*కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీ కార్యక్రమంలో మోకుదెబ్బ నాయకులు..*
నర్సంపేట,నేటిధాత్రి:
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన కాటమయ్య రక్షణ కిట్లను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దొంతి మాదవరెడ్డి శనివారం ప్రారంభించడం జరిగింది..జిల్లా బీసీ సంక్షేమ శాఖ, ఆబ్కారీ శాఖల ఆధ్వర్యంలో డివిజన్ లోని ఆరు మండలాలకు చెందిన 214 మంది గీత కార్మికులకు కిట్లు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పుస్పలత,కందాల శంకరయ్య గౌడ్,ఆబకారి సీఐ నరేష్ రెడ్డి,ఎస్ఐ శార్వాణి,గౌడ జనహక్కుల పోరాటం సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్, జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శీలం వీరన్న గౌడ్,డివిజన్ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ గౌడ్,సలహాదారులు రామగోని సుధాకర్ గౌడ్,పొగాకు వెంకటేశ్వర్లు, రమేష్ గౌడ్,పోగాకు సాయితేజ గౌడ్,భూపతి మల్లంపల్లి గౌడ సంఘం సభ్యులు అరేల్లి ప్రకాష్ గౌడ్, కక్కేర్ల రాజు,రమేష్,రాజు,రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఠాగూర్, సౌదే కర్ బీడీ యాజమాన్య కంపెనీలు ఆరు నెలల నుండి ఇవ్వడం లేదు
లేనిపక్షంలో హైదరాబాద్ లేబర్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేస్తాము
*బీడీ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షులు ముశం రమేష్*
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని బి. వై నగర్ అమృత్ లాల్ శుక్ల కార్మిక భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ము శం రమేష్ మాట్లాడుతూ.. ఠాగూర్ సౌదే కర్ బి.డి కంపెనీ యజమాన్యం కార్మికులకు నెల నెల వేతనాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నది గత ఆరు మాసాల నుండి కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదు ఈరోజు కూలి వస్తే ఆ రోజు పూట గడిచే కార్మికులకు ఆరు నెలల నుండి వేతనాలు యజమానికి ఇవ్వకపోవడం దుర్మార్గమైన చర్య పనిచేసిన అప్పులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి వచ్చింది.చేసిన అప్పుకు మిత్తి కట్టలేక అప్పులు తెంపలేక తీవ్ర ఇబ్బందిలకు గురవుతున్నారు.దీనికి తోడు కార్మికులను విపరీతంగా శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారు కంపెనీ సెంటర్ల కిరాయిలు కూడా కార్మికుల కూలి నుండి వసూలు చేయడం జరుగుతుంది.ఇలాంటి చర్యలను బీడీ యజమాన్యం మానుకోవాలని వెంటనే కార్మికులకు రావలసిన ఆరు నెలల వేతనం మొత్తం అందించాలని లేనిపక్షంలో హైదరాబాద్ లేబర్ కమిషనర్ కి ఫిర్యాదు చేస్తామని కార్మికులతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ సమావేశంలో బీడీ జిల్లా నాయకులు ,సూరం పద్మ శ్రీరాముల రమేష్ చంద్ర, జిందం కమలాకర్ తదితరులు పాల్గొన్నారు
యాదవ జాతి ముద్దు బిడ్డ అఖిల భారతీయ యాదవ సంఘం మహాసభ జాతీయ కార్యవర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర గొర్రెల, మేకల పెంపకం వృత్తి దారుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు “శ్రీ సందనవేన మహేంద్రనాథ్ యాదవ్” గారి జన్మదిన సందర్భంగా మహాదేవపూర్ మండల కేంద్రంలో కేక్ కట్ చేసి, స్విట్స్ పంపిణీ చేయడం జరిగింది. మండల కేంద్రంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు కన్నెవేణి ఐలయ్య యాదవ్, మండల ఉపాధ్యక్షులు కాటవేణి రాజయ్య యాదవ్, కాట్రేవుల నవీన్ యాదవ్, పర్శవేని నగేష్ యాదవ్, ములుకల తిరుపతి యాదవ్, పిడుగు బాపు యాదవ్, దాసరి దేవేందర్ యాదవ్, సిద్ది శంకర్ యాదవ్, బత్తిని మల్లేష్ యాదవ్, అఖిల్ యాదవ్, కొమురయ్య యాదవ్, రాకేష్ యాదవ్, జాగరి రాజయ్య యాదవ్, రాజేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు…*
