ట్రంప్ విధానాలపై ఎంసిపిఐ(యు) నిరసన, దేశవ్యాప్తంగా సమ్మె పిలుపు

ట్రంప్ విధానాలకు వత్తాసు పలుకుతున్న ప్రధాని మోడీ

ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి

ఎంసిపిఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్

రెండో రోజు కొనసాగిన ఎంసిపిఐ(యు) రాష్ట్ర శిక్షణ తరగతులు

నర్సంపేట,నేటిధాత్రి:

పెత్తందారి పోకడలతో అశాంతిని సృష్టిస్తూ ఇతర దేశాలపై విచక్షణారహితంగా పనులను విధిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంపు అవలంబిస్తున్న వినాశనకర విధానాలకు బిజెపి మోడీ ప్రభుత్వం వత్తాసు పలకడం దేశ ప్రజలకు హానికరమని ఎం సి పి ఐ (యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్ ఆందోళన వ్యక్తం చేశారు. సామ్రాజ్యవాద నియంతృత్వ మతత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచశాంతి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. శనివారం దుగ్గొండి మండలంలోని గిర్నిబావి లో జరుగుతున్న ఎంసిపిఐ (యు) రాష్ట్ర స్థాయి సైతాంతిక రాజకీయ రెండో రోజు శిక్షణా తరగతుల్లో భాగంగా అంతర్జాతీయ జాతీయ పరిణామాలు కమ్యూనిస్టులు కర్తవ్యం అనే అంశంపై పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు కామ్రేడ్ వంగల రాగసుధ అధ్యక్షత వహించగా జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్ హాజరై మాట్లాడారు.ప్రపంచంలో యుద్ధాలను ప్రేరేపిస్తూ అశాంతిని సృష్టించే విధంగా తద్వారా తన దేశంలోని అణ్వయుధాల వ్యాపారాన్ని విస్తృతపరచుకోవడానికి లాటిన్ అమెరికా దేశాల చమురుపై గుత్తాధిపత్యాన్ని సాధించడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఈ క్రమంలోనే వెనిజులా అధ్యక్షుడు మధురోను అక్రమంగా బంధించి తన నియంతృత్వాన్ని చాటాడని తనను సమర్థించని ఇతర దేశాలపై పన్నుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు.పరోక్షంగా యుద్ధ వాతావరణాన్ని ప్రేరేపిస్తున్నారని అలాంటి సామ్రాజ్యవాద అమెరికా ట్రంప్ విధానాలకు మోడీ వత్తాసు పలకడం ఎంతవరకు సమంజసం అని అయినా ట్రంపు మాత్రం భారత్ పై పన్నుల భారం మోపుతూనే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో కోట్లాదిమంది ప్రజలకు రోజువారి ఉపాధి కరువై కనీసం అవసరాలు తీర్చుకోలేక రెండు పూటల తిండి లేక ఇబ్బందులు పడుతుంటే ఎంతో కొంత ఉపయోగపడే జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని నీరుగార్చే విధంగా చట్టాన్ని మార్చివేశారని ఇది సరైన చర్య కాదన్నారు. ప్రత్యేక ఓటర్ల సవరణ పేరుతో కోట్లాదిమంది ప్రజల ఓట్లను కుంటిసాకులతో తొలగించి తమకు అనుకూలమైన ఓటర్లను మాత్రమే జాబితాలో ఉంచుతున్నారని తద్వారా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని అభాష్యం పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతు కార్మిక కూలి వ్యతిరేక విధానాలతో శ్రామికుల జీవితాలను అతలాకుతలం చేస్తున్న మోడీ విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
పిలుపునిచ్చారు.

కమ్యూనిస్టుల ఏకీకరణయే దోపిడి పాలకులకు ప్రత్యామ్నాయం

రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి

ప్రపంచీకరణ నూతన ఆర్థిక కార్పోరేట్ విధానాలను అవలంబించే బూర్జువా పార్టీలు ప్రజలకు ఏమి చేయవని.
కార్మిక వర్గ, సామాజిక స్పృహ కలిగి మార్క్సిజం – ఫూలే, అంబేద్కర్ ఆలోచన విధానం కలిగిన
వర్గ, సామాజిక జమిలి సిద్ధాంత ప్రత్యామ్నాయం ఏర్పాటు ద్వారా మాత్రమే మనువాద, బ్రాహ్మణ ఫాసిస్టు ఆర్థిక వ్యవస్థ కు ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక, ప్రత్యామ్నాయం ఏర్పాటు ద్వారా నిర్మించాలని యంసిపిఐ(యు) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు.వర్గ సామాజిక జమిలి ప్రత్యామ్నాయం కోసం ఏర్పడ్డ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పడి 7 సంవత్సరాల సందర్భంగా జనవరి 25 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బిఎల్ఎఫ్ జెండాలను ఎగురవేయాలని అన్నారు. మావొయిస్టు పార్టీ నుంచి ఈ మధ్య కాలంలో బయటికి వచ్చిన కామ్రేడ్సు యంసిపిఐ(యు)తో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వామపక్ష సామాజిక శక్తులతో కలిసి పోటీ చేయాలని బూర్జువా భూస్వామ్య పెట్టుబడి దారీ పాలక వర్గం వ్యతిరేకంగా పని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ వ్యవస్థాపక నేత అమరజీవి కామ్రేడ్ ఓంకార్ గారి శతజయంతి సభలను విజయవంతం చేసేందుకు ప్రజలు ప్రజాతంత్రవాదులు సహకరించాలన్నారు.ఈ శిక్షణ తరగతులలో పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ తో పాటు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వల్లెపు ఉపేందర్ రెడ్డి, కుంభం సుకన్య, వనం సుధాకర్, గోనె కుమారస్వామి, ఎన్ రెడ్డి హంసారెడ్డి,మంద రవి,రాష్ట్ర కమిటీ సభ్యులు నర్రా ప్రతాప్,కుసుంభ బాబురావు, గుండెబోయిన చంద్రయ్య, తుడుం అనిల్ కుమార్,కర్ర దానయ్య, జబ్బర్ నాయక్, నీల రవీందర్, కర్ర రాజిరెడ్డి, కనకం సంధ్య, గడ్డం నాగార్జున, మాస్ సావిత్రి, దుగ్గొండి మండల కార్యదర్శి సింగతి మల్లికార్జున్ వివిధ జిల్లాల నాయకత్వం స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version