గాంధీభవన్లో ఈరోజు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన వివరణ లేఖ.

బ్రేకింగ్ న్యూస్

నేటిధాత్రి, హైదరాబాద్.._

కొండా మురళీ పిర్యాదు లేఖ..

హైదరాబాదులోని గాంధీభవన్లో ఈరోజు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన వివరణ లేఖ.

హైదరాబాద్ నేటిధాత్రి:

2007లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యవహారాన్ని నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాకు అప్పగించారు.

నాటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గాదె వెంకట్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంకు సంబంధించి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపట్టగా వరంగల్ వ్యవహారాలు మొత్తం నేనే పర్యవేక్షించడం జరిగింది.

వరంగల్ జిల్లా నుంచి ఎక్కువ మంది దళితులు, గిరిజనులకు అవకాశం దక్కాలని, ఈ జిల్లాలో ఎక్కువ మందికి పునర్విభజనలో ఆయా వర్గాలకే నేను సీట్లు కేటాయించాను. ఎందుకంటే, అట్టడుగువర్గాలకే న్యాయం జరగాలన్నది నా సిద్ధాంతం. నేను నా రాజకీయ పంథాను ప్రారంభించిందే నిమ్న వర్గాలకు న్యాయం చేయాలని.

వరంగల్ జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్ స్థానాలు నిమ్నవర్గాలకు కేటాయించడంలో నాడు నాదే కీలక పాత్ర.

వరంగల్ పార్లమెంట్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లోని ఒక దాన్ని ఎస్సీ, మరొక దాన్ని ఎస్టీ చేసి దళిత, గిరిజనులకు ప్రత్యేక అవకాశం కల్పించేలా చేసిన.

కాగా, ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనే ఏ జిల్లాలో లేని విధంగా ఒక జిల్లాలో రెండు స్థానాలు రిజర్వు కావడం కేవలం వరంగల్ లో మాత్రమే సాధ్యం అయింది. అందు కోసం నేను తీవ్రంగా కృషి చేశాను.

సామాజిక న్యాయం చేయాలన్న నా ప్రయత్నంలో భాగంగా… ఈ ప్రక్రియతో తాను సీటును కోల్పోయానని… అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత రామసహాయం సురేందర్ రెడ్డి…. అందుకు నేనే(కొండా మురళీయే) కారణమని చెబుతూ రాజకీయాల్లోంచి బయటికి వెళ్ళిన పరిస్థితి ఉన్నది.

అయితే, నేడు ఆయన అల్లుడు అయిన మంత్రి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి, వరంగల్ జిల్లా ఇంఛార్జీ మంత్రిగా ఉండి నా సతీమణి శ్రీమతి కొండా సురేఖ మీద కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. అదే కోపంతో ఆయన ఉన్నట్టు తాజా పరిణామాలు చూస్తుంటే నిశితంగా అర్థం అవుతున్నది.

వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, లోకల్ ఎమ్మెల్సీ బస్వారాజు సారయ్యను వెంట పెట్టుకొని మా వరంగల్ ఈస్టు నియోజకవర్గంలో తిరుగుతున్నారు. అయినా, మేము వారికి ఎక్కడా ఇబ్బందులు చేయలేదు.

ఇదే బస్వరాజు సారయ్య, మా వరంగల్ ఈస్టు నియోజకవర్గంలో నా సతీమణి కొండా సురేఖ మీద 2014లో 40 వేల ఓట్లతో ఓడిపోయారు.

ఎమ్మెల్సీ బస్వారాజు సారయ్య, రామసహాయం సురేందర్ రెడ్డి గారికి ప్రధాన శిష్యుడు అనే విషయం అందరికీ తెలిసిందే.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాస్ లీడర్ గా ఉన్న మేము దాదాపు ప్రతి ఎన్నికల్లో గెలిచి నిలుచున్నాము.