భారత ఆర్థిక సంస్కరణలలో విప్లవత్మక మార్పులు తీసుకొచ్చిన పివి
నడికూడ నేటిధాత్రి:
మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మరియు ఉపాధ్యాయ బృందం పి వి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ పాములపర్తి వేంకట నరసింహారావు భారతదేశానికి తొమ్మిదవ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 దాకా పనిచేశాడనీ ఈయన బహుభాషావేత్త, రచయిత,ఈ పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు,ఒకే ఒక్క తెలుగువారని,భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనతను సొంతం చేసుకున్న వ్యక్తి అని,అదే సమయంలో దేశ లౌకిక విధానమునకు సంబంధించిన బాబ్రీ మసీదు కూల్చివేత కూడా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నపుడు జరిగిందనీ, 1957 లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పి.వి., ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రి గానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టాడనీ,భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం ఆయన గొప్ప పరిపాలన దక్షతకు నిదర్శనం అని అన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ అని కూడా అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా,కంచరాజు కుమార్, మేకల సత్యపాల్, అంగన్వాడీ టీచర్స్ బీముడి లక్ష్మీ,నందిపాటి సంధ్య, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
ఘనపూర్ లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలు
వనపర్తి నేటిధాత్రి
ఖిల్లా ఘనపూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ ఆధ్వర్యంలో బస్టాండ్ దగ్గర రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి జన్మదిన వేడుకలు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి జరుపుకున్నారు ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు పండ్లు పంపిణీ చేయడం చేశారు ఈ వేడుకలలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ జిల్లా వికలాంగుల కమిటీ అధ్యక్షుడు గంజాయి రమేష్ జిల్లా డాక్టర్ సెల్ జిల్లా అధ్యక్షులు నరేందర్ గౌడ్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఎం దేవన్న యాదవ్ మున్నూరు జయకర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ దేవుజా నాయక్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు కే బాల్ రెడ్డి, చిట్యాల లింగస్వామి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు
నేతాజీ డిగ్రీ కాలేజ్ లో అంగరంగ వైభవంగా ఉద్యోగ కల్పన భాగంగా (ఆరంబ్) కార్యక్రమం
సిరిసిల్ల టౌన్( నేటిధాత్రి ):
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని నేతాజీ డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా ఇంటర్న్షిప్ (INTERNSHIP) ప్రోగ్రాంలో Gatnix Company ద్వారా సిరిసిల్ల టౌన్ సి.ఐ కృష్ణ మరియు కళాశాల చైర్మన్ జూపల్లి పృథ్వీదర్ రావు, కరస్పాండెంట్ నాయిని జగన్మోహన్ రావు, ప్రిన్సిపల్ రేశం శ్రీకాంత్ చేతుల మీదుగా 50 మందికి ఆఫర్ లెటర్స్ ని అందించడం జరిగినది.
Netaji Degree College.
అంతేకాకుండా గత రెండు నెలల నుండి కళాశాలలో జరిగిన కంప్యూటర్ కోర్సెస్ పూర్తి చేసిన 180 మంది విద్యార్థులకు అందించడం జరిగినది. ఈ విద్యా సంవత్సరం కళాశాలలో చేరినటువంటి విద్యార్థిని విద్యార్థులకు (ARAMBH) ప్రోగ్రామ్ ద్వారా కల్చరల్ యాక్టివిటీస్ ని కూడా పూర్తి చేసుకోవడం జరిగినది. ఈ కళాశాల కార్యక్రమంలో ఉన్నటువంటి అధ్యాపాక బృందం మరియు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.
పి హరి ప్రసాద్ బాబు. గీసుగొండ మండల వ్యవసాయ అధికారి.
