భూవివాదంలో మహిళను హత్య చేసిన మనోజ్ అనే రౌడి షీటర్ పై పీడీ యాక్ట్ నమోదు.
నిందుతుడు మనోజ్ కి పిడి యాక్ట్ నిర్బంధ ఉత్తర్వులు అందజేసి శుక్రవారం రోజున చందుర్తి సి.ఐ ఆధ్వర్యంలో చర్లపల్లి జైలు కి తరలించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.
2023 సం.లో హత్య కేసులో, దొంగతనం , బెదిరింపులకు పాల్పడిన కేసులలో నిందుతుడిగా మనోజ్..
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న మనోజ్ పై 2024 సంవత్సరంలో రౌడి షీట్ ఓపెన్.
నిందుతులు వివరాలు.
1.బొల్లు మనోజ్ s/o స్వామి వయస్సు:20 సంవత్సరాలు
చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలానికి చెందిన బొల్లు మనోజ్ అనే వ్యక్తి మహిళ హత్య కేసు తో పాటుగా, హత్య కేసులల్లో, దొంగతనం,బెదిరింపులకు పాల్పడిన కేసులలో నిందుతుడిగా ఉండి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ తరచు ప్రజలను భయబ్రాంతులకు గురి చేయగా 2024 సంవత్సరంలో మనోజ్ పై రౌడి షీట్ ఓపెన్ చేసి పలు మార్లు కౌన్సెలింగ్ నిర్వహించిన మనోజ్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రానప్పటికి తరచు నేరాలకు పాల్పడుతు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నందున జిల్లా కలెక్టర్ గారు పిడి యాక్ట్ అమలు చేయడానికి ఉత్తర్వులు జారీ చేయగా చందుర్తి సి.ఐ వెంకటేశ్వర్లు మనోజ్ కి పిడి యాక్ట్ నిర్బంధ ఉత్తర్వులు అందజేసి నిందుతుణ్ణి చర్లపల్లి జైలుకు తరలించడం జరిగింది.
జిల్లాలో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ గారు ఈసందర్భంగా హెచ్చరించారు. జిల్లాలో ఉన్న రౌడి షీటర్స్ పై పాత కేసులలో ఉన్న నెరస్థులపై నిత్యం పోలీస్ నిఘా ఉంటుందని, గతంలో పలు కేసులల్లో నిందుతులగా ఉండి తరచు నేరాలకు పాల్పడే వారిపై పిడి యాక్ట్ అమలు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.