తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ. ఇసుక టాక్స్ పాలసీ తీసుకురావాలని పెద్దపెల్లి జిల్లాలో అమలవుతున్న ఇసుక టాక్స్ పాలసీ సిరిసిల్లలో కూడా అమలు చేయాలని సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఇసుక పాలసిని. తీసుకోవాలని గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలతో అక్రమాలు జరిగాయని ఇసుక రవాణా విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రజా ప్రభుత్వంలో సామాన్యులకు సైతం ఇసుక అందుబాటులో ఉండేరా నిర్ణయం తీసుకోవాలని దూరాన్ని బట్టి ఇసుక రవాణాలకు చాలాను.కట్టే విధంగా ఇసుకపాలసిని .అమలు చేయాలని అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ సామాన్యులకు ఇసుక సరఫరా లో ఇబ్బందులు కలగకుండా చూడాలని. దీనిపై జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి. పొన్నం ప్రభాకర్ గౌడ్. ఆది శ్రీనివాస్. కేకే మహేందర్ రెడ్డి లు. ఈ విషయంలో చొరవ చూపాలని కాంగ్రెస్ పార్టీ తరపున తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగాల భూపతి. గుగ్గిళ్ళ భరత్ కొత్త రవి.సత్తు శ్రీనివాస్ రెడ్డి. మీరాల శ్రీనివాస్. పొన్నాల లక్ష్మణ్. మునిగల రాజు. శ్రీకాంత్ గౌడ్. వాసు. చంద్రారెడ్డి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ. ఇసుక టాక్స్ పాలసీ తీసుకురావాలని పెద్దపెల్లి జిల్లాలో అమలవుతున్న ఇసుక టాక్స్ పాలసీ సిరిసిల్లలో కూడా అమలు చేయాలని సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఇసుక పాలసిని. తీసుకోవాలని గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలతో అక్రమాలు జరిగాయని ఇసుక రవాణా విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రజా ప్రభుత్వంలో సామాన్యులకు సైతం ఇసుక అందుబాటులో ఉండేరా నిర్ణయం తీసుకోవాలని దూరాన్ని బట్టి ఇసుక రవాణాలకు చాలాను.కట్టే విధంగా ఇసుకపాలసిని .అమలు చేయాలని అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ సామాన్యులకు ఇసుక సరఫరా లో ఇబ్బందులు కలగకుండా చూడాలని. దీనిపై జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి. పొన్నం ప్రభాకర్ గౌడ్. ఆది శ్రీనివాస్. కేకే మహేందర్ రెడ్డి లు. ఈ విషయంలో చొరవ చూపాలని కాంగ్రెస్ పార్టీ తరపున తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగాల భూపతి. గుగ్గిళ్ళ భరత్ కొత్త రవి.సత్తు శ్రీనివాస్ రెడ్డి. మీరాల శ్రీనివాస్. పొన్నాల లక్ష్మణ్. మునిగల రాజు. శ్రీకాంత్ గౌడ్. వాసు. చంద్రారెడ్డి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని స్మశాన వాటిక కోసం కోనుగోలు చేసిన భూమి ఇతరుల సాగులోకి వెళ్ళింది. వివరాల్లోకి వెళితే తాజా మాజీ గ్రామ సర్పంచ్ లెటర్ హెడ్ పై సర్పంచ్ భర్త అయిన ప్రభుత్వ ఉపాధ్యాయులు స్మశాన వాటిక కోసం గ్రామ ప్రజల చందాలతో 09 సెప్టెంబ ర్2019న గుంట ఒకంటికి పదిహేనువేల రూపాయల చొప్పున పదమూడు గుంటల భూమిని కోనుగోలు చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేయకముందే మొత్తం డబ్బులు 15డిసెంబర్ 2019న భూయజమానులకు సర్పంచ్ భర్త అయిన ప్రభుత్వ ఉపాధ్యాయులు ఐదువేల రూపాయలను అదనంగా చెల్లించి గంపగుత్తగా అని తెలిపారు. అట్టి భూమిని కోనుగోలు చేసినప్పుడు గ్రామ పంచాయతీ ఆదినంలో ఉంటుందని తెలిపారు. కాని వాస్తవంగా కోనుగోలు చేసిన నుండి నేటి వరకు గ్రామ పంచాయతీ ఆదినంలోకి తీసుకోకపోవడంతో నేడు అట్టి భూమిని ఇతరుల సాగులోకి వెళ్ళింది. ఈవిషయంలో గ్రామప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారు. స్మశానవాటిక నిమిత్తం కొనుగోలు చేసింది పన్నెండు గంటలా, ఇరవై ఐదు గుంటలా, ముప్పై గుంటల పైగానో తెలియని అయోమయ స్థితిలో గ్రామ ప్రజలున్నారు. వాస్తవానికి పోన్నం వీరేశం అనే గ్రామస్తుని నుండి గ్రామ ప్రజల చందాలతో గ్రామపంచాయతీ కార్యాలయం వారు పన్నెండు గంటల భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని హద్దులు ఏర్పాటు చేసి స్మశాన వాటిక నిర్మాణం చేసి ఉన్నారు. తదనంతరం పదమూడు గుంటల భూమిని కొంతమంది గ్రామస్తుల ద్వారా తాజా మాజీ సర్పంచ్ లెటర్ హెడ్ పై కొనుగోలు చేశారు. ఇట్టి భూమి ప్రస్తుతం గ్రామపంచాయతీ ఆధీనంలో లేకపోవడం, గ్రామ స్మశానవాటిక నిర్మాణ అనంతరం చందాదారులకు సన్మాన కార్యక్రమంలో ముఫై గుంటల పైగా భూమిని కొనుగోలు చేశామని తెలియజేశారు. ఇలా మూడు రకాలుగా వినబడుతున్న మాటలు విన్న గ్రామప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారు. దీనిపై ఇప్పటికైనా సంబంధిత గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని గ్రామ స్మశాన వాటిక నిమిత్తం ఎంత భూమి కొనుగోలు చేశారో నిగ్గుతేల్చాలని గ్రామ ప్రజలు పత్రికా ముఖముగా అధికారులను వేడుకొనుచు, అసలు ప్రజల చందాలు ఎన్ని సమకూరాయో తెలియపరచాలని, గ్రామ పంచాయతీ కోనుగోలు చేసినప్పుడు చూపిన హద్దుల ప్రకారం మండల రెవెన్యూ సర్వేయర్ తో కోలిపించి హద్దు రాళ్ళను ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ ఆదినంలోకి తీసుకోని, ఒకవేళ తప్పు జరిగిందని నిర్ధారణ జరిగితే సంబంధిత అప్పటి గ్రామ సర్పంచ్, పాలకవర్గంపై, అప్పటి గ్రామ, మండల అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు అధికారులను కోరుతున్నారు.