కాశిబుగ్గ నేటిధాత్రి
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం కొనాయమాకుల కేంద్రంగా శనివారం నాడు రైతు వేదికలో ఈ ఖరీఫ్ సీజన్లో డీలర్లు తీసుకోవలసిన జాగ్రత్తల పై మండల వ్యవసాయ అధికారి పి హరి ప్రసాద్ బాబు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.మండలంలో ఉన్న 28 మంది డీలర్లు ఈ అవగాహన సదస్సుకు హాజరైయ్యారు.డీలర్లను ఉద్దేశించి మండల వ్యవసాయ అధికారి పి.హరి ప్రసాద్ బాబు మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజన్లో ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా ఎరువులు ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలన్నారు.రైతులకు అమ్మిన ఎరువుల బస్తాల వివరాలు రిజిస్టర్ లో పొందుపరచాలని,రైతుకు ఉన్న వ్యవసాయ భూమికి సరిపడా మాత్రమే విడతల వారీగా పంపిణీ చేయాలని సూచించారు.సీజన్ మొత్తానికి ఒకేసారి కొనుగోలు చేసుకోకుండా అమ్మకం జరిపేటప్పుడు రైతు వేసే పంట వివరాలు తెలుసుకొని ఆ నెలకు సరిపడా మాత్రమే తీసుకునేటట్లుగా ఒప్పించాలన్నారు.నానో యూరియాను,నానో డీ.ఏ.పీ ని వాడే విధంగా రైతులను ప్రోత్సహించాలని,వ్యవసాయ విస్తరణ అధికారులు కూడా గ్రామాల్లో పర్యటిస్తున్న సందర్భంగా ఈ విషయంపై రైతులకు అవగాహన కలిగిస్తున్నారని,అందరం కలిసి నానో ఉత్పత్తులను రైతులు వాడే విధంగా చూడాలని కోరారు. గ్రామాల్లో గ్లైఫోసేట్ అక్రమ మార్గాల్లో నిలువచేసిన,అమ్మిన అట్టి సమాచారాన్ని వెంటనే వ్యవసాయ అధికారులకు అందజేసినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.డీలర్లు ఎవరు కూడా అనుమతి లేకుండా గ్లైఫోసేట్ కొనడం గాని, అమ్మడం గాని చేయకూడదని హెచ్చరించారు.డీలర్లు ఎప్పటికప్పుడు తన దగ్గర ఉన్న పురుగుమందుల స్టాకులను పరిశీలిస్తూ వాటి పరిమిత కాలం చెల్లని స్టాక్ లను వెంటనే వేరు చేసి ప్రత్యేకమైన బాక్సులో వాటిని ఉంచి అట్టి బాక్సు పై డేట్ ఎక్స్పైర్ స్టాక్ అని రాసి రోజు అమ్మే స్టాక్ కు దూరంగా పెట్టాలని సూచించారు.అట్టి స్టాకు వివరాలను డేట్ ఎక్స్పైర్ స్టాక్ రిజిస్టర్ లో నమోదు చేసి వ్యవసాయ అధికారి తో సర్టిఫై చేయించుకోవాలని ఆదేశించారు.అనంతరం మండల తాహసిల్దారు రియాజుద్దీన్ మాట్లాడుతూ డీలర్లు జిల్లా అధికారుల ఆదేశానుసారం నడుచుకోవాలని,రైతులకు ఇబ్బందులు కలగకుండా ఎరువుల అమ్మకాలు చేయాలని,ఈ సీజన్లో వ్యవసాయ శాఖ అధికారులతో పాటు తనిఖీలు చేపడతామని అక్రమాలకు పాల్పడినట్లు తమ దృష్టికి వస్తే చట్టప్రకారం చర్యలుఉంటాయన్నారు. ఈ అవగాహన సదస్సు కార్యక్రమంలో ఎరువుల షాపు డీలర్లు పాల్గొన్నారు.
జహీరాబాద్ జూలై 2-7-2025 బుధవారం సాయంత్రం 6:30 గంటలకు జహీరాబాద్ బస్టాండ్ పక్కనగల షెట్కర్ ఫంక్షన్ హాల్ నందు బుద్ధుని నాటక ప్రదర్శన ఉంటుంది. ఈ యొక్క నాటక ప్రదర్శనకు దాదాపుగా లక్షకు పైగా ఖర్చు అవుతుంది కావున ఈ యొక్క నాటక ప్రదర్శన నిర్వహించడానికి మీ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా మీ అందరిని పేరుపేరునా కోరుచున్నాము అని నిర్వాహకులు తెలిపారు. ఫోన్ పే చేయవలసిన నంబర్ 9989069468
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జియంతి వేడుకలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు
వనపర్తి నెటిదాత్రి :
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే మేగారెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రాపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వేడుకలు ఘనంగా నిర్వహించామని టిపిసిసి వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ డి వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు కాంగ్రెస్ పార్టీనేతలు లక్కకుల సతీష్ బి కృష్ణ చందర్ నక్కరాములు చుక్కరాజు జి జె శ్రీనివాసులు పార్టీ నేతలు పాల్గొన్నారు
గౌడ కులస్తుల వల్ల ఆనాటి నైజాం ప్రభులే ధనవంతులయ్యారు
గీత వృత్తిని కొనసాగిస్తూ ఆర్థికంగా ఎదగాలి.
