బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ను గెలిపించండి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు నేటిధాత్రి:

భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ వెంకట్రావుపల్లి శక్తి కేంద్రం ఇంఛార్జి బద్ధం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో లక్ష్మీపూర్ గ్రామంలో వికసిత భారత్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్, మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ లు హాజరై మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్రమోదీ బీజేపీ ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విఫలం అయిందని, రెండున్నర సంవత్సరాలు పూర్తి కాకముందే కాంగ్రెస్ పాలనను ప్రజలు చీకొడుతున్నారన్నారు. తెలంగాణలో త్వరలో జరుగబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు. తెలంగాణ వచ్చే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమేనని వారు జోస్యం చెప్పారు. బీజేపీ పాలనలో ప్రజలు సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, బూత్ కమిటీ అధ్యక్షులు గుర్రం శ్రీనివాస్ గౌడ్, దైవల తిరుపతి గౌడ్, మడికంటి శేఖర్, యువ మోర్చా మండల అధికార ప్రతినిధి వంచ మనోజ్, మల్లయ్య, గోపు అనంత రెడ్డి, నాయకులు, ప్రజలు, తదితరులు హాజరయ్యారు.

లారీ ఓనర్ అధ్యక్షుడిగా మేకల చంద్రయ్య ఎన్నిక.

లారీ ఓనర్ అధ్యక్షుడిగా మేకల చంద్రయ్య ఎన్నిక

భూపాలపల్లి నేటిధాత్రి:

కాకతీయ లారీ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మేకల చంద్రయ్య భారీ మెజార్టీతో గెలుపొందారు
భూపాలపల్లి లోని మంజునగర్ లో కాకతీయ లారీ ఓనర్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది అధ్యక్షుడుగా మేకల చంద్రయ్య కోశాధికారిగా రాకేష్ ఉపాధ్యక్షుడిగా ఏనగంటి రాజేందర్ ప్రధాన కార్యదర్శిగా ఎండి అన్వర్ పాషా సహాయ కార్యదర్శిగా రాసలింగమూర్తి ఎన్నికైనారు ఈ సందర్భంగా అధ్యక్షుడు మేకల చంద్రయ్య మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించి నన్ను రెండోసారి లారీ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలిపించిన సభ్యులందరికీ రుణపడి ఉంటాను నా మీద నమ్మకంతో నన్ను రెండోసారి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ గెలుపు నామీద మరింత పనిచేసే భారాన్ని పెంచింది కావున కాకతీయ లారీ ఓనర్ అసోసియేషన్ మరింత అభివృద్ధి పథంలోకి నడిపియడానికి నా వంతుగా రెండోసారి కృషి చేస్తానని నేను తెలియజేస్తున్నాను

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version