నడికూడ మండలంలో జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకలు

ప్రజాస్వామ్యానికి పునాది ఓటు

నడికూడ,నేటిధాత్రి:

మండలం లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల నందు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తాహసిల్దార్ రాణి కార్యాలయ సిబ్బంది చే ఓటర్ల బాధ్యత ను తెలియజేస్తూ భారతదేశ పౌరులమైన మేము, ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మనదేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను,స్వేచ్ఛ, నిష్పక్షపాత,ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని, మతం,జాతి,కులం,వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించండం జరిగింది,స్కూల్ పిల్లలతో మండల కేంద్రములో ర్యాలీ నిర్వహించి ఓటు హక్కు అవశ్యకత పై అవగాహన కల్పించారు,ఓటర్ల దినోత్సవం పై నిర్వహించిన వ్యాస రచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానము చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ రాణి,కార్యాలయ సిబ్బంది,మండల విద్యాశాఖ అధికారి హనుమంతరావు, ఉపాధ్యాయులు,అంగన్వాడి టీచర్స్,ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

బోరేగావ్ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ పాఠశాల ప్రారంభం

*ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ…*

*జహీరాబాద్ నేటి ధాత్రి:*

బోరేగావ్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ పాఠశాలను మండల విద్యాధికారి శ్రీనివాస్ ప్రధానోపాధ్యాయులు ఈలియాస్ మరియు గ్రామ సర్పంచ్ నాగేంద్ర పటేల్ గ్రామ ఉపసర్పంచ్ నర్సింలు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు

సి ఆర్ పి చిరంజీవి రాజు శివ మరియు గ్రామస్తులు తో కలిసి ప్రారంభించడం జరిగింది ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయులు గా పి సబితా ఆయాగా సమిన, నియమించడం జరిగింది గ్రామంలో మూడు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ప్రీ ప్రైమరీ పాఠశాలలో అడ్మిషన్ చేయవలసిందిగా మండల విద్యాధికారి తెలియజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలోగ్రామస్తులు పాల్గొనడం జరిగింది,

ప్రపంచ వికలాంగుల దినోత్సవం పాఠశాలలో..

ప్రపంచ వికలాంగుల దినోత్సవం పాఠశాలలో..

నిజాంపేట: నేటి ధాత్రి

 

ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో వికలాంగుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి సాంగాని యాదగిరి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దివ్యాంగ విద్యార్థుల హక్కులు, తల్లిదండ్రుల బాధ్యత గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఆదార్ కేంద్రాన్ని పరిశీలించిన మండల విద్యాధికారి…

ఆదార్ కేంద్రాన్ని పరిశీలించిన మండల విద్యాధికారి

చందుర్తి, నేటిధాత్రి:

 

ప్రాథమిక పాఠశాల సనుగులలో నిర్వహిస్తున్న ఆదార్ నమోదు కేంద్రాన్ని మండల విద్యాధికారి వినయ కుమార్ సందర్శించి జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. పరిసర గ్రామాల బడి పిల్లలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. ఇంతవరకు వంద పైన అప్డేషన్ లు అయ్యాయని ఇంకా ఎవరైనా పిల్లలు తమ ఆదార్ ని నమోదు చేసుకోకపోయినా, నవీకరణ చేసుకోకపోయినా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని‌ అన్నారు. ఈ కార్యక్రమంలో సనుగుల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కటుకూరి ముఖేష్, సి.ఆర్.పి ఉమ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యార్థుల ఆలోచన శక్తి మేదస్సు అభివృద్ధి కోసం

విద్యార్థుల ఆలోచన శక్తి మేదస్సు అభివృద్ధి కోసం

స్వగ్రామ విద్య అభివృద్ధికి అంకితభావం…

కేసముద్రం,ఇనుగుర్తి హై స్కూల్స్ కి చెస్ బోర్డుల బహుకరణ

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మరియు ఇనుగుర్తి మండలాల విద్యార్థుల క్రీడా ప్రోత్సాహానికి అమెరికాలో నివాసముంటున్న వెంకటగిరి గ్రామానికి చెందిన ఎన్ ఆర్ ఐ గుజ్జ శ్రీనివాసరావు, ఆయన సతీమణి మంజుల దంపతులు విశేష సహకారం అందించారు. విద్యార్థుల ఆలోచనా శక్తి, మేధస్సు అభివృద్ధి కోసం మండలంలోని 14 ప్రభుత్వ హైస్కూల్స్‌కి ఒక్కొక్క పాఠశాలకు 6 చొప్పున చెస్ బోర్డులు బహుకరించారు.

ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల విద్యాశాఖాధికారి కాలేరు యాదగిరి, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు బందెల రాజు, బండారు నరేందర్, ధన్నసరి సింగిల్ విండో చైర్మన్ మర్రి రంగారావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, బి ఆర్ ఎస్ నాయకులు నీలం దుర్గేశ్, గుగులోత్ వీరునాయక్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఇలా పేర్కొన్నారు.

అమెరికాలో నివసిస్తూ స్వగ్రామ విద్యార్థుల అభివృద్ధికి అంకితభావంతో ముందుకు వస్తున్న గుజ్జ శ్రీనివాసరావు, మంజుల దంపతులు నిజమైన ఆదర్శ దాతలు అన్నారు.

చెస్ ఆట విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని, వ్యూహాత్మక ఆలోచనను పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది అని దాత అభిప్రాయపడ్డారు.

స్వగ్రామ విద్యా అభివృద్ధికి అంకితభావంతో చేసిన గుజ్జ శ్రీనివాసరావు, మంజుల దంపతుల సహకారం కేసముద్రం మండల విద్యా రంగంలో చిరస్మరణీయంగా నిలుస్తుందని అందరూ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version