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి
గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కీట్ల పంపిణీ
నర్సంపేట నేటిధాత్రి:
ప్రస్తుతం ఉన్న మద్యం రేట్లును పరిగణలోకి తీసుకున్న పలువురు ప్రకృతి వరమైన తాటికల్లులు సేవిస్తున్నారని ఈ నేపథ్యంలో గీత వృత్తి చేసే కార్మికులు ఒక కంప్యూటర్ ఉద్యోగిగా భావిస్తూ వృత్తి కొనసాగించుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి తెలిపారు.బీసీ సంక్షేమ శాఖ,ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నర్సంపేట డివిజన్ పరిధిలోని ఆరు మండలాల కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచాలు కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. బ్రిటిష్ కాలంలో తెలంగాణ ప్రాంతంలో గౌడ కులస్తులు కల్లు ద్వారా వచ్చే ఆదాయంతో నిజాం నవాబులు ధనవంతులు అయ్యారని ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం చేసిన సర్వేలో వెళ్లడైందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కువగా మద్యం తాగేది తెలంగాణలోనే అని అన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో అన్ని ప్రాంతాలలో ఆయుర్వేద మెడిసిన్గా భావిస్తూ ప్రతీ ఒక్కరూ తాటికల్లు తాగుతున్నారు.కళ్లు అనేది నామూసి కాదని ఎమ్మెల్యే అభిప్రాయ వ్యక్తం చేశారు. గౌడ కులస్తులు నమ్ముకున్న గీత వృత్తిని కొనసాగించి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో కాటమయ్య రక్షణ కిట్లకు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 41 లక్షల 40 వేల ఖర్చు చేసిందని పేర్కొన్నారు. గీత కార్మికులకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తాం. ఎక్సైజ్ శాఖ అధికారులు,కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు సహకారంతో ఉంటుందని ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వచ్చిన అందిస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి హామీ ఇచ్చారు.జిల్లా బీసీ సంక్షేమ అధికారి పుష్పలత మాట్లాడుతూ గీత కార్మికులకు తాడిచెట్టు ఎక్కేటప్పుడు రక్షణ కల్పించేందుకు గాను కాటమయ్య రక్షణ కిట్స్ పంపిణీ సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సహకారంతో చేపట్టినట్లు తెలిపారు. ప్రాణాలను రక్షించుకుంటూ వృత్తిని కాపాడుకున్న కోవాలని గీత కార్మికులను సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, నర్సంపేట ఎక్సైజ్ సిఐ నరేష్ రెడ్డి ఎస్ఐ శార్వాణి సిబ్బంది నాగరాజు పాల్గొన్నారు.
జైపూర్ మండల కేంద్రంలో ఏఎస్ఓగా విధులు నిర్వహించి డివైఎస్ఓ గా పదోన్నతి పొంది భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వెళ్తున్న సతీష్ కుమార్ కి శనివారం రోజున తహసిల్దార్ వనజా రెడ్డి, కార్యాలయ సిబ్బందితో కలిసి పూలమాలతో,శాలువాతో సత్కరించి,వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహుకరించి సన్మానం చేశారు.తమతో పాటు విధి నిర్వహణలో చురుగ్గా,నైపుణ్యంతో కూడిన సేవలను అందించి పదోన్నతి పై వెళ్తున్న సతీష్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా మరింత శ్రమించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నామని తహసిల్దార్ వనజా రెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుంది…
కేసముద్రం/ నేటిదాత్రి
కేసముద్రం మండలం పరిధిలో ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణంలో రైతు వేదిక నందు మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళి నాయక్, ఆదేశాల మేరకు స్థానిక తహసిల్దార్ వివేక్ అధ్యక్షతన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది, మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి 50 మంది లబ్ధిదారులకు మరియు13 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు,కేసముద్రం మున్సిపాలిటీ చెందిన 100 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పత్రాలను అందజేసిన ధన్నసరి పిఎసిఎస్ వైస్ చైర్మన్ అల్లం నాగేశ్వర్ రావు మహబూబాబాద్ జిల్లా ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి,కేసముద్రం పిఎసిఎస్ వైస్ చైర్మన్ అంబటి మహేందర్ రెడ్డి,
ఈ సందర్భంగా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ..నిరుపేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 లక్షల నిధులతో ఇందిరమ్మ మంజూరు చేస్తున్నారని, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు.