ఇక ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి మహబూబాబాద్ కు చెందిన నాయకులు. ఆయన గతంలో కొండా సురేఖ మీద పోటీ చేస్తే, ఆ ఎన్నికల్లో కొండా సురేఖకు ఘనమైన మెజారిటీ వచ్చింది. కానీ, నరేందర్ రెడ్డికి కేవలం 2 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఇక డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఈరోజు వరకు ఒక్క ఎలక్షన్ కూడా గెలవలేదు. ఆమె మా వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి మేము(నేను నా సతీమణి) వచ్చేటప్పుడు 26 మంది కార్పొరేటర్లు వచ్చారు. ఇదీ వరంగల్ లో కొండా మురళి, కొండా సురేఖ దంపతుల పవర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పుడు నేను రాజీనామా చేసి వచ్చిన. అది నా నిబద్ధత. కొంతమంది లీడర్ల మాదిరి పార్టీ మారినా… పదవిలో కొనసాగలేదు. భారతదేశంలోనే ఏకగ్రీవంగా గెల్సిన ఏకైక ఎమ్మెల్సీని. ఈ విషయం అందరికీ తెలిసిందే.

ఇక నన్ను ఎవరు పిలిచి ఈ విషయాలు చెప్పమని అడగలేదు. మన పీసీసీ ప్రెసిడెంట్, బీసీ బిడ్డ మహేష్ కుమార్ గారి మీద అభిమానంతో నేనే వచ్చి పార్టీకి వివరించాలని అనుకున్నాను. అందుకే, స్వయంగా వచ్చి తెలియజేయడం జరిగింది.

వర్ధన్నపేట – కేఆర్ నాగరాజు

ఈ నియోజకవర్గంలో మా ప్రభావం స్పష్టంగా ఉంటుంది.

ఈ నియోజకవర్గంలో మాకు రాజకీయంగా, వ్యక్తిగతంగా చాలా మంది అభిమానులు ఉన్నారు.

వాస్తవానికి ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కాక మునుపు… ఎర్రబెల్లి దయాకర్ రావు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండేవారు.

ఎర్రబెల్లి దయాకర్ రావు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ చేస్తున్న అరాచకాలకు అడ్డు నిలిచి పోరాడినందుకు మాకు ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది.

అయితే, ప్రస్తుత ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎవరు ఎటు రమ్మంటే అటు వెళ్తారు. ఆయనకు ప్రత్యేకంగా వర్గాలు అంటూ ఏమీ లేవు. రేపు మేము ఏదైనా ప్రోగ్రాంకు రమ్మని పిలిచినా వచ్చి వెళతారు.
మాతో కూడా ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి.

భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ

ఒకానొక సందర్భంలో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి నన్ను (కొండా మురళీ) నిలుచోవాలని అక్కడి ప్రజల నుంచే విజ్ఞప్తులు పెద్ద ఎత్తున వచ్చాయి.

కానీ, ఎన్నికల సమయంలో అప్పటికే నా సతీమణి కొండా సురేఖ వరంగల్ ఈస్టు నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో మా కుటుంబం నుంచే రెండో నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఇష్టం లేక చేయలేదు.

ఈ నియోజకవర్గంతో నాకు (కొండా మురళికి) చాలా మంచి పట్టు ఉన్నదని సర్వత్రా తెలిసిందే.

గతంలో మదుసూదనాచారి గెలుపు కోసం తీవ్రంగా నేను కృషి చేశాను.

వాస్తవానికి గండ్ర సత్యనారాయణ గతంలో టీడీపీ నుంచి వచ్చారు. అయినా నేను సపోర్టు చేసినం. ఆ సమయంలో మా సపోర్టును ఆయన అడిగారు. మేము కూడా పార్టీ గెలుపు కోసం మనస్ఫూర్తిగా పని చేశాము.

అయితే, ఈయన ప్రస్తుతం మా మీదకు వ్యతిరేకంగా ఇతర నాయకులతో కలవడం శోచనీయం.

అయితే, ఈయనతో కూడా మాకు మంచి సంబంధాలే ఉన్నాయి.

