కే.యు ఆంగ్ల విభాగంలో పీహెచ్డి సూపర్వైజర్ గా ప్రొఫెసర్.

కే.యు ఆంగ్ల విభాగంలో పీహెచ్డి సూపర్వైజర్ గా ప్రొఫెసర్ నవీన్ ఎంపిక

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

కాకతీయ యూనివర్సిటీ ఆంగ్ల విభాగంలో పీహెచ్డి సూపర్వైజర్ గా నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ ఎంపికయ్యారు.
ప్రొఫెసర్ మల్లం నవీన్ ను కాకతీయ యూనివర్సిటీ ఆంగ్ల విభాగంలో పీహెచ్డీ గైడ్ షిప్ ను అందించింది.కాగా
వీరు ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి (ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్) సభ్యులుగా కొనసాగుతున్నారు.
కాకతీయ యూనివర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్ కే. ప్రతాప రెడ్డి,రిజిస్ట్రార్, ఆర్ట్స్ డీన్ ఈ సందర్భంగా అభినందించారు.తెలంగాణ ప్రభుత్వం నుండి స్టేట్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డును,ఏల్టాయి నుండి నేషనల్ లెవెల్ బెస్ట్ టీచర్ అప్రిసియేషన్ అందుకుని,వివిధ నేషనల్, ఇంటర్నేషనల్ సెమినార్లలో దాదాపు 59 పరిశోధన పత్రాలను, వివిధ జర్నల్ మరియు పుస్తకాలలో దాదాపు 30 వ్యాసాలను ఇప్పటివరకు ఆయన సంపర్పించారు.ఈ సందర్భంగా జరిపిన సమావేశంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, వివిధ కళాశాలల నుంచి అధ్యాపకులు ప్రొఫెసర్ మల్లం నవీన్ ను ఘనంగా సన్మానించారు. ఇందులో భాగంగా పరిశోధనలు చేసే విద్యార్థులకు మెంటారుగా ,సూపర్వైజర్ గా తన యొక్క విద్యార్థులు పరిశోధన గ్రంథం సమర్పించడంలో తగు సలహాలు సూచనలు ఇస్తూ పరిశోధక విద్యార్థుల యొక్క అత్యున్నత డిగ్రీ( పీహెచ్డీ పట్టా) పొందడంలో పారదర్శకంగా, నిజాయితీగా నాణ్యమైన పరిశోధనలు రావడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తనకు ఈ గొప్ప అవకాశం కల్పించిన కాకతీయ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ కే. ప్రతాప రెడ్డి, రిజిస్టర్, ఆర్ట్స్ డీన్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కు ఉన్నత గౌరవం దక్కడంతో కళాశాల యొక్క కీర్తి మరో మైలురాయి దాటినట్టు అధ్యాపక మిత్రులు సిబ్బంది, విద్యార్థులు సంతోషాన్ని ప్రకటించారు.

బీఆర్ఎస్వీ నేతలపై కేయూ పీఎస్ లో ఫిర్యాదు.!

బీఆర్ఎస్వీ నేతలపై కేయూ పీఎస్ లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జేఏసి కన్వీనర్ డాక్టర్ మేడారపు సుధాకర్

హన్మకొండ, నేటిధాత్రి:

సీఎం ను కించపరుస్తూ కార్యక్రమాలు చేయడం పై మండిపడ్డ నిరుద్యోగ జేఏసి నాయకులు
నిరుద్యోగ జేఏసి రాష్ట్ర చైర్మన్ కోటూరి మానవతారాయ్ రాష్ట్రవ్యాప్త నిరసనల పిలుపు మేరకు…
కాకతీయ యూనివర్సిటీ
తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని కుక్క బొమ్మకు అతికించి ర్యాబిస్ ఇంజక్షన్ ఇస్తూ శునకానందం పొందిన ఓయూ బీఆర్ఎస్వీ నాయకులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జేఏసి పిలుపు మేరకు కన్వీనర్ డాక్టర్ మేడారపు సుధాకర్ ఆధ్వర్యంలో జేఏసి బృందం కేయూ పీఎస్ లో ఎస్.ఐ అనంతరి మధు కి కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసి కన్వీనర్, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ మేడారపు సుధాకర్, తాళ్లపెల్లి నరేష్ లు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికై అహర్నిశలు కృషి చేస్తున్న రాష్ట్ర సి.ఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని ఓయూ లోని బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులు కుక్క బొమ్మకు అతికించి ర్యాబిస్ ఇంజక్షన్ ఇస్తూ, పిచ్చి కుక్క అని నినాదాలు చేస్తూ, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానుల యొక్క మనోభావాలు దెబ్బతీశారని తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని అన్నారు, గౌరవ ప్రదమైన స్థానంలో ఉన్న సీఎం పై ఇలాంటి కార్యక్రమాలు చేస్తే సహించేది లేదన్నారు, ముఖ్యమంత్రిని కించపరుస్తూ మాట్లాడటం పై నిరుద్యోగ జెఏసి నేతలు మండిపడ్డారు, ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జెఏసి నాయకులు గుండేటి సుమన్, ముత్యాల సాయి, శ్రీనివాస్, అరుణ్ కుమార్, సాయి వికాస్, మురళి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version