ఈ నేల 15 నుండి 26 వరకు జరిగే సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు నడువు తున్నట్టు డిపో మేనేజర్ రవిచందర్ ఓ ప్రకతనలో తెలిపారు.రోజుకు 10 ప్రత్యేక బస్సులు పరకాల నుండి కాళేశ్వరంకు నడుపుతున్నట్టు తెలిపారు.ఈ పుత్యేక బస్సులకు చార్జీలు పరకాల నుండి కాళీశ్వరంకు పెద్దలకు 190రూపాయలు పిల్లలకు 110రూపాయలు గా నిర్ణయించినట్టు తెలిపారు.ఏదైనా వివరాలకు 9705479088,7382 926774 నంబర్లను సంప్రదించాలని,భక్తులందరు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
బిఆర్ఎస్ నాయకున్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర.
చిట్యాల నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రం రామ్ నగర్ కు చెందిన బిఆర్ఎస్ మండల నాయకులు ఆరెపల్లి సమ్మయ్యను హైదరాబాద్ యశోద హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి మంగళవారం రోజు పరామర్శించి వైద్యులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు , వారి వెంట బి ఆర్ఎస్ మండల అద్యక్షులు అల్లం రవీందర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరు రాజిరెడ్డి గారు మండల నాయకులు పాండ్రాల వీరస్వామి పెరుమాండ్ల రవీందర్ గౌడ్ ఉన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని తిరుమలగిరి, చిన్నరేవల్లి, మోదంపల్లి, హేమాజీ పూర్ తదితర గ్రామాల్లో సోమవారం అర్ధరాత్రి ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పెద్దరేవల్లి రైతు వేదిక వద్ద ఈదురు గాలులకు ఆరబెట్టిన ధాన్యం స్వల్పంగా తడిసింది. ఈదురు గాలులకు కుప్పలపై కప్పిన టార్పలిన్లు ఎగిరిపోవడంతో ధాన్యం తడిసిందని రైతులన్నారు. తాత్కాలికంగా నిర్మించిన టెంట్ సైతం కూలిపోయిందన్నారు.
గణపురం లో కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల నిర్మాణ సన్నాహక సమావేశం
సంస్థాగత నిర్మాణం వైపు కాంగ్రెస్ అడుగులు భూపాలపల్లి నియోజక వర్గం
గణపురం నేటి ధాత్రి:
గణపురం మండలం లో ప్రతిపాదనల స్వీకరణ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంస్థాగత నిర్మాణంలో భాగంగా, భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండల కేంద్రంలోని ప్రొ బెల్ స్కూల్ లో మండల అధ్యక్షులు రేపాక రాజేందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సంస్థాగత నిర్మాణం సమావేశానికి ముఖ్య అతిధులుగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా పరిశీలకులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి , మాసంపెల్లి లింగాజి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సమావేశంలో వరంగల్ కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా ఈరోజు గణపురం మండల కేంద్రంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని, మండల స్థాయి నుంచి పీసీసీ దాకా కార్యవర్గాలను ఏర్పాటు చేసేందుకు మండల కమిటీ అధ్యక్షుడు కి గ్రామ కమిటీ అధ్యక్షుడుకి ప్రతిపాదనలు పంపేందుకు, ఆసక్తి ఉన్న ముఖ్యనాయకులు, కార్యకర్తలు అందరూ సకాలంలో తమరి బయోడేటా, పాస్ ఫోటోతో ప్రతిపాదన సమర్పించాలని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ, అనుబంద సంస్థల, బ్లాక్ అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గోన్నారు.