ములుగు సీతక్క

మంత్రి సీతక్క గారితో మాకు ఎప్పుడూ ఎటువంటి ఇబ్బంది లేదు. ఆమె పని ఆమె చేసుకుంటూ పోతున్నారు. అయితే, కడియం శ్రీహరి పార్టీలోకి వచ్చినప్పటి నుంచి మంత్రి కొండా సురేఖకు…. మంత్రి సీతక్క కు గ్యాప్ వచ్చిందని, కావాలని కొన్ని పేపర్లలో వార్తలు రాయిస్తున్నారు. సోషల్ మీడియాలో పెయిడ్ ప్రచారం చేస్తున్నారు.

పరకాల రేవూరి ప్రకాశ్ రెడ్డి

ఈ నియోజకవర్గం పూర్తిగా మాదే (కొండా సురేఖ, కొండా మురళి దంపతులదే). గతంలో ఇదే నియోజకవర్గం నుంచి నా భార్య కొండా సురేఖ మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. మంత్రిగా కొనసాగిన విషయంలో అందరికీ తెలిసిందే.

ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామం, ప్రతి మండలంలో కొండా మురళి, కొండా సురేఖకు ఎంతోమంది అభిమానులు, కార్యకర్తలున్నారు. ఇది జగమెరిగిన సత్యం.

ఎన్నికల సమయంలో కూడా రేవూరి ప్రకాశ్ రెడ్డి మా మద్దతు అడిగారు. మేము నిస్వార్ధంగా ఆయనకు సపోర్టు చేసినం. మా మద్దతుతోనే గెలిచారు.

ఈరోజు ఆయన కూడా మాకు వ్యతిరేకంగా గుడుపుఠాణి కట్టి రాజకీయాలు చేస్తున్నారు. ఇది చాలా దారుణం.

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి సంబంధించిన క్రషర్స్ లో అక్రమాలు జరుగుతున్నాయని మేము చెప్పి ఆపిస్తే… వాళ్ళు వేరే బ్రోకర్స్ ద్వారా వచ్చి రేవూరి ప్రకాశ్ రెడ్డికి కొంత ముట్టజెప్పి వాటిని ఓపెన్ చేయిస్తున్నారు. వీటి ద్వారానే బీఆర్ఎస్ నేతలకు… ఇతర నియోజకవర్గంలోనే నేతలకు పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయి. దీనివల్ల బీఆర్ఎస్ ఆర్థికంగా బలపడుతున్నది. ఇది కాంగ్రెస్ కి నష్టం. ఇది జిల్లాలో అందరికి తెలిసిందే. అయినా ఎవరు నోరు మెదపరు.

ఇక పరకాలలో నా ఊరు ఉన్నది. గతంలో అక్కడికి ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్పీ రావాలంటే రాలేకపోయేవారు. వెహికల్ దిగి నడిచి వచ్చిన దుస్థితి ఉంది కూడా. బీఆర్ఎస్ పదేండ్ల హయాంలో కూడా మా గ్రామానికి అప్పటి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కూడా వచ్చే సాహసం చేయలేదు. కానీ, ఇటీవల ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఇష్టారీతిన మాట్లాడి వచ్చారు. రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శించారు.

ఆయన మాటలతో అక్కడ లా అండ్ ఆర్డర్ ఇబ్బందులు ఎదురైతే ఎవరిది బాధ్యత?

వరంగల్ వెస్ట్ – నాయిని రాజేందర్ రెడ్డి

నాయిని రాజేందర్ ఈ రోజు చాలా పెద్ద పెద్ద మాటలు, స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ, ఎన్నికల ముందు వచ్చి మా (కొండా దంపతుల) మద్దతు అడిగారు. అప్పటి ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ను ఎన్నికల కదనరంగంలో తట్టుకోవాలంటే తనకి మా మద్దతు కావాలని ప్రాధేయ పడ్డారు. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్సీతో వరంగల్ తూర్పులో తిరుగుతున్నారు.

వరంగల్ ఈస్టులో ఎలక్ట్రిసిటీ అధికారులకు పోస్టింగులు ఇప్పించుకుంటున్నారు మా ప్రమేయం లేకుండానే, ముఖ్యంగా రెడ్డి అధికారులకు పోస్టింగ్లు ఇచ్చుకుంటున్నారు.