గత ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా ఇండ్లు మంజూరు చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్కరికి సన్నబియ్యం అందిస్తుందన్నారు. మూడు నెలల సన్న బియ్యం ఒకేసారి అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె ప్రసన్న రాణి, ఎమ్మార్వో జి వివేక్ , రెవెన్యూ అధికారులు ఎండీ మాజిద్,సౌజన్య,పిసిసి మెంబర్ దశ్రు నాయక్ ,,మాజీ ఎంపీపీ మల్సూర్ నాయక్,మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ ఎండీ ఆయాబ్ ఖాన్, చింతకుంట్ల యాదగిరి,మాజీ సర్పంచ్ మధుగిరి సాంబయ్య, మాజీ ఉప్పసర్పంచ్ బానోత్ వెంకన్న, అధికారులు,గ్రామ పార్టీ అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
విద్యా వ్యవస్థ, పరిశ్రమల మధ్య అనుసంధానానికి వ్యూహాత్మక దిశ
వరంగల్ నేటిధాత్రి:
భారతదేశంలోని ప్రముఖ ప్లేస్‌మెంట్ ప్రిపరేషన్ మరియు నైపుణ్యాభివృద్ధి వేదిక అయిన ప్రెప్‌ఇన్స్టా, జూన్ మొదటివారంలో షాద్ నగర్ లో జరిగిన కెరీర్ నెక్సస్ -2025లో హాజరైనది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్స్ కన్సోర్షియం (టిటిపిఓసి) ఏర్పాటు చేసింది. రెండు రోజుల పాటు సాగిన ఈ సదస్సు విద్యా సంస్థలు మరియు కార్పొరేట్ నియామకదారుల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి ప్రధాన వేదికగా నిలిచింది. దేశవ్యాప్తంగా వందలాదిమంది టీపీఓలు, హెచ్ ఆర్ అధిపతులు, ఎడ్టెక్ నేతలు మరియు పాలసీ మేకర్లు పాల్గొని, క్యాంపస్ ప్లేస్‌మెంట్లు మరియు నైపుణ్యాభివృద్ధి భవిష్యత్తును పునర్నిర్వచించాలనే లక్ష్యంతో చర్చించారు. ఈ చర్చల కేంద్రబిందువుగా, విద్యా శిక్షణ మరియు పరిశ్రమ అవసరాల మధ్య పెరుగుతున్న అంతరాన్ని పరిగణించడమే జరిగింది. ప్రెప్‌ఇన్స్టా సీనియర్ డైరెక్టర్ మనీష్ అగర్వాల్ మాట్లాడుతూ, “భారతదేశంలో ప్లేస్‌మెంట్ లాండ్‌స్కేప్ వేగంగా మారుతోంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది గ్రాడ్యుయేట్లు తయారవుతున్నా, పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా ఉద్యోగానికి సిద్ధంగా ఉండే వారి శాతం చాలా తక్కువగా ఉంది. ఈ అంతరాన్ని తగ్గించాలంటే, టిపిఓ లు మరియు కంపెనీ హెచ్ఆర్ లు కలిసి పని చేయాలి. శిక్షణ, అంచనా, నియామకం అన్నీ ఒకే వేదికపై కలిసేలా ప్లాట్‌ఫారాలు నిర్మించాలి. ఇది విద్యార్థుల విజయాన్ని పటిష్టంగా మద్దతిచ్చే ప్లేస్‌మెంట్ పద్ధతుల తరం కావాలి” అని అన్నారు. ఈ కార్యక్రమంలో చర్చించిన ముఖ్య సమస్యలు ఈ విధంగా ఉన్నాయి. క్యాంపస్ శిక్షణలో ప్రమాణాల లోపం, పాత విధానాల ఆధారంగా ప్లేస్‌మెంట్ ట్రాకింగ్, టీపీఓ లు మరియు నియామకదారుల మధ్య తక్కువ కమ్యూనికేషన్, టియర్ 2 టియర్ 3 కాలేజీలలో తక్కువ ప్లేస్‌మెంట్ శాతం వంటివి ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి, ప్రెప్‌ఇన్స్టా సహకారాత్మక, డేటా ఆధారిత దృక్పథాన్ని ప్రతిపాదించింది. దీని ద్వారా కాలేజీలు పటిష్టమైన డేటా, స్కేలబుల్ టూల్స్, మరియు బలమైన రిక్రూటర్ నెట్‌వర్క్‌ను పొందగలుగుతాయి. “ప్రెప్‌ఇన్స్టాలో, లక్ష్యం ఏమిటంటే విద్యార్థి ఏ కాలేజ్‌లో చదువుతున్నా, అతనికి సరైన శిక్షణ, మార్గనిర్దేశం మరియు ఉద్యోగ అవకాశాలు అందాలి. టిటిపీఓసి వంటి ఈవెంట్‌లు విద్యా వ్యవస్థతో కలసి భవిష్యత్ కోసం సమగ్ర పరిష్కారాలను రూపకల్పన చేసే అవకాశాలు కల్పిస్తాయి” అని మానిష్ అగర్వాల్ తెలిపారు. ఈ దిశగా, ప్రెప్‌ఇన్స్టా భారత దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీల టిపిఓలు మరియు మేనేజ్‌మెంట్‌లను 2025 ప్లేస్‌మెంట్ సీజన్ కోసం వ్యూహాత్మక భాగస్వామ్యాలను అన్వేషించమని ఆహ్వానిస్తోంది. ప్రెప్‌ఇన్స్టా రూపొందించిన బి2ఐ సాస్ ప్లాట్‌ఫారమ్ ‘ఆప్టిమస్’ ఇప్పటికే 250కి పైగా విద్యాసంస్థలకు మద్దతు ఇస్తోంది. శిక్షణ, అంచనా మరియు ప్రిపరేషన్ ట్రాకింగ్‌ను సమర్థంగా నిర్వహిస్తోంది. 