ప్రజల్లో చైతన్యం ద్వారానే అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ
అటవీ అభివృద్ధి సంస్థ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్
జైపూర్,నేటి ధాత్రి:
ప్రజల్లో చైతన్యం,అవగాహన ద్వారానే అడవులు, ప్లాంటేషన్లలో అగ్ని ప్రమాదాల నివారణ పూర్తిగా సాధ్యమవుతుందని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీజీ ఎఫ్ డీసీ) మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ అన్నారు.అటవీ అభివృద్ధి సంస్థ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం జైపూర్ మండలంలోని ముదిగుంట శివారులో ఉన్న నీలగిరి ప్లాంటేషన్ లో అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వేసవిలో ప్లాంటేషన్ లలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించినప్పుడు మంటలు ఎలా ఆర్పాలో గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
Forest fires
సంస్థ పరంగా బ్లోయర్ లతో మంటలు ఎలా నియంత్రిస్తారో వివరించడం జరిగింది. ప్లాంటేషన్లు,అటవీ ప్రాంతాల మీదుగా వెళ్లేవారు బీడీలు సిగరెట్లు తాగి నిర్లక్ష్యంగా పడేయవద్దని చెప్పారు. అడవులు,ప్లాంటేషన్లు కాలడం వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతుందన్నారు.వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ తో పాటు కాగజ్ నగర్,బెల్లంపల్లి రేంజ్ ల ప్లాంటేషన్ మేనేజర్లు లక్ష్మణ్, సునీత,ఫీల్డ్ సూపర్వైజర్లు రాజేష్,శ్రీనివాస్,వాచర్లు, సిబ్బంది శంకర్,సాయికిరణ్, లచ్చన్న,రాకేష్,ఓదెలు, సంజీవ్ లు పాల్గొన్నారు.
పార్టీవ దేహానికి నివాళులర్పించిన ఎస్సి కార్పొరేషన్ (టిఎస్ఎస్ సిసిడిసి)మాజీ చేర్మెన్ వై.నరోత్తం..
జహీరాబాద్ నేటి ధాత్రి:
జి.శ్రీనివాస్ న్యాయవాది తండ్రి జి.అడివప్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతు మరణించిన విషయం తెలిసి ఎస్సి కార్పొరేషన్ (టిఎస్ఎస్ సిసి డిసి) మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారు. ఈ రోజు వారి ఇంటికి వెళ్లి పార్టీవ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు,నివాళులర్పించిన వారిలో చెంగల్ జైపాల్,దిలీప్,ఉన్నారు.
అయినవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు గల నూతన ఎల్లమ్మ ఆలయం నందు శ్రీ ఎల్లమ్మ దేవి విగ్రహ ప్రతిష్టాపన. కార్యక్రమంలో రెండవ రోజు ఎల్లమ్మ విగ్రహానికి, గణపతి విగ్రహానికి, సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాలను ఊరేగించి జలాభిషేకం చేయడం జరిగింది. మరియు ప్రాతశాపాసన, వాస్తు పూజన, వాస్తు శాంతి, పర్యగ్నికరణ, లక్షణోద్ధారణ, జలాధివాసన, బింబశుద్ది, ధాన్యాధివాసన, కళానాహన, శాంతి హవన, పంచావరణ స్థాపన, తత్త్యత్రయ మూలమంత్ర హవన, నీరాజన, మన్త పుష్ప సమర్పణ, నిత్యబలిహరణ, తీర్ధప్రసాద వితరణ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి అద్దంకి నాగేశ్వర్ రావు, ఉప ప్రధానార్చకులు పాతర్లపాటి రవీందర్ దేవాలయ నిర్మాణ దాత శ్రీ పర్ష సర్వేశ్వర్ రావు యాదవ్ కుటుంబ సభ్యులు ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్ అయినవోలు మధుకర్ శర్మ వేద పండితులు గట్టు పురుషోత్తం శర్మ విక్రాంత్ వినాయక్ జోషి, అర్చక సిబ్బంది పాల్గొన్నారు. కోమల్లపెల్లి సంపత్ కుమార్ రూత్విక బృందం ఆధ్వర్యంలో ఇట్టి కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది.