తంగళ్ళపల్లి. మండల కేంద్రంలో పాటు. తంగళ్ళపల్లి. గీత నగర్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న. టీ. జి. పాలీసెట్.ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పరీక్ష కేంద్రాలను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న పరీక్షలు. ఎలా జరుగుతున్నాయని ఎగ్జామ్స్ సెంటర్లో నిర్వహించిన. సీసీ కెమెరాల పరిధిలో పరిశీలించి వివరాలు అడిగి. కెమెరాల పరిశీలన ఎలా ఉందని తెలుసుకున్నారు ప్రవేశ పరీక్ష సజావుగా ప్రశాంతంగా జరగాలని కలెక్టర్ తెలిపారు. అలాగే. తంగళ్ళపల్లి జెడ్పిహెచ్ఎస్. పాఠశాలలో నిర్మిస్తున్న అదనపు తరగతి గదులను త్వరగా పూర్తి చేయాలని ప్రిన్సిపల్ శంకర్ నారాయణ ఆదేశించారు. అదేవిధంగా పాఠశాల ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన బోరుకు మోటార్ ఏర్పాటు చేయాలని ప్రిన్సిపల్ కోరగా పంచాయతీ . సెక్రెటరీ కి. ప్రతిపాదనలు అందజేయాలని ప్రిన్సిపల్ కి సూచించారు. ఇట్టి తనిఖీల్లో జిల్లా కలెక్టర్ వెంట. ప్రిన్సిపల్ . సూపర్డెంట్. శంకర్ నారాయణ శారద ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
రేవెల్లి గ్రామపంచాయతీ పరిధిలో ప్రక్క గ్రామ నీటి ట్యాంకర్ ద్వారా రోడ్డుపై నీటిని చల్లుతున్న వైనం
కరీంనగర్ నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా చోప్పదండి మండలం రెవెల్లి గ్రామ చెరువులో మట్టి తవ్వకాలు జరిపేందుకు రంగాపూర్ గ్రామం పెద్దపల్లి మండలం మరియు జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి సంబంధించిన ఏఎన్ఆర్ బ్రిక్స్ కు గ్రామపంచాయతీ వారు మే రెండున తీర్మానం అందించగా, ఇరిగేషన్ అధికారులు మే8న అనుమతులిచ్చారు. నిబంధనల ప్రకారం రెండు వేల క్యూబిక్ మీటర్ల మట్టి మాత్రమే తరలించాలని, తవ్వకాల కోసం రెండు ప్రొక్లెయిన్ మట్టి తరలింపు కోసం పది లారీలను మాత్రమే ఉపయోగించాలని, ఉదయం 6 నుండి సాయంత్రం 6 తీసుకోవాలని పర్మిషన్ లో పేర్కొన్నారు.
Gram Panchayat
కాని మట్టి తరలింపు కోసం పర్మిషన్ పొందిన సదరు కాంట్రాక్టర్ నిబంధనలు ఏం చేయవు, అధికారులు పట్టించుకోరు అనుకున్నాడో ఏమో గాని, పరిమిషన్ లేని లారీలను వాడటమే కాకుండా రాత్రి ఆరు గంటల తర్వాత కూడా ఇష్టారీతిన మట్టి తరలింపు చేపడుతున్నారు.
Gram Panchayat
ఇదిలా ఉండగా రాగంపేట గ్రామపంచాయతీ కి సంబంధించిన నీటి ట్యాంకర్ ను సంబంధిత కాంట్రాక్టర్ రేవెల్లి గ్రామపంచాయతీ పరిధిలో మట్టి తరలిస్తున్న లారీలు వెళ్లే దారిలో నీటిని పట్టుతుండడం విశేషం. ఈవిషయమై రాగంపేట గ్రామపంచాయతీ కార్యదర్శి అనిల్ ను వివరణ కోరగా మేము ట్యాంకర్ ను ఎవరికీ ఇవ్వలేదని తెలియజేశారు.
Gram Panchayat
తమ ఆధీనంలో ఉండాల్సిన ట్యాంకర్ పక్క గ్రామంలో నీటిని పడుతున్న ఏమీ తెలియనట్టు ఉన్నా పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే మట్టి తవ్వకాలు చేపట్టిన సమయంలో పర్యవేక్షించాల్సిన ఇరిగేషన్ అటువైపు కనీసం కన్నెత్తి చూడకపోవడంపై మండలంలోని ప్రజలలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇట్టి విషయమై గ్రామపంచాయతీ కార్యదర్శి సంప్రదించడానికి వెళ్ళగా పంచాయతీ కార్యాలయంలో లేకపోవడంతో ఆమె కార్యాలయానికి ప్రతిరోజు ఆలస్యంగా వచ్చుచున్నారని గ్రామ ప్రజలు తెలియజేశారు.
