గోహత్యలు అక్రమ రవాణాను అరికట్టాలి.

గోహత్యలు అక్రమ రవాణాను అరికట్టాలి
బీజేవైఎం నాయకులు వినతి

నిజాంపేట నేటి ధాత్రి:

గోహత్యలు, గోవుల అక్రమ రవాణాను అరికట్టాలని బీజేవైఎం నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో గల స్థానిక పోలీస్ స్టేషన్లో ఇన్చార్జ్ ఎస్సై సృజనకు గో హత్యలు, గోవుల అక్రమ రవాణా చేసే వారిని కఠినంగా శిక్షించాలని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గోవులు దైవ స్వరూపమని అలాంటి గోవులను కొంతమంది హత్యలు చేస్తూ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆవును తల్లిలా భావించి గోమాత అని పిలుచుకునే సాంప్రదాయం భారతదేశంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం ప్రశాంత్ గౌడ్, బోయిని ప్రణయ్ కుమార్, గజం రాజు, మేకల రమేష్, సందీప్ గౌడ్, బాసం అనిల్, భరత్,  లు ఉన్నారు.

విద్యుత్ ఘాతంతో జెర్సీ ఆవు మృతి.

విద్యుత్ ఘాతంతో జెర్సీ ఆవు మృతి
మొగుళ్ళపల్లి నేటి దాత్రి:

 

మండలంలో విద్యుత్ ఘాతంతో జెర్సీ ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. బుధవారం తెల్లవారుజామున ఈదురు గాలులతో ఉరుములు మెరుపులతో కురిసిన అకాల వర్షంలో రైతు మొగుళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన పడిదల బాపురావు ఇంటినుండి దగ్గరలోని విద్యుత్ పోల్ నుండి సర్వీస్ వైర్ ఈదురు గాలులకు మధ్యలో తెగి జెర్సీ అవుమీదపడి విద్యుత్ ప్రసరణ జరగడంతో.రైతు పడిదల బాపురావు కు చెందిన 60 వేల విలువగల జెర్సీ ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. విద్యుత్ షాక్ గురై ఆవు చనిపోయిన. రైతును ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని పలువురు రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version