వనపర్తి బస్ డిపోలో బస్సుల సంఖ్య పెంచి వనపర్తి నుండి పుణ్యక్షేత్రలకు బస్ లను నడపాలని వనపర్తి జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యర్య ములో వనపర్తి డి ఎం కు ఇచ్చామని ,అధ్యక్షుడు సతీష్ యాదవ్ ఒక ప్రకటన లో.విలేకరుకు తెలిపారు దూర ప్రాంతాలకు, మారుమూల ప్రాంతాలకు వనపర్తి డి పో బస్ లు పుణ్యక్షేత్రాలైన యాదగిరిగుట్ట, మంత్రాలయం, శ్రీశైలం, తిరుపతి భద్రాచలం అరుణచలం వెంటనే బస్సులు నడపాలని వనపర్తి , మాజీ బిసి ఎమ్మెల్యేల గ్రామాలకు జయరాములు గ్రామం గుమ్మడం కు బాలకృష్ణయ్య గ్రామం చిట్యాల పెద్దమందడి మీదుగా మహబూబ్ నగర్ , హైదరాబాద్ కు బస్సులు నడుపాలని, పాత బస్టాండు నిర్మాణం చేయించి, ప్రయాణికులకు అందుబాటులో కి తీసుక రావాలని బస్ లు పో నీ మారుమూల గ్రామాలకు బస్సులు నడపాలని కోరారు స్క్రాప్ బస్సులో స్థానంలో 20 బస్సులు వచ్చాయని అవి సరిపోక మరో 25 బస్సులు డిపోకు అవసరమని వెంటనే తెప్పించాలని ఎమ్మెల్యే మేగారెడ్డి, కలెక్టర్ ని ఒక ప్రకటన లో కోరారు సతీష్ యాదవ్, వెంట వెంకటేశ్వర్లు, తెలుగుదేశం కొత్త గొల్ల శంకర్ గౌనికాడి యాదయ్య, రాజ్ కుమార్, మన్యం నాయక్, రాము యాదవ్, శివకుమార్, పుట్టపాక బాలు తదితరులు ఉన్నారు
ఈ నెల 20 న సార్వత్రిక సమ్మెకు మద్దత్తుగా గ్రామీణ బంద్ ను జయప్రదం చేయండి
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్
కరీంనగర్ నేటిధాత్రి:
దేశంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, వ్యవసాయ, రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 20 తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దత్తుగా గ్రామాల్లో వ్యవసాయ కూలీలు గ్రామీణ బంద్ నిర్వహించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల సమావేశం జరిగింది. ఈసందర్బంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ చాయ్ వాలా పేరుతో దేశంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా నిర్లక్ష్యం చేస్తూ, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తూ, హక్కులను హరిస్తున్నారని, నలబై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా తెచ్చారని, ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ దేశ సంపదను అధాని, అంబానిలకు కట్టబేడుతున్నారని ఆరోపించారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పెద బడుగు బలహీన వర్గాలకు చేతి నిండా పని కల్పించాలనే లక్ష్యంతో యుపిఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అమలు చేసి కోట్లాది మంది కూలీలకు పని కల్పిస్తుంటే నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపులో కోత విధిస్తున్నారని, పని రోజులు తగ్గిస్తున్నారని, పని ప్రదేశాల్లో పనికి ముందు పనికి తర్వాత కూలీలను ఫోటో అప్లోడ్ చేసే విదానాన్ని తెచ్చారని అన్నారు. ఉపాధి కూలీలకు రెండు వందల రోజుల పని కల్పించాలని, రోజు వారి కూలీ ఆరు వందలు చెల్లించాలని, వేసవి భృతి యధావిధిగా కొనసాగించాలని, పని ప్రదేశాల్లో కొలుతలు లేకుండా పని కల్పించి బిల్లులు చెల్లించాలని, ఆధార్, జాబ్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అనుసంధానం చేయడం ఆపాలనే, ఉపాధి కూలీలకు ఇన్స్యూరెన్స్ అవకాశం కల్పించాలని, ఉపాధి హామీ పథకం రద్దు చేసే కుట్రలను మానుకోవాలని కోరుతూ 20 వ తేదీన కూలీలు ఉపాధి హామీ పనులను బంద్ చేసి దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె, గ్రామీణ బంద్ ను జయప్రదం చేయాలని సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. ఈసమావేశంలో బికెయంయు జిల్లా అధ్యక్షులు బోయిని అశోక్, ఏఐఏడబ్లుయు జిల్లా ఉపాధ్యక్షులు రాయికంటి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి సుంకరి సంపత్, నాయకులు నల్లగొండ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ఉప్పల వెంకటేష్ ఆర్థిక సహాయం.