2017లో స్థాపితమైన ప్రెప్‌ఇన్స్టా, నైపుణ్యాల అభివృద్ధి మరియు ప్లేస్‌మెంట్ కోసం విశ్వసనీయ వేదికగా ఎదిగింది. ఇందులో 200కి పైగా ఇండస్ట్రీ-అలైన్‌డ్ కోర్సులు ఉన్న ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉంది. ఇందులో జనరేటివ్ ఏ ఐ, మెషీన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి హై-డిమాండ్ రంగాలలో శిక్షణ అందించబడుతుంది. నైపుణ్యాధారిత, ఉపాధి-సిద్ధమైన భారత్ కోసం మద్దతుగా నిలుస్తోందని తెలిపారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వరంగల్ డివిజన్ ఏఎస్పీ గా ఎన్. శుభం ప్రకాష్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2022 ఐ.పి.ఎస్ బ్యాచ్ కు చెందిన శుభం 2024 సంవత్సరం వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఆరు నెలల పాటు ట్రైనీ ఐపిఎస్ గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం వరంగల్ ఏసీపీ గా పనిచేస్తున్న నందిరాం నాయక్ డిజిపి కార్యాలయంకు బదిలీ అయ్యారు.
రామ్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన శాసన మండలి పక్ష నేత ఎమ్మెల్సీ సిరికొండ
గణపురం నేటి ధాత్రి:
గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లి గ్రామాన్ని చెందిన ఇటీవల ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఒద్దుల రాంరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన శాసనమండలి పక్ష నేత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి. ఈ కార్యక్రమంలో బీ. ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బైరాగాని కుమారస్వామి,రత్నం రవి,గ్రామ కమిటీ అధ్యక్షులు ఎడెల్లి మల్లారెడ్డి,మాజీ పిఎసిఎస్ చైర్మన్ పూర్ణచంద్రారెడ్డి,కంచరకుంట్ల రవీందర్ రెడ్డి.ఎక్కటి శ్యామల దేవి,మొగిలి శ్రీనివాస్.
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉచిత కంది విత్తనాల కిట్ల పంపిణి
నర్సంపేట నేటిధాత్రి:
వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ యాంత్రిక పద్దతిలో వ్యవసాయం చేస్తేనే లాభాలు లేకపోతే అప్పులపాలు కాక తప్పదని అన్నారు. వ్యవసాయం చేసే రైతులకు అది ఒక ఉద్యోగం లాంటిదని, సేంద్రియ వ్యవసాయంతో కష్టపడి పని చేస్తే లాభాలు పొందవచ్చునని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి తెలిపారు.జాతీయ ఆహార భద్రత పోష కమిషన్, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పప్పు దినుసుల చిరు సంచుల కందులు,మినుములు విత్తన పంపిణీ కార్యక్రమం నర్సంపేట వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో నర్సంపేట డివిజన్ పరిధిలోని ఆరు మండలాల లో గల రైతులకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఎల్అర్జి 52 రకం కంది విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కంది పంట సాగు చేయడం ద్వారా అధిక లాభాలు రావడం,ఆకులు మొత్తం భూమిపై రాలడంతో ఎరువులగా మారుతుంది. దీంతో భూసారం పెరుగుతుంది.రాబోయే పంటలకు ఎరువులు తక్కువగా వాడుకోవచ్చని పేర్కొన్నారు.వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్న విధంగా కందులు 10 నుండి 12 క్వింటాలు రావడం ఖాయమని ,వరి సాగు కంటే కందుల పంట సాగు వలన అధిక లాభాలు పొందవచ్చన్నారు.పత్తి మిరప,వేరుశనగ మరే ఇతర పంటల కంటే పప్పు దినుసుల పంటలే మేలన్నారు.గతంలో పశువుల ఎరువులు వాడేది.