Gram Panchayat
ఇదే విషయమై గ్రామ ప్రత్యేక అధికారిని వివరణ కోరగా కార్యదర్శి పై ఎంపీఓకి ఆలస్యంగా వచ్చుచున్నారని తెలియజేశామని మరియు మట్టి తరలింపుపై ఎంపీఓకి సమాచారం అందజేశామని తెలియజేశారు.నిబంధనలు విస్మరించి అనుమతి లేని వాహనాల ద్వారా మట్టి తరలిస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవడంతో పాటు ఇంత జరుగుతున్నా సదరు కాంట్రాక్టర్ కి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఇరిగేషన్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రత్యేక అధికారులపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ. ఇసుక టాక్స్ పాలసీ తీసుకురావాలని పెద్దపెల్లి జిల్లాలో అమలవుతున్న ఇసుక టాక్స్ పాలసీ సిరిసిల్లలో కూడా అమలు చేయాలని సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఇసుక పాలసిని. తీసుకోవాలని గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలతో అక్రమాలు జరిగాయని ఇసుక రవాణా విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రజా ప్రభుత్వంలో సామాన్యులకు సైతం ఇసుక అందుబాటులో ఉండేరా నిర్ణయం తీసుకోవాలని దూరాన్ని బట్టి ఇసుక రవాణాలకు చాలాను.కట్టే విధంగా ఇసుకపాలసిని .అమలు చేయాలని అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ సామాన్యులకు ఇసుక సరఫరా లో ఇబ్బందులు కలగకుండా చూడాలని. దీనిపై జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి. పొన్నం ప్రభాకర్ గౌడ్. ఆది శ్రీనివాస్. కేకే మహేందర్ రెడ్డి లు. ఈ విషయంలో చొరవ చూపాలని కాంగ్రెస్ పార్టీ తరపున తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగాల భూపతి. గుగ్గిళ్ళ భరత్ కొత్త రవి.సత్తు శ్రీనివాస్ రెడ్డి. మీరాల శ్రీనివాస్. పొన్నాల లక్ష్మణ్. మునిగల రాజు. శ్రీకాంత్ గౌడ్. వాసు. చంద్రారెడ్డి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో. రైతులు ఆరుగాలం పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రాస్తారోకో ధర్నాకు దిగారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజులు గడుస్తున్న కాంట పెడతలేరు అంటూ. వడ్లు కొంట.లేరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వడ్లు కొనుగోలు విషయంలో జాప్యం జరుగుతుందంటూ జిల్లెల్ల గ్రామంలో ప్రధాన రహదారిపై ధర్నాకు దిగిన రైతులు. రైతులు ధర్నాకు దిగడంతో రోడ్డుపై భారీగా ఎక్కడికక్కడ వాహనాలు . నిలిచి. రాకపోకలకు ఇబ్బంది జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ .ఇకనైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని. ఈ సందర్భంగా జిల్లాల గ్రామస్తులు తెలిపారు అలాగే. మండేపల్లి గ్రామంలో వడ్లు కొనుగోలు చేస్తలేరని రైతులు రోడ్డెక్కి. నిరసన తెలియజేస్తూ ధర్నాకు దిగారు. దయచేసి వెంటనే సంబంధిత అధికారులు మండలంలో ప్రతి గ్రామంలో వడ్ల. కొనుగోలు కేంద్రాల ప్రారంభించి రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా రైతులు ఉన్నతాధికారులకు విన్నవించారు ఇట్టి ధర్నా కార్యక్రమంలో జిల్లెల్ల గ్రామ ప్రజలు. రైతులు. మండపల్లి గ్రామ ప్రజలు. రైతులు. పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తర్వాత. పోలీసులు వెళ్లి ధర్నా చేస్తున్న వారిని . శాంతింప చేసి. సంబంధిత అధికారులతో మాట్లాడి వరి ధాన్యం. కొనుగోలు చేసే విధంగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రోడ్డుపై వెళ్లే వాహనాలను . క్రమబద్ధకరించి. వాహనాలు సజావుగా పోయేటట్టు రాకపోకలకు అంతరాయం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు
కోహిర్ మండలం నాగిరెడ్డిపల్లి వెళ్లే మార్గంలో స్థానిక వైకుం ఠధామం వద్దకు వెళ్లే దారిలో భారీ మురుగు కాలువ ఏర్పడటంతో స్థానికులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. ఈకాలువ కారణం గా స్మశానవాటికకు వెళ్లేమార్గం అడ్డంకులతో కూడుకున్నది దీంతో అంత్యక్రియలు, ఇతర ఆ చారాలు నిర్వహించడం కష్టతరంగా మారింది. స్తానికులు తెలిపిన వివరాల ప్రకారం.ఈ ము రుగు కాలువ నీరు చుట్టుపక్కల ప్రాంతాలను కలుషితం చేస్తూ దుర్వాసన వెదజల్లుతుంది. ఈ సమస్య వల్ల స్మశానవాటికకు వెళ్లేవారు ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మురుగు కాలువ వల్ల మార్గం పూర్తిగా మునిగిపోయింది. అంత్యక్రియలకు వెళ్లడం కూడా కష్టంగా మారిందని స్థాని కులు తెలిపారు. అధికారులు ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని మురు గు కాలువను మూసివేసి స్మశానవాటికకు సరైన మార్గం ఏర్పాటు చేయాలని స్థానికు లు కోరుతున్నారు. ఈవిషయంలో తహశీల్దార్ కార్యాలయం తగిన చర్య లు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈసమస్యపై అధికారుల స్పం దన కోసం స్థానికులు ఎదురుచూస్తున్నారు.
వక్ఫ్ సవరణ బిల్లు 2025 కు వ్యతిరేకంగా మే 24న జహీరాబాద్‌లో నిరసన సమావేశం.
◆ ముఫ్తీ అబ్దుల్ సబూర్ ఖాసీ కాను మరియు వక్ఫ్ బచా ప్రచారం, ముస్లిం పర్సనల్ లా బోర్డు జహీరాబాద్ సమాచారం ప్రకారం, వక్ఫ్ సవరణ బిల్లు 2025.