కల్వకుర్తి/నేటి ధాత్రి :
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం, కల్వకుర్తి మున్సిపల్ పట్టణానికి చెందిన భగత్ సింగ్ తండాలోని నూతన దేవాలయంలోని విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, తెలంగాణ మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ & ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ రూ.25 వేల ఆర్థిక సహకారం అందించారు. ఈనెల 16,17,18,19 తేదీలలో జరిగే బ్రహ్మోత్సవాలకు కూడా రావలసిందిగా ఉప్పల వెంకటేష్ ఆహ్వానం అందించిన భగత్ సింగ్ తండా ఆలయ కమిటీ చైర్మన్ మరియు సభ్యులు.ఈ కార్యక్రమంలో ఉప్పల వెంకటేష్ సైన్యం & తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు దారమోని గణేష్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్ధమోని రమేష్ గౌడ్ ,భగత్ సింగ్ తండా నాయకులు రాజు నాయక్, బాలు నాయక్, హర్యా నాయక్, దేవేందర్ నాయక్, భాస్కర్ నాయక్, బోడు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఫామ్ ఆయిల్ తోటలతో రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చు
రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి మండలం అచ్యుతాపురం గ్రామములో రైతు బోయినీ.వాసు 4ఎకరాలతో సాగు చేస్తున్న ఫామ్ ఆయిల్ తోటను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించారు భవిష్యత్తు ప్రయోజనాల కోసం తాను మంత్రిగా ఉన్నప్పుడు ఫామ్ ఆయిల్ తోటలు పట్ల రైతులకు అవగాహన కల్పించి సాగు దిశగా ప్రోత్సహించామని నిరంజన్ రెడ్డి అన్నారు.ఫామ్ ఆయిల్ తోటల వల్ల రైతులు దీర్ఘకాల ఆదాయం లాబాలు పొందుతూ అదేవిధంగా అంతర్గత కొత్త రాకాల పంటల వేసుకొని జీవనోపాధి పొందవచ్చని అన్నారు.మార్కెట్లో ఫామ్ ఆయిల్ మంచి గిరాకీ ఉన్నదని భవిష్యత్తు మొత్తం ఫాం ఆయిల్ తోటలది మాజీ మంత్రి అన్నారు. పంట సాగు చేస్తున్న వాసుకు సూచనలు చేసి అభినందించారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వెంట మాజీ సర్పంచ్ శారద ఆశన్న నాయుడు, చిట్యాల.రాము,నరసింహ,బి.ఆర్.ఎస్ నాయకులు తదితరులు ఉన్నారని మీడియా ఇంచార్జి నందిమల్ల అశోక్ తెలిపారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎల్ఆర్ఎస్ రాయితీ చెల్లింపు గడువు మే మాసం 31 వరకు పొడిగింపు చేసినట్లు మంగళవారం మధ్యాహ్నం విడుదల చేసిన. పత్రికా ప్రకటన లో జహిరాబాద్ పురపాలక సంఘం కమిషనర్ ఉమామహేశ్వరరావు తెలిపారు.