ఇప్పుడు అధికంగా కెమికల్స్, ఫర్టీలైజర్స్ వేస్తున్నారు. దీంతో భూసారం తగ్గుతున్నది.పెట్టుబడులు పెరుగుతున్నాయి.లాభాలు తక్కువగా వస్తున్నాయని దీంతో రైతు కుటుంబం అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి నెలకొంటున్నదని ఎమ్మెల్యే దొంతి రైతులకు సూచించారు.అధిక పెట్టుబడుల వలన నేడు రైతులు తమ శ్రమ శక్తిని కూడా సంపాదించలేక పోతున్నారని…రైతే రాజు.. నేను రాజు అనే పిలింగ్ తో ,వ్యవసాయంలోనే ఉపాధి.. ఉన్నది.వ్యవసాయంతోనే జీవనం సాగిస్తూ అభివృద్ధి చేసుకోవాలని ఈసందర్భంగా పేర్కొన్నారు.తక్కువ పెట్టుబడులు ఉన్న అపరాలు పంటలు,ఫామ్ అయిల్ పంటలు సాగు చేసుకోవాలన్నారు.బయట దేశాల నుండి దిగుమతి అయ్యే వస్తువులకు ఆపాలని,వేరుశనగ,అపరాల పంటలకు బోనస్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా కేంద్రానికి నివేదికలు అందించేందుకు చర్యలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే దొంతి రైతులకు తెలిపారు.గ్రామాల్లో ఇండ్ల కూరగాయలు, కోళ్ళు,గుర్రెలు పెంపకం చేసుకోవాలి.ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవ్వరూ సాగు చేసుకోవటం లేదు. గ్రామాల్లో ఉన్న ప్రజలకు హైదారాబాద్ లో ఉన్న ప్రజలకు తేడా లేకుండా పోయిందని ఈ సందర్భంగా నియోజక వర్గం ప్రజలకు సూచించారు. వ్యవసాయ శాఖ జిల్లా అధికారి అనురాధ మాట్లాడుతూ ప్రతీ రోజు పప్పుదినుసులు తినాల్సిందే. కావున ప్రస్తుతం పప్పుల్లో కలర్ వేస్తున్నారు.వాటి వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పప్పు దినుసుల పంటలు వరి సాగు కంటే కందుల పంట వలన అధిక లాభాలు ఉన్నాయని సూచించారు.ఈ సాగు వలన భూసారం పెరుగుతుంది.అవసరం మేరకే ఎరువులు,కెమికల్స్ వేయాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్టీవో ఉమారాణి, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, జాతీయ ఆహార భద్రత న్యూట్రిషన్ మిషన్ వరంగల్ ఉమ్మడి జిల్లా కన్సల్టెంట్ సారంగం,వైస్ చైర్మన్ , ఆయా మండలాల వ్యవసాయ శాఖ అధికారులు రైతులు పాల్గొన్నారు.
సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శిగా రామడుగు లక్ష్మణ్ రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికయిన నేపద్యంలో రామకృష్ణాపూర్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సీపీఐ శ్రేణులు ఘనంగా సన్మానించారు.పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ ను సైతం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రామడుగు లక్ష్మణ్ మాట్లాడారు. జిల్లా మహాసభలో చేసిన తీర్మానాలను,పార్టీ ప్రజా సంఘాల నిర్మాణానికి స్థానిక సమస్యల పరిష్కారానికి భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై కౌన్సిల్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇప్పకాయల లింగయ్య, మిట్టపల్లి పౌల్, వెంకటస్వామి, వనం సత్యనారాయణ, సాంబయ్య, గోపి, మణెమ్మ,శంకర్,రాములు, సత్తన్న, మొగిలి తదితరులు పాల్గొన్నారు.
స్పోర్ట్స్ స్కూల్స్ రాష్ట్రస్థాయి క్రీడలకు ఇద్దరు బాలికల ఎంపిక
మహాదేవపూర్ జూన్ 28( నేటి ధాత్రి )
స్పోర్ట్స్ స్కూల్స్ ప్రవేశం కోసం మహాదేవపూర్ మండలం కుదురుపల్లి ప్రాథమిక పాఠశాలకు చెందిన ఇద్దరు బాలికలు రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొనేందుకు ఎంపికైనట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంపత్ తెలిపారు కుదురుపల్లి కి చెందిన విద్యార్థినిలు జిముడ రహస్య గోగుల అనుష్క ఎంపికయ్యారు జులై ఒకటిన నుండి హైదరాబాద్ హంకి పేటలొ స్పోర్ట్స్ స్కూల్ పోటీలో పాల్గొంటారని ఆయన తెలిపారు మారుమూల గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ పోటీలో పాల్గొనేందుకు ఎంపిక కావడం పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు సతీష్, సంధ్య గ్రామస్తులు తదితరులు అభినందించారు
ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి
శాశ్వతంగా ప్రైవేట్ విద్యాసంస్థలను మూసివేయాలి
మారపల్లి మల్లేష్ సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి డిమాండ్
భూపాలపల్లి నేటిధాత్రి:
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ వికేసి పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షులు అంబాల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ బహుజన వర్గాల విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి లక్షలాది రూపాయలు అన్యాయంగా వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని ప్రైవేట్ విద్యాసంస్థలను శాశ్వతంగా మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విద్యార్థి నాయకులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికైనా రాబోయే రోజుల్లో ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉచిత విద్యాను మెరుగుపరచాలని పేద విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలలను పాఠశాలలను అభివృద్ధి చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ పాఠశాలలను కళాశాలలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విద్యార్థుల పక్షాన ప్రభుత్వ కళాశాల పక్షాన ప్రభుత్వ పాఠశాలల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం నిలబడి విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు రాబోయే రోజుల్లో విద్యార్థుల సమస్యలు ప్రభుత్వ కళాశాలల ప్రభుత్వ పాఠశాలలు సమస్యలు పరిష్కరించక పోతే విద్యార్థులను భారీ ఎత్తున ఏకం చేసి విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ధర్నాలు రాస్తరోకలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఐసా జిల్లా కార్యదర్శి శీలపాక నరేష్ విద్యార్థి నాయకులు అనిల్ రాజశేఖర్ నిఖిల్ జానీ అఖిల్ అభిషేక్ రాజు తదితరులు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల పెంపుకు కృషి చేయాలి
సీకేఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించిన జెడి, ప్రొఫెసర్ డీఎస్ఆర్ రాజేందర్ సింగ్
నేటిధాత్రి, వరంగల్.
