సీఐ శ్రీనివాస్ ను సన్మానించిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణ సీఐగా ఇటీవల నూతన బాధ్యతలు స్వీకరించిన సర్కిల్ ఇస్పెక్టర్ శ్రీనివాస్ ను జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం కమిటీ, స్వచ్ఛంద సంస్థల సమాఖ్య ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ లో మర్యాద పూర్వకంగా కలుసుకొని శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా స్వంచంద సంస్థలు ఉంటూ ఎన్నో రంగాల్లో నిస్వార్థసేవలు అందించడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం అధ్యక్షుడు గిరగాని సుదర్శన్ గౌడ్, ఫుడ్ అడ్వైజరీ కమిటీ మెంబర్, స్వయంకృషి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు బెజ్జంకి ప్రభాకర్ , ఏఎస్ఆర్ సంస్థ నిర్వాకుడు ఎర్రబోయిన రాజశేఖర్, విజిలెన్స్ కమిటీ మెంబర్ నాగెల్లి సొరంగం,ఎస్సి,ఎస్టీ కన్వీనర్ బోయిన వెంకటస్వామి,వేంకటాచారి,మొగిలిచర్ల రాము సిబ్బంది పాల్గొన్నారు.