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుకు వ్యతిరేకంగా వక్ఫ్ బచా దస్తూర్ బచా ప్రచారం యొక్క కేంద్ర నిరసన అఖిల పక్ష సాధారణ సమావేశం మే 24వ తేదీ శనివారం అసర్ ప్రార్థనల తర్వాత రాత్రి 10 గంటల వరకు ఈద్గా మైదాన్ జహీరాబాద్‌లో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహ్మానీ అధ్యక్షతన జరుగుతుంది. ఈ సమావేశంలో అన్ని ఆలోచనా విధానాల నాయకులు, రాజకీయ పార్టీ నాయకులు మరియు ఇతర మతాల నాయకులు ప్రసంగిస్తారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యవస్థాపక కార్యనిర్వాహక కమిటీ సభ్యులు కూడా పాల్గొంటారు. ఈ నల్లజాతి చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించే నిరసన సమావేశంలో అన్ని ఇస్లామిక్ సోదరులు తమ మతం లేదా మతంతో సంబంధం లేకుండా పాల్గొని, తమ ఐక్యత, జాతీయ సంఘీభావం, మతపరమైన గర్వం మరియు సజీవ దేశంగా నిరూపించుకోవాలని మరియు ఈ వివాదాస్పద నల్లజాతి చట్టానికి వ్యతిరేకంగా తమ సమిష్టి నిరసనను నమోదు చేయాలని అభ్యర్థించారు.
ఉపాధి హామీ పనులను కూలీలందరూ సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎంపీడీవో సుధాకర్ సూచించారు. మంగళవారము ఝరాసంగం మండల పరిధిలోని కంబాలపల్లి గ్రామ శివారులో చేపడుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి అక్కడ కల్పిస్తున్న మౌలిక వసతులపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆధార్‌కార్డును బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాలని సూచించారు. ఎండలు పెరిగిపోవడంతో రైతులు ఉదయం సమయంలోనే పనులు పూర్తి చేసుకొని ఇంటికి చేరుకోవాలని సూచించారు. వడదెబ్బ తగలకుండా పనులు ముందే ముగించాలన్నారు. పని ప్రదేశాల్లో తాగునీరు తప్పకుండా తీసుకెళ్లాలని తెలిపారు. పని ప్రదేశాల్లో సరైన వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం నర్సరీలో మొక్కల పెంపకంపై జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ రాజ్ కుమార్ గ్రామ కార్యదర్శి నవీద్ ఫీల్డ్ అసిస్టెంట్ ఈశ్వర్ కూలీలు పాల్గొన్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళముందే కాలి పోతు న్న దృశ్యాన్ని చూసి రైతు కంట కన్నీళ్లు ఆగలేదు వివరాల్లో కెళితే శాయంపేటమండలం పత్తిపాక గ్రామానికి చెందిన అన్న బోయిన రఘుపతి అనే రైతు మూడున్నర ఎకరాల్లో మొక్కజొన్న పంటసాగు చేశారు పంట చేతికి అంద డంతో మొక్కజొన్న కోసి వాటిని పొలంలో కుప్పగా పోసి మార్కెట్ చేసేందుకు నిలువ ఉంచారు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించ డంతో పొలంలోని మూడున్నర.
Agriculture
ఎకరాలలో మొక్కజొన్న పంట సుమారు ఖాళీ బూడిదయింది పొలం వైపు వెళ్లి చూడగా పంట పూర్తిగా మట్టిలో కలిసిపో యింది అప్పటికే మొక్కజొన్న కంకులు కాలుతూనే ఉన్నాయి దృశ్యాన్ని చూసి రైతు లబోది బో అంటూ గుండె బాదుకు న్నాడు. రైతు స్థానిక వ్యవసా య అధికారికి ఫిర్యాదు మేర కు ఏవో గంగా జమున కాలిపో యిన కంకులు పరిశీలించగా 60% కాలి పోయినట్లు గుర్తిం చారు. రైతుకు పంట నష్టం జరిగినట్లు నిర్ధారించడం జరిగింది.
`రెండేళ్ల దాకా విచారణ పూర్తి కాకపోతే మళ్ళీ అదే కొలువు.
`అలాంటి దానికి పట్టుకోవడం ఎందుకు?
`శిక్ష లేనప్పుడు కేసులెందుకు?
`కొలువు మళ్ళీ ఇచ్చేది వున్నప్పుడు దాడులెందుకు?
`రాబందుల్లా దోచుకుంటున్నారని తెలుసు.
`రెడ్ హాండెడ్‌గా పట్టుబడ్డారని తెలుసు.
`అయినా కొలువెందుకు పోదు?
`పట్టు బడిన వెంటనే కొలువు పోయేలా చట్టమెందుకు చేయరు!
`అవినీతి నిరోధక శాఖ కష్టం బూడిదలో పన్నీరౌతోంది.
`అవినీతి ఉద్యోగులను పట్టుకునే వ్యవస్థకే పూర్తి అధికారాలు ఎందుకివ్వరు!
`ఉద్యోగుల సర్వీసు రిమూవల్ ఏసిబి చేతిలో ఎందుకు పెట్టరు.
`తప్పు చేసిన తర్వాతే ఏ ఉద్యోగి పట్టుబడతాడు!
`దానికి మళ్ళీ విచారణ ఎందుకు?
`దేశ వ్యాప్తంగా ఇదే జరుగుతోంది!
`కేంద్రం ఎందుకు స్పందించదు?
`రాష్ట్రాలన్నీ తీర్మానాలు చేసి ఎందుకు పంపవు?
`పట్టుబడ్డా కొలువులు..వారికే ప్రమోషన్లు!
`అవినీతి అధికారులకే అందలాలు.
`ఇదీ మన వ్యవస్థ దురవస్థకు ఆనవాలు.
