భానుడి…… భగభగ.

భానుడి…… భగభగ.

#సుర్రు మనిపిస్తున్న సూరీడు.

#ఎండలకు భయపడి బయటకు రాని ప్రజలు.

#నిర్మానుషమైన ప్రధాన రహదారులు.

#41డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.

#వేసవిలో జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సూచన.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

సూరీడు సుర్రుమంటున్నాడు ఉక్క పోత చికాకు పుట్టిస్తుంది వడగాల్పులు వెంటాడుతున్నాయి. వేసవిలో ఎండలు దంచి కొట్టడంతో రహదారులన్నీ నిప్పుల కుంపటిగా మారిపోయి నిర్మానుషంగా కనిపిస్తున్నాయి కొద్ది రోజులుగా సుమారు 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఉదయం 8 గంటల నుండి ఇంటి నుండి బయటకు రావడానికి జనం జంకుతున్నారు తప్పని పరిస్థితుల్లో ఉద్యోగులు, ఉపాధి కూలీలు, కార్మికులు వడదెబ్బ తగలకుండా పలు జాగ్రత్తలు తీసుకొని నిర్దిష్ట సమయానికే పని ముగించుకుని ఇండ్లలోకి చేరుకుంటున్నారు ఏప్రిల్ మాసంలోనే ఎండ తీవ్రత ఇలా ఉంటే మే నెలలో మరింత ఉష్ణోగ్రతలు పెరగడం ఖాయమని పలువురు వాపోతున్నారు గత వారం రోజులుగా మండలంలో 41డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనర్వం ఈ అధిక వేడిని తట్టుకోలేక మనుషులతో పాటు పశుపక్షాలు సైతం తల్లాడిల్లుతున్నాయి చెరువులలో, కుంటలలో తగినంత నీరు నిల్వ లేకపోవడంతో మూగజీవాల సైతం మృత్యువాత పడుతున్నాయి మిట్ట మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత మరింత ఎక్కువ కావడంతో ప్రజలు ఏ మాత్రం అజాగ్రత్త వహించిన అనారోగ్యం బారిన పడతారని కావున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు, వాతావరణ శాఖ అధికారులు సూచించడంతో ప్రజలు బయటకు రావడం లేదు మధ్యాహ్నం12 నుండి సాయంత్రం4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో వాహనాల రాకపోకలు లేకపోవడం వల్ల ప్రధాన రహదారులన్నీ నిర్మానుషంగా మారిపోయాయి రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం వల్ల మండల ప్రజలు ఉక్కపోత నుండి ఉపశమనం పొందేందుకు పలు రకాల మార్గాలను అన్వేషిస్తున్నారు అందులో భాగంగా ఎయిర్ కండిషన్, కూలర్ల లాంటి వాటిని ఇంటి లోపల సమకూర్చుకుంటున్నారు ఉపాధి హామీ కూలీ పథకానికి వెళ్లే కూలీలు ఉదయం తెల్లవారుజామునే పనికి వెళ్లి 11 గంటల సమయంలోపే పని ముగించుకుని ఇండ్లకు చేరుకొని నిమ్మరసం, మజ్జిగ లాంటి ద్రవ పదార్థాలను సేవించి సేద తీరుతున్నారు రైతులు అరకొర వ్యవసాయ పనులు ఉండడం వల్ల ఉదయాన్నే పనులను ముగించుకుంటున్నారు వాహనాదారులు రాకపోకల సమయంలో వేసవి తాపాన్ని తట్టుకునేందుకు పండ్ల రసాలు, శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్ , కొబ్బరి బోండాలు, వాటర్ మిలన్,మజ్జిగ లాంటి వాటిని సేవించి ఎండ ఎద్దడినుండి ఉపశమనం పొందుతున్నారు.

#వేసవిలో తగు జాగ్రత్తలు పాటించాలి…

#డాక్టర్ ఆచార్య వైద్యాధికారి . నల్లబెల్లి.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంవల్ల అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దు ఎండలో తిరిగే వారికి వేడి గాలులు వీచే సమయంలో డిహైడ్రేషన్ తో పాటు, వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఉంటాయి వడదెబ్బ బారిన పడినవారు ఆకలిని, శక్తిని కోల్పోయి బలహీనపడి సొమ్మ సీలి పడిపోతారు. ముఖ్యంగా వేసవిలో వృద్ధులు, పిల్లలు ఎండ వేడిమిని తట్టుకోలేరు కావున వేసవి నుండి ఉపశమనం పొందుటకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి తప్పని పరిస్థితుల్లో ఎండలో తిరిగేవారు తప్పనిసరిగా గొడుగు, టోపీ, తలపాగా ధరించాలి ఈ వేసవిలో ప్రతి ఒక్కరు వేసవి జాగ్రత్తలు పాటించాలి.

