపాలని ఆశించి భావితరాలకు సమ సమాజాన్ని అందించాలని కాంక్షతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగానీ రచించారన్నారు..అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కిషన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు , మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్ , మండల నాయకులు షేక్ రఫీ , బరపటి వెంకన్న , చందా నాగేశ్వరరావు , ఒగలబోయిన శ్రీను , పూజారి వెంకన్న, కొమరం వెంకటేశ్వర్లు , బిలపాటి సంపత్ , తోలేం కృష్ణ , గాంధర్ల రామనాథం , పోలేబోయిన చందర్రావు అశ్రపునిసా , కార్యకర్తల,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని సినారె గ్రంథాలయంలో డాక్టర్,భీమ్ రామ్ అంబేద్కర్ గారి 134వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలు సమర్పించారు. అనంతరం గ్రంథాలయ విద్యార్థినీ,విద్యార్థులను పాఠకులను ఉద్దేశించి మాట్లాడుతూ మన జిల్లా గ్రంథాలయంలో చదువుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించి. మహనీయుడైన అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని కోరారు . ఈ కార్యక్రమంలో గ్రంథపాలకుడు కమటం మల్లయ్య, గ్రంథాలయ సిబ్బంది, సాయి, మహేష్ మరియు, విద్యార్థులు,పాఠకులు పాల్గొని విజయవంతం చేశారు.
బాబా సాహెబ్ చిత్రపటానికి,విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఘన నివాళులు
పరకాల నేటిధాత్రి
సోమవారం రోజున పరకాల పట్టణంలో అగ్నిమాపక శాఖ వారోత్సవాల మొదటి రోజైన ఏప్రిల్ 14వ తేదీన దేశంలోని అగ్నిమాపక సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి అగ్నిమాపక అధికారి వి. భద్రయ్య శ్రద్ధాంజలి ఘటించి మౌనంపాటించి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ఏప్రిల్ 15వ తేదీ నుండి 20వ తేదీ వరకు జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలు,పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు,కోల్డ్ స్టోరేజీలు, పరిశ్రమలు,మొదలైన వాటిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాలని తెలిపారు.ఏదైనా ప్రమాదం సంభవిస్తే పరకాల అగ్నిమాపక కేంద్రం 8712699306, 8712699307 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు.అగ్ని ప్రమాద సమాచారం త్వరగా తెలియజేస్తే ప్రమాద నష్టం ఎక్కువగా జరగకుండా చూడవచ్చునని అన్నారు.
అంబెడ్కర్ చిత్రపటానికి నివాళులు
అగ్నిమాపక కార్యాలయంలో అగ్నిమాపక అధికారి వి.భద్రయ్య భారత రాజ్యాంగ నిర్మాత 134వ జయంతి సందర్బంగా అంబెడ్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో అగ్నిమపక సిబ్బంది పాల్గొన్నారు.
రక్తదానం మహాదానమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని.. ఏనుగొండ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహబూబ్ నగరంలోని ఏనుగొండ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో ఎస్విఎస్ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మరియు ఉచిత మెడికల్ క్యాంపు శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్త దాతలను ఆయన ప్రత్యేక అభినందించారు. ముందుగా అంబేద్కర్ చిత్ర పటానికి ఆయన పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యూత్ కాంగ్రెస్ సభ్యులు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. అందుకు యూత్ కాంగ్రెస్ నాయకులను ఆయన అభినందించారు. అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యే నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టి.పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, నాయకులు కిరణ్, వెంకటేష్ గౌడ్, సాయిబాబా, ప్రవీణ్ కుమార్, సంజీవ్ రెడ్డి, అబ్దుల్ హక్, సంజీవ్ రెడ్డి, పురుషోత్తం, చర్ల శ్రీనివాసులు, అశ్వాక్, మురళీధర్ గౌడ్, శాంతి కుమార్, మహ్మద్ కలీం, చెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.