హైదరాబాద్,నేటిధాత్రి: లంచగొండులు… ఆ పదం వినాలంటేనే అసహ్యం అనిపిస్తుంది. అలాంటిది లంచాలను విచ్చలవిడిగా తీసుకుంటున్న ఉద్యోగులకు చీమ కుట్టినట్లు కూడా కావడం లేదా? చీ..చీ అనిపించడం లేదా? జనమంతా ఛీ అని ఉమ్ముతున్నా సిగ్గనిపించడం లేదా? ఎందుకురా ఆ బతుకులు అంటూ జనం శాపాలు పెడుతున్నా లంచాలు మానరా? జనం పాలిట రాబంధులై నిత్యం పీక్కుతింటూనే వుంటారా? ఉద్యోగాలు సంపాదించుకున్నది ప్రజలకు సేవ చేయడానికా? లేక లంచాలు మెక్కడానికా? అసలు ప్రభుత్వ పనుల్లో పర్సెంటీజీలేమిటో? అవి ఎవరు నిర్దారించారో? ప్రజలు ఏ పని కోసం వచ్చినా దానికి ఒక రేటు ఫిక్స్ చేయడమేమిటో? ఉద్యోగులు అడిగిందానికి నోరు మూసుకొని ప్రజుల చెల్లించడమేమిటో? వ్యాపారులు, కాంట్రాక్టర్లు లక్షలకు లక్షలు లంచాలు ఇవ్వడమేమిటో? ఇలా లంచాలు తీసుకునే అదికారుల మూలంగా వ్యవస్ధకు జరుగుతున్న నష్టాలు ఎవరు పూడ్చాలి. ఒకప్పుడు నిర్మాణం చేసిన ఎన్నో కట్టడాలు ఇంకా చెక్కు చెదరడం లేదు. కాని ఇటీవల ఏ చిన్న పనిచేసినా బిల్లులు కాంట్రాక్టర్లకు బిల్లులు చేతికొచ్చే దాకా కూడా వుండడం లేదు. ఏ పనుల్లో నాణ్యత వుండడంలేదు. ఇక రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు, నీటి పారుదల, వ్యవసాయ శాఖ ఇలా చెప్పుకుంటూ పోతే ఏ శాఖను చూసినా ఏమున్నది గర్వకారణం. అన్ని శాఖలు కంపులోదొర్లుతున్న పందులకన్నా హీనం. రోజుకు కనీసం నలుగురు పట్టుబడుతున్నారు. లంచం తీసుకుంటూ పట్టుబడితే పరవు పోతుందన్న భయం లేదు. పట్టుకుంటే మహా అయితే ఓ నాలుగు రోజులు జైలుకు వెళ్తాం అంతకంటే జరిగేందేమీ వుంది. లంచం తీసుకోవడం దొంగతనంతో సమానం కాదా? చిన్న చిన్న దొంగతనం చేసిన వారిని పోలీస్ స్టేషన్‌లో చేసే సన్మానం లంచం తీసుకున్న అదికారులకు కూడా చేసే వ్యవస్ధ తయారైతే తప్ప అవినీతి అంతం కాదు. లంచం తీసుకుంటూ పట్టుబడిన ఉద్యోగికి వెంటనే ఉద్యోగం పోయేంత పరిస్దితి రావాలి. పట్టుబడిన ఉద్యోగులకు జైలులో సాదారణ ఖైదీకి వుండే వెసులుబాటైన జీవితమే వుంటుంది. కొంత కాలం తర్వాత బెయిల్ వస్తుంది. బైటకు వచ్చిన తర్వాత పాలకపక్షంలో వున్న పెద్దల ఆశీస్సులు, అవసరమైతే లంచాల ద్వారా సంపాదించిన దానిలో కొంత ముట్టజెప్పితే చాలు. మళ్లీ తన కొలువు తనకు వుస్తుంది. ఆ తర్వాత కేస్ క్లోజ్ అవుతుంది. తనను అన్యాయంగా ఇరికించారన్న సాక్ష్యాలను సృష్టించి తప్పించుకోవడం పరిపాటిగా మారింది. ఒక వేళ ఇలాంటి వెసులుబాటు కాని పక్షంలో రెండేళ్ల కాలం వరకు కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వుంటుంది. అందుకు ఇతర అధికారుల సహాకారంతో ఆ కేసు రెండేళ్లు దాటిందంటే చాలు..వెంటనే మళ్లీ తిరిగి ఉద్యోగం. అవసరమైతే ప్రమోషన్. ఇదే మన ఉద్యోగ వ్యవస్ధలో వున్న వెసులుబాటు. అది ఇప్పుడు అందరికీ అర్ధమైపోయింది. దాంతో ఏ ఉద్యోగి భయపడడం లేదు. భయపడి లంచం తీసుకోకుండా వుంటే ఈ వ్యవస్దలో కోటీశ్వరిడిని కాలేదు. రేపటి తన కుటుంబ తరానికి ఆస్దులు కూడగట్టలేనని తెలుసుకున్నారు. ప్రతి పనికి ఒక రేటు పిక్స్ చేసుకుంటున్నారు. అది ఏ పైని అయినా సరే..చిన్నా చితక అన్న ఆలోచన లేదు. సామాన్యులనుంచి కాంట్రాక్టర్లు, వ్యాపారుల నుంచి ఉద్యోగుల నోటి నుంచి వచ్చిన మాటే చివరి మాట. అంతే ముట్ట చెప్పాలి మూట. ఇక రైతులను పీడిరచుకు తినడంలో రెవిన్యూ వ్యవస్ద. భూముల కొనుగోలు, అమ్మకాలు, వారికి కాని భూములు రిజిస్ట్రేషన్ చేయడం కోసం అదికారులు తీసుకునే సొమ్ముకు లెక్కేలేదు. నిత్యం కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. లంచావతరాలు రోజురోజుకూ పెరుగుతున్నారు. తాజాగా సిరిసిల్లలో నీటి పారుదల శాఖకు చెందిన ఓ ఉద్యోగి లంచం తీసుకొని పట్టుబడ్డారు. కాని ఆయన ముఖంలో ఎలాంటి చీకు,చింత లేదు. భయం అసలేలేదు. పట్టుకుంటే మహా అయితే ఏం చేస్తారు? అన్నట్లు చూపులున్నాయి. ఏసిబి పట్టుకుంటే కనీసం కళ్లలోనైనా ఏదో ఒక సానుభూతి కోసం ఎదురుచూస్తున్నట్లు ముఖ కవళికలు మార్చేవారు వుంటారు. కాని ఈ ఉద్యోగి మాత్రం సోఫాలో దర్జాగా కూర్చొని, చిరునవ్వు చిందిస్తున్నాడు. అంటే లంచం తీసుకునే అదికారుల్లో ఎంతో భరోసా వుంటే తప్ప అలాంటి వ్యవహార శైలి కనిపించదు. పట్టుకున్నారు..