బాల కార్మిక వ్యవస్థను రూపుమాపుదాం
ఆపరేషన్ ముస్కాన్-11కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం
చిన్న పిల్లలతో వెట్టిచాకిరి చెపిస్తే క్రిమినల్ కేసులు తప్పవు.
జిల్లా ఎస్పీమహేష్ బి. గితే ఐ.పీ.ఎస్
సిరిసిల్ల టౌన్ (నేటి ధాత్రి):
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం జులై 01 నుండి 31తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్-11కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ అధికారులకు ఆదేశించారు.
ఆపరేషన్ ముస్కాన్-11కార్యక్రమంలో భాగంగా శనివారం రోజున వివిధ శాఖల అధికారులతో జిల్లా పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈసందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ….ఆపరేషన్ స్మైల్ -11లో పాలుపంచుకొంటున్న ప్రతి ఒక్క అధికారి సమన్వయంతో పక్కా ప్రణాళిక రుపొందించుకోని బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేలా విధులు నిర్వహించాలన్నారు.
ప్రతీ ఒక్కరి జీవితంలో బాల్యం అమూల్యమైనదని దానిని అనుభవించటం ప్రతీ పౌరుని హక్కు అని,క్షణికావేషంలో పిల్లలు తొందరపాటులో చిన్న చిన్న విషయాలకే తల్లి దండ్రులను విడిచి ఇంటికి దూరంగా ఉంటున్నారని,ఇట్టి అవకాశాన్ని ఆసరాగా తీసుకొని కొందరు వారిని ప్రమాదకర పనుల్లో వారితో పనులు చేయిస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారని అలాంటి వారిని గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తెలిపారు.