ప్రపంచ సుందరి అందాల పోటీలను రద్దు చేయాలని అడిగినందుకు మహిళా సంఘాల నాయకుల హౌస్ అరెస్టులతో నిర్బంధించడం అప్రజాస్వామికమని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వై గీత పేర్కొన్నారు.మహిళా నేతల హౌస్ అరెస్టుల పట్ల వై గీత ఖండించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల యొక్క అంగంగా ప్రదర్శన ప్రపంచస్థాయి పోటీలను తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడానికి చేసిన ఏర్పాట్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ప్రపంచ సుందరి అందాల పోటీలు ఉంటాయని అన్నారు.తెలంగాణ రాష్ట్ర సాంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉండే ఈ పోటీలను ఇక్కడ నిర్వహించకూడదని కోరారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థికంగా దివాల తీస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికే ఇబ్బందిగా ఉందని చెప్తూ ప్రపంచ సుందరి అందాల పోటీలకు 300 కోట్లు రూపాయలు ఖర్చు చేయడం సరైనది కాదని ఆరోపించారు. ఈ పోటీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో పిఓడబ్ల్యు జాతీయ నాయకురాలు సంధ్యతోపాటు ఐద్వా నాయకురాలు మల్లు లక్ష్మి,ఇతర జిల్లాలలో నాయకులను ఇళ్లలోకి చొరబడి అక్రమంగా అరెస్టులు చేయడం అప్రాజస్వామిక చర్యగా భావిస్తున్నట్లు పేర్కొంటూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గీత ప్రభుత్వాన్ని వేడుకొన్నారు.
ప్రమాదవశాత్తు గాయపడిన నాయకుని పరామర్శించిన బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి :
తంగళ్ళపల్లి మండలానికి చెందిన టౌన్ బిఆర్ఎస్ పార్టీ. సీనియర్ నాయకులు జంగపల్లి. బిక్షపతి గత కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు గాయపడం జరిగింది. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ. సీనియర్ నాయకులు . బొ ల్లి. రామ్మోహన్. పార్టీ నాయకులు కార్యకర్తలు . ఆయన. ఇంటికి వెళ్లి. పరామర్శించి మనోధైర్యం చెప్పి. బిఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటామని ధైర్యం చెప్పి. సంబంధిత విషయాన్ని మాజీ మంత్రి కేటీ రామారావు దృష్టికి తీసుకెళ్లి తమకు అండగా ఉంటామని పార్టీ పరంగా ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు . పరామర్శించిన వారిలో తంగళ్ళపల్లి టౌన్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు యూత్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా ఊరేగింపు
వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి పట్టణంలో శంకర్ గంజ్. శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం రాత్రి స్వామివారి ఊరేగింపు శంకర్ గుంజీ నుండి బయలుదేరి కమాన్ చౌరస్తా రాజీవ్ చౌక్ ద్వారా భక్తిశ్రద్ధలతో ఆలయ కమిటీ నిర్వాహకులు నిర్వహించారు
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని స్మశాన వాటిక కోసం కోనుగోలు చేసిన భూమి ఇతరుల సాగులోకి వెళ్ళింది. వివరాల్లోకి వెళితే తాజా మాజీ గ్రామ సర్పంచ్ లెటర్ హెడ్ పై సర్పంచ్ భర్త అయిన ప్రభుత్వ ఉపాధ్యాయులు స్మశాన వాటిక కోసం గ్రామ ప్రజల చందాలతో 09 సెప్టెంబ ర్2019న గుంట ఒకంటికి పదిహేనువేల రూపాయల చొప్పున పదమూడు గుంటల భూమిని కోనుగోలు చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేయకముందే మొత్తం డబ్బులు 15డిసెంబర్ 2019న భూయజమానులకు సర్పంచ్ భర్త అయిన ప్రభుత్వ ఉపాధ్యాయులు ఐదువేల రూపాయలను అదనంగా చెల్లించి గంపగుత్తగా అని తెలిపారు. అట్టి భూమిని కోనుగోలు చేసినప్పుడు గ్రామ పంచాయతీ ఆదినంలో ఉంటుందని తెలిపారు. కాని వాస్తవంగా కోనుగోలు