అయితే ఏంటి? అని ఏసిబినే ప్రశ్నిస్తున్నట్లు అదికారుల వ్యవహార శైలి వుంటోంది. ఓ వైపు ప్రజలను లంచాల కోసం ఏ ఉద్యోగి అయినా వేదిస్తే వెంటనే ఏసిబిని ఆశ్రయించండి. అంతా గోప్యంగా వుంచుతామని ప్రకటనలు చేస్తున్నారు. ఈ మధ్య ఆ శాఖ పనితీరు కూడా ఎంతో బాగుంది. నిత్యం వారు ఎంతో కష్టపడుతున్నారు. ప్రజల పిర్యాదులకు బాగా స్పందిస్తున్నారు. ఎంత పెద్ద ఉద్యోగి అయినా సరే పట్టుకుంటున్నారు. ఎక్కడా వెనుకంజ వేయడంలేదు. పట్టుకోవడంలో ఎలాంటి శషభిషలు ప్రదర్శించడం లేదు. జాప్యం చూపడం లేదు. పిర్యాదు చేసిన ప్రజల చేత పదే పదే పిర్యాధులు కూడా తీసుకునేంత ఆలస్యం కూడాచేయడం లేదు. వెంటనే స్పందిస్తున్నారు. అదును చూసి పట్టుకుంటున్నారు. ఇంత వరకు బాగానే వుంది. అలా దొరికిన ఉద్యోగులను కోర్టులో ప్రవేశపెడుతున్నారు. చేతులు దులుపుకుంటున్నారు. మరి కేసుల విచారణ సమయంలో పట్టుకున్న అదికారులు సాక్ష్యం సరిగ్గా చెప్పడం లేదా? లేక ఆ పని తమది కాదని వదిలేస్తున్నారా? పోలీసులకు అప్పగించి చేతులు దలుపుకుంటున్నారా? ఎక్కడ లోపం జరుగుతోంది. ఎందుకు అవినీతి ఉద్యోగులు మళ్లీ ఉద్యోగాలు పొందుతున్నారు. నిజానికైతే ఒక్కసారి లంచంతో పట్టుబడి ఉద్యోగి మళ్లీ ఉద్యోగానికి అర్హుడు కాదు. ఏదైనా ఒకటి రెండు సందర్భాలలో ఆ అదికారిని టార్గెట్ చేసి ఇరించారన్న వార్తలు కూడా వస్తుంటాయి. అయినా అధికారి లంచం అడక్కుండా..ఇవ్వకుండా వున్నప్పుడు నోట్లను ఆ ఉద్యోగి ముట్టుకునే అవకాశం లేదు. అలాంటప్పుడు టార్గెట్ చేయడం అన్నది జరిగే ప్రశ్నే ఉత్పన్నం కాదు. కాని లాలో వున్న లొసుగులను ఆదారం చేసుకొని లంచాలతో సంపాదించిన సొమ్మును విసిరేసి, మళ్లీ ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. అంతకంతకు మళ్లీ మళ్లీ లంచాలతో సంపాదించుకుంటున్నారు. మన సమాజంలో అలాంటి ఉద్యోగులు ఎంతో మంది వున్నారు. అయితే ఇక్కడ ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న ఒక్కటే. లంచంతీసుకుంటూ పట్టుబడిన ఉద్యోగి ఉద్యోగం ఎందుకు వెంటనే పోదు? ఏసిబి అధికారులు రెడ్ హాండెడ్‌గా పట్టుకున్న తర్వాత కూడా అది ఫేక్ ఎలా అవుతుంది. ఏసిబి అదికారులకు , ఇతర ఉద్యోగులకు ఏలాంటి సంబంధాలు వుండవు. ఒక వేళ ఏసిబి వాళ్లు టార్గెట్ చేశారనడానికి ఆస్కారమే లేదు. ఏసిబి అధికారులు న్యాయంగా, దర్మంగా పనిచేస్తే తప్ప లంచావతారులైన ఉద్యోగులు పట్టుబడరు. ఒక వేళ ఏసిబి వాళ్లు ఆ అదికారులను తప్పించాలనుకుంటే , పట్టుకోకముందే తప్పించొచ్చు. ఏసిబి అధికారులు పట్టుకున్న తర్వాత ఉద్యోగులు నీతిమంతులెలా అవుతారు? మళ్లీ వాళ్లకు క్లీన్ చీట్ ఎలా వస్తుంది. అంటే ఏసిబి అధికారులను పనితీరును తప్పు పట్టినట్లా? లేక వ్యవస్ధను ఎగతాళి చేసినట్లా? చాల మంది ఉద్యోగులు, అందులో ఉన్నత ఉద్యోగులు ప్రజలను రాబందుల్లా పీడిరచుకు తింటున్నారని తెలుసు. తమ భూములను తమ పేరు మీద మార్చడానికి కూడా ఎకరానికి లక్షల రూపాయలు వసూలు చేసిన అదికారులు కూడా వున్నారు. అలా తప్పని పరిస్దితుల్లో లంచాలు ఇచ్చి, అప్పులు చేసి మరీ లంచాలు ఇచ్చుకున్న ప్రజలు కోకొల్లలున్నారు. లంచం ఇవ్వడం తప్పే, తీసుకోవడం తప్పే? అని మాత్రం ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటే సరిపోతుందా? కేంద్ర ప్రభుత్వం అనేక చట్టాలలో మార్పులు తీసుకొస్తున్నారు. ఏకంగా న్యాయ వ్యవస్దలోనే అనేక మార్పులు తీసుకొచ్చారు. బ్రిటీష్ ఇండియానుంచి ఇంత కాలం వారసత్వంగా వస్తున్న అనేక చట్టాలను మార్చి, కొత్త న్యాయ సంహితను తెచ్చారు. మరి అందులో అవినీతి అదికారుల గురించి ఆలోచించలేదు. అసలు అధికారులు సాగిస్తున్న అవినీతి గుర్తించలేదు. కనిపించడ ంలేదా? దేశ వ్యాప్తంగా అవినీతి అనేది ఎలా పెరిగిపోయిందో చూస్తూనే వున్నాం. కేంద్రం ప్రత్యేకచట్టం తీసుకురావడానికి అభ్యంతరం ఏమిటి? అందుకు రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి. తెలంగాణలో ఎంత ఉద్యోగ వ్యవస్దలో ఎంత అవినీతి జరగుతుందో చూస్తూనే వున్నాం. అలాంటి అవినీతి అంతానికి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మాణంచేసి, కేంద్రానికి పంపొచ్చు కదా? అలా అన్ని రాష్ట్రాలు తీర్మాణాలు చేసి, పంపిస్తే బాగుంటుంది. ఉద్యోగి లంచం తీసుకుంటే ఆ క్షణమే ఉద్యోగం కోల్పోతాడన్న కొత్త చట్టం తీసుకురావడానికి ఎందకు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయడంలేదు. ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు. అవినీతి అంతం చేస్తామంటారు. అవినీతి అదికారులను కాపాడుతుంటారు. ఇదెక్కడి దిక్కుమాలిన రాజకీయాలో ఎవరికీ అర్దం కావు.
