ఎన్నికల్లో నర్సంపేట మున్సిపాలిటీ ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం.
రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం నర్సంపేటకు ఏమిచ్చింది.
మాజీ ఎంపీ,భాజపా రాష్ట్ర నేత,ప్రొఫెసర్ అజ్మీర సీతారాం నాయక్
కుంభకోణాల్లో కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీలు
జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం
నర్సంపేట,నేటిధాత్రి:
రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి నిధులు కేంద్రం నుంచి వచ్చినవే.. ఇప్పటివరకు నర్సంపేటను పాలించిన బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఏమి అభివృద్ధి చేశాయి. త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వండి కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తాం అని మాజీ ఎంపీ,భాజపా రాష్ట్ర నేత,ప్రొఫెసర్ అజ్మీర సీతారాం నాయక్ అన్నారు.మున్సిపల్ ఎన్నికలకు ముందు భాజపా ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు,కార్యకర్తలతో ముందస్తు సన్నగ్ద సమావేశాలు నిర్వహించేందుకుగాను శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి, నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల కన్వీనర్ డాక్టర్ గోగుల రాణా ప్రతాపరెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీర సీతారాం నాయక్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏమి ఇచ్చిందో మరోసారి పట్టణ ప్రజలు తెలుసుకోవాలని కోరారు.నర్సంపేట పరిదిలో ముఖ్యమైన అభివృద్ధి పనులు చేసేవి చాలా ఉన్నాయి.మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపించండి.. కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తెచ్చి అభివృద్ధి చేసే బాధ్యత మాది అని సీతారాం నాయక్ హామీ ఇచ్చారు.కాంగ్రెస్,భారాస పార్టీలు అభివృద్ధి చేస్తాయని ఇప్పటికీ నర్సంపేట మోసపోయింది.మరల మోసపోవద్దు అని పేర్కొన్నారు.ప్రస్తుతం నర్సంపేటలో జరిగిన అభివృద్ధి నేను చేసిందే.. కేంద్ర ప్రభుత్వ నిధులతో..చేసిన అభివృద్దే కనబడుతున్నది అని మాజీ ఎంపీ తెలిపారు.ప్రధాని మోడీ ప్రపంచ నాయకునిగా ఆచరిస్తున్నారు.అదే తరహాలో ఎన్నికల్లో మున్సిపాలిటీ ఇస్తే రాబోయే ఎమ్మెల్యే కూడా భాజపాదే అని భాజపా రాష్ట్ర నేత సీతారాం నాయక్ తెలిపారు.మాజీ ఎమ్మెల్యే,మాజీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు,మున్సిపల్ ఎన్నికల జిల్లా కన్వీనర్ కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ
2014 నుండి ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని దశ దిశలను మార్చారు.అదే తరహాలో మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను చైతన్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజలకు అవగాహన కల్పించి ఎన్నికల్లో భాజపా అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు.జరుగబోయే మున్సిపల్ ఎన్నికలల్లో గెలుపు జెండాలను ఎగురవేయడానికి సన్నాహక సమావేశాలు నిర్వస్తున్నామని అన్నారు.ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం అన్ని డివిజన్ లలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి ఎంపికలు ఉంటాయన్నారు.
స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ ఏమి అభివృద్ధి చేసినన్నారు.డెబ్బై ఏండ్ల కాంగ్రెస్,
పదేండ్ల బిఆర్ఎస్ పార్టీలు ఒకే కుటుంబ పార్టీలు..అవి నిత్యం కుంభకోణాలను నిలయంగా మారుతున్నాయని ఆరోపించారు.
గతంలో గిలిచిన 9 ఎంపిలు,9 ఎమ్మెల్యే స్థానాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగబోయే మున్సిపాలిటీలో ఎన్నికలో అధిక మున్సిపాలిటీలను గెలిపించుకోవడమే లక్ష్యం.దీంతో వచ్చే శాసన సభ ఎన్నికల్లో అధిక సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జోష్యం చెప్పారు.కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ,ఎన్నికల జిల్లా కో కన్వీనర్ పుల్లారావు మాట్లాడుతూ నర్సంపేటలో చేసే ప్రతి అభివృద్ధి పథకం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులే అని పేర్కొన్నారు.
సొమ్మోకరిది సోకోకరిది అనే విధంగా కేంద్ర ప్రభుత్వం నిధులతో రాష్ట్ర ప్రభుత్వ నిధులంటూ కాంగ్రెస్ ప్రభుత్వం,కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.జిల్లా ప్రధాన కార్యదర్శి,నర్సంపేట ఎన్నికల కన్వీనర్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికలల్లో
30 డివిజన్లలో పోటీ చేస్తున్నాం.
ప్రజా బలం ఉన్న నాయకున్ని ఎన్నికల బరిలో దింపుతామని పేర్కొన్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రధాని మోడీ నర్సంపేట 3000 ఇండ్లు పంపితే ఒక్క డబుల్ బెడ్రూo కూడా ఇవ్వలేదన్నారు.ఆరు గ్యారెంటీలు,420 హామీలతో అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సిసి రోడ్ల పేరుతో కాంట్రాక్టర్ అవతారంలో ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు గమనించి భాజపా నాయకులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తే నర్సంపేటకు శ్రీరామ రక్షా అవుతుందని రాణా ప్రతాప్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గూడూరు సందీప్,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహారాములు,జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్,నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, రూరల్ అధ్యక్షులు తనుగుల అంబేద్కర్ సీనియర్ నాయకులు కూనమల్ల పృథ్వీరాజ్, బాల్నే జగన్, పంజాల శ్రీ రాం,కుంభం కోమల్ రెడ్డి, జూలూరు మనీష్ గౌడ్,గుడిపూడి రాధాకృష్ణ, కట్ల రామచందర్ రెడ్డి, బానోత్ వీరన్న, మల్యాల సాంబామూర్తి,పొనుగోటి రవీంద్రచారి నర్సంపేట పట్టణ ప్రధాన కార్యదర్శి సూత్రపు సరిత మహిళ నాయకురాలు మార్త సంధ్యారాణి,బీజేపీ పట్టణ నాయకులు ఠాకూర్ విజయ్ సింగ్, కాసుల నాగేంద్రబాబు,రాజ్ కుమార్, మస్ శివ,థౌటం నిశాంత్, చిలువేరు అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.
