
మానేరుపై అక్రమ వసూళ్ళ నిలిపివేత..
స్పందించిన అధికారులు పెద్దపల్లి “నేటిధాత్రి” మానేరుపై అక్రమ వసూళ్ళ నిలిపివేత.. టోల్‌గేట్ తొలగింపు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి వద్ద మానేరు నదిలో అక్రమంగా నిర్వహిస్తున్న టోల్‌గేట్‌ను ఎట్టకేలకు పోలీసులు, రెవెన్యూ అధికారులు తొలగించారు. “నేటిధాత్రి”పత్రికలో ఫిబ్రవరి 11 వ తారీకున వచ్చిన అధికారుల అండదండలతో కోట్లకు పడగలెత్తుతున్న దళారీలు అనే కథనంపై పోలీసులు, రెవెన్యూ అధికారులు స్పందించారు. మానేరు నది వద్దకు చేరుకున్న మంథని సీఐ…