మోదంపల్లిలో.. ఘనంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ…

మోదంపల్లిలో.. ఘనంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ

జడ్చర్ల/ నేటి ధాత్రి.

జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని మోదంపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మంగళవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విగ్రహానికి పూలమాలలు అర్పించి, అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలు సమాజానికి ఎల్లప్పుడూ మార్గదర్శకమని, సమానత్వం, సామాజిక న్యాయం, విద్యాభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. యువత అంబేద్కర్ బాటలో నడిచి సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు.

ఉడిత్యాలలో ప్రీ-ప్రైమరీ చిన్నారులకు దుస్తుల పంపిణీ.

ఉడిత్యాలలో ప్రీ-ప్రైమరీ చిన్నారులకు దుస్తుల పంపిణీ.

 

జడ్చర్ల/నేటి ధాత్రి.

 

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని ఉడిత్యాల గ్రామంలో శనివారం ద్వాక్రా మహిళా సంఘం ఆధ్వర్యంలో.. ప్రీ-ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సువర్ణ ముఖ్యంగా పాల్గొని చిన్నారులకు దుస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు చక్కెర శ్రీధర్ గౌడ్ డ్వాక్రా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

ధ్వజస్తంభం ఏర్పాటుకు రూ.2.11 లక్షల విరాళం

బాలానగర్ : ధ్వజస్తంభం ఏర్పాటుకు రూ.లక్ష విరాళం.

బాలానగర్ /నేటి ధాత్రి.

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలోని స్థానిక హనుమాన్ దేవాలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన కోసం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుడిసెల యాదయ్యభక్తితో ముందుకు వచ్చి రూ.2.11 లక్షలు రూపాయల విరాళాన్ని ప్రకటించారు. అందులో భాగంగా శనివారం రూ.లక్ష అడ్వాన్స్ ను దేవస్థానం కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా గుడిసెల యాదయ్య మాట్లాడుతూ.. ధర్మం కోసం చేసే ఖర్చు ఎప్పుడూ వృధా పోదని.. స్వామి వారి సేవలో భాగస్వాములై తన వంతు విరాళాన్ని అందించానని అన్నారు. గుడిసెల యాదయ్య సామాజిక స్పృహను దైవభక్తిని గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులు అభినందిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

జాలుగడ్డ తండాలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ

జాలుగడ్డ తండాలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ

బాలానగర్ /నేటి ధాత్రి.

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మండల పరిధిలోని జాలుగడ్డ తండాలో బుధవారం నూతన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ రాము నాయక్ లబ్ధిదారులకు ఈ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాము నాయక్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.పారదర్శకమైన పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేసి, ఈ పత్రాలను అందించామన్నారు. మంజూరైన నిధులతో లబ్ధిదారులు నాణ్యమైన ఇళ్లను నిర్మించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రవి నాయక్, కిషన్, సుప్రియ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, తండావాసులు పాల్గొన్నారు.

జడ్చర్ల నియోజకవర్గం బీసీ సేన అధ్యక్షులుగా లింగం యాదవ్ నియామకం.

జడ్చర్ల నియోజకవర్గం బీసీ సేన అధ్యక్షులుగా లింగం యాదవ్ నియామకం.

 

 

 

జాతీయ బీసీ సేన అధ్యక్షులు బర్క కృష్ణ సమక్షంలో బీసీ సేన మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు సుప్ప ప్రకాష్ చేతుల మీదుగా.. జడ్చర్ల నియోజకవర్గ బీసీ సేన ఉపాధ్యక్షులుగా సూరారం గ్రామానికి చెందిన లింగం యాదవ్ ను గురువారం నియమించారు. ఈ సందర్భంగా లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. బీసీ హక్కుల కోసం పనిచేస్తానన్నారు. బీసీల ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వరప్రసాద్ యాదవ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సదర్ శ్రీనివాస్ యాదవ్, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్యాట జయ శ్రీకాంత్, బాలానగర్ మండల బీసీ సేన అధ్యక్షులు చాకలి మధు, శ్రీశైలం, పూజారి శ్రీశైలం, శేఖర్ గౌడ్ మల్లేష్ యాదవ్, శ్రీశైలం, పూజరి రమేష్, కురువ మహేష్,చాకలి వీరేష్, సరస్వతి శారదమ్మ పద్మ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version