అంబేద్కర్ ఆశయా సాధనకై నరేంద్ర మోదీ పాలన.

అంబేద్కర్ ఆశయా సాధనకై నరేంద్ర మోదీ పాలన.

#భాజపా మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ పాలన సాగుతుందని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ అన్నారు.భారతరత్న డాక్టర్ భీంరావు రాంజీ అంబేద్కర్135వ జయంతిని పురస్కరించుకొని బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి పండ్ల పంపిణీ చేశారు.ఈ సందర్బంగా వినయ్ గౌడ్ మాట్లాడుతూ. అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తిగా ఈ దేశాన్ని ప్రధాని మోదీ మరింతగా ముందుకు తీసుకెళ్తున్నారన్నారు.సమాజంలో అసమానతలను తొలగించి,సకల జనులకు సమన్యాయం చేకూర్చాలన్న బాబాసాహెబ్ ఆశయాలను నిజం చేస్తూ.. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ స్ఫూర్తితో ముందుకు సాగుతోందని,సామాజిక సాధికారత దిశగా మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చారిత్రక అడుగులే ఆ మహనీయునికి మనం అర్పించే నిజమైన నివాళులు అన్నారు.బీజేపీ ప్రభుత్వం డాక్టర్ అంబేద్కర్ కు అత్యున్నత భారతరత్న పురస్కారాన్ని ప్రధానం చేసిందని,భారతదేశపు సామాజిక నిర్మాణాన్ని అద్వితీయ పాత్రను పోషించిన అత్యున్నత పురస్కారమిచ్చి గౌరవించుకుంది బిజెపి పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షుడు బత్తిని కుమారస్వామి, గుర్రపు నరేష్, మండల కార్యదర్శులు ఓదెల అశోక్,పున్నం కృష్ణమూర్తి,పార్టీ సీనియర్ నాయకులు పెరుమాండ్ల కోటి, వల్లే పర్వతాలు,ఎస్సీ మోర్చా మండల నాయకుడు జన్ను మధు, యువ మోర్చా మండల అధ్యక్షుడు తిమ్మాపురం శివ, నాయకులు ములుక రాజేష్, ధర్మారం క్రాంతి కుమార్,కొనకటి సుధాకర్,బల్ల రాజు,ఈర్ల రవి, మార్తా రవీందర్,దొమ్మటి బచ్చలు తదితరులు పాల్గొన్నారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది..

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

మండలంలోని నారక్క పేట, గుండ్లపాడు గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ నాయకుల కుటుంబ సభ్యుల వివాహాది కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట మాజీ వైస్ ఎంపీపీ గందె శ్రీలత శ్రీనివాస్ గుప్తా, సర్పంచ్ దండేమ్ సంపత్, ఉప సర్పంచ్ సూరబోయిన రాంబాబు, మాజీ ఎంపిటిసిలు, సర్పంచులు, గ్రామ పార్టీ అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన బానోత్ సారంగపాణి

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన భానోత్ సారంగపాణి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

మండలంలోని రుద్రగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అనంతుల రాజ్ కుమార్ గౌడ్ తండ్రి రాములు అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందగా విషయం తెలుసుకున్న మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి మృతుని స్వగృహానికి చేరుకొని ఆయన పార్దివదేహంపై పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్, క్లస్టర్ ఇంచార్జి గందె శ్రీనివాస్ గుప్తా, సర్పంచ్ మంద సుజాత రాజిరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు మురాల ప్రతాపరెడ్డి, నాయకులు తౌట్ రెడ్డి రాజిరెడ్డి, ఇంగ్లీ రవి, అబ్బు విజయేందర్ రెడ్డి, వార్డు మెంబర్స్ గంగారావు వినయ్, హింగే రమేష్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

నల్లబెల్లిలో బిజెపి నుంచి బీఆర్ఎస్‌లో చేరికలు

బిజెపి నుండి బిఆర్ఎస్ లో చేరిక.

#ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటా.

#మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.

నల్లబెల్లి నేటి ధాత్రి:

పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తలకు అండగా ఉండి కంటిరెప్పలా కాపాడుకుంటానని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆయన స్వగృహం వద్ద నల్లబెల్లి గ్రామానికి చెందిన బిజెపి నాయకులు కొండ్లె శ్రావణ్, రాజేష్, జక్కోజు కృష్ణ, ఉడుత సాయి, వంశీయులు బిజెపి పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ న్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగెల్లి జ్యోతి ప్రకాష్ మాజీ సర్పంచ్ నానబోయిన రాజారాం యాదవ్, మాజీ ఎంపిటిసి వైనాల వీరస్వామి, మాజీ సొసైటీ డైరెక్టర్ సట్ల శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ గుమ్మడి వేణు, యూత్ నాయకుడు మేడిపల్లి రాజు గౌడ్, కొత్తపల్లి రామ్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version