తనకి సంబంధం లేని మా నియోజకవర్గంలో పోస్టింగులు ఇచ్చుకోవడం ఏంటి?

ఎంజీఎంలో ఆకస్మిక తనిఖీ చేపట్టి…. మాకు సమాచారం లేకుండా మా అధికార పరిధిలోకి చొచ్చుకురావడం సహేతుకం కాదు కదా.

జనగామ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాతో బాగానే ఉంటున్నరు.

స్టేషన్ ఘనపూర్: కడియం శ్రీహరి బీఆర్ఎస్ ను ముంచి మన పార్టీలోకి వచ్చిండు. స్థానిక కాంగ్రెస్ ఇంఛార్జీ ఇందిరకు చుక్కలు చూపిస్తున్నడు. ఆమె వర్గీయులను కూడా టార్చర్ చేస్తున్నడు. 200 నుంచి 300 మంది కడియం వేధింపులు తట్టుకోలేక నాకు చెప్పినా… నేను ఆయన నియోజకవర్గంలో ఇన్వాల్ కావడం లేదు. కానీ, జిల్లాలో ఏం చేస్తున్నాడో యావత్ రాష్ట్రమంతా తెలుస్తున్నది.

పాలకుర్తి యశశ్వినీ రెడ్డి:

ఈమె యాంటీ దయాకర్ రావు వర్గమే. నేను ఎన్నికల సమయంలో ఆమెకు బాగా సపోర్టు చేసిన. అన్ని విధాలుగా అండగా నిలిచిన. నన్ను ఇక్కడి నుంచి నిలబడాలని చాలామంది చెప్పినా… నిలబడకుండా వారికే మద్దతు ఇచ్చి గెలిపించినం.

డోర్నకల్: రాంచంద్రనాయక్: ఈ నియోజకవర్గంలో మనకు పెద్దగా పట్టు లేదు. కానీ, ఏజెన్సీ ఏరియా, నక్సలైట్ ప్రభావిత ప్రాంతంలో నాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగు ఉన్నది. నేను కూడా అక్కడి వారు ఎవరు వచ్చినా వారి పనులు చేయడం జరుగుతున్నది.

మహబూబాబాద్: ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వేం నరేందర్ రెడ్డి కేవలం ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే గెలిచారు. ఒక దఫా వేం నరేందర్ రెడ్డి, కొండా సురేఖ మీద కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే… ఆయనకు కేవలం 2 వేల ఓట్లు వచ్చాయి. డిలిమిటేషన్లో ఆయన సీటు ఎగిరిపోయిందని… అందుకు నేనే కారణమని నాపై కోపంతో ఉన్నట్టు ఉన్నారు వేం నరేందర్ రెడ్డి.

వరంగల్ నగర అభివృద్ధికి పాటు పడతామని కొండా దంపతుల హామీ


కొండా సురేఖను కలిసిన వరంగల్ కాంగ్రెస్ జిల్లా లీగల్ సెల్ చైర్మన్ శామంతుల శ్రీనివాస్

వరంగల్ నగర అభివృద్ధికి పాటు పడతామని కొండా దంపతుల హామీ:-

వరంగల్ హన్మకొండ నేటిధాత్రి (లీగల్):

వరంగల్ నగరంలో అండర్ రైల్వే గేట్ ప్రాంతం మురికి కాలువలతో, ముంపుకు గురి అవుతుందని, శాశ్వత పరిష్కారానికి, మంత్రివర్యులు కొండా సురేఖ గారు అన్ని చర్యలు తీసుకున్నారని, .శాఖరాశికుంఠ 39 డివిజన్ లో అభివృద్ధికి పాటుపతనని హామీనిచ్చారనీ అన్నారు.
ఈ కార్యక్రమం లో కతేరాశాల వేణు గోపాల్, బాసాని శ్రీనివాస్, ముత్యాల విజయ్, రుకాంగ్రెస్ లీగల్ సెల్ చెర్మెన్ శామంతుల శ్రీనివాస్ మహిళా నాయకురాలు, రావుల విజయరాంచందర్, రాధిక, కవిత, మెడిది రజిత, తదితరులు పాల్గొన్నా

బిఎస్పి చర్ల మండల అధ్యక్షుడు కొండా చరణ్.

నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇల్లు మొదటి లిస్టులో మంజూరు చేయకపోతే ఉద్యమం తప్పదు

బిఎస్పి చర్ల మండల అధ్యక్షుడు కొండా చరణ్

చర్ల నేటి ధాత్రి:

 

చర్ల మండల కేంద్రంలో బిఎస్పి పార్టీ కార్యాలయంలో పార్టీ మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కొండా చరణ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నియామకం లో గ్రామ కమిటీలు ఇచ్చిన లిస్టు అన్యాయమని అన్నారు చర్ల మండల వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు మూడో దఫాలో కేటాయించవలసిన వ్యక్తులను మొదటి దశలోనే కేటాయించడం సరైంది కాదని అన్నారు రాజకీయ కుట్రలో భాగంగా పేదలకు అన్యాయం జరుగుతుందని ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు గుర్తించాలని కోరారు తక్షణమే రాజకీయాలకతీతంగా నిరుపేదలను గుర్తించి న్యాయం చేయాలని తెలియజేశారు లేకుంటే బీఎస్పీ ఆధ్వర్యంలో అర్హులైన వారిని గుర్తించి ఉద్యమిస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు సామల ప్రవీణ్ పార్టీ ప్రధాన కార్యదర్శి చెన్నం మోహన్ పార్టీ కోశాధికారి పంబి కుమారి పార్టీ మండల ఈసీ మెంబర్ ఏకుల వెంకటేశ్వర్లు పార్టీ మండల ఈసీ మెంబర్ గుర్రాల విజయ్ కుమార్ ఉప్పరిగుడం సెక్టార్ అధ్యక్షులు రాజు కుదునూరు సెక్టార్ అధ్యక్షులు వర్షిక త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు

అవినీతిని బట్టబయలు చేసిన మంత్రి కొండా సురేఖ.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో మంత్రుల అవినీతిని బట్టబయలు చేసిన మంత్రి కొండా సురేఖ

-మంత్రి వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించి..సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు

-బీసీ మహిళా మంత్రిపై జరుగుతున్న కుట్రలను తిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉన్న బీసీ సమాజం

-వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

గత పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు చేసిన అవినీతి చిట్టాను విప్పిన అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీలోని అగ్రకులస్తులు తప్పుగా వక్రీకరించి సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని, అట్టి కుట్రలను చూస్తూ బీసీ సమాజం ఊరుకోబోదని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ఘాటుగా హెచ్చరించారు. శనివారం ఆయన స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. కమిషన్లకు కక్కుర్తి పడి..ప్రతి పనిలో వాటాలు తీసుకుని..ధనిక తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టి వేశారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క అభివృద్ధి పని జరగాలన్నా, ఫైల్ కదలాలన్నా మంత్రులకు కమిషన్లు ఇస్తేనే పనులు జరిగేవని కాలేశ్వరం మిషన్ భగీరథ మిషన్ కాకతీయ లాంటి పథకాలలో భారీ అవినీతి జరిగిందని మంత్రి కొండా సురేఖ ఆరోపిస్తే.ఆ ఆరోపణలపై సమాజానికి స్పష్టతనివ్వాల్సిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు..వారి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ పార్టీలోని కొందరు అగ్రవర్ణ కులస్తులు మంత్రి కొండా సురేఖ ఎదుగుదలను ఓర్వలేకపోతున్నారని, బీసీ మంత్రిగా..ఓరుగల్లు ప్రజల ముద్దుబిడ్డగా.పేద ప్రజల గుండెచప్పుడుగా..నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యి..వారి హృదయాల్లో కొలువుదీరి.ప్రజా నాయకురాలిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని మంత్రివర్గంలో చోటు సంపాదించుకొని.మిగతా మంత్రులను కలుపుకొని..సమిష్టి నిర్ణయాలతో ప్రజా పాలనను ముందుకు తీసుకెళుతున్న తరుణంలో.బీసీ మంత్రి అయినా కొండా సురేఖ ఎదుగుదలను ఓర్వలేక.ఆమెను టార్గెట్ చేసి.కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రివర్గం మధ్య చిచ్చుపెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీలోని అగ్ర కులస్తులు కుట్రలు చేస్తున్నారని, ఈ కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ.ప్రజా కోర్టులో బీఆర్ఎస్ పార్టీ అగ్రకులస్తుల వైఖరిని ఎండగడతామని మహేందర్ గౌడ్ హెచ్చరించారు.