నర్సంపేట మండలం ఇటుకాలపల్లి గ్రామంలో శ్రీ సూరమాంబ -శ్రీ కంఠ మహేశ్వరుని కల్యాణం కన్నుల పండుగగా జరిగింది.ఐదు రోజుల పాటు గౌడ కులస్తుల ఆధ్వర్యంలో శ్రీ కంఠ మహేశ్వరునికి ఉత్సవాలు నిర్వహించారు.మొదటి రోజు ఆలయంలో మామిడి తోరణాల అలంకరణ, గౌడ కులస్తులకు మాలాదారణ, పటం కథ, రెండో రోజు గ్రామ దేవత లకు ప్రత్యేక పూజలు, మూడో రోజు జాలాభిషేకం, నాలుగో రోజు శ్రీ సూరమాంబ దేవి -శ్రీ కంఠ మహేశ్వరునికి కళ్యాణం,శ్రీ రేణుక-ఎల్లమ్మ తల్లి, జమదగ్ని పండుగ,బోనాల సమర్పణ, కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాల భాగంగా బోనాల కార్యక్రమం లో గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరయ్యారు. శ్రీ కంఠ మహేశ్వరుని ఆలయంలో రేణుకా ఎల్లమ్మ,వనం మైసమ్మ,సూరమంబా దేవి, శ్రీ కంఠ మహేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం బొట్టు పెద్ద మనుషులు కట్ల సుధాకర్ గౌడ్, బుర్ర వెంకటేశ్వర్లు గౌడ్, సంఘం అధ్యక్షులు బుర్ర ఆనందం గౌడ్, కార్యదర్శి కక్కెర్ల కుమారస్వామి గౌడ్, కోశాధికారి తాళ్లపెల్లి అశోక్ గౌడ్, పిఏసిఎస్ వైస్ చైర్మన్ మేరుగు శ్రీనివాస్ గౌడ్, కట్ల కనుకయ్య గౌడ్, మచ్చిక రవీందర్ గౌడ్, బూడిద రవీందర్ గౌడ్, బూడిద శివ కోటి గౌడ్, ఆరెల్లి హరికిషన్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ లు ఆరెల్లి వేణు గౌడ్, బోడిగే వినయ్ గౌడ్,మాజీ ఎంపీపీ మోతె పద్మ నాబరెడ్డి, మాజీ జెడ్పి టీ సి కోమాండ్ల గోపాల్ రెడ్డి, ఎంపిటీసీ వీరన్న నాయక్, మాజీ పిఏసిఎస్ చైర్మన్ దుపాటి ఆనంద్ గౌడ్,యువజన నాయకులు బోడిగే క్రాంతి గౌడ్, కుమార్ గౌడ్, రాకేష్ గౌడ్, రంజిత్ గౌడ్, రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జైపూర్ మండలం ఇందారం గ్రామపంచాయతీని సోమవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. అలాగే సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు స్థల పరిశీలన చేపట్టి అధికారులకు తగు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, తహసిల్దార్ వనజా రెడ్డి, విద్యుత్ ఏఈ మనోహర్,ఆర్ఐ తిరుపతి,పంచాయతీ కార్యదర్శి సుమన్ తదితరులు పాల్గొన్నారు.
స్వాములకు అన్నప్రసాదం వితరణ చేసిన మార్కెట్ చైర్మన్ రాజిరెడ్డి
పరకాల నేటిధాత్రి :
మండలంలోని మల్లక్కపేట గ్రామంలోగల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో మాలధారుల స్వాములకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి అన్నప్రసాదం అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి,ఆలయ చైర్మన్ అంబిరి మహేందర్,ఆలయ ప్రధానార్చకులు కాటూరి జగన్నాధాచార్యులు,అల్లం రఘు నారాయణ,కొత్తపల్లి రవి,ఆలయ కమిటీ డైరెక్టర్ మిట్ట బాలరాజు,టెంపుల్ డైరెక్టర్ దొమ్మటి శంకరయ్య,మంద నాగరాజు,దుప్పటి సాంబశివుడు తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 28 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా ఐదు మంది తమ సమస్యలు తెలుపగా, 23 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మునిసిపల్ పార్క్ వెనుక ప్రాంతంలో చెత్త వాహనం సక్రమంగా వచ్చేలా చూడాలని, పూల మార్కెట్, సున్నపు వీధిలో ఆక్రమణలు తొలగించాలని, రాజీవ్ నగర్ లోని మసీదు వద్ద నీటి వసతి కల్పించి, మొక్కలు నాటించాలని, చేపల మార్కెట్ వద్ద శుభ్రంగా ఉంచాలని, కొంకచెన్నాయ గుంటలో అక్రమంగా వేసిన యు డి ఎస్ తొలగించాలని, వరదరాజ నగర్ పాచిగుంట వద్ద సక్రమంగా నీరు రావడం లేదని, గతంలో ఇంటికోసం డబ్బులు కట్టామని ఇళ్ళైనా, డబ్బులు ఇప్పించాలని కోరారని తెలిపారు. ఆయా సమస్యలను విభాగాల వారికి పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించాలని కమిషనర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డీసీపీ మహాపాత్ర, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, డి.ఈ.లు, ఏసిపి లు, తదితరులు ఉన్నారు.