చేసిన నుండి నేటి వరకు గ్రామ పంచాయతీ ఆదినంలోకి తీసుకోకపోవడంతో నేడు అట్టి భూమిని ఇతరుల సాగులోకి వెళ్ళింది. ఈవిషయంలో గ్రామప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారు. స్మశానవాటిక నిమిత్తం కొనుగోలు చేసింది పన్నెండు గంటలా, ఇరవై ఐదు గుంటలా, ముప్పై గుంటల పైగానో తెలియని అయోమయ స్థితిలో గ్రామ ప్రజలున్నారు. వాస్తవానికి పోన్నం వీరేశం అనే గ్రామస్తుని నుండి గ్రామ ప్రజల చందాలతో గ్రామపంచాయతీ కార్యాలయం వారు పన్నెండు గంటల భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని హద్దులు ఏర్పాటు చేసి స్మశాన వాటిక నిర్మాణం చేసి ఉన్నారు. తదనంతరం పదమూడు గుంటల భూమిని కొంతమంది గ్రామస్తుల ద్వారా తాజా మాజీ సర్పంచ్ లెటర్ హెడ్ పై కొనుగోలు చేశారు. ఇట్టి భూమి ప్రస్తుతం గ్రామపంచాయతీ ఆధీనంలో లేకపోవడం, గ్రామ స్మశానవాటిక నిర్మాణ అనంతరం చందాదారులకు సన్మాన కార్యక్రమంలో ముఫై గుంటల పైగా భూమిని కొనుగోలు చేశామని తెలియజేశారు. ఇలా మూడు రకాలుగా వినబడుతున్న మాటలు విన్న గ్రామప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారు. దీనిపై ఇప్పటికైనా సంబంధిత గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని గ్రామ స్మశాన వాటిక నిమిత్తం ఎంత భూమి కొనుగోలు చేశారో నిగ్గుతేల్చాలని గ్రామ ప్రజలు పత్రికా ముఖముగా అధికారులను వేడుకొనుచు, అసలు ప్రజల చందాలు ఎన్ని సమకూరాయో తెలియపరచాలని, గ్రామ పంచాయతీ కోనుగోలు చేసినప్పుడు చూపిన హద్దుల ప్రకారం మండల రెవెన్యూ సర్వేయర్ తో కోలిపించి హద్దు రాళ్ళను ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ ఆదినంలోకి తీసుకోని, ఒకవేళ తప్పు జరిగిందని నిర్ధారణ జరిగితే సంబంధిత అప్పటి గ్రామ సర్పంచ్, పాలకవర్గంపై, అప్పటి గ్రామ, మండల అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు అధికారులను కోరుతున్నారు.
పిజేటిఏయూ వారి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమo
కరీంనగర్, నేటిధాత్రి:
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గల వ్యవసాయ పరిశోధన స్థానం, కరీంనగర్ వారి ఆధ్వర్యంలో రైతులకు మేలైన సాగు పద్దతులపై అవగాహన కల్పించడంతో పాటు, వానాకాలం సాగుకు రైతులను సమాయత్తం చేసేందుకు వ్యవసాయ శాఖతో కలిసి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే వినూత్న కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా రామడుగు మండలo దేశరాజుపల్లి గ్రామంలోని రైతువేదిక నందు నిర్వహించడం జరిగినది. వ్యవసాయ పరిశోధన స్థానం, శాస్త్రవేత్త మరియు అధిపతి డా.ఉషారాణి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంతో పాటు ముఖ్యమైన అంశాలైన తక్కువ యూరియా వాడండి, సాగు ఖర్చుని తగ్గించండి, అవసరం మేరకు రసాయనాలను వినియోగించండి, నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడండి, రశీదులను భద్రపరచండి, కష్టకాలంలో నష్ట పరిహారాన్ని పొందండి అని తెలిపారు. ఈకార్యమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎఎంసి చైర్మన్ బొమ్మరవేణి తిరుమల మరియు జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మిలు మాట్లాడుతూ రైతులందరూ యూరియ వాడకాన్ని తగ్గించి, చెట్లని పెంచి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. నెల రోజుల పాటు జిల్లాలో వివిధ గ్రామాలలో జరిగే ఈరైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈకార్యక్రమానికి విచ్చేసిన వ్యవసాయ పరిశోధన స్థానం, కరీంనగర్ శాస్త్రవేత్త డా . ఏ.