“కొండా” జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్.

“కొండా” జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్..

మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో వరంగల్‌లో మెగా జాబ్ మేళా..

నిరుద్యోగులతో కిక్కిరిసిన హోటల్ ప్రాంగణం

వరంగల్ తూర్పు, నేటిధాత్రి:

 

వరంగల్ తూర్పు నియోజక వర్గ పరిధిలోని ఏం.కే నాయుడు కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ ( సీతక్క) తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ. వరంగల్‌లో మెగా జాబ్‌మేళా ప్రారంభించిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క లు మాట్లాడుతూ, 60 కంపెనీల ద్వారా 11 వేల మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం చేశాం అని అన్నారు. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కష్టం అని, ఎవరి ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు దక్కుతాయి అని అన్నారు. గత ప్రభుత్వం కేసీఆర్‌ హయాంలో 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అని విమర్శించారు. మా ప్రభుత్వంలో 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం అని మంత్రులు కొండా సురేఖ, సీతక్క లు అన్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద, బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ అప్జల్ బియాబాని, ఖుస్రో పాషా, అదనపు కలెక్టర్ సంధ్య రాణి, తూర్పు కార్పొరేటర్లు, జిడబ్ల్యూఎంసీ ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

నిరుద్యోగులతో కిక్కిరిసిన హోటల్ ప్రాంగణం

మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో వరంగల్‌లో నిర్వహించిన జాబ్ మేళా నిరుద్యోగుల విశేష స్పందనతో కిక్కిరిసిపోయింది. రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఈ మేళాకు ఊహించిన దానికంటే భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. దీంతో ప్రాంగణం నిండిపోవడంతో, పరిస్థితిని సమర్థంగా నిర్వహించేందుకు పోలీసులు ముందస్తు జాగ్రత్తగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ జాబ్ మేళాలో దాదాపు 100 కంపెనీలు పాల్గొన్నాయి. వివిధ రంగాల్లో మొత్తం 8,000కి పైగా ఉద్యోగ అవకాశాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

జాబ్ మేళాలో తొక్కిసలాట, పలువురికి గాయాలు

భారీగా సంఖ్యలో చేరుకున్న నిరుద్యోగులు.

హోటల్ ప్రధాన ద్వారం అద్దం పగిలి ముగ్గురు మహిళ నిరుద్యోగులకు గాయాలు.

వరంగల్ రైల్వే స్టేషన్ రోడ్డులోని ఎంకే నాయుడు హోటల్ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో పలువురు ఉద్యోగార్థులకు గాయాలయ్యాయి. ఎక్కువ మంది నిరుద్యోగులు హాజరు కావడంతో హోటల్ ప్రధాన ద్వారం వద్ద జరిగిన తొక్కిసలాటలో అద్దం పగిలి పలువురికి గాయాలయ్యాయి. ఈ జాబ్ మేళాకు సుమారు 10వేల మంది వరకు హాజరైనా, కనీస ఏర్పాట్లు కూడా చేయలేదని, హాలు సరిపోలేదని నిరుద్యోగులు విమర్శించారు. వీరితో పాటు పార్టీ కార్యకర్తలు, ఇతర నాయకులు హాజరవడం వల్లే తొక్కిసలాట జరిగినట్లు చెబుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version