మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి జయంతి వేడుకలు.

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి జయంతి వేడుకలు…

మందమర్రి నేటి ధాత్రి:

*కార్మిక మరియు గనుల శాఖ మంత్రివర్యులు చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి వేడుకలు మందమర్రి మార్కెట్ సంజయ్ గాంధీ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదట యూత్ కాంగ్రెస్ నాయకులు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.యూత్ కాంగ్రెస్ నాయకులు చెన్నూరు నియోజక యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నేరటి వెంకటేష్,రాయబారపు కిరణ్,చిప్పకుర్తి శశిధర్ మాట్లాడుతూ పీవీ నరసింహారావు భారతరత్న అవార్డు గ్రహీత, తొలి తెలుగు ప్రధాని
తెలంగాణ నుండి కూడా మొట్టమొదటి ప్రధాని మంత్రి అని
బహుభాషా కోవిదుడు అని కొనియాడారు. ఆ మహనీయుని కి ఇదే ఘన నివాళి అని తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు రమేష్,చోటు,సూరజ్ కిరణ్,సతీష్,బాచి,చింటూ,శంకర్, రాజ్ కుమార్,రాజేష్,రాజు పాల్గొన్నారు.*

యాదాద్రి నరసింహస్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎస్సార్.

యాదాద్రి నరసింహస్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి:

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వారి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.అంతకుముందు ఆలయ అధికారులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు. ఆలయంలో స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగాణంలో ఉన్న వేదాశీర్వచన మండపంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు పండితులు ఆశీర్వచనం చేసి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎమ్మెల్యే వెంట ఆలయ అధికారులు, ప్రోటోకాల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

జయంతి ఉత్సవాల సందర్భంగా ఊరేగింపు. !

శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా ఊరేగింపు

వనపర్తి నేటిధాత్రి :

 

వనపర్తి పట్టణంలో శంకర్ గంజ్. శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం రాత్రి స్వామివారి ఊరేగింపు శంకర్ గుంజీ నుండి బయలుదేరి కమాన్ చౌరస్తా రాజీవ్ చౌక్ ద్వారా భక్తిశ్రద్ధలతో ఆలయ కమిటీ నిర్వాహకులు నిర్వహించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version