శాయంపేటలో చేనేత కార్మికులకు రుణమాఫీ సాయం

చేనేతకు సహకారం.. నేతన్నలకు ఆనందం

ఏడి,ఎమ్మెల్యేకు కృతజ్ఞత లు తెలియజేసిన మాజీ ఎంపీపీ

శాయంపేట నేటిధాత్రి :

చేనేత రుణమాఫీలో భాగంగా మండల కేంద్రంలోని చేనేత కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ,9,00,000 లను చెక్ రూపంలో అందజేయడం తో మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘంలో పనిచే స్తున్న చేనేత కార్మికులకు ఊర ట లభించింది. ఇందుకుగాను చేనేత ఔలి శాఖ ఏడి విజయ లక్ష్మి మరియు భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు లకు మాజీ ఎంపీపీ తెలంగాణ రాష్ట్ర కార్మిక మినిమమ్ వేజెస్ బోర్డు మెంబర్ బాసాని చంద్రప్ర కాష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం చేపట్టి న రుణమాఫీ కార్యక్రమాన్ని స్వాగతించారు. కార్మికులకు రుణమాఫీ ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రుణమాఫీ చేసి తో డ్పాటు అందించడం ఆనం దకరమని తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version