వరంగల్ దేశాయిపేటలోని చందాకాంతయ్య ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలను శనివారం నాడు, కళాశాల విద్య సంయుక్త సంచాలకులు (జేడీ), ప్రొఫెసర్ డీఎస్ఆర్ రాజేంద్ర సింగ్ సందర్శించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ ధర్మారెడ్డి, అధ్యాపక బృందం స్వాగతం పలికారు.
కళాశాల లోని గ్రంథాలయం, ప్రయోగశాలలు, లేడీస్ హాస్టల్ తదితర వసతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో జేడీ ప్రొఫెసర్ డీఎస్ఆర్ రాజేంద్రసింగ్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధిక సంఖ్యలో ప్రవేశాలు తీసుకునేలా విద్యార్థులను సన్నద్ధం చేయాలని సూచించారు.
CKM Government Degree College.
సీకేఎం డిగ్రీ కళాశాలలో నెట్, సెట్, పీహెచ్డీ వంటి అత్యున్నత విద్యార్హతలు, బోధన అనుభవం కలిగిన అధ్యాపకులు ఉన్నారని, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ విభాగాలు అందుబాటులో ఉన్నాయని విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఎన్సిసి లో విద్యార్థులు శిక్షణ పొందినట్లయితే సాధారణ డిగ్రీతో పాటు మిలిటరీ డిగ్రీ కూడా వస్తుందని, అది విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని భవిష్యత్తులో ఆర్మీ, పోలీస్, పారా మిలిటరీ విభాగాలలో ఉన్నత ఉద్యోగాలకు ఎంపిక అవుతారని తెలియజేశారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంపిక చేసుకొని ముందుకు తగిన విధంగా శ్రమించాలని అధ్యాపకులు బోధన, పరిశోధన రంగాలలో మరింత నైపుణ్యాలను పెంపొందించుకొని కళాశాలను అభివృద్ధి చేయాలని సూచించారు.
సికేఎం కళాశాల అభివృద్ధి కోసం కళాశాల విద్య కమిషనర్ ఆదేశానుసారం ప్రభుత్వపరంగా సహాయ సహకారం అందించేందుకు తాము కృషి చేస్తామని తెలిపారు.
CKM Government Degree College.
గెస్ట్ అధ్యాపకులు తమ సేవలను ఆటో రెన్యువల్ చేసి ప్రతి నెల కన్సాలిడేట్ పేమెంట్ ఇవ్వాలని, 12 నెలల వేతనం ఇవ్వాలని జేడీ కి వినతిపత్రం అందజేశారు.
అనంతరం జెడి ప్రొఫెసర్ డీఎస్ఆర్ రాజేంద్ర సింగ్ కు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ ధర్మారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కే ఎల్ వి వరప్రసాదరావు, పూర్వ ప్రిన్సిపల్ డాక్టర్ జి శశిధర్ రావు, ఎన్సిసి ఆఫీసర్ కెప్టెన్ డాక్టర్ పి .సతీష్ కుమార్, లైబ్రేరియన్ ఎస్. అనిల్ కుమార్, సి సి ఈ సూపరిండెంట్లు కృష్ణారెడ్డి, ఖుర్షీద్, కళాశాల సూపరిండెంట్ జి.శ్రీనివాస్, జ్ఞానేశ్వర్, పాష,బోధన , బోధనేతర సిబ్బంది , విద్యార్థులు, ఎన్సిసి క్యాడేట్స్ తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.