బాలానగర్ : ధ్వజస్తంభం ఏర్పాటుకు రూ.లక్ష విరాళం.
బాలానగర్ /నేటి ధాత్రి.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలోని స్థానిక హనుమాన్ దేవాలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన కోసం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుడిసెల యాదయ్యభక్తితో ముందుకు వచ్చి రూ.2.11 లక్షలు రూపాయల విరాళాన్ని ప్రకటించారు. అందులో భాగంగా శనివారం రూ.లక్ష అడ్వాన్స్ ను దేవస్థానం కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా గుడిసెల యాదయ్య మాట్లాడుతూ.. ధర్మం కోసం చేసే ఖర్చు ఎప్పుడూ వృధా పోదని.. స్వామి వారి సేవలో భాగస్వాములై తన వంతు విరాళాన్ని అందించానని అన్నారు. గుడిసెల యాదయ్య సామాజిక స్పృహను దైవభక్తిని గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులు అభినందిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