విజయభాస్కర్ సాగు నీటిని ఆదా చేయండి, భావి తరాలకు అందించండి, పంట మార్పిడి పాటించండి, సుస్థిర ఆదాయాన్ని పొందండి, చెట్లను పెంచండి పర్యావరణాన్ని కాపాడండి అనే విషయాలు రైతులకు తెలిపారు. జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి శ్రీనివాస్ రావు రైతులను ఉద్దేశిస్తూ మామిడి, కూరగాయ, ఆయిల్ పామ్ సాగు వివరాలు తెలిపారు. అనంతరం టిఎస్ఎస్డిసి రీజినల్ మేనేజర్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతు నాణ్యమైన విత్తన లభ్యత మరియు ధరల వివరాలను వివరించారు. ఈకార్యక్రమంలో చొప్పదండి సహ సంచాలకులు ప్రియదర్శిని, మండల వ్యవసాయ అధికారి త్రివేదిక, సీడ్ ఆఫీసర్ మౌనిక , ఉద్యాన శాఖ ఆఫీసర్ రోహిత్, విఏఎస్ మనోహర్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారులు రమేష్, సంపత్, గోవర్ధన్ సుమారు నూటా యాభై ఏడు మంది రైతులు పాల్గొన్నారు.
ఆపరేషన్ కగార్ పేరిట అమాయక గిరిజనులపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలి
గుండాల,నేటిధాత్రి:
గుండాల మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ కార్యక్రమం కు వచ్చిన టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి గోపగాని శంకర్ రావు మండల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మన పొరుగు రాష్ట్రమైన చత్తీస్గడ్ లో ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసి ప్రజానీకాన్ని స్వదేశీ, విదేశీ కార్పోరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం హతమారుస్తున్న విధానాన్ని దేశంలోని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు తీవ్రంగా ఖండిస్తున్న కేంద్రంలోని మనువాద మతోన్మాద ప్రభుత్వం నిసిగ్గుగా మావోయిస్టుల ఏరివేత పేరుతో అనేకమంది పేరుతో అనేకమంది ఆదివాసి యువకులను దారుణంగా చంపి రాజ్య హింసకు పాల్పడుతూ మధ్య భారత దేశంలోని ఆదివాసి ప్రజానీకం. జల్, జంగల్, జమీన్ కోసం పోరాడుతూ అడవిని, అడవిలో గల సహజ, ఖనిజ సంపదను రక్షించుకునేందుకు సాగిస్తున్న విరోచత పోరాటాలపై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్బంధాన్ని, హత్యకాండను ప్రతికటిద్దాం ఈ దేశ మూలవాసులు అనాదిగా అడవిని వాగులు, వంకలు, ఒర్రెలు, చెట్టు పుట్ట మరియు మూగజీవాలతో సహజీవనం చేస్తూ, తర తరాలుగా అడవినే నమ్ముకుని జీవనం గడుపుతున్న ఆదివాసి ప్రజానీకాన్ని, అడవి నుండి ఖాళీ చేసి, సహజ, ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు ధారా దత్తం చేసేందుకు కుటిల రాజనీతిని ప్రదర్శిస్తూ ఆదివాసీల మనుగడను ప్రశ్నార్ధకంగా మార్చింది. ఒక ప్రక్కన మావోయిస్టులను దేశంలో నుండి ఏరిపారేసామని గొప్పలు చెబుతున్న పాలకులు, ఈనాడు ఇంకా మావోయిస్టులు ఉన్నారన్న నెపంతో అడవిలో ప్రశ్నించే శక్తులు లేకుండా కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామిక వాదులు ముక్తకంఠంతో ఖండించాలన్నారు.భారతదేశ రాష్ట్రపతి 5. 6 షెడ్యూల్ ప్రాంతంలో జన్మించి రాజకీయంగా ఎదిగి, ఈనాడు ఆయా తెగల మీద ఫాసిస్టు ప్రభుత్వం ఆదివాసీలపై ఆపరేషన్ కగారు పేరుతో హననం చేస్తుంటే, మౌన ముని వలె ప్రేక్షక పాత్ర పోషించడం తగదు. దేశ సరిహద్దు ప్రాంతంలో ఉండవలసిన సైన్యం ఆదివాసి గూడాలపై పడి మరణ హోమం కలిగించడం బాధాకరం. ప్రజలు ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాలు ఆదివాసీలకు అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆట, పాట, వేట, ఆదివాసీల సంస్కృతి, వారిని అడవికి దూరంగా పారామిలటరీ దళాలు తరుముతున్నాయి. తెలంగాణలో పారా మిలటరీ మరియు బిఎస్ఎఫ్ క్యాంపులను సత్వరమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గొల్లపల్లి రమేష్ పాల్గొన్నారు.