అఖిలభారత పద్మశాలి సంఘం శాశ్వత సభ్యత్వా ల నమోదు కార్యక్రమం
జై మార్కండేయ జై జై మార్కండేయ
జై పద్మశాలి జై జై పద్మశాలి
శాయంపేట నేటిధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని చేనేత సహకార సంఘం గ్రామ ఉపాధ్యక్షుడు తుమ్మ ప్రభాకర్ ఆధ్వర్యంలో చేనేత సహకార సంఘం నందు కార్మికులందరికీ నూతన శాశ్వత సభ్యత్వాలు ఇవ్వడం జరిగింది.
Registration
భవిష్య త్తులో పద్మశాలీలందరూ ఏకమై అఖిలభారత పద్మశాలి సంఘం ఎదుగుదలకు తోడ్పాటు చేసి భవిష్యత్తులో పద్మశాలీల అందరికీ సమన్యా యం జరిగే విధంగా కార్యవర్గం అందరం కృషి చేస్తారు. ఈ కార్యక్ర మంలో శాయంపేట మాజీ సర్పంచ్ వలుపదాసు చంద్రమౌళి ,చేనేత సహకార సంఘం డైరెక్టర్ బూరలక్ష్మీ, నారాయణ ,నాయకులు, కందగట్ల గోపి తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం మార్కెట్ ప్రాంతంలో గల పద్మశాలి సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. గత అధ్యక్ష పదవి కాలం ముగిసిన సందర్భంగా మరల అధ్యక్ష ఎన్నికల కొరకై ప్రణాళిక సిద్ధం చేయుట కొరకు పద్మశాలి కుల బాంధవుల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అడక్ కమిటీ ఏర్పాటు చేశారు. ప్రస్తుత అడగ్ కమిటీ ఆధ్వర్యంలో మార్కెట్ ప్రాంతంలోని అన్ని వార్డులలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా మార్కెట్ ఏరియాలోనీ వ్యాపార సముదాయాలలో గల పద్మశాలి కుల బాంధవులను కలిసి వారి యొక్క సభ్యత్వ నమోదును కమిటీ సభ్యులు చేపట్టారు. కమిటీ సభ్యులు పిట్టల సుధాకర్, బత్తుల సతీష్ బాబు మాట్లాడుతూ కుల సభ్యులు ఎవరైనా ఇంకా సభ్యత్వ నమోదు చేసుకోనట్లయితే మార్కెట్ ప్రాంతంలో గల కళ్యాణ్ సూపర్ మార్కెట్ వద్ద నమోదు చేసుకోగలరనీ తెలిపారు. అధ్యక్ష పదవి ఎన్నిక కొరకు తేదీ త్వరలో ఖరారు చేస్తామని, ఈలోగా సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
ముత్యాల మహేష్ పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన…ఎఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు.
కాంగ్రెస్ పార్టీ కట్ర్యాల గ్రామశాఖ అధ్యక్షులు బండారి సతీష్ చేసిన ఆర్థిక సహాయాన్ని మహేష్ కుటుంబ సభ్యులకు అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
వర్దన్నపేట (నేటిదాత్రి ):
ఈ రోజు…వర్ధన్నపేట మండలం, కట్ర్యాల గ్రామానికి చెందిన *గ్రామపంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్(ట్రాక్టర్ డ్రైవర్) ముత్యాల మహేష్ అనారోగ్యముతో నిన్న తెల్లవారుజామున మరణించినందున వర్ధన్నపేట AMC చైర్మన్ నరుకుడు వెంకటయ్య గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు కట్ర్యాలలోని వారి నివాసం వద్ద మహేష్ పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించి మహేష్ భార్య,పిల్లలను కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపిన అనంతరం కాంగ్రెస్ పార్టీ కట్ర్యాల గ్రామశాఖ అధ్యక్షులు బండారి సతీష్ మానవతా హృదయంతో చేసిన రూ.2000/- ల ఆర్థిక సహాయాన్ని ఏఏంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ జిల్లా కార్యదర్శి గజ్జల సదయ్య, మాజీ ఉప సర్పంచ్ & మైనార్టీ మండల అధ్యక్షుడు ఎండి అక్బర్,కాంగ్రెస్ పార్టీ మండల మహిళా నాయకురాలు తీగల సునీత గౌడ్,MD రషీద్ ,గార్లు మహేష్ కుటుంబ సభ్యులకు అందజేశారు.మహేష్ చనిపోవడంతో కుటుంబ యజమానిని కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయినందున నిస్సహాయ స్థితిలో ఉన్న వారి కుటుంబ పరిస్థితులను ఎంఎల్ఏ నాగరాజు దృష్టికి తీసుకెళ్లగా. మానవతా హృదయంతో స్పందించిన ఎమ్మెల్యే చనిపోయిన మహేష్ కుటుంబానికి ఏళ్లవెళాల కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారని తెలిపారు.ఈకార్యక్రమములోకాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు బండారి సతీష్ గౌడ్,మాజీ ఉప సర్పంచ్& కాంగ్రెస్ పార్టీ మైనార్టీ మండల అధ్యక్షుడు ఎండీ అక్బర్,కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ వరంగల్ జిల్లా కార్యదర్శి గజ్జెల సదయ్య,సీనియర్ నాయకులు నాం పెళ్లి రవీందర్,మహిళా మండల నాయకురాలు తీగల సునీత గౌడ్, ఎండి రషీద్ , ఎస్సీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి కొండేటి మధుకర్. ఇ రుకు శ్రీధర్ లు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రాయిపల్లి డి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల మాణిక్యమ్మ (62) అనే ఉపాధి హామీ మహిళ కూలీ సోమవారం మధ్యాహ్నం పని స్థలంలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారని సర్పంచ్ ప్రతినిధి విజయ కుమార్ తెలిపారు. సంబంధితశాఖ అధికారులు, సిబ్బంది మృతురాలి కుటుంబాన్ని పరామార్శించారని విజయ కుమార్ వివరించారు. సంబంధిత శాఖ మండల స్థాయి అధికారులు మృతురాలి అంత్యక్రియలకు కొంత నగదు ఆర్థిక సహాయం అందచేసినట్లు గ్రామస్థులు తెలిపారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.