టిఆర్ఎస్ కు కంచుకోట ఉమ్మడి మెదక్ జిల్లా అలాగే మెదక్ నియోజకవర్గం కూడా ఈ పార్టీకి మంచిపట్టున్న నియోజకవర్గం. అయితే ఈ మధ్యకాలంలో మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకుడు కాంటారెడ్డి తిరుపతిరెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయని తెలుస్తోంది. ఏ కార్యక్రమం చేసిన వేరువేరుగా చేయడం పట్ల కార్యకర్తలు కూడా అయోమయంలో పడుతున్నారు. బహిరంగంగా విభేదాలు బయటపడకున్న లోలోపల మాత్రం విభేదాలు ఉన్నాయని వినిపిస్తున్నాయి. ఇప్పటినుండి వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారని పలువురి అభిప్రాయం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోహిత్ రావు తనదైన శైలిలో ముందుకు వెళ్లడంతో పాటు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కూడా ఘాటుగా విమర్శిస్తున్నారు.
Congress.
ఈ క్రమంలో అనుకున్న విధంగా ఈ ఇద్దరిలో ఎవరు కూడా ఖండించకపోవడం పట్ల కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ రావ్ వ్యాఖ్యల పట్ల పార్టీ కార్యకర్త ఒకరు సోషల్ మీడియాలో ఘాటుగా విమర్శించారు. అయితే ఆ కార్యకర్తను పోలీసులు విచక్షణ రహితంగా కొట్టిన కనీసం పట్టించుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. బాధితుడు ఇటీవల కేటీఆర్ ను కలిసి తన బాధను చెప్పుకున్నాడు. కేటీఆర్ సైతం మెదక్ నియోజకవర్గంలో నాయకుల పనితీరు పట్ల సంతృప్తిగా లేదని పలువురి వాదన. ఏది ఏమైనా ఇంటి పోరే కారుకు తిను సవాలుగా మారే ప్రమాదం ఉంది.
స్వాములకు అన్న ప్రసాదం అందజేసిన కవిత కిషన్ దంపతులు
పరకాల నేటిధాత్రి :
మండలంలోని మల్లక్కపేట గ్రామంలోని ఈ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో బొజ్జం కవిత కిషన్ దంపతులు మంగళవారం రోజున ఆంజనేయ స్వామి మాల ధరించిన దాదాపు 250 మంది స్వాములకు అన్నప్రసాదం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,ఆలయ చైర్మన్ అంబిరు మహేందర్,ఇఓ వెంకటయ్య,అర్చకులు కాటూరి జగన్నాధాచార్యులు,డైరెక్టర్స్ దొమ్మటి శంకరయ్య,నిట్టె బాలరాజు,బొజ్జం రాజేందర్ అలాగే,నల్ల విష్ణువర్థన్ రెడ్డి,భక్తులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.